Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం-28 సుదంతుని కధ

గంధర్వనగరం అనే సుందర పట్టణం లో ప్రజలను కన్నబిడ్డలు లాగా చూసు కొనే మహారాజు ఉన్నాడు .దానికి దగ్గర లో చిన్న అడవి ఉంది .అందులో సుదంతుడు అనే పేరున్న మహర్షి ఉన్నారు .ఆయన సద్గుణ సంపన్నుడు .తపోనిధి .ఆశ్రమ ధర్మాలన్ని టిని సక్రమంగా నిర్వహిస్తూ మౌని గా పవిత్ర జీవితాన్ని గడుపు తున్నాడు .మంత్ర మననం తో రుషి అయాడు .హృదయం లో ఆత్మా రాముడిని దర్శిస్తూ ఆనంద బ్రహ్మ లాగా ,ఆనంద మూర్తి గా ఉన్నాడు .వృద్ధాప్యం ప్రవేశించి ,ఆకలి దప్పుల చే పీడింప బడుతున్నాడు .
             ఒక రోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమ పడుతూ బయల్దేరాడు .వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తున్నాడు భరద్వాజుడు .కాని సుదంతుని పట్టించు కోలేదు .ఆకలిగా ఉన్న సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గర కు చేరి ,నమస్కరించి ,’’మహర్షీ! అందర్ని ఆదరించారు .నా మీద అనాదరం ఎందుకు చూపిస్తున్నారు?నేను కడు దరిద్రుడిని .వృద్ధుడిని.ఆకలి దప్పిక తో బాధ పడుతూ భరించ లేక మీ చెంతకు చేరాను .’’అని విన్న వించాడు .మహర్షి హృదయం కరిగి ,జాలిగా సుదంతుని వైపు చూశాడు.ఓదార్చాడు .దుఃఖించ వద్దని చెప్పాడు .అతనికి ఆతిధ్య మివ్వ కుండా ఉండటం లో తన తప్పేమీ లేదని ,అదంతా సుదంతుడు చేసిన పాప కర్మ ఫలమే నని వివరించాడు .
            ‘’పూర్వం నువ్వు ఒక రాజ్యానికి రాజు గా ఉండే వాడివి .అందర్నీ బాగా చూసే వాడివి .విద్యా వంతుడివే అయినా నీవు  ఎందుకో హనుమ ను దూరం చేసుకోన్నావు .హనుమను దేవుడు కాదని ,ఒక సామాన్య మైన కోతి అని భావించి నిన్దిన్చావు . అంతే కాదు హను మంతుడిని ఉపాసించే వారిని బాధించావు .కాని నీ తల రాత ఇంకో విధం గా ఉంది .నీ శత్రువులు అందరు ఏకమై ,నిన్ను ఓడించి,నీ రాజ్యాన్ని ఆక్రమించి ,నిన్ను అడవులకు పంపారు .నీ భార్యా ,పిల్లలు చని పోయారు .నువ్వు అన్నీ పోగొట్టు కోవటం చేత కుంగి ,కృశించి ,ఆ అడవి లోనే మరణించి ,బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడి నందుకు బ్రాహ్మణుడి గా జన్మించావు .నిష్కామంగా ,నిశ్చల బుద్ధి తో తపస్సు చేసి రుషి అని పించు కొన్నావు .అయినా మారుతి ని దూషించిన ఫలితం గా నువ్వు ఆకలి బాధ కు గురి అయావు .ఆ దుష్కృతి పోగొట్టు కోవ టానికి నువ్వు హను మంతుని సేవించు .నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని తీవ్రం గా జపిస్తూ ,నీ కోర్కెను తీర్చుకో ‘’అని చెప్పాడు .
             భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ,ఆయన సమక్షం లోనే జపించాడు సుదంతుడు .అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాదరించాడు .సుదంతుడు హనుమ పాదాల పై వాలి నమస్కరించాడు .తనను ఉద్ధరించ మని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు .అంజనా నందనుడు ఆనంద పడి,’’సుదంతా !బాధ పడకు .నన్ను సేవించు.నీకు ఇదే చివరి జన్మ .’’అని ఊరడించి అదృశ్యమైనాడు ..అప్పటి నుండి సుదంతుడు నిత్యం హనుమ ను సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపాశిస్తూ జీవితాన్ని గడి పాడు .జీవితాన్ని ధన్యంచేసుకొని చివరకు  హనుమ  లో లీనమయ్యాడు .
   ‘’రాజ్య ప్రదం హనూమంతం వదాన్యం మధుర ప్రియం
    శ్రియం చింతా మణిం కామ ధేనుం కల్పక మాశ్రయే.’’
‘’సపీత కౌపీన ముదంచి తాన్జలిం సముజ్జ్వలం మౌన్జ్య జినోప వీతినం
సకుండలం లంబశిఖం సువాలం తమాన్జనేయం శరణం భజామి ‘’.
   సశేషం