Pages

Saturday, 7 February 2015

శ్రీ ఆంజనేయ మహాత్మ్యం —1 ( శ్రీ ఆంజ నేయ మంత్రోప దేశ లక్షణం )


      ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు ”కలి కాలం లో దుక్కాలను దూరం చేసేది ,దారిద్రాన్ని పోగొట్టేది ,వ్యాదులనుండి రక్షించేది ,సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియ జేయండి ”.దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా !మంచి ప్రశ్న వేశావు .నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను .అది సకల వేద శాస్త్ర ,పురాణాదుల సారమే .వెంటనే ఫలితాన్ని ఇచ్చేది  .
       
 నేను ఒక సారి సరయు నది దగ్గర వుండగా ,నా తండ్రి వశిష్టుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు .శివ ,వైష్ణవ ,శాక్తేయ ,గాణాపత్యము  మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు .వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీ నారాయణ విద్య ,భవానీ శంకర విద్య ,సీతా రామ మహా విద్య హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి .వీటి తరువాత నృసింహ విద్య ,బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతీ విద్య .ఎనిమిదవది  సామ్రాజ్య లక్ష్మీ విద్య ,తొమ్మిది  మహా గణపతి విద్య ,పది  సౌర విద్య , పదకొండ వది   దక్షిణ కాళీ విద్య .పన్నెండవ విద్య చింతామణి విద్య .వీటినే ద్వాదశ విద్యలు అంటారు .వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారమూ పాటించక పోయినా ఫలితాన్ని ఇస్తుంది .అస్తార్ణ మారుతీ విద్య ఇంకా తక్కువ సమయం లో ఫలితం చేకూరుస్తుంది .ఇందులో అనులోమ ,ప్రతి లోమం గా యాభై వర్ణాలు వుంటాయి  .బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్యా మంచి ఫలితాన్నే ఇస్తుంది .నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలం లో ఫలిస్తుంది .వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమాన్ మంత్రం ”శీఘ్రం గా శిద్ధి నిస్తుంది .ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలి లో పట్టి తాగ గలిగాడు .అర్జునికి,భీమునికి  శత్రువులను జయించే శక్తి ,దీని వల్లే కలిగింది .విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహం తో పొందాడు .
హనుమాన్మంత్రం చేత జయం ,గౌరవం ,,రాజ్యం ,జన వశ్యం ,అచంచల భాగ్యం కలుగు తాయి .ధర్మార్ధ ,కామ మోక్షాలు ,ఆపదలను పోగొట్టు కోవటం ,శత్రు జయం ,నిగ్రహానుగ్రహ శక్తి దీని వల్ల సాధ్యమవుతుంది .వాక్సుద్ధి  ,పుత్ర సంతానం ,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి .అయితే గురు ముఖతా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ,గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం వుంటుంది .పరి శుద్ధ మైన మనసు తో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి .అన్ని విద్యలకు ఇది ఆధార మైన మంత్రం .పంచ వక్త్ర మహా విద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది .శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని,వెయ్యి శిరస్సులున్న ఆది శేషుడు కూడా వందల సంవత్స రాలు చెప్పినా తరగదు .”అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ  మంత్ర మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు 

 వశిష్ఠ ప్రోక్త హనుమత్ కవచము

పాదౌ వాయు సుత: పాతు రామ దూతస్త దంగుళీ : గుల్ఫౌ హరీశ్వర: పాతు జంఘే చార్ణవలంఘన జానునీ మారుతీ పాతు ఉరూపాత్వ సురాంతక:
గుహ్యం వజ్రతను: పాతు జఘ నంతు జగద్దిత ఆంజనేయ కటిం పాతు నాభిం సౌమిత్రి జీవన:
ఉదరం పాతు హృద్గేహి హృదయం మహాబల: వక్షో వాలాయుధ: పాతు స్తనౌ చామిత విక్రమ:
పార్స్యౌ జితేం ద్రి య: పాతు బాహూ సుగ్రీవ మంత్రికృత్ కరోవక్ష జయీపాతు హనుమాంశ్చ తదంగుళీ
వృష్టం భవిష్యత్ బ్రహ్మచ స్కంధౌ మతి మతం వర: కంఠo పాతు కపి శ్రేష్టో ముఖం రాహు దర్పహా
వక్త్రంచ వక్త్రు ప్రవణో నేత్రే దేవ గణస్తుత బ్రహ్మాస్త్ర సన్మాన కరో భ్రువే మే పాతు సర్వదా
కామరూప: కపోలేమే ఫాలం వజ్ర నభోవతు శిరోమే పాతు సతత జానకీ శోక నాశన :
శ్రీ రామ భక్త ప్రవర పాతూ సర్వ కళేబరం మా మహ్నిపాతు సర్వజ్ఞ పాతు రాత్రౌ మహాయశ :
వివస్వదంతే వాసీచ సంద్వ్య్యయో పాతు సర్వదా బ్రహ్మాది దేవతా దత్త వర: పాతు నిరంతరం
య ఇదం కవచం నిత్యం పఠేఛ్ సృను యాన్నర: దీర్ఘ మాయురవాప్నోతి బలం ద్దృ ష్టించ విందతి
పాదా క్రాంతా భవిష్యంతి పదతస్త్స్య శ త్రవ: స్థిరాంశు కీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖం