Pages

Thursday, 26 February 2015

ఆంజనేయ మహాత్మ్యం —13 గాలవుని కధ


  పూర్వం గాలవుడు అనే కిరాతకుడు వుండే వాడు .ఆహారం కోసం జంతువులను వేటాడే వాడు .ఇంటిని లక్ష్మీ కళ తో నిర్వహించే వాడు .సాదు జీవనం గడి పే వాడు .అతనికి నలభై సంవత్స రాలు వచ్చాయి .ఏదో తీరని బాధ తో ,దిగులుగా వుండే వాడు .
ఒక రోజూ గాలవుడు వేటకై అడవి లోకి వెళ్లి ఒక జింక కనపడ గానే ,దాన్ని వెంబడించాడు .అది మధ్యలో మాయమై కని పించ లేదు .మృగం కని పించ నందుకు బాధ పడ్డాడు .తాను చేరిన ప్రదేశం ,నైమిశారణ్యం అని గ్రహించాడు .ఇక్కడ వున్న ,మహర్షులను సేవించి ,మనో వ్యాధి ని మాన్చు కోవాలని భావించాడు .దగ్గర లో వున్న పుష్కర ముని ఆశ్రమం చేరాడు .ఆయన పాదాల పైబడి మనసు లోని బాధ నివేదించాడు .తనకు దేనిపైనా ఆసక్తి లేదని ,ఏదీ రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనం తో తన జన్మ చరితార్ధం అయిందని  ,తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు .కొంత కాలమ్ ఇక్కడే వేచి వుండాలని ముని సెలవిచ్చాడు .
రోజూ పుష్కర ముని ని సేవిస్తూ ఫలాలు కాయలు ,పూలు కోసి తెస్తూ ,దర్భలు కోసి అందిస్తూ అక్కడే వున్నాడు గాలవుడు .అతని శ్రద్ధా శక్తులకు మహర్షి సంతోషించి ,అతన్ని కరుణించా లని భావించి  ,అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించా వచ్చా?ఉపదేశిస్తే హనుమ అనుగ్ర హిస్తాడా ,ప్రసన్నుడై అతని కోర్కె తీరు స్తాడా? అనే సందిగ్ధం లో కొంత కాలమ్ వున్నాడు ముని .ఒక రోజూ నిండు మనసు తో హనుమను స్మరించాడు ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షం అయాడు .ఆయన ఆకారం ఎలావుందో చూడండి .బంగారు యజ్ఞోప వీతం ,స్వర్ణ వస్త్రాలు ,రత్నాలు పొదిగిన చేతి కంకణాలు ,పాదాలకు బంగారు కడియాలు ,శిరసు పై రత్న ఖచిత కిరీటము ,శంఖం లాంటి కంఠం ,బంగారు చిరు జజ్జే లున్న వడ్డాణం ,స్వర్ణ తాటంకాలు ,శ్రీ కారం లాంటి కర్ణాలు ,చంపకం వంటి నాసిక ,విశాలనేత్రాలు  నేత్రాలు ,నెమలి పించం వంటి కురులతో వున్న కొప్పు ,మన్మధుని విల్లు లాంటి కను బొమలు ,హంస నడక వంటి నడక ,దొండ పండు వంటి పెదవులు ,ముక్తా తిలకం తో నుదురు, ,సన్నని నడుము ,మృదుల బాహుద్వయం ,అందాల రాసి వంటి భార్య అయిన సువర్చలా దేవి తో కన్నుల పండువు గా కన్పించాడు. మహర్షి మనసులో ని సందేహం గమనించాడు హనుమ .గాలవునికి మంత్రం ఉపదేశించటం లో సందేహం అక్కర్లేదని ఎవరికైనా ఉపదేశించా వచ్చునని వివరించాడు .అందరు కుల లింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ,ఫలితం పొంద వచ్చు అన్నాడు .వంచకునికి ,క్రుతఘ్నుడికి ,గర్విస్టికి ,లోభికి ,గురువు మీద విశ్వాసం లేని వాడికి మాత్రం తన మంత్రం ఉప దేశించ రాదు అని హితవు చెప్పాడు ..
పుష్కర ముని కి మనసు లో వున్న సందేహాలన్నీ పటా పంచలు అయాయి .గాలుని దగ్గరకు పిలిచి ,దగ్గర లో వున్న పుణ్య జలాశయం లో స్నానం చేసి శుచి గా రమ్మని చెప్పాడు .దానికి గాలవుడు అతి భక్తిగా మహర్షీ !మీ పాద జలమే నాకు పవిత్రోదకం .అది గంగాది సకల తీర్దాల కంటే పవిత్ర మైనది .గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా .కనుక నేను వేరే పవిత్ర జలం లో స్నానం చేయాల్సిన పని లేదు .మీ పాద జలమే నా సకల పాప విముక్తి కల్గిస్తుంది అనుగ్ర హించండి అని వేడు కొన్నాడు
కిరాతుడైన గాలవుని భక్తికి చలించి పోయాడు ముని .యోగ విడుదైన పుష్కరుడు హనుమను ధ్యానించి ,తన పాద జలాన్ని ,గాలవుని శిరస్సు పై చల్లాడు .గాలుని ,విశ్వాసం అంత గొప్పది .వెంటనే అతని పాపా లన్నీ తొలగి పోయాయి .లోపల వున్న వ్యాధి కూడా నివారణ అయింది .ఎంతో ఆరోగ్య వంతుడయ్యాడు .పరిశుద్ధ దేహ ,అంతరంగుడు అయాడు .వెంటనే మహర్షి అతనికి హనుమ ద్వాదశాక్షరిమంత్రాన్ని ఉపదేశించాడు .
మహర్షి సన్నిధి లోనే 108 సార్లు ద్వాదశాక్షరి మహా మంత్రాన్ని జపించాడు .వెంటనే ఫలితం దక్కింది .అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి .జ్ఞాని అయాడు .భూత భవిష్యత్ వర్త మానాలన్ని తెలుసు కో గలిగే సామర్ధ్యం లభించింది .ఆకాశ గమనం వచ్చింది .అన్ని లోకాలు తిరుగ గల్గె శక్తి వంతు దాయాదు .సిద్ధ, చార, గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామార్ధ్యాలు చూసి ఆశ్చర్య పోయాయి . .
సర్వ శక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహాను భావా !నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తీ కలిగి వుండే వరం ఇవ్వండి .అని కోరాడు .గురువు ఆశీర్వ దించి ,మంత్రాన్ని కడు శ్రద్ధా సక్తులతో జపించమని ,దానిని విసర్జిస్తే చాలా కస్టాలు మీద పడు తాయని హెచ్చరించాడు ..గురువు ను విడువ లేక .విడువ లేక అక్కడి నుండి బయల్దేరాడు .  ,గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరాడు .ఇది ఆంజనేయ స్వామి వారి తొమ్మిదవ అవతారం లో ని కధ .
సారి కశ్యపుని కధ ను తెలుసు కొందాం
సశేషం