Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఇరవై ఒకటి అధ్యాయం


శుక ఉవాచ

వితథస్య సుతాన్మన్యోర్బృహత్క్షత్రో జయస్తతః
మహావీర్యో నరో గర్గః సఙ్కృతిస్తు నరాత్మజః

ఇతనికి వితథుడు అనే కుమారుడు కలిగాడు, ఇతనికి మన్యువు, .....

గురుశ్చ రన్తిదేవశ్చ సఙ్కృతేః పాణ్డునన్దన
రన్తిదేవస్య మహిమా ఇహాముత్ర చ గీయతే

గురువూ రంతి దేవుడు అనే వారు సఙ్కృతి కుమారుడు. రంతి దేవుడు చాలా మంచి పేరు గడించాడు

వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః
నిష్కిఞ్చనస్య ధీరస్య సకుటుమ్బస్య సీదతః

ఇతను ఉన్న దాన్ని మొత్తం దానం చేసి తనకు ఏదీ లేకుండా చేసుకున్నాడు, భగవంతుడు ఏమిస్తే దానితో కాలం గడుపుతున్నాడు

వ్యతీయురష్టచత్వారింశదహాన్యపిబతః కిల
ఘృతపాయససంయావం తోయం ప్రాతరుపస్థితమ్

ఇలా ఏమీ లేకుండా నలభై ఎనిమిది రోజులు గడిచాయి. ఒక సారి ఇంటిలో చక్కని పాయసం చల్లటి నీరూ లభించాయి.

కృచ్ఛ్రప్రాప్తకుటుమ్బస్య క్షుత్తృడ్భ్యాం జాతవేపథోః
అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్

సరిగ్గ తినబోతూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అథితిగా. అప్పుడు తాను తినబోయే దానిలో కొంత ఇచ్చాడు. మిగిలినదాన్ని తినబోతూ ఉంటే ఒక శూద్రుడు వచ్చాడు. అతనికి మిగిలిన దాన్ని పెట్టాడు.. అతను వెళ్ళిన వెంటనే ఒక చండాలుడు కుక్కలను తీసుకుని భోజనానికి వచ్చాడు. నాకు ఆకలి వేస్తోంది అని అడిగాడు

తస్మై సంవ్యభజత్సోऽన్నమాదృత్య శ్రద్ధయాన్వితః
హరిం సర్వత్ర సమ్పశ్యన్స భుక్త్వా ప్రయయౌ ద్విజః

అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతేః
విభక్తం వ్యభజత్తస్మై వృషలాయ హరిం స్మరన్

యాతే శూద్రే తమన్యోऽగాదతిథిః శ్వభిరావృతః
రాజన్మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే

స ఆదృత్యావశిష్టం యద్బహుమానపురస్కృతమ్
తచ్చ దత్త్వా నమశ్చక్రే శ్వభ్యః శ్వపతయే విభుః

కుక్కలకూ, అతనికీ మిగిలిన దాన్ని పెట్టేసాడు. నీరు మాత్రం మిగిలి ఉంది.

పానీయమాత్రముచ్ఛేషం తచ్చైకపరితర్పణమ్
పాస్యతః పుల్కసోऽభ్యాగాదపో దేహ్యశుభాయ మే

అప్పుడు ఒక పుల్కసుడు వచ్చి తనకు నీరు కావాలి అంటే

తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమామ్
కృపయా భృశసన్తప్త ఇదమాహామృతం వచః

కృప్తతో అతనికి నీరు ఇచ్చాడు. అన్నం లేదు, నీరు ఉంది తాగు అన్నాడు

న కామయేऽహం గతిమీశ్వరాత్పరామష్టర్ద్ధియుక్తామపునర్భవం వా
ఆర్తిం ప్రపద్యేऽఖిలదేహభాజామన్తఃస్థితో యేన భవన్త్యదుఃఖాః

నేను మోక్షాన్ని గానీ సంపదని గానీ కోరడములేదు. ప్రపంచములో ఉన్న జీవులందరి మనసులో ఉన్న ఆర్తిని వారిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తొలగించాలి అని కోరుతున్నాను.

క్షుత్తృట్శ్రమో గాత్రపరిభ్రమశ్చ దైన్యం క్లమః శోకవిషాదమోహాః
సర్వే నివృత్తాః కృపణస్య జన్తోర్జిజీవిషోర్జీవజలార్పణాన్మే

ఆకలి కానీ దప్పి గానీ అలసటా దైన్యమూ వాడిపోవడం శోకమూ విషాదమూ అన్నీ తొలగిపోయాయి, నీకు జల దానం చేసిన ఫలముతో.

ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణః పిపాసయా
పుల్కసాయాదదాద్ధీరో నిసర్గకరుణో నృపః

దప్పికతో ఉన్న వాడికి నీరిచ్చాడు

తస్య త్రిభువనాధీశాః ఫలదాః ఫలమిచ్ఛతామ్
ఆత్మానం దర్శయాం చక్రుర్మాయా విష్ణువినిర్మితాః

ఈ పని చేయగానే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ఇంద్రునితో కలిసి.

స వై తేభ్యో నమస్కృత్య నిఃసఙ్గో విగతస్పృహః
వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరమ్

అందరికీ ఎలాంటి కోరికా లేక నమస్కరించాడు.

ఈశ్వరాలమ్బనం చిత్తం కుర్వతోऽనన్యరాధసః
మాయా గుణమయీ రాజన్స్వప్నవత్ప్రత్యలీయత

పరమాత్మ యందు మనసు లగ్నం చేయడం వలన భగవంతుని మాయతో చేయబడిన త్రిగుణాత్మకమైన ప్రకృతి అతని నుండి దూరం అయ్యింది.

తత్ప్రసఙ్గానుభావేన రన్తిదేవానువర్తినః
అభవన్యోగినః సర్వే నారాయణపరాయణాః

రంతి దేవునితో సహవాసం చేసిన వారూ అనుసరించిన వారూ శ్రీమన్నరాయణుని భక్తులయ్యారు.

గర్గాచ్ఛినిస్తతో గార్గ్యః క్షత్రాద్బ్రహ్మ హ్యవర్తత
దురితక్షయో మహావీర్యాత్తస్య త్రయ్యారుణిః కవిః

తరువాత గర్గుడు, మొదలైన వారు.వీరందరూ క్షత్రియులే గానీ బ్రాహ్మణులయ్యారు.

పుష్కరారుణిరిత్యత్ర యే బ్రాహ్మణగతిం గతాః
బృహత్క్షత్రస్య పుత్రోऽభూద్ధస్తీ యద్ధస్తినాపురమ్

ఇతని కుమారుడే బృహత్క్షత్రుడు, ఇతనే హస్తీ. ఇతనే హస్తినాపురాన్ని నిర్మించాడు

అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ హస్తినః
అజమీఢస్య వంశ్యాః స్యుః ప్రియమేధాదయో ద్విజాః

ఇతనికి అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ అని ముగ్గురు కుమారులు.
అజమీఢ వంశం వారు బ్రాహ్మణులు అయ్యారు.

అజమీఢాద్బృహదిషుస్తస్య పుత్రో బృహద్ధనుః
బృహత్కాయస్తతస్తస్య పుత్ర ఆసీజ్జయద్రథః

తత్సుతో విశదస్తస్య స్యేనజిత్సమజాయత
రుచిరాశ్వో దృఢహనుః కాశ్యో వత్సశ్చ తత్సుతాః

రుచిరాశ్వసుతః పారః పృథుసేనస్తదాత్మజః
పారస్య తనయో నీపస్తస్య పుత్రశతం త్వభూత్

ఇదంతా వారి వంశ వృక్షం

స కృత్వ్యాం శుకకన్యాయాం బ్రహ్మదత్తమజీజనత్
యోగీ స గవి భార్యాయాం విష్వక్సేనమధాత్సుతమ్

బ్రహ్మదత్తుడనే వాడు యోగి. కావున అతని భార్య ఐన గోవు యందు విశ్వక్సేనుడిని కుమారుడిగా పొందాడు

జైగీషవ్యోపదేశేన యోగతన్త్రం చకార హ
ఉదక్సేనస్తతస్తస్మాద్భల్లాటో బార్హదీషవాః

జైగీషుడనే ఆయన ఉపదేశం వలన యోగతంత్రాన్ని రచించాడు

యవీనరో ద్విమీఢస్య కృతిమాంస్తత్సుతః స్మృతః
నామ్నా సత్యధృతిస్తస్య దృఢనేమిః సుపార్శ్వకృత్

సుపార్శ్వాత్సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః
కృతీ హిరణ్యనాభాద్యో యోగం ప్రాప్య జగౌ స్మ షట్

కృతి అనే ఆయన బ్రహ్మ నుండి యోగాన్ని అభ్యసించాడు. యోగ సంహితను రచించాడు.

సంహితాః ప్రాచ్యసామ్నాం వై నీపో హ్యుద్గ్రాయుధస్తతః
తస్య క్షేమ్యః సువీరోऽథ సువీరస్య రిపుఞ్జయః

తతో బహురథో నామ పురుమీఢోऽప్రజోऽభవత్
నలిన్యామజమీఢస్య నీలః శాన్తిస్తు తత్సుతః

ఈ పురామీఢుడికి సంతానం లేదు. అపుడు అజమీడునికి నీలుడు కలిగాడు.

శాన్తేః సుశాన్తిస్తత్పుత్రః పురుజోऽర్కస్తతోऽభవత్
భర్మ్యాశ్వస్తనయస్తస్య పఞ్చాసన్ముద్గలాదయః

యవీనరో బృహద్విశ్వః కామ్పిల్లః సఞ్జయః సుతాః
భర్మ్యాశ్వః ప్రాహ పుత్రా మే పఞ్చానాం రక్షణాయ హి

ఈ ఐదుగురు పుత్రులనూ కాపాడడానికి రాజ్యం అడుగగా, ఈ ఐదుగురికీ ఇది చాలు అని ఇచ్చిన భాగమే పాంచాల రాజ్యం అయ్యింది

విషయాణామలమిమే ఇతి పఞ్చాలసంజ్ఞితాః
ముద్గలాద్బ్రహ్మనిర్వృత్తం గోత్రం మౌద్గల్యసంజ్ఞితమ్

ముద్గలుడు బ్రహ్మజ్ఞ్యానం పొందిన వాడై అతని పేరు మీద మౌద్గల్య గోత్రం వచ్చింది

మిథునం ముద్గలాద్భార్మ్యాద్దివోదాసః పుమానభూత్
అహల్యా కన్యకా యస్యాం శతానన్దస్తు గౌతమాత్

ఈ ముద్గలునికి ఒక ఆడా మగా కవలలుగా పుట్టారు. అమ్మాయి అహల్య, ఆహల్యకు గౌతమి నుండి శతానందుడు కుమారునిగా కలిగాడు

తస్య సత్యధృతిః పుత్రో ధనుర్వేదవిశారదః
శరద్వాంస్తత్సుతో యస్మాదుర్వశీదర్శనాత్కిల

శతానందునికి సత్య్దృతీ పుట్టారు. అతను ధనుర్వేదములో విశారధుడు

శరస్తమ్బేऽపతద్రేతో మిథునం తదభూచ్ఛుభమ్
తద్దృష్ట్వా కృపయాగృహ్ణాచ్ఛాన్తనుర్మృగయాం చరన్
కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్యభవత్కృపీ

శరస్తంభునికి ఊర్వశిని చూడగా రేతస్సు రెల్లు గడ్డి మీద పడగా ఒక అమ్మాయి అబ్బాయి కలిగారు. అబ్బాయి కృపాచార్యుడు, అమ్మై పేరు కృపి.
శంతన మహారాజు అడవిలో వెళుతూ ఈ ఇద్దరు పిల్లలనూ చూసాడు. కృపి ద్రోణుని భార్య కాగా, కృపాచార్యుడు కురువంశానికి గురువుగా ఉన్నాడు. ఈయన ఇప్పటికీ ఉన్నాడు.