Pages

Thursday, 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం –16 త్రిశూల రోముని కధ -1



-- మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరం లో హనుమ నిత్య కృత్యం గురించి తెలియ జేయ మని కోరాడు .మహర్షి చెప్పటం ప్రారంభించాడు .కిష్కింద ( నాటి ఆనె గొంది ) కు దగ్గర లో పంపా సరోవరం వుంది .దానిలో స్వర్ణ కమలాలుంటాయి .మునులకు ఆవాస భూమి .అనేక రకాల పక్షులకు నిలయం .మలయ మారుతం చల్ల గా వీచి మానసికానందాన్ని కల్గిస్తుంది .దేవతలు ,కిన్నెరలు అక్కడికి వచ్చి ఆడుతూ ,పాడుతూ వుంటారు .అద్వైతులు ప్రణవో పాసన తో వుంటారు .పంపా తీరం లో విహరించాలని ఒక రోజూ హనుమ ఒంటె వాహనం ఎక్కి ,పరి వార సమేతం గా అక్కడికి  చేరాడు .
అప్పుడు సుషేణుడు హనుమకు ఛత్రం పట్టాడు .నీలుడు ,మైందుడు ,చామరాలతో విసరు తున్నారు .మాగధుడు స్తోత్రం చేశాడు .గంధ మాదనుడు ముందు నడి  చాడు .ద్వివిదుడు సంభాషించి వినోదం కల్గించాడు .పవనుడు పాదుకలను పట్టాడు .జాంబ వంతుడు నీతి ని బోధించాడు .గంధ మాదనుడు ,వంశ కీర్తి ని పాడు తున్నాడు .అందరు అభి వాదం చేస్తుండగా ఒంటె దిగి ఉచితాసనం మీద కూర్చున్నాడు హనుమ .అందరిని వారి వారి స్థానాలకు వెళ్ళ మని హనుమ అనుమతి నిచ్చాడు .గవాక్షుడు ,శరభుడు ,నీలుడు ,గవయుడు ,గంధ మాదనుడు ,నలుడు ,గజుడు ,ప్రహస్తుడు ,దర్దరుడు ,వేగ వంతుడు అనే పది మంది మహా వీరులు కోటి మంది సైన్యం తో సరస్సు తూర్పు భాగాన విడిది చేశారు .ఋషభుడు ,సుముఖుడు ,ప్రుదువు ,దధి  ముఖుడు ,జ్యోతిర్ముఖుడు ,సంపాతి ,రుంధ్ర గ్రీవుడు ,కేసరి అనే ఎనిమిది మంది యోదులుయిడు లక్షల సైన్యం తో దక్షిణ భాగం లో వున్నారు .మరీచి కేసరి ,రంభుడు ,తరునుడు ,గోముఖుడు ,అనే అయిదుగురు  వానర శ్రేష్ఠులు పద్నాలుగు వేల మంది సైన్యం తో పశ్చిమ దిశ కు చేరారు .సువేషుడు ,హరి లోముడు ,విద్యుద్దంష్ట్రుడు ,జాత శ్రముడు ,శత వాలి అనే నలుగురు తొమ్మిది వేల వానర సైన్యం తో ఉత్తర దిక్కు చేరారు .వీరదరికి భక్తులు సకల ఫలాలు జలాలు సమర్పించారు .హనుమ పంపా సరోవారం లో దిగి హాయిగా స్నానం చేశాడు .
ఇంతలో ఆకాశం నుండి అతి ప్రకాశ మాన మైన వెలుగు తో నారద మహర్షి అక్కడ ప్రత్యక్ష మయాడు .అందరు లేచి నిలబడి నమస్కరించి భక్తీ చూపించారు .హనుమ నారదునికి నమస్కరించి యోగా క్షేమాలు విచారించాడు .దేవేంద్రాదుల క్షేమ  సమా చారాలను అడిగి తెలుసు కొన్నాడు .ఏమి పని మీద ఇక్కడికి వచ్చాడో చెప్ప మన్నాడు .నారదుడు హనుమకు భక్తీ ప్రపత్తులతో ప్రదక్షిణం చేసి ప్రార్ధన చేశాడు .
ఆంజనేయ నమస్తుభ్యం సంసారార్నవ తారకః -ప్రసీద జగతాం నాద దేవ దేవ నమోస్తుతే
నమస్తే విశ్వ రూపాయ జ్యోతిషాం పతయే నమః -అబాదిత స్వరూపాయ పూర్ణయ పర మాత్మనే
సూత్రాత్మనే నమస్తుభ్యం సూక్ష్మ రూపాయ విష్ణవే -శంకరాది దేవాయ యోగినాం పత నమః
సువర్చలా సమేతాయ పార్వతీ నంద నాయచ -నమో వేదాంత వేద్యాయ శరణ్యాయ నమో నమః
అని మనసారా స్తుతించి నారదుడు ఆంజనేయ స్వామితో హనుమత్ప్రభో !ఒక దేవ కార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు . కార్యమేమిటో ఎలా స్వామి దాన్ని పూర్తి చేశాడో తరు వాత తెలుసు కొందాం
  .