Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

            

 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం
శ్రీద్ధవ ఉవాచ
క్రియాయోగం సమాచక్ష్వ భవదారాధనం ప్రభో
యస్మాత్త్వాం యే యథార్చన్తి సాత్వతాః సాత్వతర్షభ

నిన్ను ఎలా ఆరాధించాలో చెప్పవలసింది. ఇదే పాంచరాత్ర ఆగమ విధానం.
సాత్వతులు, జ్ఞ్యానులు నిన్ను ఎలా ఎలా ఆరాధిస్తారో

ఏతద్వదన్తి మునయో ముహుర్నిఃశ్రేయసం నృణామ్
నారదో భగవాన్వ్యాస ఆచార్యోऽఙ్గిరసః సుతః

అన్నిటికంటే భగవంతుని ఆరాధించడమే ఉత్తమమైన నిశ్రేయసం అని మునులందరూ చెప్పారు

నిఃసృతం తే ముఖామ్భోజాద్యదాహ భగవానజః
పుత్రేభ్యో భృగుముఖ్యేభ్యో దేవ్యై చ భగవాన్భవః

పూర్వ కాలములో నీ ముఖం నుండి వచ్చినదే నీ పుత్రుడు ఐన బ్రహ్మ అందరికీ చెప్పాడు.
పార్వతీ దేవికి శంకరుడు
బృగ్వాదులకు బ్రహ్మ

ఏతద్వై సర్వవర్ణానామాశ్రమాణాం చ సమ్మతమ్
శ్రేయసాముత్తమం మన్యే స్త్రీశూద్రాణాం చ మానద

అన్ని ఆశ్రమాలకూ వర్ణాలకూ ఇది సమ్మతం. స్త్రీలకూ శూద్రులకూ ఇది ఉత్తమ శ్రేయస్సు ఇచ్చి కర్మ బంధాన్ని తొలగిస్తుంది

ఏతత్కమలపత్రాక్ష కర్మబన్ధవిమోచనమ్
భక్తాయ చానురక్తాయ బ్రూహి విశ్వేశ్వరేశ్వర

విశ్వేశ్వరుడవైన నీయందు భక్తి ఉన్న నాకు ఈ విషయం చెప్పవలసింది

శ్రీభగవానువాచ
న హ్యన్తోऽనన్తపారస్య కర్మకాణ్డస్య చోద్ధవ
సఙ్క్షిప్తం వర్ణయిష్యామి యథావదనుపూర్వశః

అంతులేని కర్మ కాండకు అంతు అంటూ ఉండదు. పరిపూర్ణముగా ఎవరూ చెప్పలేరు. అందుచే సంక్షేపముగా చెబుతాను విను.

వైదికస్తాన్త్రికో మిశ్ర ఇతి మే త్రివిధో మఖః
త్రయాణామీప్సితేనైవ విధినా మాం సమర్చరేత్

వైదికమనీ తాంత్రికమనీ మిశ్రమమనీ మూడు విధాలు నా ఆరాధనం. వీటిలో ఎవరిది ఏది ఇష్టమో అలా చేయవచ్చు

యదా స్వనిగమేనోక్తం ద్విజత్వం ప్రాప్య పూరుషః
యథా యజేత మాం భక్త్యా శ్రద్ధయా తన్నిబోధ మే

తన ఆగమం ప్రకారం బ్రాహ్మణత్వం పొందిన పురుషుడు శ్రద్ధతో భక్తితో ఎలా ఆరాధించాలో నీకు చెబుతాను విను

అర్చాయాం స్థణ్డిలేऽగ్నౌ వా సూర్యే వాప్సు హృది ద్విజః
ద్రవ్యేణ భక్తియుక్తోऽర్చేత్స్వగురుం మామమాయయా

అర్చలో గానీ, స్థండిలములో గానీ అగ్నిహోత్రములో గానీ సూర్యుడిలో గానీ జలములో గానీ హృదయములో గానీ, ఏమీ లేకపోతే ఎదురుగా ఉన్న బ్రాహ్మణోత్తమునిలో గానీ నన్ను భావించి ద్రవ్యముతో, అందరికీ గురువైన నన్ను, (లేద గురువు రూపములో ఉన్న నన్ను ) మాయ లేకుండా అర్చించాలి

పూర్వం స్నానం ప్రకుర్వీత ధౌతదన్తోऽఙ్గశుద్ధయే
ఉభయైరపి చ స్నానం మన్త్రైర్మృద్గ్రహణాదినా

మొదట స్నానం చేసి, దంతధావనాదులు చేసుకుని,
శుద్ధ మృత్తికతో మంత్రముతో జలముతో స్నానం చేయాలి

సన్ధ్యోపాస్త్యాదికర్మాణి వేదేనాచోదితాని మే
పూజాం తైః కల్పయేత్సమ్యక్ సఙ్కల్పః కర్మపావనీమ్

వేదములో బోధించిన సంధయా కర్మలు చేసిన తరువాత
మన కర్మలను పవిత్రం చేసే పూజను ఆచరించాలి

శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ
మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా

ఆరాధించడానికి ప్రతిమ ఎనిమిది రకాలుగా ఉంటుంది
శిలతో
చెక్కతో
లోహముతో
నూనెతో
చిత్రపటమూ
ఇసుక
మనోమయం
మణిమయం
ఇలా ఎనిమిది రకాలుగా ఉంటాయి

చలాచలేతి ద్వివిధా ప్రతిష్ఠా జీవమన్దిరమ్
ఉద్వాసావాహనే న స్తః స్థిరాయాముద్ధవార్చనే

ప్రతిమ కూడా రెండు రకాలు
ఇంటిలో ఉన్న ప్రతిమ చల, దేవాలయాదులలో ఉండేది అచల
స్థిరమైన ప్రతిమలో ఆవాహనా, ఉద్వాసనా ఉండదు. చలములో ఆవాహనా ఉద్వాసనా ఉంటుంది.

అస్థిరాయాం వికల్పః స్యాత్స్థణ్డిలే తు భవేద్ద్వయమ్
స్నపనం త్వవిలేప్యాయామన్యత్ర పరిమార్జనమ్

అస్థిర దగ్గర, కావాలంటే ఉద్వాసన చేయవచ్చు, లేకుంటే లేదు
స్థండిలములో మాత్రం తప్పకుండా ఉద్వాసనావాహనాదులు చేయాలి
కరిగిపోనివి, మరిగిపోనివాటికే స్నానం చేయించాలి. కరిగిపోయే వాటికి స్నానం ఉండదు
వాటికి ప్రోక్షణ మాత్రం చేయాలి

ద్రవ్యైః ప్రసిద్ధైర్మద్యాగః ప్రతిమాదిష్వమాయినః
భక్తస్య చ యథాలబ్ధైర్హృది భావేన చైవ హి

కపటం లేనివాడు ప్రసిద్ధమైన ద్రవ్యములతో నన్ను పూజించాలి. దొరికిన దానితో నన్ను పూజించాలి.
లేకుంటే హృదయములో భావనతోనే అన్నీ సమర్పించవచ్చు.

స్నానాలఙ్కరణం ప్రేష్ఠమర్చాయామేవ తూద్ధవ
స్థణ్డిలే తత్త్వవిన్యాసో వహ్నావాజ్యప్లుతం హవిః

విగ్రహములోనే స్నానమూ అలంకరణమూ చేయాలి
స్థండిలములో అలంకారం ఉండదు. కేవలం తత్వ విన్యాసాలు చేయాలి (వాసుదేవ, అనిరుద్ధాది తత్వాలు, 24 తత్వాలు)
అగ్నిహోత్రమైతే ఆజ్యాహుతములివ్వాలి

సూర్యే చాభ్యర్హణం ప్రేష్ఠం సలిలే సలిలాదిభిః
శ్రద్ధయోపాహృతం ప్రేష్ఠం భక్తేన మమ వార్యపి

