Pages

Thursday, 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –11 కపిలుని కధ –1



— పరాశర మహర్షి మైత్రేయునికి ,హనుమ ఏడవ అవతారాని కి చెందిన ”నీలుని కధ ”ను తెలియ జేస్తున్నాడు .పూర్వ కాలమ్ లో గంగా నది ఒడ్డున ,బార్హస్పత్యపురం అనే గ్రామం వుండేది .అందు లో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు వుండే వాడు .వేద వేదంగా విదుడు .దైవాన్ని నమ్మి ,నిష్కామం గా సంసారాన్ని పోషిస్తున్నాడు .రోజూ గంగా స్నానం తో పవిత్రుడు అవుతూ ,ఆ నది లోనే హనుమంతుని షోడశాక్షరి మంత్రమైన ”ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చలా వల్లభ హనుమతే స్వాహా ‘అనే మంత్రాన్ని నిష్ఠ గా ధ్యానం చేసే వాడు .అవసరమైన శాకాలను   సంపాదించి ,ఇంటికి చేరే వాడు .అనుకూల వతి అయిన భార్య లేమికి చింతించ కుండా గుట్టు గా సంసారాన్ని గడిపేది .అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆకుటుంబం జీవనం సాగిస్తోంది .
గంగా స్నానం ,హనుమ జపం తో జీవితానికి సార్ధకత్వం పొందుతున్న ఆ కపిలుడి కి ఒక రోజూ సువర్చలా మనోహరుడు ,భక్త వత్సలుడు ,రామ బంటు ,భక్త శిఖామణి ,ప్రత్యక్ష మైనాడు .హనుమ నాలుగు భుజాలతో ,చంద్ర కాంతితో ,తెల్లని యజ్ఞోప వీతం తో ,నవరత్నాలతో వున్న కుండ  లాల తో ,దుకూలం తో ,ముత్యాల హారాలతో ,ముంజ మేఖలం తో ,జాంబవత ,వినత ,నీల పావన ,గంధ మాదన ,సుశేణ ,మైండ ,ద్వివిదు లతో ప్రత్యక్ష మైనాడు ఆంజనేయ స్వామి .స్వామిని చూసిన ఆనందం   ,కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి ,పులకితుదయ్యాడు .ఆనందం తో  మాటలు నోటి నుండి రాలేదు .కొంచే సేపటికి తేరుకొని ,”స్వామీ హనుమా !నిన్ను చూసి నా జన్మ    ధన్యమైంది .ఇక నాకు నా గృహం మీద విచారం లేదు .నేను భక్తీ తో సమర్పించే ఈ ఫల ,పుష్పాలను స్వీకరించు .అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు
”జయచాపి సువర్చలా రవిసుతా దివ్యం చ హేమామ్బరం
మాణిక్యా మ్చిత  ,కుండలే ,శ్రవణ యొహ్  కంతే(kamthe )  చ  ముక్తావళి హ్
సుగ్రీవ అంగద  గంధ మాదన ముఖః సత్పార్శాదాస్సంతితే
కిం దాశ్యామి మనః ప్రియం హి హనుమాన్ సంపూర్ణ కామో భవాన్ ”
సూర్య దేవుని పుత్రిక సువర్చల నీ భార్య .నువ్వు కట్టింది బంగారు బట్టలు .కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి .మెడలో తెల్లని ముత్యాల హారం .సుగ్రీవుడు అంగదుడు ,గంధ మాదనుడు ,మొదలైన హేమా హేమీలు నిన్ను ఎప్పుడు కొలుస్తూ వుంటారు .నువ్వు సంపూర్ణ కాముడివి .నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందిం  చను  అని స్తోత్ర భావం .
ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు .కపిలుడు హనుమతో అతని వెంట వున్న పరివారం వివ రాలు తెలియ జేయ వలసినది గా ప్రార్ధించాడు .
అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం వున్న వాడు గంధ మాదనుడు అని ,గైరికాది ధాతువులతో ,బంగారు అరటి తోటలతో శోభిస్తు ఉంటాడని ,మిగిలిన వారందరూ మహా మహులే నని వారంతా తన కు ఇరువైపులా వుండే పార్శదులే నని ,వారే జాంబవంతుడు ,వినతుడు ,నీలుడు ,పనసుడు ,సుషేణుడు ,మైందుడు ,ద్వివిదుడు అని వివ రించాడు .వీరంతా మహా బలాధ్యులు ,కార్య దక్షులు అని చెప్పాడు .
కపిలుని ఆప్యాయం గా పిలుస్తూ ”కపిలా !రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి ,ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు .నీ అభిషేక జలం ఒక ఏరుగా మైంది .దానికి ”వాల సాగరం ”అని పేరు ఏర్పడుతుంది .ఇందులో ఎవరు స్నానం చేసినా ,పవిత్రులు అవుతారు .వారి కోరికలు తీరుతాయి .ముందుగా నా భక్తులైన వీరిని పూజించి ,తరువాత నన్ను పూజించాలి .నా భక్తులకు అవమానం జరిగితే నాకు ఆవ మానం జరిగి నట్లే .నా అవతారాలు ,రూపాలు వేల కొద్దీ వున్నాయి .ఎవరు ఎభావంతో ఏ రూపాన్ని  ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపం తో నేను అనుగ్రహిస్తాను .”అని ఆశీర్వ దించి హనుమ ,పరివారం తో సహా అదృశ్య మైనాడు .
కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ ,నిత్య పూజ పూర్తి చేసుకొని ,ఆ ఆనందం తో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకొని వెళ్ళ కుండా చేరాడు .జరిగిన  విషయం అంతా భార్యకు పూస గుచ్చి నట్లు తెలియ జేశాడు .ఆమె చాలా సంతోషించి ,ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇంక ఏ లోటు ఉండదని ,ఏమీ తీసుకు రాలేక పోయినందుకు బాధ పడ వద్దని ఊర డించింది .
అయినా పిల్లల ఆకలి చూసి వారి కి బట్టలు లేక పోవటం చూసి మనసు లోని బాధ ను బయటికి చెప్పింది ”స్వామీ !మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు .వెద శాస్రాలన్నీ చదివారు .అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా .మా తండ్రికి మీ అసమర్ధత తెలియక నన్నుమీకిచ్చి పెళ్లి చేశాడు .మన పిల్లకు కాని నాకు కాని సరైన బట్టలే లేవు చిరిగినా వాటితో కాలక్షేపక్మ్ చేస్తున్నాం .అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంత వరకు ఆహారం .మన దరిద్రాన్ని తీర్చ లేని ఆ ఆంజనేయుడి భజన తో ఈవితం అంతా గడిపేశారు .ఫలితం ఏమీ లేదు .ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచి పెట్టేస్తారు .మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడు తున్నారు .వదిలి వేరే ఎవరి నైనా ఆశ్రయించండి ”అని అతి నిష్టూరంగా అన్నది . .ఈ మాటలు భరించ లేక భగవంతుని దూషించటం పాపం అని హితవు చెప్పి  ఆతడు లోపలి వెళ్లి పోయాడు .
ఇంతలో హనుమ ప్రత్యక్ష మైనాడు .జరిగిన దంతా కపిలుని ద్వారా విన్నాడు .విచారించ వద్దని చెప్పాడు .అతని భక్తీ కి సంతోషించానని దరిద్రం పోవ టానికి ఒక మార్గం చెప్పాడు .వాళ్ల ఇంటి వెనుక వున్న రేగు చెట్టు మొదట్లో ధన రాసివుందని ,  ,దానిని తెచ్చుకొని ,అనుభవింప మని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్య మైనాడు మారుతి .ఈ విషయం భార్యకు చెప్పాడు .ఆమె నమ్మ లేదు .మోసం అంది .నిజం గా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం వుంటే ,ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మన కిచ్చే వాడు కదా అని నిస్టురాలాడింది .అతని మనసు తీవ్రం గా క్షోభించింది .ఆ రాత్రి కపిలుడి బార్య నిద్రించిన సమయం లో హనుమ రేగు చెట్టు   కింద వున్న ధన రాసులతో వున్న పెట్టె ను బయటికి తీసి ,దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు .కపిలుడు భయ కంపితుడై ,అంత బరువు గల పెట్టెను తాను హనుమ శిరసు మీద పెట్టలేనని ఏడ్చాడు .కష్మించమని ప్రార్ధించాడు .కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ,ఆ పెట్టెను తానె నెట్టి పైకి ఎత్తు కోని ,నిద్ర పోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు .ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ”ఈకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను .ఇదే నీకు చివరి జనం ”అని చెప్పి అదృశ్యమైనాడు .
మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్ర లేచి ,తన ముందున్న అనన్త ద్రవ్య రాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్య పోయింది .తన్ను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది .దైవాప చారానికి మన్నించ మని హనుమను ప్రార్ధించింది .హనుమ ఇచ్చిన ధనం తో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందం గా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు .అందరి కోర్కెలు తీర్చాడు .పిల్లల వివాహాలు చేశాడు .ఇన్ని చేస్తున్నా ,మనసంతా నువ్వే అని అతను హనుమ చరనాలనే ఆశ్రయించి చివరికి సాయుజ్యం పొందాడు కపిలుడు .నమ్మిన వారికి నమ్మినంతా సాయం ఇచ్చే వాడు ఆంజనేయుడు అని ఈ కధ మనకు తెలియ జేస్తోంది .
దీని తరువాతి కధ సోమ దత్తుని కధ .
సశేషం ,