Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం –22 దార్మికుని కధ


               కాశీ పట్టణం లో  కేదారేశ్వర ఘాట్ లో దక్షిణాన రామ వాటిక వుంది .దాని ముందు గంగా తీరం లో జానకీ నాధుడు వున్నాడు .అయోధ్య లో శ్రీ రాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీ రాముని మూర్తి అద్భుతం గా వుంటుంది .ఆయన పాద పద్మాల చెంత హనుమ కూర్చుండి భక్తుల మనో భీష్టాలను నెర వేరుస్తుంటాడు .రామ వాటిక లో ధార్మికుడు అనే వేదాధ్యయనుడైన   బ్రాహ్మనుడున్నాడు .అతని కుమారుడు ధర్మ కీర్తి .సదాచారి ,వినయ సంపన్నుడు .పితృ షేవా పరాయణుడు .పదహారేళ్ళ ప్రాయం వాడు .మహా ప్రాజ్ఞుడు .అయినా ఇంట్లో దారిద్ర్యం తాండ విస్తూనే వుంది .ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ  క్షేత్రం చేరాడు .గోకర్నేశ్వరున్ని అర్చించి ,పూర్వ జన్మ వాసన వల్ల ఇంటిని మరిచి పోయి అక్కడే  చాలా కాలమ్ స్వామి సేవ లో ఉండి పోయాడు .
అక్కడ కాశి లో భార్యా పిల్లలు ధర్మ కీర్తి జాడ తెలియక బాధ పడుతున్నారు .కనపడిన ప్రతి యాత్రికుడిని తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కన్పించాడా అని అడిగే వాడు ధార్మికుడు .కొడుకు యెడ బాటును సహించ లేక నిత్యం దుఖిస్తూనే ఉండే వాడు .ఒక రోజూ సుతప్తుడు అనే బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి ”ధార్మికా !దుఃఖించ వద్దు .దైవ సహాయం ఇప్పుడు నీకు కావాలి .భూత ,భవిషత్ ,వార్త మానాలను తెలియ జేసే ”స్వప్నాన్జనేయ మంత్రం ”వుంది. నీకు దాన్ని ఉప దేశిస్తాను .నిరంతరం జపించి నీ పుత్రుని   ,ఆయన అనుగ్రహం తో తిరిగి పొందు ”అని చెప్పి మంత్రోపదేశం  చేశాడు .కలలో ఆంజనేయ స్వామి కని పించి ధర్మ కీర్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో కూడా తెలియ జేస్తాడని కూడా చెప్పాడు .
ధార్మికుడు ఏకాగ్ర చిత్తం తో రామ వాటిక లోని శ్రీ రామ సన్నిధిలో కూర్చుని ,మంత్రాన్ని జపిస్తున్నాడు .ఒక రోజూ కలలో హనుమ కన్పించి ”ధార్మికా !నీ కుమారుడు క్షేమం గా గోకర్ణం లో ఆరోగ్యం గా స్వామి సేవ లో గడుపు తున్నాడు .తనంతట తానె తిరిగి మీ వద్దకు  తిరిగి వస్తాడు .నన్ను స్వప్న  హను మంతుని గా భావించు  .స్వస్తి .”అని చెప్పి మారుతి అదృశ్యమైనాడు .ఆకష్మికం గా జరిగిన ఈ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగింది .ఉదయం నిద్ర లేచి తన కలను అందరికి తెలియ బర చాడు .అందరు ఆంజనేయ వైభవాన్ని దార్మికుని అదృష్టాన్ని పొగిడారు .పుత్రుని రాక కోసం ఎదురు చూస్తూ ,ఆంజనేయ జపాన్ని చేస్తూనే వున్నాడు ధార్మికుడు .
అక్కడ గోకర్ణ క్షేత్రం లో తనను అత్యంత భక్తీ విశ్వాసాలతో కొలుస్తున్న ధర్మ కీర్తి సేవలను ప్రస్తు తించి ,కాశీ క్షేత్రం కు వెళ్లి తలిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చ మని హితవు చెప్పి , గోకర్నేశ్వర స్వామి వెళ్ళ టానికి అనుమతి నిచ్చాడు .అతడు శివుని ఆజ్న ను శిరసా వహించి కాశీ కి ప్రయాణమైనాడు .కొన్ని రోజులకు కాశీ చేరి ఇంటికి వచ్చాడు .తలిదండ్రుల ఆనందం వర్ణించ లేకుండా వుంది .అందరికి నమస్కారాలు చేసి ,బంధువులను పలకరించాడు .కాశీ విశ్వ నాధుని నిత్యం సేవిస్తూ ఆంజనేయ ఉపాసన పొంది రోగాలు లేకుండా ,ఆరోగ్యం గా జీవిస్తూ ,చివరకు మోక్షాన్ని పొందాడు .”స్వప్న హను మంతుని ”దివ్య ప్రభావం అంత గొప్పది అని ధార్మిక ,ధర్మ కీర్తి ల కధ మనకు తెలియ జేస్తోంది .
సశేషం