సూర్యునికి అర్ఘ్య జలం ఇష్టం.
జలములో పూజించాలంటే సలీలాలతో చేయాలి
భక్తుడు శ్రద్ధగా నాకు అర్పించిన నీరు కూడా నాకు ఇష్టమే

భూర్యప్యభక్తోపాహృతం న మే తోషాయ కల్పతే
గన్ధో ధూపః సుమనసో దీపోऽన్నాద్యం చ కిం పునః

భక్తిలేకుండా ఎంత చేసినా నాకు నచ్చదు. గంధమూ ధూపమూ పూలూ దీపమూ అన్నాద్యములూ, పరిశుద్ధుడై

శుచిః సమ్భృతసమ్భారః ప్రాగ్దర్భైః కల్పితాసనః
ఆసీనః ప్రాగుదగ్వార్చేదర్చాయాం త్వథ సమ్ముఖః

అన్నీ కూర్చుకుని దర్భల మీద తాను కూర్చుని, తూర్పు లేద ఉత్తర ముఖముగా కూర్చుని, లేదా అర్చ యందు సముఖముగా కూర్చుని కూడా చేయవచ్చు

కృతన్యాసః కృతన్యాసాం మదర్చాం పాణినామృజేత్
కలశం ప్రోక్షణీయం చ యథావదుపసాధయేత్

తాను అంగన్యాస కరన్యాసములు చేసి, అవి అన్నీ ఉంచిన స్వామిని చేతితో స్పృశించి, ఆయా పాత్రలు అక్కడ ఆసాదించాలి

తదద్భిర్దేవయజనం ద్రవ్యాణ్యాత్మానమేవ చ
ప్రోక్ష్య పాత్రాణి త్రీణ్యద్భిస్తైస్తైర్ద్రవ్యైశ్చ సాధయేత్

ఆ నీళ్ళతో దేవయజనం, ద్రవ్యాలనూ ప్రోక్షించుకుని, పాత్రలను నీటితో నింపి,
తీర్థం పొడి మొదలైనవి ఉంచి

పాద్యార్ఘ్యాచమనీయార్థం త్రీణి పాత్రాణి దేశికః
హృదా శీర్ష్ణాథ శిఖయా గాయత్ర్యా చాభిమన్త్రయేత్

అర్ఘ్యానికీ పాద్యానికీ ఆచమనీయానికీ మూడు పాత్రలు ఉంచి, ఆచార్య పాత్ర ఉంచి
హృదయముతో శిరస్సుతో శిఖతో గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి,

పిణ్డే వాయ్వగ్నిసంశుద్ధే హృత్పద్మస్థాం పరాం మమ
అణ్వీం జీవకలాం ధ్యాయేన్నాదాన్తే సిద్ధభావితామ్

వాయువుతో అగ్నితో శుద్ధమైన ఈ దేహములో హృదయ పద్మములో ఉన్న నన్ను, అంతర్యామిగా ఉన్న నన్ను ధ్యానం చేయాలి.

తయాత్మభూతయా పిణ్డే వ్యాప్తే సమ్పూజ్య తన్మయః
ఆవాహ్యార్చాదిషు స్థాప్య న్యస్తాఙ్గం మాం ప్రపూజయేత్

ఆ కలను ఈ ఆత్మలో ఆవాహింపచేసి, ఆరాధకుడు కూడా భగవన్మయుడైపోయి, ఆవాహన చేసి, అర్చాదులలో వాటిని స్థాపించి, అంగములతో కలసి నన్ను పూజించాలి

పాద్యోపస్పర్శార్హణాదీనుపచారాన్ప్రకల్పయేత్
ధర్మాదిభిశ్చ నవభిః కల్పయిత్వాసనం మమ

అర్ఘ్య పాద్య ఆచమనీయాది ఉపచారాలు చేసి
ధర్మాదులతో తొమ్మిదితో ఆసనాన్ని కల్పించి

పద్మమష్టదలం తత్ర కర్ణికాకేసరోజ్జ్వలమ్
ఉభాభ్యాం వేదతన్త్రాభ్యాం మహ్యం తూభయసిద్ధయే

అక్కడ అష్ట దళ పద్మాలను, కర్ణికా కేసరములతో కల్పించి, ఐతే వైదిక మంత్రాలతో, లేదా తాంత్రిక మంత్రాలతో ఈ రెండిటితో ఉభయ సిద్ధికోసం నన్ను

సుదర్శనం పాఞ్చజన్యం గదాసీషుధనుర్హలాన్
ముషలం కౌస్తుభం మాలాం శ్రీవత్సం చానుపూజయేత్

ఈ ఆయుధాలు ధరించి ఉన్న నన్ను ఆరాధించాలి

నన్దం సునన్దం గరుడం ప్రచణ్డం చణ్డం ఏవ చ
మహాబలం బలం చైవ కుముదం కముదేక్షణమ్

దుర్గాం వినాయకం వ్యాసం విష్వక్షేనం గురూన్సురాన్
స్వే స్వే స్థానే త్వభిముఖాన్పూజయేత్ప్రోక్షణాదిభిః

వీరందరూ పరివార దేవతలు. వీరందరినీ తమ తమ స్థానాలలో ఉంచి పూజించాలి. దర్శనం స్పర్శనం మార్జనాదులతో వారిని ఆరాధించాలి.

చన్దనోశీరకర్పూర కుఙ్కుమాగురువాసితైః
సలిలైః స్నాపయేన్మన్త్రైర్నిత్యదా విభవే సతి

సుగంధ ద్రవ్యాలతో పరిమళింపచేసి
సుగంధ ద్రవ్యములతో కూర్చబడిన జలముతో, మంత్రములతో , సంపద ఉంటే నిత్యమూ పూజ చేయాలి

స్వర్ణఘర్మానువాకేన మహాపురుషవిద్యయా
పౌరుషేణాపి సూక్తేన సామభీ రాజనాదిభిః

మహాపురుష విద్యతో (పురుష సూక్తముతో), సామ మంత్రములూ ఋగ్వేదాదులతో

వస్త్రోపవీతాభరణ పత్రస్రగ్గన్ధలేపనైః
అలఙ్కుర్వీత సప్రేమ మద్భక్తో మాం యథోచితమ్

వస్త్రాదులని అర్పించి, ప్రేమతో అలంకరించాలి, తగిన రీతిలో భక్తితో ప్రేమతో నన్ను అలంకరించాలి

పాద్యమాచమనీయం చ గన్ధం సుమనసోऽక్షతాన్
ధూపదీపోపహార్యాణి దద్యాన్మే శ్రద్ధయార్చకః

పుష్పాలతో ధూప దీపాదులను అర్పించాలి శ్రద్ధతో

గుడపాయససర్పీంషి శష్కుల్యాపూపమోదకాన్
సంయావదధిసూపాంశ్చ నైవేద్యం సతి కల్పయేత్

సకినాలూ అరిసెలూ లడ్డూలు పాయసములూ, పెరుగూ మొదలైనవాటిని "సంపదా శక్తీ ఉంటే" చేసి నాకు అర్పించాలి

అభ్యఙ్గోన్మర్దనాదర్శ దన్తధావాభిషేచనమ్
అన్నాద్యగీతనృత్యాని పర్వణి స్యురుతాన్వహమ్

దంత ధావనాదులూ స్నానం అభ్యంగనం ఉన్మర్దనం, అద్దం చూపడం, అభిషేకం, నృత్యమూ గానమూ మొదలైనవి, ఈ ప్రత్యేక సేవలు శక్తి ఉంటే రోజూ చేయాలి లేదంటే తిరునక్షత్రాలలో చేయాలి

విధినా విహితే కుణ్డే మేఖలాగర్తవేదిభిః
అగ్నిమాధాయ పరితః సమూహేత్పాణినోదితమ్

అగ్నిహోత్రమంటే, యధావిధిగా చేసిన హోమ యాగ కుండములో, దర్భలూ మొదలైనవాటితో అగ్నిని ఆవాహన చేసి, జలం తీసుకుని

పరిస్తీర్యాథ పర్యుక్షేదన్వాధాయ యథావిధి
ప్రోక్షణ్యాసాద్య ద్రవ్యాణి ప్రోక్ష్యాగ్నౌ భావయేత మామ్

పరిషేచనం చేసి, ప్రోక్షించి, ప్రోక్షణతో ద్రవ్యాలను ప్రోక్షించాలి

తప్తజామ్బూనదప్రఖ్యం శఙ్ఖచక్రగదామ్బుజైః
లసచ్చతుర్భుజం శాన్తం పద్మకిఞ్జల్కవాససమ్

అగ్నిహోత్రములో ఇలా వేంచేసి ఉన్న నన్ను ధ్యానం చేయాలి

స్ఫురత్కిరీటకటక కటిసూత్రవరాఙ్గదమ్
శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభం వనమాలినమ్

ధ్యాయన్నభ్యర్చ్య దారూణి హవిషాభిఘృతాని చ
ప్రాస్యాజ్యభాగావాఘారౌ దత్త్వా చాజ్యప్లుతం హవిః

ధ్యానం చేసి, అర్చించి, సమిధలను హవిస్సుతో పూజించి,  ఇలా అన్నీ చేసి
హవిస్సును నెయ్యితో చల్లి, దానితో వేయాలి

జుహుయాన్మూలమన్త్రేణ షోడశర్చావదానతః
ధర్మాదిభ్యో యథాన్యాయం మన్త్రైః స్విష్టికృతం బుధః

షోడశారాధనతో మూలమంత్రముతో హోమం చేయాలి
ధర్మాధులతో పండితుడైనవాడు చేయాలి

అభ్యర్చ్యాథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్
మూలమన్త్రం జపేద్బ్రహ్మ స్మరన్నారాయణాత్మకమ్

ఇలా ఆరాధన చేసి నమస్కారం చేసి ద్వారపాలకులకు బలిని అర్పించాలి
నారాయణాత్మకమైన మూల మంత్రాన్ని జపించాలి

దత్త్వాచమనముచ్ఛేషం విష్వక్షేనాయ కల్పయేత్
ముఖవాసం సురభిమత్తామ్బూలాద్యమథార్హయేత్

ఇలా దానం చేసి శేషాన్ని విశ్వక్సేనుడికి అర్పించాలి
తాంబూలాదులు అర్పించాలి

ఉపగాయన్గృణన్నృత్యన్కర్మాణ్యభినయన్మమ
మత్కథాః శ్రావయన్శృణ్వన్ముహూర్తం క్షణికో భవేత్

గానం చేస్తూ పలుకుతూ నాట్యం చేస్తూ నా కర్మలు అభినయించాలి
నా కథలు వినిపించాలీ, వినాలి. ముహూర్తకాలం తన్మయముగా మౌనముగా ఉండాలి

స్తవైరుచ్చావచైః స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి
స్తుత్వా ప్రసీద భగవన్నితి వన్దేత దణ్డవత్

పురాణములలో చెప్పిన స్తోత్రములతో గానీ ప్రాకృతి స్తోత్రములతో గానీ స్తోత్రం చేసి, భగవన్ ప్రసీదా అని దండ ప్రమాణం చేసి

శిరో మత్పాదయోః కృత్వా బాహుభ్యాం చ పరస్పరమ్
ప్రపన్నం పాహి మామీశ భీతం మృత్యుగ్రహార్ణవాత్

శిరస్సుని పాదముల వద్ద ఉంచి, బాహువులతో నమస్కారం చేయాలి.
"మృత్యువు అనే పెద్ద సంసారములో మునిగి ఉన్న నన్ను కాపాడు"

ఇతి శేషాం మయా దత్తాం శిరస్యాధాయ సాదరమ్
ఉద్వాసయేచ్చేదుద్వాస్యం జ్యోతిర్జ్యోతిషి తత్పునః

అని పలికి నేను ఇచ్చిన దాన్ని శిరస్సున ఉంచుకుని
ఉద్వాసన చేయదగినదైతే ఉద్వాసన చేయాలి
జ్యోతిని జ్యోతిలో కలపాలి

అర్చాదిషు యదా యత్ర శ్రద్ధా మాం తత్ర చార్చయేత్
సర్వభూతేష్వాత్మని చ సర్వాత్మాహమవస్థితః

ఎలాంటి అర్చ ఉంటే, అక్కడ ఎలాంటి శ్రద్ధ ఉంటే అలా ఆరాధించాలి
అన్ని ప్రాణ్నులలో ఆత్మలో నేను సర్వ స్వరూపుడిగా ఉంటాను

ఏవం క్రియాయోగపథైః పుమాన్వైదికతాన్త్రికైః
అర్చన్నుభయతః సిద్ధిం మత్తో విన్దత్యభీప్సితామ్

ఇలాంటి క్రియాయోగ మార్గాలతో వైదిక తాంత్రిక మార్గాలతో ఇలా చేస్తే ఇహ పరములలో నా నుండి సిద్ధిని పొందుతాడు

మదర్చాం సమ్ప్రతిష్ఠాప్య మన్దిరం కారయేద్దృఢమ్
పుష్పోద్యానాని రమ్యాణి పూజాయాత్రోత్సవాశ్రితాన్

శక్తి ఉన్నవాడైతే దృఢమైన మందిరాన్ని ఏర్పాటు చేసి నా మందిరాన్ని ప్రతిష్ఠించాలి
పూజలకూ యాత్రలకూ ఉత్సవాలకూ పనికి వచ్చే పుష ఉద్యానవనములను, అతి సుందరములనూ నిర్మించాలి

పూజాదీనాం ప్రవాహార్థం మహాపర్వస్వథాన్వహమ్
క్షేత్రాపణపురగ్రామాన్దత్త్వా మత్సార్ష్టితామియాత్

మహాపర్వలలోగానీ ప్రతీరోజూ గానీ ఆచరించ వలసిన పూజా విధానం కోసం
దేవాలయం యొక్క ఆరాధన కొరకు ఉత్సవానికి కావలసిన వాటినీ, క్షేత్రములూ ఆపణములూ పురములూ గ్రామములూ ఇస్తే నా దగ్గరకు చేరతాడు

ప్రతిష్ఠయా సార్వభౌమం సద్మనా భువనత్రయమ్
పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్యతామియాత్

నన్ను దేవాలయములో ప్రతిష్ఠ చేస్తే చక్రవర్తిత్వం వస్తుంది
మంద్రీం నిర్మిస్తే త్రైలోక్య ఆధిపత్యం వస్తుంది
పూజాదులు చేస్తే బ్రహ్మ లోకం కలుగుతుంది
మూడూ చేస్తే నా అంతటి వాడవుతాడు

మామేవ నైరపేక్ష్యేణ భక్తియోగేన విన్దతి
భక్తియోగం స లభత ఏవం యః పూజయేత మామ్

సంసారం యందు కోరిక లేకుండా భక్తి యోగముతో నన్నే పొందుతాడు
నన్ను ఎవరు ఈ విధిగా పూజిస్తారో వారికి భక్తి యోగం లభిస్తుంది

యః స్వదత్తాం పరైర్దత్తాం హరేత సురవిప్రయోః
వృత్తిం స జాయతే విడ్భుగ్వర్షాణామయుతాయుతమ్

దేవతలకూ బ్రాహ్మణులకూ తానిచ్చిన దాన్ని గానీ ఇతరులు ఇచ్చిన దాన్ని గానీ హరిస్తే పదిలక్షల సంవత్సరాలు మలములో పురుగుగా పుడతాడు

కర్తుశ్చ సారథేర్హేతోరనుమోదితురేవ చ
కర్మణాం భాగినః ప్రేత్య భూయో భూయసి తత్ఫలమ్

భగవంతుని కార్యక్రమాలను చేసేవాడికే కాక చేయించేవాడికీ కారణానికీ  ప్రేరేపించిన వాడికీ ఆమోదించిన వాడికీ కూడా ఈ ఆరాధనా ఫలితములో భాగం లభిస్తుంది

                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు