Pages

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఆరవ అధ్యాయం

         
       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఆరవ అధ్యాయం

శ్రీరాజోవాచ
బ్రహ్మన్వేదితుమిచ్ఛామః స్వసారాం రామకృష్ణయోః
యథోపయేమే విజయో యా మమాసీత్పితామహీ

సుభద్రా అర్జనుల వివాహాన్ని చెప్పండి మాకు

శ్రీశుక ఉవాచ
అర్జునస్తీర్థయాత్రాయాం పర్యటన్నవనీం ప్రభుః
గతః ప్రభాసమశృణోన్మాతులేయీం స ఆత్మనః

అర్జనుడు తీర్థ యాత్రలు తిరుగుతూ ద్వారకకు వేంచేసాడు
ప్రహ్బాస తీర్థములో సుభద్ర సౌందర్యం గురించి విన్నాడు

దుర్యోధనాయ రామస్తాం దాస్యతీతి న చాపరే
తల్లిప్సుః స యతిర్భూత్వా త్రిదణ్డీ ద్వారకామగాత్

బలరాముడు ఒక్కడే దుర్యోధనునినికి సుభద్రను ఇచ్చి పేళ్ళి చేద్దామని అనుకున్నాడు. అర్జనుడుయతి వేషములో ద్వారకకు వెళ్ళాడు. బలరాముడు అర్జనుని యతి అనుకుని తన ఇంటికి తీసుకు వచ్చి అన్ని పూజలూ సత్కారాలూ చేసాడు. ఆ సత్కరించిన వారిలో సుభద్ర కూడా ఉంది. ఆమె సౌందర్యం చూసిన అర్జనుడు సుభద్రను మోహించాడు. అర్జనుని పరాక్రమం విన్న సుభద్ర కూడా అతనిని ప్రేమించినది అని తెలుసుకున్నాడు.

తత్ర వై వార్షితాన్మాసానవాత్సీత్స్వార్థసాధకః
పౌరైః సభాజితోऽభీక్ష్ణం రామేణాజానతా చ సః

ఏకదా గృహమానీయ ఆతిథ్యేన నిమన్త్ర్య తమ్
శ్రద్ధయోపహృతం భైక్ష్యం బలేన బుభుజే కిల

సోऽపశ్యత్తత్ర మహతీం కన్యాం వీరమనోహరామ్
ప్రీత్యుత్ఫుల్లేక్షణస్తస్యాం భావక్షుబ్ధం మనో దధే

సాపి తం చకమే వీక్ష్య నారీణాం హృదయంగమమ్
హసన్తీ వ్రీడితాపఙ్గీ తన్న్యస్తహృదయేక్షణా

తాం పరం సమనుధ్యాయన్నన్తరం ప్రేప్సురర్జునః
న లేభే శం భ్రమచ్చిత్తః కామేనాతిబలీయసా

మహత్యాం దేవయాత్రాయాం రథస్థాం దుర్గనిర్గతాం
జహారానుమతః పిత్రోః కృష్ణస్య చ మహారథః

కృష్ణ పరమాత్మ సహకారముతో సుభద్ర దేవతాయతనానికి బయలు దేరి వెళుతున్న సమయములో కృష్ణుని ప్రేరణతో రథం తీసుకుని ఆమెను అపహరించుకుని వెళ్ళాడు. దుర్గా దేవిని ఆరాధించడానికి దేవయాత్రకు బయలు దేరిన సుభద్రను ఆమె తల్లి తండ్రుల, కృష్ణుని అంగీకారముతో అపహరించుకుని వెళ్ళాడు

రథస్థో ధనురాదాయ శూరాంశ్చారున్ధతో భటాన్
విద్రావ్య క్రోశతాం స్వానాం స్వభాగం మృగరాడివ

తచ్ఛ్రుత్వా క్షుభితో రామః పర్వణీవ మహార్ణవః
గృహీతపాదః కృష్ణేన సుహృద్భిశ్చానుసాన్త్వితః

రథముతో ఉన్న వారిని, అడ్డగించినవారిని తన పరాక్రమముతో చెల్లా చెదురు చేసాడు.
బలరాముడీ మాట విని కోపించి ఆవేశంతో ఊగిపోయాడు
కృష్ణ పరమాత్మ బలరాముని కాళ్ళుపట్టుకుని ఓదార్చి శాంతింపచేసాడు

ప్రాహిణోత్పారిబర్హాణి వరవధ్వోర్ముదా బలః
మహాధనోపస్కరేభ రథాశ్వనరయోషితః

వధూవరులకు కట్నాలను దగ్గర ఉండి మరీ పంపాడు బలరాముడు

శ్రీశుక ఉవాచ
కృష్ణస్యాసీద్ద్విజశ్రేష్ఠః శ్రుతదేవ ఇతి శ్రుతః
కృష్ణైకభక్త్యా పూర్ణార్థః శాన్తః కవిరలమ్పతః

స ఉవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమీ
అనీహయాగతాహార్య నిర్వర్తితనిజక్రియః

మిథిలానగరములో పరమ భక్తుడైన బ్రాహ్మణోత్తముడు శ్రుతదేవుడు.
పరమాత్మ యందు భక్తితో ఆయన పరిపూర్ణార్తుడు. ఏ కోరికా లేని వాడు. పరమాత్మ సంకల్పముతో ఏమి లభిస్తాయో దానితోనే తృప్తి పొందుతూ జీవిస్తున్నాడు

యాత్రామాత్రం త్వహరహర్దైవాదుపనమత్యుత
నాధికం తావతా తుష్టః క్రియా చక్రే యథోచితాః

ఏపూటకాపూటా భిక్షాటనతో తృప్తిగా జీవిస్తున్నాడు

తథా తద్రాష్ట్రపాలోऽఙ్గ బహులాశ్వ ఇతి శ్రుతః
మైథిలో నిరహమ్మాన ఉభావప్యచ్యుతప్రియౌ

మిథిలా నగరానికి బహులాశ్వుడని రాజు ఉన్నాడు. వీరిద్దరూ కృష్ణ పరమాత్మకు భక్తులే
వీరిని చూడగోరి కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు

తయోః ప్రసన్నో భగవాన్దారుకేణాహృతం రథమ్
ఆరుహ్య సాకం మునిభిర్విదేహాన్ప్రయయౌ ప్రభుః

నారదో వామదేవోऽత్రిః కృష్ణో రామోऽసితోऽరుణిః
అహం బృహస్పతిః కణ్వో మైత్రేయశ్చ్యవనాదయః

తత్ర తత్ర తమాయాన్తం పౌరా జానపదా నృప
ఉపతస్థుః సార్ఘ్యహస్తా గ్రహైః సూర్యమివోదితమ్


కృష్ణ పరమాత్మ ద్వారక నుండి మిథిలా నగరానికి వస్తే ఇంత మంది మహర్షులు వారి వారి ఆశ్రమ ప్రాంతాలలో స్వామిని ఎదుర్కొని పూజించారు
పౌరులు కూడా వారిని పూజించారు.
ఉదయించిన సూర్యున్ని గ్రహములు ఆరాధించినట్లుగా పౌరులందరూ ఇలా వస్తున్న స్వామిని ఆరాధించారు

ఆనర్తధన్వకురుజాఙ్గలకఙ్కమత్స్య
పాఞ్చాలకున్తిమధుకేకయకోశలార్ణాః
అన్యే చ తన్ముఖసరోజముదారహాస
స్నిగ్ధేక్షణం నృప పపుర్దృశిభిర్న్ర్నార్యః

ఇన్ని రకాల దేశాల రాజులూ
నరులూ నారీమణులు పరమాత్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆయనకు స్వాగతం చెప్పారు
పరమాత్మ దర్శనముతో వారి అన్ని రకాల పాపాలూ తొలగిపోయాయి

తేభ్యః స్వవీక్షణవినష్టతమిస్రదృగ్భ్యః
క్షేమం త్రిలోకగురురర్థదృశం చ యచ్ఛన్
శృణ్వన్దిగన్తధవలం స్వయశోऽశుభఘ్నం
గీతం సురైర్నృభిరగాచ్ఛనకైర్విదేహాన్

ఋషులూ భక్తులూ ప్రజలూ స్తోత్రం చేస్తూ ఉంటే వారు చేస్తున్న స్తోత్రాలను వింటూ తన కీర్తిని విస్తరింపచేసుకుంటూ మిథిలానగరానికి వెళ్ళారు

తేऽచ్యుతం ప్రాప్తమాకర్ణ్య పౌరా జానపదా నృప
అభీయుర్ముదితాస్తస్మై గృహీతార్హణపాణయః

కృష్ణ పరమాత్మ రాజ్యములోకి వచ్చాడన్న మాట విని పౌరులందరూ పూజా ద్రవ్యాలూ అర్ఘ్య పాద్యాలు తీసుకుని వెళ్ళి, పరమాత్మను సేవించారు, విప్పరిన కళ్ళతో
చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు
ఇంతకాలానికి స్వామికి అనుగ్రహం కలిగి మమ్ము కరుణించడానికి వచ్చాడని, ఇద్దరూ ఆయన పాదాలమీద పడి నమస్కరించారు. ఇద్దరూ కృష్ణ పరమాత్మను మా ఇంటికి రండీ అంటే మా ఇంటికి రండీ అని ఆహవానించారు. స్వామి కూడా ఎవరి మాటా కాదనకుండా ఇద్దరి ఇంటిలోకీ రెండు రూపాలతో ప్రవేశించాడు ఒకే సారి


దృష్ట్వా త ఉత్తమఃశ్లోకం ప్రీత్యుత్ఫులాననాశయాః
కైర్ధృతాఞ్జలిభిర్నేముః శ్రుతపూర్వాంస్తథా మునీన్

స్వానుగ్రహాయ సమ్ప్రాప్తం మన్వానౌ తం జగద్గురుమ్
మైథిలః శ్రుతదేవశ్చ పాదయోః పేతతుః ప్రభోః

న్యమన్త్రయేతాం దాశార్హమాతిథ్యేన సహ ద్విజైః
మైథిలః శ్రుతదేవశ్చ యుగపత్సంహతాఞ్జలీ

భగవాంస్తదభిప్రేత్య ద్వయోః ప్రియచికీర్షయా
ఉభయోరావిశద్గేహముభాభ్యాం తదలక్షితః

శ్రాన్తానప్యథ తాన్దూరాజ్జనకః స్వగృహాగతాన్
ఆనీతేష్వాసనాగ్ర్యేషు సుఖాసీనాన్మహామనాః

ప్రవృద్ధభక్త్యా ఉద్ధర్ష హృదయాస్రావిలేక్షణః
నత్వా తదఙ్ఘ్రీన్ప్రక్షాల్య తదపో లోకపావనీః

వచ్చిన స్వామికి ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టి పరమాత్మ మా ఇంటికి వచ్చాడని పరమానందముతో కనుల నీరు నిండగా, నా జన్య ధన్యమయ్యింది అనుకుంటూ, స్వామిని ఆరాధిస్తూ, పాదాలకు నమస్కారం చేసి, పాదాలను కడిగి, ఆ జలమును శిరస్సున జల్లుకుని పరమాత్మను ఆరాధించారు

సకుటుమ్బో వహన్మూర్ధ్నా పూజయాం చక్ర ఈశ్వరాన్
గన్ధమాల్యామ్బరాకల్ప ధూపదీపార్ఘ్యగోవృషైః

వాచా మధురయా ప్రీణన్నిదమాహాన్నతర్పితాన్
పాదావఙ్కగతౌ విష్ణోః సంస్పృశఞ్ఛనకైర్ముదా

ధూప దీప గంధ పుష్ప మాల్యము మొదలైన వాటితో ఆరాధించి మధురమైన మాటలతో సంతోషం కలిగింపచేస్తూ స్వామి పాదాలను ఒడిలోపెట్టుకుని సంతోషముతో పులకిస్తూ ఇలా అన్నారు

శ్రీబహులాశ్వ ఉవాచ
భవాన్హి సర్వభూతానామాత్మా సాక్షీ స్వదృగ్విభో
అథ నస్త్వత్పదామ్భోజం స్మరతాం దర్శనం గతః

అఖిల ప్రాణులకూ నీవే ఆత్మవు సాక్షివీ ప్రాణానివి. ఎంతో కాలం నుంచి నీ పాదాలను స్మరిస్తున్న మాకు నీ దర్శనాన్ని ప్రసాదించావు. నా భక్తులను దగ్గర ఉండి కాపాడతాను అని నీవు ఇచ్చిన మాటను నిజం చేయడానికి వచ్చావు

స్వవచస్తదృతం కర్తుమస్మద్దృగ్గోచరో భవాన్
యదాత్థైకాన్తభక్తాన్మే నానన్తః శ్రీరజః ప్రియః

కో ను త్వచ్చరణామ్భోజమేవంవిద్విసృజేత్పుమాన్
నిష్కిఞ్చనానాం శాన్తానాం మునీనాం యస్త్వమాత్మదః

ఇలాంటి నీ ప్రభావం తెలిసిన వారెవరు నీ పాదాలను విడిచిపెడతారు
వేరే ఏదీ కోరకుండా పరమ శాంతులైన మునులకు నీవు నిన్నే ఇచ్చుకుంటావు.

యోऽవతీర్య యదోర్వంశే నృణాం సంసరతామిహ
యశో వితేనే తచ్ఛాన్త్యై త్రైలోక్యవృజినాపహమ్

యాదవ వంశములో పుట్టి సంసారములో ఉన్న మానవులకు కష్టాలనూ దుఃఖాలనూ ఆపదలనూ తొలగించి, కాపాడి , చెడువారిని శిక్షిస్తూ ప్రవర్తిస్తూ ఉంటావు

నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుణ్ఠమేధసే
నారాయణాయ ఋషయే సుశాన్తం తప ఈయుషే

నీవు నారాయణ ఋషివి. పరమ శాంతముగ జగత్ శాంతి కోసం తపస్సు చేస్తున్న నారాయణ ఋషికి నమస్కారం

దినాని కతిచిద్భూమన్గృహాన్నో నివస ద్విజైః
సమేతః పాదరజసా పునీహీదం నిమేః కులమ్

మా ఇంటిలో కొన్నాళ్ళు ఉండి నిమి వంశాన్ని ఉద్ధరించండి

ఇత్యుపామన్త్రితో రాజ్ఞా భగవాంల్లోకభావనః
ఉవాస కుర్వన్కల్యాణం మిథిలానరయోషితామ్

మిథిలా నగరములో నరులకూ స్త్రీలకు ఆనందాన్ని కలిగిస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు

శ్రుతదేవోऽచ్యుతం ప్రాప్తం స్వగృహాఞ్జనకో యథా
నత్వా మునీన్సుసంహృష్టో ధున్వన్వాసో ననర్త హ

బ్రాహ్మణోత్తముడు కూడా ఇంటికి వచ్చిన కృష్ణ పరమాత్మకు నమస్కరించి దర్భాసనం వేసి కూర్చోబెట్టాడు

తృణపీఠబృషీష్వేతానానీతేషూపవేశ్య సః
స్వాగతేనాభినన్ద్యాఙ్ఘ్రీన్సభార్యోऽవనిజే ముదా

భార్యతో కలసి పాదాలు కడిగి తీర్థం నెత్తిన వేసుకుని

తదమ్భసా మహాభాగ ఆత్మానం సగృహాన్వయమ్
స్నాపయాం చక్ర ఉద్ధర్షో లబ్ధసర్వమనోరథః

ఆనంద బాష్పాలతో స్నానం చేయించి ఇంతకాలానికి అన్ని కోరికలూ తీరినవాడయ్యాడు

ఫలార్హణోశీరశివామృతామ్బుభిర్మృదా సురభ్యా తులసీకుశామ్బుయైః
ఆరాధయామాస యథోపపన్నయా సపర్యయా సత్త్వవివర్ధనాన్ధసా

పరమాత్మ పాదాలను తులసితో దర్భలతో కడిగి ఆరాధించాడు. తనకు లభించిన దానితో సాత్విక మార్గములో పరమాత్మను ఆరాధించాడు

స తర్కయామాస కుతో మమాన్వభూత్గృహాన్ధకుపే పతితస్య సఙ్గమః
యః సర్వతీర్థాస్పదపాదరేణుభిః కృష్ణేన చాస్యాత్మనికేతభూసురైః

సంసార అంధ కూపములో ఉన్న నాకు పరమాత్మతో సంగమం పరమాత్మ దర్శనం కలుగుతుందా?
జగత్తులో అందరినీ పవిత్రం చేయగల పరమాత్మ పాద రజస్సు నా మీద కూడా పడుతుంది అని ఏనాడూ అనుకోలేదు.

సూపవిష్టాన్కృతాతిథ్యాన్శ్రుతదేవ ఉపస్థితః
సభార్యస్వజనాపత్య ఉవాచాఙ్ఘ్ర్యభిమర్శనః

ఇలా కూర్చున్న స్వామిని భార్య పుత్ర మిత్రాదులతో కలసి ఇలా అన్నాడు

శ్రుతదేవ ఉవాచ
నాద్య నో దర్శనం ప్రాప్తః పరం పరమపూరుషః
యర్హీదం శక్తిభిః సృష్ట్వా ప్రవిష్టో హ్యాత్మసత్తయా

ఈనాడు మాకు దర్శనం ప్రసాదించావు. అనంతమైన ప్రపంచాన్ని నీ దివ్య శక్తులతో సృష్టించి అందులో మళ్ళీ ప్రవేశిస్తూ ఉంటారు కదా

యథా శయానః పురుషో మనసైవాత్మమాయయా
సృష్ట్వా లోకం పరం స్వాప్నమనువిశ్యావభాసతే

పడుకున్న మానవుడు కలలో రకరకములైన వాటిని సృష్టించుకుని అందులోకి తాను వెళతాడు. తాను సృష్టించిన స్వాప్నిక పదార్థాలలో తాను ప్రవేశించినట్లుగా పరమాత్మ కూడా తాను సృష్టించిన జగత్తులో తాను ప్రవేశిస్తున్నాడు

శృణ్వతాం గదతాం శశ్వదర్చతాం త్వాభివన్దతామ్
ణృణాం సంవదతామన్తర్హృది భాస్యమలాత్మనామ్

నీ కథలు చెప్పేవారికీ వినేవారికీ నిన్ను ఆరాధించేవారికీ నమస్కరించేవారికీ పరస్పరం నీ గురించి మాట్లాడుకునే వారి అందరి హృదయాలలో నీవు సాక్షాత్కరిస్తావు

హృదిస్థోऽప్యతిదూరస్థః కర్మవిక్షిప్తచేతసామ్
ఆత్మశక్తిభిరగ్రాహ్యోऽప్యన్త్యుపేతగుణాత్మనామ్

వైకుంఠములో ఉన్న నీవు కూడా నిన్ను స్మరించేవారికి దర్శనం ఇస్తావు. హృదయములో అతి దగ్గర ఉండి కూడా కర్మలతో దూరం అయిన వారికి నీవు దర్శనమివ్వవు. కర్మ ఫలితాలనే సుఖ దుఃఖాలుగా భావిస్తూ అనుభవిస్తూ ఉన్న వారికి హృదయములో అతి దగ్గర ఉండి కూడా కనపడవు
నీ ప్రభావం తెలిసిన వారికి కనుల ముందరే ఉంటావు

నమోऽస్తు తేऽధ్యాత్మవిదాం పరాత్మనే
అనాత్మనే స్వాత్మవిభక్తమృత్యవే
సకారణాకారణలిఙ్గమీయుషే
స్వమాయయాసంవృతరుద్ధదృష్టయే

పరమాత్మా నీకు నమస్కారం. నీవే సకారణం(పరమాత్మ వలనే జగత్తు వచ్చింది అనే సిద్ధాంతం), నీవే అకారణం (పరమాణు సిద్ధాంతం). మనమాచరించే కర్మల వలన కలిగిన సంస్కారముతోనే మనం సృష్టికి పరమాత్మ కారణం అనీ, సృష్టికి ప్రకృతే కారణం అనీ అంటారు. ఈ రెండూ అనిపించేది నీవే. రెండు వాదాలూ నీవే.
నీ మాయ కప్పితే నీవు కనపడక భగవంతుడు లేడు అంటారు. నీ మాయ తీస్తే భగవంతుడు ఉన్నాడు అంటారు. ఆ రెండు పనులూ చేసేది నీవే.

స త్వం శాధి స్వభృత్యాన్నః కిం దేవ కరవామ హే
ఏతదన్తో నృణాం క్లేశో యద్భవానక్షిగోచరః

మేమందరమూ నీ సేవకులము. ఏమి చేయమంటారో ఆజ్ఞ్యాపించు.
పరమాత్మ దర్శనమయ్యే దాకానే సంసారం ఉంటుంది. నీవు కంటికి కనపడేంత వరకే సంసారం

శ్రీశుక ఉవాచ
తదుక్తమిత్యుపాకర్ణ్య భగవాన్ప్రణతార్తిహా
గృహీత్వా పాణినా పాణిం ప్రహసంస్తమువాచ హ

తనకు నమస్కరించినవారి ఆర్తిని పోగొట్టే పరమాత్మ అతని మాటలు విని చేతితో చేయి పట్టుకుని నవ్వుతూ అంటున్నాడు

శ్రీభగవానువాచ
బ్రహ్మంస్తేऽనుగ్రహార్థాయ సమ్ప్రాప్తాన్విద్ధ్యమూన్మునీన్
సఞ్చరన్తి మయా లోకాన్పునన్తః పాదరేణుభిః

మునులందరనూ తీసుకుని స్వామి వద్దకు వచ్చాడు.
బ్రాహ్మణోత్తమా ఈ ఋషులందరూ నిన్ను అనుగ్రహించడానికి వచ్చారు. నా సంకల్పముతో తమ పాద పరాగమముతో అన్ని లోకాలూ పవిత్రం చేయడానికి వారు సంచరిస్తూ ఉంటారు

దేవాః క్షేత్రాణి తీర్థాని దర్శనస్పర్శనార్చనైః
శనైః పునన్తి కాలేన తదప్యర్హత్తమేక్షయా

దేవతలూ పుణ్య క్షేత్రాలూ తీర్థాలూ, వెళ్ళి దర్శించి స్పృశించి ఆరాధిస్తే అవి చాలా కాలం తరువాత గానీ కరుణించవు. చాలా కాలం తరువత, ఉత్తమములైన సాధువుల దృష్టిపాతం పడితేనే దేవ్తలూ తీర్థములూ క్షేత్రములు వారిని దర్శించిన వారిని అనుగ్రహిస్తారు. ఉత్తముల దృష్టితోనే అవి సేవించిన వారి పాపాలు పోగొడతాయి

బ్రాహ్మణో జన్మనా శ్రేయాన్సర్వేషామ్ప్రాణినామిహ
తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కలయా యుతః

ప్రాణులందరిలోనూ పుట్టుకతోనే అన్ని శ్రేయస్సులకూ మూలం ఐన వాడు బ్రాహ్మణుడు. అతను తపస్సు చేసి జ్ఞ్యానం సంపాదించి , సంతృప్తిగా ఉండి, దానికి తోడు నా అంశకూడా చేరితే ఇంక వాని గురించి ఏమి చెప్పాలి.

న బ్రాహ్మణాన్మే దయితం రూపమేతచ్చతుర్భుజమ్
సర్వవేదమయో విప్రః సర్వదేవమయో హ్యహమ్

నా ఈ చత్రుభుజ రూపం కూడా నాకు బ్రాహ్మణుడి కన్నా ఇష్టం కాదు
బ్రాహ్మణుడు సకల వేద స్వరూపుడు. నేను సకల వేదమయుడిని

దుష్ప్రజ్ఞా అవిదిత్వైవమవజానన్త్యసూయవః
గురుం మాం విప్రమాత్మానమర్చాదావిజ్యదృష్టయః

జ్ఞ్యానం లేని వారు ఈ  తత్వాన్ని తెలియక దోష దృష్టితో బ్రాహ్మణులను అవమానిస్తూ ఉంటారు
ఆలయములో విగ్రహాన్ని మాత్రమే పూజించ యోగ్యముగా తలుస్తారు.

చరాచరమిదం విశ్వం భావా యే చాస్య హేతవః
మద్రూపాణీతి చేతస్యాధత్తే విప్రో మదీక్షయా

చచరా ప్రపంచమూ, అందులో ఉన్న అఖిల ప్రభావమూ, ప్రతీ చర్యా, ఇవన్నీ భగవంతుని రూపాలని భావించి ఆరాధించేవాడు బ్రాహ్మణుడు. అలాంటి వాడి కంటే గొప్పదైన వస్తువు ప్రపంచములో లేదు.
ఆ దృష్టి బ్రాహ్మణుడికి కూడా నా అనుగ్రహముతోనే కలుగుతుంది.

తస్మాద్బ్రహ్మఋషీనేతాన్బ్రహ్మన్మచ్ఛ్రద్ధయార్చయ
ఏవం చేదర్చితోऽస్మ్యద్ధా నాన్యథా భూరిభూతిభిః

నన్ను ఎంత శ్రద్ధతో అర్చిస్తావో, ఈ ఋషులందరినీ కూడా నేనే అనుకుని అంతే శ్రద్ధతో ఆరాధించు
ఇలా చేస్తే నేను పరిపూర్ణముగా పూజించబడిన వాడిని అవుతాను. లక్షలు అర్పించినా నేను సతోషించను. ఇటువంటి బ్రహ్మఋషులను నా దృష్టితో సేవిస్తే నేను సంతోషిస్తాను

శ్రీశుక ఉవాచ
స ఇత్థం ప్రభునాదిష్టః సహకృష్ణాన్ద్విజోత్తమాన్
ఆరాధ్యైకాత్మభావేన మైథిలశ్చాప సద్గతిమ్

అపుడు ఈ బ్రాహ్మణోత్తముడు కృష్ణ పరమాత్మతో ఉన్న బ్రాహ్మణులను, బ్రాహ్మణులే పరమాత్మ, పరమాత్మే బ్రాహ్మణుడు అన్న భావనతో పూజించాడు
ఇలా బ్రాహ్మణోత్తముడూ మిథిల రాజూ, సద్గతిని పొందాడు

ఏవం స్వభక్తయో రాజన్భగవాన్భక్తభక్తిమాన్
ఉషిత్వాదిశ్య సన్మార్గం పునర్ద్వారవతీమగాత్

భక్తుల యందు భక్తి గల పామాత్మ (తన యందు భక్తి కలవారి మీద తాను భక్తి కలిగి ఉంటాడు) కొన్నాళ్ళు మిథిలా నగర్ములో ఉండి వారికి సంగార్గాన్ని ఉపదేశించి ద్వారకా నగరానికి వెళ్ళాడు

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు