Pages

Tuesday, 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పదిహేనవ అధ్యాయం


శ్రీరాజోవాచ
బలేః పదత్రయం భూమేః కస్మాద్ధరిరయాచత
భూతేశ్వరః కృపణవల్లబ్ధార్థోऽపి బబన్ధ తమ్

పరమాత్మ అన్ని పొందినవాడైనా దీనుడిలాగ ఎందుకు బలిని యాచించాడు. యాచించి ఎందుకు బలిని బంధించాడు.

ఏతద్వేదితుమిచ్ఛామో మహత్కౌతూహలం హి నః
యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బన్ధనం చాప్యనాగసః

దీనిని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. పరిపూర్ణుడైన యజ్ఞేశ్వరుడు తప్పు చేయని వాడిని బంధించడం వింతగా ఉంది 

శ్రీశుక ఉవాచ
పరాజితశ్రీరసుభిశ్చ హాపితో హీన్ద్రేణ రాజన్భృగుభిః స జీవితః
సర్వాత్మనా తానభజద్భృగూన్బలిః శిష్యో మహాత్మార్థనివేదనేన

ఇంద్రుడు ఓడించగా భృగువు బతికించాడు. తమను బతికించిన గురువును బలి చక్రవర్తి త్రికరణ శుద్ధిగా సేవించాడు. మహానుభావుడైన బలి చక్రవర్తి గురువును సేవించాడు. ఆయా సమయాలలో దక్షిణ కూడా ఇచ్చాడు. గురువుగారికి ఏ సమయములో ఏవేవి కావాలో అర్పిస్తూ సేవించాడు.

తం బ్రాహ్మణా భృగవః ప్రీయమాణా అయాజయన్విశ్వజితా త్రిణాకమ్
జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిషేకేణ మహానుభావాః

ఇన్ని రకములుగా నిరంతరం సేవిస్తున్న బలి చక్రవర్తి భక్తికి భృగువు సంతోషించి స్వర్గం మళ్ళీ గెలవాలి అన్న కోరిక ఉన్న బలి చేత ఋక్ సామ మంత్రాలతో అభిషేకించి విశ్వజిత్ యాగం చేయించాడు 

తతో రథః కాఞ్చనపట్టనద్ధో హయాశ్చ హర్యశ్వతురఙ్గవర్ణాః
ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్భిరిష్టాత్

హవిస్సుల చేత తృప్తి పొందిన అగ్ని హోత్రుడు నుండి రథం బయలు దేరింది, ఇంద్రుని గుర్రాలతో సమానమైన రంగు గల గుర్రాలు వచ్చాయి, సింహ ధ్వజం, ధనువూ అక్షయ తూణీరం కవచము, బ్రహ్మ గారు వాడని పూల మాల ఇచ్చాడు. శుక్రుడు శంఖాన్నిచ్చాడు

ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్తౌ కవచం చ దివ్యమ్
పితామహస్తస్య దదౌ చ మాలామమ్లానపుష్పాం జలజం చ శుక్రః

ఏవం స విప్రార్జితయోధనార్థస్తైః కల్పితస్వస్త్యయనోऽథ విప్రాన్
ప్రదక్షిణీకృత్య కృతప్రణామః ప్రహ్రాదమామన్త్ర్య నమశ్చకార

ఇలా బ్రాహ్మణోత్తముల చేత ఇవ్వబడిన సామాగ్రితో వారి చేత స్వస్తి వాచనం చెప్పబడి వారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తాతగారైన ప్రహ్లాదునికి నమస్కారం చేసి దివ్య రథం అధిరోహించి గురువుగారిచ్చిన రథాన్ని అధిరోహించి ఖడ్గం ధనువూ తూణీరాలూ మాలలూ ఆభరణాలూ ధరించి యజ్ఞ్య గుండములో అగ్నిహోత్రునిలా భాసించాడు.
తనతో సమానమైన బలం ఐశ్వర్యం కలవారితో కలిసి అన్ని దిక్కులనీ కాల్చివేస్తున్నట్లుగా ఆకాశాన్ని తాగేస్తున్నట్లుగా సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకుని భూమి ఆకాశాన్ని కంపింపచేస్తూ ఇంద్ర నగరమైన అమరావతికి బయలు దేరారు


అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథః
సుస్రగ్ధరోऽథ సన్నహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుధిః

హేమాఙ్గదలసద్బాహుః స్ఫురన్మకరకుణ్డలః
రరాజ రథమారూఢో ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్

తుల్యైశ్వర్యబలశ్రీభిః స్వయూథైర్దైత్యయూథపైః
పిబద్భిరివ ఖం దృగ్భిర్దహద్భిః పరిధీనివ

వృతో వికర్షన్మహతీమాసురీం ధ్వజినీం విభుః
యయావిన్ద్రపురీం స్వృద్ధాం కమ్పయన్నివ రోదసీ

రమ్యాముపవనోద్యానైః శ్రీమద్భిర్నన్దనాదిభిః
కూజద్విహఙ్గమిథునైర్గాయన్మత్తమధువ్రతైః

ప్రవాలఫలపుష్పోరు భారశాఖామరద్రుమైః
హంససారసచక్రాహ్వ కారణ్డవకులాకులాః
నలిన్యో యత్ర క్రీడన్తి ప్రమదాః సురసేవితాః

ఆకాశగఙ్గయా దేవ్యా వృతాం పరిఖభూతయా
ప్రాకారేణాగ్నివర్ణేన సాట్టాలేనోన్నతేన చ

రుక్మపట్టకపాటైశ్చ ద్వారైః స్ఫటికగోపురైః
జుష్టాం విభక్తప్రపథాం విశ్వకర్మవినిర్మితామ్

రకరకాల సరసులూ ఉద్యానవనాలు పక్షులూ అన్నీ ఆడుకుంటున్నాయి. ఆకాశ గంగతో నిరంతరం ప్రకాశిస్తోంది. ఏ ఇంటికి ఆ ఇల్లు విశ్వకర్మ అందముగా రూపొందించాడు. వజ్రాలతో పొదగబడిన అడుగులు కల ఇళ్ళు 

సభాచత్వరరథ్యాఢ్యాం విమానైర్న్యర్బుదైర్యుతామ్
శృఙ్గాటకైర్మణిమయైర్వజ్రవిద్రుమవేదిభిః

యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః
భ్రాజన్తే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వహ్నయః

జ్వాలలతో అగ్ని ప్రకాశించినట్లుగా నిత్య యవ్వనం కల దేవతా స్త్రీలు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. రాజ వీధి అని గుర్తుపట్టాలంటే దేవత స్త్రీల జడలో ఉన్న పూల వాసన చూడటానికి వచ్చిన తుమ్మెదలను చూచి గుర్తుపట్టాలి.  వాయువు కూడా అన్ని మార్గాలను వదిలిపెట్టి ఆమార్గములో వెళుతుంది. 
బంగారు కిటికీల రంధ్రం నుండి యజ్ఞ్య ధూమం వస్తోంది. అలాంటి మార్గాలలో వారు సంచరిస్తూ ఉంటారు. 

సురస్త్రీకేశవిభ్రష్ట నవసౌగన్ధికస్రజామ్
యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః

హేమజాలాక్షనిర్గచ్ఛద్ధూమేనాగురుగన్ధినా
పాణ్డురేణ ప్రతిచ్ఛన్న మార్గే యాన్తి సురప్రియాః

ముక్తావితానైర్మణిహేమకేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్
శిఖణ్డిపారావతభృఙ్గనాదితాం వైమానికస్త్రీకలగీతమఙ్గలామ్

మృదఙ్గశఙ్ఖానకదున్దుభిస్వనైః సతాలవీణామురజేష్టవేణుభిః
నృత్యైః సవాద్యైరుపదేవగీతకైర్మనోరమాం స్వప్రభయా జితప్రభామ్

ముత్యాల మణులతో బంగారముతో నానా పతాకాలు కలవు. నెమళ్ళూ పావురాలూ  లాంటి పక్షుల నాదముతో విమానాలలో ఉన్న స్త్రీలు పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. మంగళ వాద్యాలు మోగుతూ 

యాం న వ్రజన్త్యధర్మిష్ఠాః ఖలా భూతద్రుహః శఠాః
మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజన్తి యత్

తాం దేవధానీం స వరూథినీపతిర్బహిః సమన్తాద్రురుధే పృతన్యయా
ఆచార్యదత్తం జలజం మహాస్వనం దధ్మౌ ప్రయుఞ్జన్భయమిన్ద్రయోషితామ్

నృత్యములు జరుగుతూ ఉంటాయి. దుర్మార్గులూ భూత ద్రోహం చేసే వారు వంచకులూ అధర్మాత్ములూ ఎక్కడికి వెళ్ళలేరో ఆ స్వర్గానికి బలి చక్రవర్తి వెళ్ళాడు. అహంకారం కోరికా పిసినారి తనం లేని వారు అక్కడికి వెళ్ళగలరు. ఆ స్వర్గాన్ని తన సైన్యముతో బలి చక్రవర్తి అరికట్టాడు

మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమమ్
సర్వదేవగణోపేతో గురుమేతదువాచ హ

ఇంద్రుని స్త్రీలకు భయం కలిగిస్తూ గురువుగారిచ్చిన శంఖాన్ని పూరించాడు. అది విన్నాడు ఇంద్రుడు. మొత్తం దేవతా గణాలూ కలిసి గురువుగారితో ఇలా అన్నాడు

భగవన్నుద్యమో భూయాన్బలేర్నః పూర్వవైరిణః
అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః

భగవాన్, మాతో ఇది వరకూ పూర్వం వైరం ఉన్న బలి చక్రవర్తికి ఇంత పెద్ద ఊర్జవం ఎలా వచ్చింది.ఆ శంఖనాదం చూస్తేనే ఆయనను మనం గెలిచే లక్షణాలు కనపడటం లేదు.ఇంతలోనే ఇంత గొప్ప తేజస్సు ఎలా వచ్చింది 

నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః
పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ
దహన్నివ దిశో దృగ్భిః సంవర్తాగ్నిరివోత్థితః

ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఈ బలి చక్రవర్తిని ఎవరూ ఎదిరించలేదు. 

బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః
ఓజః సహో బలం తేజో యత ఏతత్సముద్యమః

స్వర్గాన్ని తాగుతున్నట్లుగా లోకాలన్ని మింగబోతున్నట్లూ చూపులతో కాల్చి వేస్తున్నట్లు ప్రళయకాలాగ్ని లాగ ఉన్నాడు. ఇంతటిప్రభావానికి కారణం ఏమిటి. నా శత్రువు ఐన ఇతన్ని మేము చెణకలేకున్నాము. ఇంత ఓజస్సూ బలం శక్తీ సహస్సూ  ఎక్కడి నుంచి వచ్చాయి 

శ్రీగురురువాచ
జానామి మఘవన్ఛత్రోరున్నతేరస్య కారణమ్
శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభిః

శత్రువు యొక్క ఇంత ఉన్నతికి కారణం తెలుసు. వేద ఘోష బాగా అధ్యయనం చేసే గురువులు తమ శిష్యులకు ఇతటి తేజస్సును ఇస్తారు. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క శ్రీమన్నారయణుడు తప్ప నీలాంటి వాడైనా నీవైనా ఇతని ముందు నిలవలేరు,యముని ముందర మరణించేవారు నిలవలేనట్లుగా. 

ఓజస్వినం బలిం జేతుం న సమర్థోऽస్తి కశ్చన
భవద్విధో భవాన్వాపి వర్జయిత్వేశ్వరం హరిమ్

విజేష్యతి న కోऽప్యేనం బ్రహ్మతేజఃసమేధితమ్
నాస్య శక్తః పురః స్థాతుం కృతాన్తస్య యథా జనాః

తస్మాన్నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపమ్
యాత కాలం ప్రతీక్షన్తో యతః శత్రోర్విపర్యయః

తెలివి గలవారు శత్రు బలాన్ని తమ బలాన్ని అంచనా వేసుకుని ఉపాయం ఆలోచించాలి.ఇప్పటికి మీరు ఈ స్వర్గాన్ని వదిలి బయలుదేరండి.ఏ కాలం ఈ శత్రువుకు మళ్ళీ బలహీనతను ఇస్తుందో ఆ కాలం వరకూ వేచి ఉండండి

ఏష విప్రబలోదర్కః సమ్ప్రత్యూర్జితవిక్రమః
తేషామేవాపమానేన సానుబన్ధో వినఙ్క్ష్యతి

ఈ బలం బ్రాహ్మణ బలం. దాని ప్రభావమిది. ఇపుడు ఇతను పరాక్రమాన్ని బాగా కూడగట్టుకుని ఉన్నాడు. ఏ గురువును పూజించి ఈ బలం పొందాడో అదే గురువును అవమానించి  బలం కోల్పోతాడు

ఏవం సుమన్త్రితార్థాస్తే గురుణార్థానుదర్శినా
హిత్వా త్రివిష్టపం జగ్ముర్గీర్వాణాః కామరూపిణః

వాస్తవ విషయాన్ని చూడగలిగిన గురువు గారిచేత విషయం చక్కగా వివరించబడి కామరూపం ధరించి స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళారు 

దేవేష్వథ నిలీనేషు బలిర్వైరోచనః పురీమ్
దేవధానీమధిష్ఠాయ వశం నిన్యే జగత్త్రయమ్

ఇలా దేవతలందరూ దాక్కున్నారు. అపుడు విరోచన పుత్రుడైన బలి స్వర్గాన్ని ముట్టడించి మూడులోకాలనూ తన వశములో ఉంచుకున్నాడు. 

తం విశ్వజయినం శిష్యం భృగవః శిష్యవత్సలాః
శతేన హయమేధానామనువ్రతమయాజయన్

ఇలా తన శిష్యుడు ప్రపంచాన్ని జయిస్తే శిష్య వత్సలుడైన గురువు నూరు అశ్వమేధ యాగాలు చేయించాడు 

తతస్తదనుభావేన భువనత్రయవిశ్రుతామ్
కీర్తిం దిక్షువితన్వానః స రేజ ఉడురాడివ

బుభుజే చ శ్రియం స్వృద్ధాం ద్విజదేవోపలమ్భితామ్
కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామనాః

నూరు అశ్వమేధ యాగముల ప్రభావముతో మూడు లోకములలో ఉన్న కీర్తిని వ్యాపింపచేసి బ్రాహ్మణుల ప్రభావముచేత చంద్రునిలా శోభించాడు.అగ్నిహోత్రునిలా ప్రకాశించాడు 
బ్రాహ్మణుల చేత ప్రసాదించబడిన త్రైలోక్యరాజ్యాన్ని అనుభవించాడు. అనుకున్న దానిని సాధించాను అని, మహామనస్వి కాబట్టి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నాడు