Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదమూడవ అధ్యాయం


                   ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదమూడవ అధ్యాయం
సూత ఉవాచ
యం బ్రహ్మా వరుణేన్ద్రరుద్రమరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైర్
వేదైః సాఙ్గపదక్రమోపనిషదైర్గాయన్తి యం సామగాః
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యన్తి యం యోగినో
యస్యాన్తం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః

బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు తన దివ్య స్తోత్రముతో ఎవరిని స్తోత్రం చేస్తారో
సామగానములు చేసే వారు ఎవరిని వేదములూ ఉపనిషత్తులూ (అందులో పదములూ క్రమములూ, వేదాంగములంటే శిక్ష వ్యాకరణం చంద్ర నిరుక్తం జ్యోతిషం కల్ప) ఎవరిని గానం చేస్తారో
యోగులు ఆయన యందే మనసు ఉంచి ధ్యానముతో ఎవరిని చూస్తారో
సకల దేవ దానవాది గణములు ఎవరి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలియలేరో అలాంటి పరమాత్మకు నమస్కారం

పృష్ఠే భ్రామ్యదమన్దమన్దరగిరిగ్రావాగ్రకణ్డూయనాన్
నిద్రాలోః కమఠాకృతేర్భగవతః శ్వాసానిలాః పాన్తు వః
యత్సంస్కారకలానువర్తనవశాద్వేలానిభేనామ్భసాం
యాతాయాతమతన్ద్రితం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతి

కూర్మభగవానుని ఉచ్చావస నిశ్వాసలు మమ్ము కాపాడు గాక.
తన వీపు మీద చాలా గొప్పదైన మదర గిరి పర్వతాన్ని దేవతలూ రాక్షసులూ తిప్పితే ఆయన వీపు దురద పోయి బాగా నిద్రపోయాడు. ఆయన శ్వాస వాయువులు మమ్ము కాపాడు గాక.
ఈ కూర్మ అవతారములో కూర్మ పీఠం మీద మందర పర్వతాన్ని పెట్టి అటూ ఇటూ లాగుతూ ఉంటే , ఇటు లాగుతున్నపుడు వెనక్కు వెళుతూ ఉన్నాయి, అటు లాగినపుడు ముందుకు వెళుతున్నాయి. ఆ సముద్రపు తరంగముల రాకపోకలు నేటికీ ఆగలేదు. ఆ రాకా పోకా తరంగాలు ఇప్పటికీ సందురానికి అలల రూపములో అలాగే ఉన్నాయి.

పురాణసఙ్ఖ్యాసమ్భూతిమస్య వాచ్యప్రయోజనే
దానం దానస్య మాహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత

పురాణాల గురించి చెబుతాను వినండి. ఏ పురాణములో ఎన్ని శ్లోకాలూ ఏ పురాణం ఎలా చదవాలో చెబుతాను వినండి

బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పఞ్చోనషష్టి చ
శ్రీవైష్ణవం త్రయోవింశచ్చతుర్వింశతి శైవకమ్

బ్రహ్మ పురాణం పదివేలూ
పద్మ పురాణం యాభై ఐదు వేలు
విష్ణు పురాణం ఇరవై మూడు వేలు
శివ పురాణం ఇరవై నాలుగు వేలు

దశాష్టౌ శ్రీభాగవతం నారదం పఞ్చవింశతి
మార్కణ్డం నవ వాహ్నం చ దశపఞ్చ చతుఃశతమ్

భాగవతం పద్దెనిమిది వేలు
నారద పురాణం ఇరవై ఐదు వేలు
మార్కండేయ పురాణం తొమ్మిది వేలు
అగ్ని పురాణం పదిహేను వేలు, దాని మీద మరో నాలుగు వందలు

చతుర్దశ భవిష్యం స్యాత్తథా పఞ్చశతాని చ
దశాష్టౌ బ్రహ్మవైవర్తం లైఙ్గమేకాదశైవ తు

భవిష్య పురాణం పధ్నాలుగు వేల ఐదు వందలు
బ్రహ్మ వైవర్తపురాణం పద్దెనిమిది వేలు
లింగ పురాణం పదకొండు వేలు
చతుర్వింశతి వారాహమేకాశీతిసహస్రకమ్
స్కాన్దం శతం తథా చైకం వామనం దశ కీర్తితమ్

వారాహ పురాణం ఇరవై నాలుగు వేలు
స్కంధ పురాణం ఎనభై యొక్క వేలు
వామన పురాణం పదివేలు

కౌర్మం సప్తదశాఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్దశ
ఏకోనవింశత్సౌపర్ణం బ్రహ్మాణ్డం ద్వాదశైవ తు

కూరమం పదిహేడు వేలు
మాత్స్యం పధ్నాలుగు వేలు
గరుడ పురాణం పంతొమ్మిది వేలు
బ్రహ్మాండం పన్నెండు వేలు

ఏవం పురాణసన్దోహశ్చతుర్లక్ష ఉదాహృతః
తత్రాష్టదశసాహస్రం శ్రీభాగవతం ఇష్యతే

మొత్తం పద్దెనిమిది పురాణాలలో కలసి నాలుగు లక్షల శ్లోకాలు చెప్పబడినవి
అందులో పద్దెనిమిది వేల శ్లోకాలు గలవు

ఇదం భగవతా పూర్వం బ్రహ్మణే నాభిపఙ్కజే
స్థితాయ భవభీతాయ కారుణ్యాత్సమ్ప్రకాశితమ్

ఈ భాగవతాన్ని మొదలు శ్రీమన్నారాయణుడు తన నాభినుండి పుట్టిన బ్రహ్మకు దయతో చెప్పాడు

ఆదిమధ్యావసానేషు వైరాగ్యాఖ్యానసంయుతమ్
హరిలీలాకథావ్రాతా మృతానన్దితసత్సురమ్

ఈ భాగవతానికి మొదలు మధ్యా చివరా అంతా వైరాగ్యమే.
హరి లీల అనే మహా కథా సమూహ అమృతముతో దేవతలను కూడా ఆనందింపచేసినది

సర్వవేదాన్తసారం యద్బ్రహ్మాత్మైకత్వలక్షణమ్
వస్త్వద్వితీయం తన్నిష్ఠం కైవల్యైకప్రయోజనమ్

సర్వ వేదాంత సారము. పర బ్రహ్మ స్వరూపాన్ని పరిపూర్ణముగా చెప్పింది
ఈ భాగవతానికి మోక్షం మాత్రమే ఫలం

ప్రౌష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహసమన్వితమ్
దదాతి యో భాగవతం స యాతి పరమాం గతిమ్

భాద్రపద పూర్ణిమ నాడు బంగారు సింహాసనం మీద ఎవరు భాగవతాన్ని ఇస్తారో వారు ఉత్తమ గతిని పొందుతారు

రాజన్తే తావదన్యాని పురాణాని సతాం గణే
యావద్భాగవతం నైవ శ్రూయతేऽమృతసాగరమ్

శ్రీమద్భాగవతం ప్రకాశించనంత వరకూ చెప్పనంత వరకూ విననంతవరకూ తక్కిన పురాణాలన్నీ బాగుంటాయి
భాగవత రసామృతముతో తృప్తి పొందినవారికి మరి ఏది విన్నా తృప్తి కలుగదు

సర్వవేదాన్తసారం హి శ్రీభాగవతమిష్యతే
తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్

నిమ్నగానాం యథా గఙ్గా దేవానామచ్యుతో యథా
వైష్ణవానాం యథా శమ్భుః పురాణానామిదమ్తథా

నదులలో ఎలా గంగ ఉత్తమమో
దేవతలలో విష్ణువు ఎలా ఉత్తముడో
వైష్ణవులలో శంకరుడు ఎలా ఉత్తముడో
పురాణాలలో భాగవతం అంత ఉత్తమం

క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ హ్యనుత్తమా
తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః

కాశీ ఎలా అన్ని క్షేత్రాలలో ఉత్తమమో అన్ని పురాణాలలో శ్రీమద్భాగవతం శ్రేష్టము

శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం
యస్మిన్పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే
తత్ర జ్ఞానవిరాగభక్తిసహితం నైష్కర్మ్యమావిస్కృతం
తచ్ఛృణ్వన్సుపఠన్విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః

ఇది పరిశుద్ధమైన పురాణం
విష్ణు భక్తులకు అత్యంత ప్రీతి పాత్రం
పరమ హంసలు అనుసరించదగిన అనుసరించవలసిన అవలంబించదగిన ఉత్తమ జ్ఞ్యానం గానం చేయబడుతున్నది
ఈ భాగవతములో జ్ఞ్యానమూ భక్తీ విరాగమూ వీటితో కూడుకున్న నివృత్తి ధర్మం బోధించబడుతున్నది
భాగవతాన్ని విన్నా చదివినా పరిశీలించినా (భక్తితో) జీవుడు ముక్తి పొందుతాడు

కస్మై యేన విభాసితోऽయమతులో జ్ఞానప్రదీపః పురా
తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా
యోగీన్ద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతస్
తచ్ఛుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి

ఈ శ్లోకాన్ని రోజూ చదువుకోవాలి
దీన్ని బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు చెప్పాడు
ఆ బ్రహ్మ నారదునికి చెప్పాడు
ఆ నారదుడు వ్యాసునికి చెప్పాడు
ఆ వ్యాసుడు శుకమహర్షికీ ఆ శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు దయతో చెప్పాడు
ఇది పరిశుద్ధమైనది ఎలాంటి మురికీ దుఃఖమూ లేనిది
మోక్షమును ఇచ్చేది, పరమైన పరబ్రహ్మ ఐన సత్యమైన, పరమైన, పరబ్రహ్మ రూపమైన భాగవతాన్ని ధ్యానిస్తున్నాను. పరమాత్మ రూపమైన భాగవతన్ని ధ్యానం చేస్తున్నాను

నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే
య ఇదమ్కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే

సకల జగత్సాక్షి ఐన పరమాత్మ వాసుదేవునికి నమస్కారం
ఆయన దయతో తన పుత్రుడైన మోక్షం కోరిన బ్రహ్మకు చెప్పాడు

యోగీన్ద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే
సంసారసర్పదష్టం యో విష్ణురాతమమూముచత్

శుకబ్రహ్మ, యోగీంద్రుడు. ఆయనకు నమస్కరిస్తున్నాను.
సంసారమనే మహాసర్పం కాటు వేసిన పరీక్షిత్తును మోక్షానికి పంపించిన శుకయోగీంద్రునికి నమస్కారం.సకల జీవులనూ మోక్షానికి పంపించేది శ్రీమద్భాగవతం

భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే
తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో

ఈ శ్లోకాన్ని కూడా రోజూ చదువుకోవాలి
నన్ను ఎన్ని సార్లైనా పుట్టించు. ప్రతీ జన్మలో నీ పాదముల మీదే భక్తి కలిగేలా అనుగ్రహించు.
ఎన్ని జన్మలైనా కానీ,నాకు నీ పాదముల యందే భక్తి కలిగి ఉండాలి. నీవే మా నాథుడవు. నీవు మాకు ప్రభువువు కాబట్టి నీవు మాకు నీ మీద భక్తి ఇచ్చి తీరాలి.
ఎన్ని జన్మలైనా కానీ , నీ పాదముల మీద భక్తి ఉండాలి

నామసఙ్కీర్తనం యస్య సర్వపాప ప్రణాశనమ్
ప్రణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరమ్

ఏ పరమాత్మ నామ సంకీర్తనం అన్ని పాపాలనూ పోగొడుతుందో, ఎవరికి నమస్కరిస్తే అన్ని దుఃఖాలూ పోతాయో, అలాంటి హరి పాదాలకు నమస్కరిస్తున్నాను.
 
                             ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసిక్యాం అష్టాదశ సాహస్ర్యాయాం పారమహంస్యాం ద్వాదశ స్కంధే త్రయోదశ అధ్యాయః ద్వాదశ స్కంధః అయం గ్రధస్య ఓం తత్ సత్.

                                              శ్రీ శుకబ్రహ్మణే నమః
                                              శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు