Pages

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొంభయ్యవ అధ్యాయం

      ఓం నమో భగవతే వాసుదేవయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొంభయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
సుఖం స్వపుర్యాం నివసన్ద్వారకాయాం శ్రియః పతిః
సర్వసమ్పత్సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణిపుఙ్గవైః

స్వామి యాదవులందరితో కలసి ద్వారకా పురిలో అన్ని భోగాలూ అనుభవిస్తూ

స్త్రీభిశ్చోత్తమవేషాభిర్నవయౌవనకాన్తిభిః
కన్దుకాదిభిర్హర్మ్యేషు క్రీడన్తీభిస్తడిద్ద్యుభిః

నవయవ్వన కాంతులు గల స్త్రీలతో విహరిస్తూ

రథములూ అశ్వములూ భటులూ ఉద్యానవనాలూ పూల చెట్లూ చెట్ల మీద కోయిలలూ, తోటలలో నెమళ్ళూ, సరస్సులూ.
ఇలా మహా రాజ చక్రవర్తి అయి అన్ని భోగాలనూ అనుభవించాడు అందరితో కలసి. స్త్రీలతో కలసి జల క్రీడలూ మంత్రులతో వారి రాజ్యపాలనా వివరాలు

నిత్యం సఙ్కులమార్గాయాం మదచ్యుద్భిర్మతఙ్గజైః

స్వలఙ్కృతైర్భటైరశ్వై రథైశ్చ కనకోజ్జ్వలైః
ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్రుమరాజిషు

నిర్విశద్భృఙ్గవిహగైర్నాదితాయాం సమన్తతః
రేమే షోడశసాహస్ర పత్నీనాం ఏకవల్లభః

తావద్విచిత్రరూపోऽసౌ తద్గేహేషు మహర్ద్ధిషు
ప్రోత్ఫుల్లోత్పలకహ్లార కుముదామ్భోజరేణుభిః

వారితో వీరు వీరితో వారు రమిస్తూ కాలం గడిపాడు
నటులూ వర్తకులూ గాయకులూ వందిమాగధులూ వారు చేసే స్తోత్రాలు, ఇవాన్నీ చూచేవారికి మహారాజు ఇంత భోగాలను అనుభవిస్తారా అని చెప్పడనికా అన్నట్లు
సంస్కారాలూ ఆభరాణాలూ భూషణాలూ పరస్పరం కానుకలు ఇచ్చుకున్నారు
పరమాత్మ లీలలతో పరిహాసముతో స్త్రీలందరూ తమ మనసును పారవేసుకున్నారు

వాసితామలతోయేషు కూజద్ద్విజకులేషు చ
విజహార విగాహ్యామ్భో హ్రదినీషు మహోదయః
కుచకుఙ్కుమలిప్తాఙ్గః పరిరబ్ధశ్చ యోషితామ్

ఉపగీయమానో గన్ధర్వైర్మృదఙ్గపణవానకాన్
వాదయద్భిర్ముదా వీణాం సూతమాగధవన్దిభిః

సిచ్యమానోऽచ్యుతస్తాభిర్హసన్తీభిః స్మ రేచకైః
ప్రతిషిఞ్చన్విచిక్రీడే యక్షీభిర్యక్షరాడివ

తాః క్లిన్నవస్త్రవివృతోరుకుచప్రదేశాః
సిఞ్చన్త్య ఉద్ధృతబృహత్కవరప్రసూనాః
కాన్తం స్మ రేచకజిహీర్షయయోపగుహ్య
జాతస్మరోత్స్మయలసద్వదనా విరేజుః

కృష్ణస్తు తత్స్తనవిషజ్జితకుఙ్కుమస్రక్
క్రీడాభిషఙ్గధుతకున్తలవృన్దబన్ధః
సిఞ్చన్ముహుర్యువతిభిః ప్రతిషిచ్యమానో
రేమే కరేణుభిరివేభపతిః పరీతః

నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినామ్
క్రీడాలఙ్కారవాసాంసి కృష్ణోऽదాత్తస్య చ స్త్రియః

కృష్ణస్యైవం విహరతో గత్యాలాపేక్షితస్మితైః
నర్మక్ష్వేలిపరిష్వఙ్గైః స్త్రీణాం కిల హృతా ధియః

ఊచుర్ముకున్దైకధియో గిర ఉన్మత్తవజ్జడమ్
చిన్తయన్త్యోऽరవిన్దాక్షం తాని మే గదతః శృణు

ఇలా పరమాత్మ నిత్యం తమతో కలసి నిత్యం ఉన్నాడు. నిరంతరం వారితో క్రీడాసక్తుడై తమ దగ్గరే  ఉంటున్నాడు. ఇది చూచి వారందరూ కృష్ణుడు స్త్రీలోలుడూ జడుడూ ఉన్మత్తుడూ అని భావించి ఇలా వారిలో వారు మాట్లాడుకున్నారు

వీటిని కురరి గీతము అంటారు

మహిష్య ఊచుః
కురరి విలపసి త్వం వీతనిద్రా న శేషే
స్వపితి జగతి రాత్ర్యామీశ్వరో గుప్తబోధః
వయమివ సఖి కచ్చిద్గాఢనిర్విద్ధచేతా
నలిననయనహాసోదారలీలేక్షితేన

జ్ఞ్యానాన్ని కూడా తనలో దాచుకుని పరమాత్మే రాత్రి పూట పడుకుని ఉంటున్నాడు. నీవెందుకు నిదురపోవడం లేదు. జ్ఞ్యానాన్ని రహస్యముగా దాచుకున్న ఈశ్వరుడు కూడా నిద్రపోతున్నాడు
పరమాత్మ పడుకున్నాడు కానీ మేము నిద్రపోలేదు. మాలాగా నీవు కూడా పరమాత్మ విలాసవంతమైన చూపుతో కొట్టబడ్డావా
ఉదారమైన చిరునవ్వుతో నిండిన చూపుతో కొట్టబడ్డావా

నేత్రే నిమీలయసి నక్తమదృష్టబన్ధుస్
త్వం రోరవీషి కరుణం బత చక్రవాకి
దాస్యం గత వయమివాచ్యుతపాదజుష్టాం
కిం వా స్రజం స్పృహయసే కవరేణ వోఢుమ్

చక్రవాక పక్షులకు చీకటైతే ఎదురుగా ఉన్నవారు కనపడరు. నీ ప్రియున్ని చూడక నీవు కళ్ళు మూసుకు ఉన్నావు. నీవు కూడా మాలాగా శ్రీకృష్ణుని దాస్యాన్ని ఒప్పుకున్నావా,, అందుకే నిద్రపోవడం లేదా. పరమాత్మ మెడలో దండను నీ కొప్పులో వేసుకుందామని అనుకుంటున్నావా

భో భోః సదా నిష్టనసే ఉదన్వన్నలబ్ధనిద్రోऽధిగతప్రజాగరః
కిమ్వా ముకున్దాపహృతాత్మలాఞ్ఛనః ప్రాప్తాం దశాం త్వం చ గతో దురత్యయామ్

సముద్రాలతో అంటున్నారు
తెల్లవారు నిద్రపోకుండా ఎందుకా ఘోష. మెలకువగా ఉంటున్నావు.
పరమాత్మ చేత నీ ఆస్తి అపహరించబడినదా (కౌస్తుభం)
మా సొత్తు కూడా హరించాడు పరమాత్మ

త్వం యక్ష్మణా బలవతాసి గృహీత ఇన్దో
క్షీణస్తమో న నిజదీధితిభిః క్షిణోషి
కచ్చిన్ముకున్దగదితాని యథా వయం త్వం
విస్మృత్య భోః స్థగితగీరుపలక్ష్యసే నః

అయ్యో చంద్రుడా క్షీణించిపోతున్నావా
నీ కాంతులు తగ్గిపోతున్నాయి
పొరబాటున కృష్ణుని మాటలు విని నమ్మావా
మాలాగే నీవు చిక్కిపోతావు

కిం న్వాచరితమస్మాభిర్మలయానిల తేऽప్రియమ్
గోవిన్దాపాఙ్గనిర్భిన్నే హృదీరయసి నః స్మరమ్

మలయానిలమా, మేము నీకే అపకారం చేసాము. అనవసరముగా కృష్ణునికి సాయం చేస్తూ ఆయన క్రీగంటి చూపులతో వెలువడి మా హృదయాలను చీలుస్తున్నావు

మేఘ శ్రీమంస్త్వమసి దయితో యాదవేన్ద్రస్య నూనం
శ్రీవత్సాఙ్కం వయమివ భవాన్ధ్యాయతి ప్రేమబద్ధః
అత్యుత్కణ్ఠః శవలహృదయోऽస్మద్విధో బాష్పధారాః
స్మృత్వా స్మృత్వా విసృజసి ముహుర్దుఃఖదస్తత్ప్రసఙ్గః

మేఘమా జాగ్రత్తగా చూస్తే ఉన్నవారందరిలో కృష్ణునికి నీవే ప్రియుడిగా కనపడుతున్నావు
మాలాగ నీవు కూడా పరమాత్మ యొక్క శ్రీవత్సాన్ని ధరిస్తున్నావా. మాలాగ నీవుకూడా ప్రేమ బాగా కలిగి దాన్ని దాచుకోలేక కన్నీటి ధారలాగా కురుస్తున్నావు
దుఃఖమును కలిగించే పరమాత్మ ప్రసంగాన్ని జ్ఞ్యాపకం చేసుకుని కన్నీరు వర్షిస్తున్నావా

ప్రియరావపదాని భాషసే మృతసఞ్జీవికయానయా గిరా
కరవాణి కిమద్య తే ప్రియం వద మే వల్గితకణ్ఠ కోకిల

పరమాత్మ  యొక్క ఆహ్వానాన్ని సూచించే మాటలు మాట్లాడుతున్నావు. చనిపోయినవారిని బతికించేంత తీయగా మధురమైన కంఠముతో మాట్లాడుతున్న నీకు ఎలాంటి ప్రీతి చేయాలి

న చలసి న వదస్యుదారబుద్ధే క్షితిధర చిన్తయసే మహాన్తమర్థమ్
అపి బత వసుదేవనన్దనాఙ్ఘ్రిం వయమివ కామయసే స్తనైర్విధర్తుమ్

ఓ భూమి నీవు కదలవూ మాట్లాడవు, ఏమి ఆలోచిస్తూ ఉన్నావు
నీవు కూడా మాలాగ పరమాత్మ పాద పద్మములను నీ స్తనములలో (పర్వతాలు) ఉంచుకోవాలని కోరి మాట రాకుండా ఇలా ఉన్నావా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నావా

శుష్యద్ధ్రదాః కరశితా బత సిన్ధుపత్న్యః
సమ్ప్రత్యపాస్తకమలశ్రియ ఇష్టభర్తుః
యద్వద్వయం మధుపతేః ప్రణయావలోకమ్
అప్రాప్య ముష్టహృదయాః పురుకర్శితాః స్మ

నదులూ మడుగులూ సరసులూ నీరు ఇంకిపోయి కృశించి ఉన్నారు. కమలములు కూడా లేకుండా ఉన్నారు
పరమాత్మ తీయని చూపు బడిన మాలాగా మీరు కూడా రోజు రోజుకూ చిక్కిపోతూ ఉన్నారు

హంస స్వాగతమాస్యతాం పిబ పయో బ్రూహ్యఙ్గ శౌరేః కథాం
దూతం త్వాం ను విదామ కచ్చిదజితః స్వస్త్యాస్త ఉక్తం పురా
కిం వా నశ్చలసౌహృదః స్మరతి తం కస్మాద్భజామో వయం
క్షౌద్రాలాపయ కామదం శ్రియమృతే సైవైకనిష్ఠా స్త్రియామ్

పరమాత్మ నిద్ర నటిస్తోంటే ఎదురుగా ఉన్న పరమాత్మ కనులు తెరచి చూడకుంటే వారి మనసులో ఇంతటి కలకలం రేగింది. వీరు ఆయనలో చిత్త వికారాన్ని కలిగించలేకపోయారు. పరమాత్మ మాయా విలాస ప్రభావం
హంసా, నీకు పాలు పోస్తాను, కాస్త మా స్వామి కథలు చెబుతావా
నీవు దూతవని మాకు తెలుసు. (నల దమయంతికి దౌత్యం చేసావు కదా) అలా మాకు మా స్వామికీ దౌత్యం చేసిపెడతావా
అతని చల సౌహృదుడు (చంచలమైన ప్రేమ గలవాడు) . ఐనా ఎందుకు మేము స్వామిని సేవించాలి. ఆయనను గట్టిగా నమ్ముకున్నది ఒక్క లక్ష్మీ అమ్మవారే. ఆయన కూడా అమె ఒక్కరినే పట్టుకుని ఉన్నాడు

శ్రీశుక ఉవాచ
ఇతీదృశేన భావేన కృష్ణే యోగేశ్వరేశ్వరే
క్రియమాణేన మాధవ్యో లేభిరే పరమాం గతిమ్

పరమాత్మ యందు ఇలాంటి భావముతో నిద్రపోయినపుడూ మెలకువ ఉన్నపుడూ చాటుగా ఉన్నా ఎదురుగా ఉన్నా పరమాత్మనే జ్ఞ్యాపకం చేసుకుంటూ ఉత్తమ గతిని పొందారు

శ్రుతమాత్రోऽపి యః స్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః
ఉరుగాయోరుగీతో వా పశ్యన్తీనాం చ కిం పునః

లోకములో పరమాత్మ కథ వింటేనే ముక్తి లభిస్తే ఆయనను నిరంతరం స్మరించే వారికి పరమ గతి దొరకుటలో వింతేముంది

యాః సమ్పర్యచరన్ప్రేమ్ణా పాదసంవాహనాదిభిః
జగద్గురుం భర్తృబుద్ధ్యా తాసాం కిమ్వర్ణ్యతే తపః

వారాయన కాళ్ళు వత్తారు ఆభరణాలూ వస్త్రాలిచ్చారు అన్ని కైంకర్యాలూ చేసారు
అలాంటి పరమాత్మను భర్తగా ఇన్ని రకముల సేవ చేసిన వారు ఏ తపస్సు చేసారో

ఏవం వేదోదితం ధర్మమనుతిష్ఠన్సతాం గతిః
గృహం ధర్మార్థకామానాం ముహుశ్చాదర్శయత్పదమ్

పరమాత్మ గృహస్థాశ్రమములో ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ అందరికీ ధర్మార్థ కామాల్ స్వరూప స్వభావాలు వాటి ఫలితాలూ చెబుతూ ఆచరింపచేసాడు. ఎలా కోరి ఎలా ఆచరిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూపాడు. ధర్మముగా ధర్మార్థ కామాల్ను సేవించమని బోధించాడు

ఆస్థితస్య పరం ధర్మం కృష్ణస్య గృహమేధినామ్
ఆసన్షోడశసాహస్రం మహిష్యశ్చ శతాధికమ్

పదుహారు వేల మందీ ఎనిమిది మందీ కాకుండా, నూట ఎనభై మందీ ఉన్నారు

తాసాం స్త్రీరత్నభూతానామష్టౌ యాః ప్రాగుదాహృతాః
రుక్మిణీప్రముఖా రాజంస్తత్పుత్రాశ్చానుపూర్వశః

వీరిలో అష్ట మహిషులు పరమ శ్రేష్టులు
ఒక్కో భార్య యందూ పదేసి మంది పుత్రులను పొందాడు

ఏకైకస్యాం దశ దశ కృష్ణోऽజీజనదాత్మజాన్
యావత్య ఆత్మనో భార్యా అమోఘగతిరీశ్వరః

జ్ఞ్యానం గలవాడైన పరమాత్మ సంతానాన్ని పొందాడు

తేషాముద్దామవీర్యాణామష్టాదశ మహారథాః
ఆసన్నుదారయశసస్తేషాం నామాని మే శృణు

వారిలో పరమ వీరులు 18 మంది ఉన్నారు

ప్రద్యుమ్నశ్చానిరుద్ధశ్చ దీప్తిమాన్భానురేవ చ
సామ్బో మధుర్బృహద్భానుశ్చిత్రభానుర్వృకోऽరుణః

పుష్కరో వేదబాహుశ్చ శ్రుతదేవః సునన్దనః
చిత్రబాహుర్విరూపశ్చ కవిర్న్యగ్రోధ ఏవ చ

ఇవి వారి పేర్లు. వీరు మహారథులు

ఏతేషామపి రాజేన్ద్ర తనుజానాం మధుద్విషః
ప్రద్యుమ్న ఆసీత్ప్రథమః పితృవద్రుక్మిణీసుతః

వీరిలో ప్రద్యుమ్నుడు మొదటి సంతానం.
తండ్రి అంతటి మహా పరాక్రమం గలవాడు
రుక్మి పుత్రికను పెళ్ళి చేసుకున్నాడు

స రుక్మిణో దుహితరముపయేమే మహారథః
తస్యాం తతోऽనిరుద్ధోऽభూత్నాగాయతబలాన్వితః

అనిరుద్ధుడు పదివేల ఏనుగుల బలం గలవాడు

స చాపి రుక్మిణః పౌత్రీం దౌహిత్రో జగృహే తతః
వజ్రస్తస్యాభవద్యస్తు మౌషలాదవశేషితః

రుక్మి యొక్క కొడుకు కూతురిని ఇతను పెళ్ళి చేసుకున్నాడు. వారి కుమారుడు వజ్రుడు
ఈ వజ్రుడే ఋషుల శాపం వలన వచ్చిన రోకలి బారిన పడి చావకుండా మిగిలాడు

ప్రతిబాహురభూత్తస్మాత్సుబాహుస్తస్య చాత్మజః
సుబాహోః శాన్తసేనోऽభూచ్ఛతసేనస్తు తత్సుతః

అతని నుండి ప్రతి బాహూ, ఇలా

న హ్యేతస్మిన్కులే జాతా అధనా అబహుప్రజాః
అల్పాయుషోऽల్పవీర్యాశ్చ అబ్రహ్మణ్యాశ్చ జజ్ఞిరే

యాదవ కులములో పుట్టిన్వారు ధన హీనులు గానీ, సంతాన హీనులుగానీ అల్పాయుష్యులు గానీ
బ్రాహ్మణ భక్తిలేనివారు గానీ కాలేదు

యదువంశప్రసూతానాం పుంసాం విఖ్యాతకర్మణామ్
సఙ్ఖ్యా న శక్యతే కర్తుమపి వర్షాయుతైర్నృప

తిస్రః కోట్యః సహస్రాణామష్టాశీతిశతాని చ
ఆసన్యదుకులాచార్యాః కుమారాణామితి శ్రుతమ్

అందరూ ప్రసిద్ధి పొందిన కర్మలు గలవారు. కృష్ణుని సంతానమూ, వారి సంతానమూ, వారి సంతానమూ లెక్కపెట్టడం మనం చేయలేము. వారికి విద్య నేర్పించిన వారి సంఖ్య చెప్పవచ్చు మూడు కోట్ల ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వందలు

సఙ్ఖ్యానం యాదవానాం కః కరిష్యతి మహాత్మనామ్
యత్రాయుతానామయుత లక్షేణాస్తే స ఆహుకః

ఇలాంటి వారందరికీ ఆహుకుడు మూల పురుషుడు

దేవాసురాహవహతా దైతేయా యే సుదారుణాః
తే చోత్పన్నా మనుష్యేషు ప్రజా దృప్తా బబాధిరే

వీళ్ళంతా దేవ దానవ సంగ్రామములో ఎన్నో సార్లు చనిపోయిన వారు యాదవ కులములో పుట్టారు.
బాగా గర్వించి వీరు ప్రజలను బాధిస్తున్నారు

తన్నిగ్రహాయ హరిణా ప్రోక్తా దేవా యదోః కులే
అవతీర్ణాః కులశతం తేషామేకాధికం నృప

వారిని నిగ్రహించడానికి స్వామి యదుకులములో అవతరించాడు. మొత్తం 101 కులాలలో యదువంశములో ఆవిర్భవించారు. ఈ 101 కులాలకు స్వామే అధిపతి. ఇలాంటి కృష్ణ పరమాత్మను అనుసరించే యాదవులు వృద్ధి పొందారు

తేషాం ప్రమాణం భగవాన్ప్రభుత్వేనాభవద్ధరిః
యే చానువర్తినస్తస్య వవృధుః సర్వయాదవాః

శయ్యాసనాటనాలాప క్రీడాస్నానాదికర్మసు
న విదుః సన్తమాత్మానం వృష్ణయః కృష్ణచేతసః

వీరంతా వారు అనుభవించే అనంతమైన రాజ భోగాలలో మునిగి
తాము ఎక్కడ ఎలా ఉన్నామో తెలియలేని స్థితిలో ఉన్నారు
కృష్ణ పరమాత్మను అండగా గొని తమకు ఎదురులేక అన్నీ అనుభవిస్తూ తమను తాము తెలియక అయ్యారు

తీర్థం చక్రే నృపోనం యదజని యదుషు స్వఃసరిత్పాదశౌచం
విద్విట్స్నిగ్ధాః స్వరూపం యయురజితపర శ్రీర్యదర్థేऽన్యయత్నః
యన్నామామఙ్గలఘ్నం శ్రుతమథ గదితం యత్కృతో గోత్రధర్మః
కృష్ణస్యైతన్న చిత్రం క్షితిభరహరణం కాలచక్రాయుధస్య

పరమాత్మ యదువంశములో పుట్టి తన పాదములో పుట్టిన జలమును తీర్థం చేసారు
అమ్మవారు కూడా నిరంతరం తపస్సు చేసి ప్రయత్నం చేస్తుందో ఆ పరమాత్మను చూస్తూ శత్రువులూ స్నేహితులూ ఆయననే పొందారు
ఆయన నామాన్ని విన్నా పలికినా అన్ని అమంగళాలనూ తొలగిస్తుంది
ఈ పరమాత్మ ఈ భూమి యొక్క భారాన్ని తొలగించుట పెద్ద విచిత్రమా
ఆయనకు కాలచక్రం అనే ఆయుధం ఉంది.

జయతి జననివాసో దేవకీజన్మవాదో
యదువరపరిషత్స్వైర్దోర్భిరస్యన్నధర్మమ్
స్థిరచరవృజినఘ్నః సుస్మితశ్రీముఖేన
వ్రజపురవనితానాం వర్ధయన్కామదేవమ్

దేవకిలో పుట్టడని పేరు పొందాడు స్వామి.కాని ఆయన అఖిల జన అంతర్యామి
తన బాహువులతో అధర్మాన్ని అణుస్తూ స్థావర జంగమముల దుఃఖాన్ని తన చిరునవ్వుతో ఉన్న అందమైన ముఖముతో పోగొట్టేవాడు
వ్రేపల్లెలో గోపికలకు కోరిక పెంచుతున్న స్వామి పెరుగుతున్నాడు

ఇత్థం పరస్య నిజవర్త్మరిరక్షయాత్త
లీలాతనోస్తదనురూపవిడమ్బనాని
కర్మాణి కర్మకషణాని యదూత్తమస్య
శ్రూయాదముష్య పదయోరనువృత్తిమిచ్ఛన్

తన మార్గమైన ధర్మాన్ని రక్షించడానికి దేహం ధరిచిన స్వామి, యదువులలో ఉత్తముడైన ఆయన ఆచరించిన కర్మలు మనమాచరిచిన కర్మలను నశింపచేస్తాయి.
సకల ప్రాణులు ఆచరించిన కర్మలను ధ్వంసం చేసే పరమాత్మ కథలను ఈయన పాదాలను అనుసరిచాలని కోరేవారందరూ వినాలి. వింటూ ఉండాలి
మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి.

మర్త్యస్తయానుసవమేధితయా ముకున్ద
శ్రీమత్కథాశ్రవణకీర్తనచిన్తయైతి
తద్ధామ దుస్తరకృతాన్తజవాపవర్గం
గ్రామాద్వనం క్షితిభుజోऽపి యయుర్యదర్థాః

మానవులకు ఏ పూటకాపూట ప్రతీ పూటా ప్రతీ క్షణం కోరిక పెరుగుతోంది, పరమాత్మ కథను చెప్పాలీ వినాలీ తలవాలి అన్న చింత ప్రతీ క్షణం పెరుగుతూ ఉంటే.ఇలా ఉన్నవారు దాటలేని యముని వేగాన్ని తరింపచేసే మోక్షానికి మూలమైన ఆ పరమ పదాన్ని చేరతారు.
ఆ ధామానికి చేరడానికి రాజులు కూడా నగరాలనూ పట్టణాలనూ విడిచిపెట్టి అడవులకు వెళ్ళారు, ఈ పరమాత్మ కథలను వినాలనీ, ఆయన పాద పద్మాలను సేవించాలని వెళ్ళారు.అలాంటి పరమాత్మ పాద సేవను మీరు కోరినట్లైతే ఆయన కర్మలను మీరు కూడా నిరంతరం ఆయన కథలను వినండి.

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు