Pages

Wednesday, 24 June 2015

మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు?


ఏ ప్రార్థన చివరిలోనయిన మన ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.
ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చలారుగాక)
ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లరుగాక)
ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లరుగాక)
1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని
2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట.ఇ
‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ అని మూడుసార్లు చెప్పడంలో ఇంత అర్థం దాగివుంది.

Wednesday, 17 June 2015

రాహువు కేతువు

రాహువు కేతువు జ్యోతిషంలో ఇవి చాయా గ్రహాలు. ఇవి అపసవ్యమార్గంలో ప్రయాణిస్తాయి. రాహువు దశాకాలం జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు కేతువు దశాకాలం జాతకంలో ఏడు సవత్సరాలకాలం.రాహువు విషం, విషజ్వరాలు మొదలైన వాటికి కారకుడు. కేతువు రణములకు కారకుడు. జాతక చక్రంలో రాహుకేతువులకు ఇల్లు లేదు. రాహువు సూర్యచంద్రులతో కలిసినప్పుడు సూర్యగ్రహణం. కేతువు సూర్య చంద్రులతో కలసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. రాహుగ్రహ నక్షత్రాలు ఆర్ధ్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్రజాతకులకు రాహుదశా శేషంతో జన్మిస్తారు.కేతువు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించిన వారు కేతుదశా శేషంతో జన్మిస్తారు. రాహువు కేతువు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో సంచరిస్తున్నప్పుడు దారుణమైన దుర్ఘటనలు సంభవిస్తాయి. రాహువు ఆర్ధ్ర మూడు, నాలుగవ పాదాలలో సంచరించే సమయాన ఆరోగ్య సమస్యలు, చెడు అలవాట్లు ఉత్పన్నమౌతాయి. స్వాతి నాలుగు పాదాల సంచారం ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి. శతభిష రెండవ పాదసంచారంలో కోపం, మూడవ పాద సంచారం కాలేయ సమస్యలు ఉత్పన్నమౌతాయి.కేతువు అశ్విని మూడవ పాదంలో, మఖ ఒకటి, రెండు, మూడుపాదాలలో, మూల ఒకటి రెండు పాదాలలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.రాహు శుక్రుల కలయిక కళారంగ ప్రవేశానికి అధికంగా దోహదం చేస్తుంది.రాహుశుక్రులు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇది సంభవం. అలాగే రాహువు కేంద్రంలో ఉండి గురుగ్రహ దృష్టి అంటే అయిదవ, తొమ్మిదవ దృష్టి కలిగిన రాజయోగం, సంఘంలో గౌరవ మర్యాదలు ఇస్తాడు.పన్నెండులో రాహువు చక్కని తెలివితేటలు ఇస్తాడు.అలాగే కేతువు ఆరులో ఉన్నప్పుడు కీర్తి, భవిష్యజ్ఞానం కలిగిస్తాడు. రెండవ స్థానంలో ఉన్నప్పుడు మార్కెట్ వలన లాభాలు కలిగిస్తాడు. పదకొడులో ఉన్న కేతువు లాటరీల ద్వారా ధనం ఇస్తాడు. జాతక చక్రంలో రాహు కేతువుల మద్య గ్రహములు చిక్కు పడడం కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. కాలసర్ప దోష నివారణకు కాళహస్థీశ్వర దర్శనం అక్కడ చేసే పరిహారం నివారణగా భావించబడుతుంది. రాశి చక్రంలో రాహుకేతువులు ఈద్దెనిమిది మాసముల తరువాత అపసవ్య మార్గంలో రాసి మార్పు జరుగుతుంది. రాహూఖేతువల ఒక పరిభ్రమణ కాలం పద్దెనిమిది సంవత్సరాలు. రాశి చక్రంలో రాహుకేతువుల మద్య సరిగ్గా ఏడు స్థానాల దూరం ఉంటుంది. రాహుకేతువులు చాయా గ్రహాలు కనుక ఏరాశి అందు ఉన్న ఆ రాశ్యధిపతి ఫలితాలు ఇస్తారు. రాహువు స్థానాలు 1. ప్రధమ స్థానమైన లగ్నంలో రాహువు ఉన్న సహాయగుణం కలవారుగా ఉంటారు, ధైర్యవంతులు, ముఖం మీద మచ్చలు ఉన్నవారుగా ఉంటారు.2.రాహువు ద్వితీయ స్థానంలో ఉంటే నల్లని చాయగలవారు, వివాహేతర బంధములందు ఆసక్తి కలవారుగా ఉంటారు.3. త్రుతీయ స్థానమున ఉన్న క్రీడాకారులు, ధనవంతులు, సాహసికులు ఔతారు.4. చతుర్ధ స్థానమున ఉన్న బహుభాషా కోవిదులు ఔతారు. తల్లికి కష్టాలు, విద్యలయందు ఆటంకం కలిగిస్తాడు.5. పంచమ స్థానమున ఉన్న రాహువు క్రూర స్వభావం, గర్భ సమస్యలు కలిగిస్తాడు.6. షష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు పెద్ద బంధు వర్గం కలవాడు, శత్రు రహితుడు ఔతారు. 7. సప్తమ స్థానమున ఉన్న రాహువు మంచి భోజనం కళత్రానికి సమస్యలు మధుమేహవ్యాధికి కారకుడు ఔతాడు.8.అష్టమ స్థాన రాహువు పోట్లాడే గుణం, సంకుచిత మనస్థత్వం కలిగిస్తాడు.9. నవమ స్థానమున ఉన్న రాహువు పిరికితనాన్ని, తండికి కష్టాలు కలిగిస్తాడు.10. దశమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు కళాకారుడు, యాత్రికుడు, రచయితలు ఔతాదు.11. ఏకాదశ స్థానమున ఉన్న రాహువు ధన సంపద, సంఘంలో గౌరవం మర్యాద కలిగిస్తాడు.12. ద్వాదశ స్థానమున ఉన్న రాహువు తాత్విక చింతన కళ్ళ జబ్బులు కలిగిస్తాడు.కేతువు స్థానాలు 1.లగ్నంలో ఉన్న కేతువు అధిక స్వేదం కలిగించుట, చక్కటి ప్రజాసంబంధాలను కలిగిస్తాడు.2.ద్వితీయంలో ఉన్న కేతువు ముక్తసరిగా మాట్లాడటం, శాంతస్వభావం కలిగిస్తాడు.3.త్రుతీయస్థానంలో కేతువు ఉన్న జాతకుడు కీర్త్రి ప్రతిష్టలు శక్తిమంతులుగా ఉంట్శాడు.4.చతుర్ధస్థానంలో ఉన్న కేతువు గొడవలు పడే మనస్తత్వం కలిగిస్తాడు.5.పంచమ స్థానంలో ఉన్న కేతువు సంతానానికి కీడు, 6.స్థానంలో కేతువు మాటకారితనం కలిగిస్తాడు.7.సప్తమ స్థాన కేతువు కళత్రానికి సమస్యలు కలిగిస్తాడు.8.అష్టమ స్థాన కేతువు నిదాన స్వభావం కలిగిస్తాడు.9. నవమ స్థానంలో ఉన్న కేతువు చత్వారం మంచి భాగస్వామిని ఇస్తాడు.10.దశమ స్థానంలో ఉన్న కేతువు తాత్విక చింతన కలిగిస్తాడు.11.ఏకాదశ స్థానమున ఉన్న కేతువు ధన లాభం, హాస్య స్వభావం కలిగిస్తాడు.12.ద్వాదశ స్థానమున ఉన్న కేతువు విదేశయానం కలిగిస్తాడు.

శుక్రుడు స్థానాలు


శుక్రుడు లగ్నమున ఉన్న జాతకుడు గణిత శాస్త్రజ్ఞుడు , భార్యయందు ప్రేమకలవాడు, ధనవంతుడు, పచ్కాని శరీర కాంతి కలవాడు చిరకాలం జీవించు వాడు. శుక్రుడు పాప గ్రహ చేరిక కలిగి ఉన్నను శత్రు స్థానం లేక నిచ స్తానంలో ఉన్న జాతకుడు కారుడు మోసకారి, వాత శ్లేష్మ పీడితుడు, సుఖరోగా పీడితుడు ఔతాడు .

ద్వితియమున శుక్రుడు ఉన్న ధనవంతుడు, విశాలనేత్రములు ఉన్న వాడు, దయకలవాడు, సత్యవాది, స్త్రీ వలన లాభం పొందు వాడు, స్త్రీల స్నేహం పొందు వాడు , పరోపకారి ఔతాడు. శత్రువు పాపగ్రహములతో సిరిక కలిగిన నేత్ర పీడ, చంద్రునితో కలిసిన రేసికటి కలవాడు, ధన నష్టం కుటుంబం లేని వాడు.

మూడవ స్థానంలో ఉన్న జాతకుడు అతి లోభి, ఎక్కువ మంది సోదరులు కలవాడు, సంకల్ప సిద్ధి ధన వృద్ధి పొందు వాడు, శుక్రుడు ఉచ్చ క్షేత్రం స్వక్షెత్రం అందు ఉన్న సోదర వృద్ధి కలుగును. భాధిపతి ఆరు, ఎనిమిది, పన్నెండు లో ఉన్న సోదర నష్టం కలుగును.

నాల్గవ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు రూపవంతుడు, గాయకుడు, బుద్ధిమంతుడు, ముప్పదవ సంవత్సరమున వాహన సుఖం కలుగును, సోదర సుఖం కలవాడు, క్షమాహ్రుదయ కలవాడు ఔతాడు. భావాధిపతి బలవంతుడైన కార్లు స్కూటర్లు కలవాడు , ధన కనక వస్తు వాహన సంపద కలవాడు ఔతాడు. శత్రు, నీకా, పాప స్థానమున ఉన్న బలహినుడైన ధనహినుడు , వాహన సుఖం లేని వాడు, తల్లికి అశాంతి, పరస్త్రీ ఆకర్షితుడు ఔతాడు.

పచామ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు విజ్ఞాని, మంత్రి లేక సైన్యమున గొప్ప పదవి పొందు వాడు , సదా అందమైన భార్యను పొందు వాడు, మంచి గుణం , రాజ సన్మానం కలిగిన వాడు ఔతాడు. శుక్రుడు పాప గ్రహ చేరిక, బలహీనుడు, నిచ లేక శత్రు స్థానముల ఉన్న జాతకుడు మండ బుద్ధి కలవాడు ఔతాడు.

శుక్రుడు అరవ స్థానమున ఉన్న జాతకుడు కీర్తి కల వాడు, పుత్రా వరు దది, అవసరమైన ఖర్చులు చేయువాడు, మాయావాదములు చేయువాడు, రోగ పీడితుడు ఔతాడు. శత్రు, నిచ స్థానముల ఉన్న పాపుల చేరిక లేక చంద్రుని తో చేరిక కలిగి ఉన్నా బందు నష్టం పుత్రా సంతానం లేక పోవుట, శత్రు నాశకుడు ఔతాడు.

సప్తమమున శుక్రుడు ఉన్న జాతకుడు అతి కాముకుడు, బహు ధనవంతుడు, అన్య స్త్రీల అందు ఆసక్తుడు, వాహనములు కలవాడు, సంగితకారుడు, కార్యశురుడు, భోగి, పుత్రవంతుడు ఔతాడు. శత్రు, నిచ స్థానముల ఉన్న బలహినుడైన భార్యా వియోగం, బహు వివాహములు, పుత్రా సంతాన హీనుడు ఔతాడు. బలయుక్తుడు, స్వక్షెత్రం , ఉచ్చ క్షెత్రముల ఉన్న భార్య మూలమున దనం కీర్తి కల వాడు ఔతాడు.

ఎనిమిదవ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు సుఖవంతుడు, నాగువ సంవత్సరం తల్లికి గండం , అర్దాయుష్కుడు, రోగాపిడితుడు , అసంతృప్త జీవితం , త్యాగనిరతి కలిగిన భార్య కలవాడు ఔతాడు. శుక్రుడు బలయుక్తుడై, ఉచ్చ, శుభ గ్రహ చేరిక కలిగిన దిర్గాయువు , పాప గ్రహ చేరిక, నిచ, శత్రు శ్తానముల ఉన్న అల్పాయువు కలవాడు ఉఒతాడు. మేషరాశి అష్టమమైన తృష్ణా పీడితుడు, వృషభ రాశి అష్టమమైన సుఖరోగా పీడితుడు, మిధునం అష్టమమైన దంత వ్యాధి పీడితుడు, కటకం అష్టమమైన వాత ఒపిట్ట శ్లేష్మ పీడితుడు, సోహం అష్టమమైన మసూచి పీడితుడు, కన్య అష్టమమైన మ్రుతముల చేత, తుల అష్టమమైన సర్పముల చేత , వృశ్చికం అష్టమమైన విష భక్షన చేత, ధనుస్సు అష్టమమైన క్రిమి కీటకం చేత, మకరం అష్టమమైన విష ప్రయోగం లేక శాస్త్ర చికిత్స అనంతరం, కుంభం అష్టమమైన అతికామము చేత, మీనం అష్టమమైన అతి భాదల చేత మరణం సంభవించును. ఇవి అన్ని శుక్రుడు ఉపస్తితమై ఉన్న జరుగును.

నవమున శుక్రుడు ఉన్న ధార్మికుడు తపస్వి, సత్కర్మ చేయు వాడు, పాదముల పుట్టు మచ్చలు శుభ చిహ్నములు కల వాడు, బహు భోగలాలసుడు, పుత్రవంతుడు, తండ్రి దిర్గాయువు కలవాడు ఔతాడు. నీకా, శత్రు, పాపగ్రహ చేరిక కలిగి ఉన్న జాతకుని తండ్రిని బాల్యమున కోల్పోవును. భాగ్యమును కోల్పోవును. స్వక్షెత్రం, ఉచ్చ క్షేత్రముబలయుక్తుడై ఉన్న ధనవంతుడు మహా భోగి ఔతాడు. చతుర్ధ , సప్తమ అధిపతులతోసంబంధం ఉన్న బహు భోగములు, విదేశీ కార్లు, విదేశీ ప్రయాణాలు కలుగును.

దశమ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు ధైర్యవంతుడు, బుధ, గురు, చంద్రులతో కలిసి ఉన్న భావాహనములు కలవాడు, యజ్ఞములు చేయువాడు , మరణానంతరం కుడా కీర్తిని పొందు వాడు ఔతాడు. బహినుడైన, పాపగ్రహ చేరిక ఉన్న, నిచాలో ఉన్న కార్య పరాజయం కలుగును.

ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్న ధనవంతుడు, భువసతి కలవాడు, విద్యావంతుడు ఔతాడు. బలవంతుడి, శుభ గ్రహ చేరిక, ఉచ్చ స్థానముల ఉన్న అనేక వాహనములు కలవాడు ఔతాడు. పాపగ్రహ చేరిక, నీచం, శత్రు స్థానముల ఉన్న అన్యాయ మార్గమున ధన సంపాదన చేయును.

ద్వాదశ స్య్హానమున శుక్రుడు ఉన్న దరిద్రుడు, పాప గ్రహ చేరిక ఉన్న నీచం అయిన స్త్రీ స్నేహం, శుభాగ్రహ చేరిక కలిగిన ధనవంతుడు ఔతాడు.

భాగ్యస్థానం

భాగ్యస్తానాధిపతి
జ్యోతిషంలో భాగ్యస్తానాదిపటికి ప్రాముఖ్యత ఉంది. లగ్నం నుంచి కాని చంద్రుడు ఉపస్తితమైన రాశి నుండి కాని ఎ శతానం బలయుక్తముగా ఉన్నా దానిని అనుసరించి ఫలం ఉంటుంది. భాగ్యాది పాటి అంటే లగ్నం నుంచి కాని చంద్రుని నుండి కాని తొమ్మిదవ స్థానం భాగ్యాదిపతిది. భాగ్యాధిపతి ఎష్టానమున ఉన్నా బలవంతుడైనా బలహినుడైనా కారకుడు భాగ్యాధిపతి మాత్రమె కాని భాగ్యస్తానంలో ఉండే అన్య గ్రహము కాదు. భాగ్యాధిపతి చేరిక మరియు దృష్టి కలిగి భాగ్యష్టానంలో ఉన్నా గ్రహప్రభావం స్వద్ర్శంలో భాగ్యాన్ని కలిగిస్తుంది. ఇతర గ్రహముల చేరిక దృష్టి కలిగిన పరదేశాములలో భాగ్యాన్ని ఇస్తుంది. బలవము కలిగిన గ్రహము లగ్నం నుడి నమ దృష్టి తోనూ, త్రుతియము నుండి సప్తమ దృష్టి తోనూ , పంచమము నుండి పంచమ దృష్టి తో చూసినను పుట్టినవారు శ్రేష్ఠులు ఔతారు.
గురువు భాగ్యమున ఉన్నా మంత్రి ఔతాడు. రవి దృష్టి ఉంటే రాజ తుల్యుడు ఔతాడు.చంద్రుని దృష్టి ఉంటే భోగము సౌందర్యము కలవాడు. కుజుని దృష్టి ఉంటే బంగారము కలవాడు ఔతాడు. బుధుని దృష్టి ఉంటే ధనికుడు, శుక్రుడు చుసిన ధనము గో సమూహములు శని చుసిన స్థిర ద్రవ్యము కలవాడు ఔతాడు.
గురువు భాగ్యస్తానమున ఉండగా రవి, చంద్రుల చేత చూడబడిన ధనము ధాన్యముల సమృద్ధి కలవాడు ఔతాడు.తల్లి, తండ్రులకు ఇష్టుడు , రాజతుల్యుడు, అనేక భార్యలతో కుడి ఉండు వాడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా రవి బుదుల చేత చూడబడిన సౌందర్యము కలవాడు, మనోహరమైన వాడు, శ్రేష్టమైన భార్య, ఆభరణములు కల వాడు, పండితుడు, ప్రాజ్ఞుడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా రవి శుక్రుల చేత చూడబడిన జాతకుడు ఉత్సవాదుల అందు ఆసక్తుడు, గోవులు, మహిషములు , మేకలు, ఏనుగులు కలవాడు , గొప్ప వినయము కలవాడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా రవి శనుల చేత చూడబడిన జాతకుడు దేశము పురములకు అధిపతి, ఖ్యాతి కలవాడు, ప్రాజ్ఞుడు, గుణవంతుడు, ధనము, నిధులు కుదబెట్టు వాడు ఔతాడు.
చంద్రుడు

గురువు భాగ్యమున ఉండగా చంద్ర కుజుల చేత చూడబడిన జాతకుడు మనోహరుడు, సేనాధిపతి, అనేక సౌఖ్యములు పొందు వాడు.
గురువు భాగ్యమున ఉండగా చంద్ర బుదుల చేత చేత చూడబడిన జాతకుడు ఉత్తమమైన గృహమున , ఉత్తమ వంశమున భోగము పొందు వాడు, ఉత్తమ బుద్ధి కలవాడు, తేజస్సు కలవాడు, ఆర్మీ కలవాడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా చంద్ర శుక్రుల చేత చూడబడిన జాతకుడు శూరుడు, ధనికుడు, సత్కార్మాసక్తి కలవాడు పరదారాసక్తుడు, పుత్రులు లేని వాడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా చంద్ర శనుల చూడబడిన జాతకుడు మిక్కిలి పొగరుబోతు, పరదేశమున ఉండు వాడు, వివాదము చేయు వాడు, గుణము లేని వాడు , అబద్ధములు చెప్పు వాడు ఔతాడు.
కుజుడు

గురువు భాగ్యమున ఉండగా కుజ బుదుల చేత చూడబడిన జాతకుడు చక్కగా అలంకారము చేయువాడు, ప్రాజ్ఞుడు, గుణవంతుడు, మంచి నడవడి కల వాడు, మాటను ఆలకించు వాడు, విద్వాంశుడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా కుజ శుక్రుల చేత చూడబడిన జాతకుడు విద్యావంతుడు, సత్వగుణము కలవాడు, విదేశములకు పోవు వాడు, మిక్కిలి నేర్పరి , క్రూరుడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా కుజ శనుల చేత చూడబడిన జాతకుడు నీచుడు, బలిసిన వాడు, దుష్ట సహవాసము కలవాడు, విదేశాముల ఉండు వాడు, ద్వేశించ తగిన వాడు ఔతాడు.
బుధుడు

గురువు భాగ్యమున ఉండగా బుధ శుక్రుల చేత చూడబడిన జాతకుడు యోగ్యుడు, శిల్ప శాస్త్రము ఎరిగిన వాడు,విద్వాంశుడు, సౌందర్య వంతుడు , మాట పాటించు వాడు ఔతాడు.
గురువు భాగ్యమున ఉండగా బుధ శనుల చేత చూడబడిన జాతకుడు వినయ వంతుడు, సౌందర్య వంతుడు, శౌర్య వంతుడు , వక్త, విద్వాంశుడు ఔతాడు.
శుక్రుడు

గురువు భాగ్యమున ఉండగా శుక్ర శనుల చేత చూడబడిన జాతకుడు రాజ శ్రేష్టుడు, అధిక ధనము కలవాడు, రాజులలో రాష్ట్రములలో ప్రధముడు ఔతాడు.
ఇతరములు

గురువు భాగ్యమున ఉండగా జన్మించిన జాతకుడు భాగ్యాధిపతి దృష్టి ఉన్నా , యోగ గ్రహ రుష్టి ఉన్నా శుభ ఫలితములు లేకున్నా జరగవు.
గురువు భాగ్యమున ఉండగా సర్వ గ్రహముల చేత చేత చూడబడిన జాతకుడు శ్రేష్ఠ గుణములు కలవాడు, గొప్ప ఐశ్వైర్యము కలవాడు, తేజస్సు కలవాడు , రాజు ఔతాడు.
భాగ్య స్థానమున బలము కలిగిన రాజ్యము కల వాడు, స్థిరమైన ధనము, ధాన్యము, ధర్మమూ , ఆయుష్షు కల వాడు.
భాగ్య స్థానమున పాప గ్రహములు నీచ స్థానమున ఉండగా శుభ గ్రహ దృష్టి లేకున్నా జాతకుడు దుర్బలుడు, నిర్ధనుడు, ఖ్యాతి లేని వాడు, మాలిన్యము కలవాడు ఔతాడు.
భాగ్యాధిపతి పాపి అయినను భాగ్య స్థానమున ఉండిన శుభుడు , శుభ గ్రహ దృష్టి ఉన్నా విశేష శుభాగున యుక్తుడు ఔతాడు.
పూర్ణ చంద్రుడు భాగ్యమున ఉండగా కుజ, బుధ, శనులు బలముగా ఉన్నా ప్రధాన రాజ వంశమున పుట్టిన వాడు ఔతాడు.
మేషము, వృశ్చికము, మకరము భాగ్య స్థానమైన అందు చంద్రునితో కుజుడు ఉండుట, మిధునము, కన్య భాగ్యస్తానము అయిన చంద్రునితో బుధుడు ఉండుట , కుంభము, మకరము ,తుల భాగ్యస్తానము అయిన చంద్రునితో శని ఉండుట జరిగినచో రాజ వంశ సంజాతకుడు ఔతాడు.
భాగ్యశానమున రవి ఉండగా అది మేహం అయిన , భాగ్యస్తానమున చంద్రుడు ఉండగా అది వృషభం అయిన, భాగ్య స్థానమున కుజుడు ఉండగా అది మకరం అయిన , భాగ్యస్తానమున బుధుడు ఉండగా అది కన్య అయిన, భాగ్యస్తానమున గురువు ఉండగా అది కటకము అయిన , భాగ్యస్తానమున శుక్రుడు ఉంది అది తుల అయిన జాతకుడు నరేంద్రుడు , శత్రువులు లేని వాడు, ప్రబల కీర్తి ,ఖ్యాతి , తేజము కల వాడు ఔతాడు.

బుధుడు రాశులు

బుధుడు రాశులు

బుధుడు మేషమునందు ఉండగా జన్మించిన జాతకుడు సౌందర్యవంతుడు, అతి జారత్వము చేత కృశించిన దేహము కల వాడు, పాడుతా, నాట్యమాడుట, వినియందు ఆసక్తి కలవాడు, అబద్ధము పలుకు వాడు, స్త్రీ లోలుడు, లేఖకుడు, అబద్ధపు సాక్ష్య ము పలుకు వాడు, అధికంగా భిజిమ్చు వాడు, అనేక కష్టముల ధనము పోగొట్టుకున్న వాడు, నిలకడ లేని నివాసము కలవాడు, జూదరి ఔతాడు.


బుధుడు వృషభమునందు ఉండగా జన్మించిన జాతకుడు సమర్ధుడు, మిక్కిలి దాత, ప్రసిద్ధుడు, వేదసాస్త్రార్ధములను చక్కగా ఎరిగిన వాడు, వ్యాయాయమ , వస్త్రములు, భూషణములు, పుష్ప మాలికలందు ప్రియము కలవాడు, చలించని స్వభావం కలవాడు , స్త్రిలయండు ఆసక్తి కలవాడు, ప్రియమైన వినుటకు ఇంపైన చారిత్ర కల వాడు , మాట తప్పని వాడు, గాంధర్వము, హాస్యము కలవాడు ఔతాడు.


బుధుడు మిధునము నందు ఉండగా జన్మించిన జాతకుడు మంగళకరమగు వేషము కల వాడు, ప్రియ భాషి, ధనవంతుడు, ప్రసిద్ధుడు, ఆత్మ స్తుతి చేసుకొను వాడు, అభిమానవంతుడు, సుఖమునందు అనాసక్తుడు, ఇద్దరు తల్లులకు పుత్రుడు, వివాదముల ఆసక్తుడు, వేదవేదాంగాములను ఎరిగిన వాడు, కవి, స్వతంత్రుడు, జనులందరికి ఇష్టుడు, దానశీలుడు, పనులయండు ఆసక్తి కలవాడు, పుత్రులు, స్నేహితులు కలవాడు ఔతాడు


బుధుడు కటకము నందు ఉండగా జన్మించిన జాతకుడు ప్రాజ్ఞుడు, విదేశాముల నివశించు వాడు, స్త్రీలోలుడు, గానప్రియుడు, చపలుడు, అధికముగా మాటాడు వాడు, తన బంdhu వర్గముతో ద్వేషము ఉన్నవాడు,స్త్రీ కలహమున ధనము పోగొట్టుకున్న వాడుకుత్సితుడు, మంచి కవి , సద్వంశ సంజాతకుడు, అనేక కార్యములందు ఆసక్తుడు ఔతాడు.


బుధుడు సింహమునందు ఉండగా జన్మించిన జ్ఞానము లేని వాడు, ప్రసిద్ధుడు, అసత్యవాది, జ్ఞాపకశక్తి కలవాడు, ధనవంతుడు, దుర్బలుడు, తోబుట్టువుల బాధించు వాడు, స్త్రీలకు అయిష్టుడు, స్వతంత్రుడు, నిచములగు పనులు చేయు వాడు, దూత, సంతతి లేని వాడు, తన వంశమునకు విరోధి, ప్రజలకు అందరకు ఇష్టుడు ఔతాడు.


బుధుడు కన్యనందు ఉండగా జన్మించిన జాతకుడు ధర్మమునందు ఆసక్తుడు మిక్కిలిగా మాటాడు వాడు, నేర్పరి, చిత్రకారుడు, కావ్యరచన చేయు వాడు, విజ్ఞానము శిల్పము ఎరిగిన వాడు, అందగత్తెల అందు ఆసక్తుడు, అల్ప ధైర్యం కల వాడు, పెద్ద మనిషి, స్నేహితులందరి చేతను పూజింప బడువాడు, అనేక విధముల వినయముతో ఉపచరించు భార్య కల వాడు, ప్రసిద్ధుడు, ఉదారుడు, బలవంతుడు ఆతాద్


బుధుడు తులనందు ఉండగా జన్మించిన జాతకుడు శిల్ప శాస్త్రము వాదము తెలిసిన వాడు, మాట్లాడుతయండు నేర్పరి, ద్రవ్యము కొరకు ఇష్టమైన దానిని వ్యయము చేయు వాడు, అన్ని వైపులా వాణిజ్యం చేయువాడు, అతిథులు, బ్రాహ్మణులూ, దేవతలు, గురువులు, వీరియందు భక్తి ,కపటపు పనులు చేయు సమర్ధుడు ,అందరికి ఇష్టుడు, చంచలుడు, కోపము, సంతోషము స్వల్ప కలం మాత్రమే ఉండు వాడు ఔతాడు.


బుధుడు వృశ్చికమునందు ఉండగా జన్మించిన జాతకు కష్టములు, దుఖములు అనుభవించు వాడు, మిక్కిలి ధర్మం సిగ్గు కల వాడు, మూర్ఖుడు, అసత్పురుషుడు , లోభి జార స్త్రీలను వాంచించు వాడు, కఠినముగా దండించు వాడు, చం చలమైన పనులు చేయు వాడు, తనకు అయిష్టమైన పనులందు నియోగిమ్కాబడు వాడు, ఋణగ్రస్తుడు, నీచపు పనులను ఆచరించు వాడు, ఇతరుల సొత్తు అపహరించు వాడు ఔతాడు.



బుధుడు ధనస్సునందు ఉండగా జన్మించిన జాతకుడు ప్రసిద్ధుడు, ఉదారగునము కల వాడు, వేదము ,శాస్త్రము, శౌర్యము , మంచి నడవడి కల వాడు, మంత్రి, లేక రాజ పురోహితుడు, వంశములో ముఖ్యుడు, గొప్ప ఐశ్వర్యం కల వాడు, యజ్ఞములను చేయుట, వేదములను చదివించుట అందు ఆసక్తి కల వాడు, మేదావంతుడు, మాటనేర్పరి, దీక్షాపరుడు, దాత, వ్రాయుట, చిత్రలేఖనం ఎరిగిన వాడు ఔతాడు.


బుధుడు మకరము నందు ఉండగా జన్మించిన జాతకుడు , , మూర్ఖుడు, నపుంసకుడు, ఇతరుల పనులు చేయు వాడు, కులము, శీలము మొదలైన గుణములు కల వాడు, అనేక దుఃఖములు కల వాడు, కలవరించుట, స్వేచ్చగా విహరించుట కల వాడు, చాడీలను చెప్పు వాడు, అబద్దపు పనులు చేయు వాడు, బంధువుల చేత వదల బడిన వాడు, నిలకడ లేని వాడు, మలినుడు, భయము చేత చంచలమగు వాడు ఔతాడు.


బుధుడు నందు ఉండగా జన్మించిన జాతకుడు సంగీతము, సాస్త్రార్ధము, కవిత్వము, అవధానము మొదలైన వాని అందు ఆసక్తి కలవాడు, ధర్మ, కామ, మోక్షములను సంపాదిం చువాడు, షత్రువుల చేత అవమానం పొందు వాడు, అపరిషుద్ధుడు, మంచి నడవడి లేని వాడు, అజ్ఞాని, మిక్కిలి దుష్టురాలైన భార్య కల వాడు, భోగ హీనుడు నలుగురిలో వ్యర్ధముగా వాదము చేయు వాడు, కడు కురూపి, మిక్కిలి భయశీలుడు, నపుంసకుడు, వినయము లేని వాడు,మలినుడు ఔతాడు.


బుధుడు నందు ఉండగా జన్మించిన జాతకుడు ఆచారము, పరిశుభ్రత, మొదలైన వాని అందు ఆసక్తుడు, విదేశముల ఉండు వాడు, సంతానము లేని వాడు, దరిద్రుడు, మంగళకరి అయిన భార్య కలవాడు, మంచి కార్యములను చేయు వాడు, సత్పురుషులకు ఇష్టుడు, ఇతర ధర్మముల అందు ఆసక్తుడు, కుట్టు పని తెలిసిన వాడు, ప్రసిద్ధుడు, వేదము, చతుష్టి కళలు తెలిసిన వాడు, ఇతరుల ధనము అపహరించుటలో ప్రసిద్ధుడు ఔతాడు.

బుధుడు కుజక్షేత్రము




బుధుడుడు కుజ క్షేత్రమున ఉండి రవి చేత చూడబడిన జాతకుడు సత్యవాది, సుఖవంతుడు, రాజ గౌరవం పొందు వాడు, బంధువులలో నేర్పు కలవాడు ఔతాడు.బుధుడు కుజ క్షేత్రమున ఉండి చంద్రిని చేత చూడబడిన జాతకుడు స్త్రీ మనోహరుడు, అతిగా సేవించు వాడు, మలినుడు, చెడ్డనడవడి కలవాడు ఔతాడు.


బుధుడు కుజ క్షేత్రమున ఉండగా కుజుని చేత చూడబడిన జాతకుడు అబద్ధములు, మంచి మాటలు, కలహములు మాటాడు వాడు కాగలడు, పండితుడు, ధ్నవంతుడు, రాజుల ప్రేమ పాత్రుడు ఔతాడు.


బుధుడు కుజ క్షేత్రమున ఉండి గురుని చేత చూడబడిన జాతకుడు సుఖవంతుడు, మంచి యౌవన వంతుడు,రోమములు అధికంగా కల వాడు, మంచి వెంట్రుకలు కలవాడు, మిక్కిలి ధనవంతుడు, జ్ఞాపక మరతి కలవాడు, పాపి ఔతాడు.


బుధుడు కుజ క్షేత్రమున ఉండగా శుక్రుని చేత చూడబడిన జాతకుడు రాజకార్యములను చేయు వాడు, అందగాడు, గణిత సాస్త్రములో మొదటి వాడు, చతురములగు వాక్యములు పలుకు వాడు, నమ్మకస్థుడు, స్త్రీలతో కూడి ఉండు వాడు ఔతాడు.


బుధుడు కుజక్షేత్రమున ఉండగా షని చేత చూడబడిన జాతకుడు మిక్కిలి దుఃఖితుడు, కోపము కలవాడు, హింసలను చేయు వాడు, బంధువులు లేని వాడు ఔతాడు.

బుధుడు శుక్రక్షేత్రము



బుధుడు శుక్రక్షేత్రమందు ఉండగా రవి చేత చూడబదగా జన్మించిన జాతకుడు దరిద్రము చేత దుఃఖితుడు, వ్యాది బాధితుడు, ఇతరులకు , ఈతరులకు ఉపచారము చేయు వాడు, జనుల చేత దిక్కరించ బడు వాడు ఔతాడు.




బుధుడు శుక్రక్షేత్రమందు ఉండగా చంద్రుని చేత చూడబడగా జన్మించిన జాతకుడు నమ్మకస్థుడు, మిక్కిలి ధనవంతుడు, ఆరోగ్యవంతుడు,గొప్ప కుటుంబమున జన్మించిన వాడు, ప్రసిద్ధుడు, మంత్రి ఔతాడు.


బుధుడు శుక్రక్షేత్రమందు ఉండగా కుజునిచేత చూడబడిన జన్మించిన జాతకుడు వ్యాధి పీడితుడు, శత్రువుల చేత బాధించ బడువాడు, రావమానం పొందువాడు, అన్ని దేశములనుండి బహిష్కృతుడు, కష్టములు కల వాడు ఔతాడు.


బుధుడు శుక్రక్షేత్రమందు ఉండగా గురుని చేత చూడబడిన జన్మించిన జాతకుడు ప్రాజ్ఞుడు, అందరి మాటలకు విలువ ఇచ్చు వాడు, ప్రసిద్ధుడు, దేశములకు, పట్టణములకు, వీధులకు అధిపతి ఔతాడు.


బుధుడు శుక్రక్షేత్రమందు ఉండగా శుక్రుని చేత చూడబడిన జన్మించిన జాతకుడు అందగాడు మృదువైన వాడు, సుఖవంతుడు, మంచి వస్త్రములు ,భూషణములు ధరించు వాడు , కన్యల హృదయ్ములను హరించు వాడు ఔతాడు.



బుధుడు శుక్రక్షేత్రమున ఉండగా శని చేత చూడబడిన జాతకుడు సుఖ హీనుడు, బంధువుల చేత బాధించ బడు వాడు, మలినుడు, వ్యాధి పీడితుడు, అనర్ధములను పొందు వాడు ఔతాడు.

బుధుడు స్వక్షేత్రము



బుధుడు స్వక్షేత్రమున ఉండి రవి చేత చూడబడిన జాతకుడు అర్ధవంతముగా మాటాడు వాడు,మధురమైన వాడు, రాజాభిమానం పొందిన వాడు, లోక హితుడు, పాలించు వాడు, సున్నిత మైన పనులు చేయు వాడు ఔతాడు.

బుధుడు స్వక్షేత్రమున ఉండి చంద్రుని చేత చూడబడిన జాతకుడు అతి భాషి, కలహపరాయణుడు, మదురమైన వాడు, అన్నింటా శుభం పొందు వాడు, దృఢ వ్రతుడు, శాస్త్రములందు ఆసక్తి కల వాడు ఔతాడు.


బుధుడు స్వక్షేత్రమున ఉండి కుజుని చేతచూడబడిన జాతకుడు గాయములు కలిగిన శరీరం కలవాడు, మలినుడు, ప్రతిభావంతుడు, రాజసేవకుడు, తనగృహమున ఉన్న వారి అభిమానం పొందు వాడు ఔతాడు.


బుధుడు స్వక్షేత్రమున ఉండి గురుని చేత చూడబడిన జాతకుడు మంత్రి, ప్రధమ పూజితుడు, వైభవము, పరివారము కలవాడు, నలుగురితో సమానుడు ఔతాడు.


బుధుడు స్వక్షేత్రమున ఉండి శుకౄని చేత చూడబడిన జాతకుడు ప్రాజ్ఞుడు, రాజ సేవకుడు, రాజ దూత, రాయబారి, దుష్ట స్త్రీలయందు ఆసక్తుడు ఔతాడు.


బుధుడు స్వక్షేత్రమున ఉండి శని చేత చూడబడిన జాతకుడు ఎల్లప్పుడూ ఉన్నత షానమున ఉండూ వాడు, అర్ధవంతమైన కార్యములు చేయుటలో ప్రధముడు, వస్త్రముల కొరత లేని వాడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రము



బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా రవి చేత చూడబడిన జాతకుడు రజకుడు, పుష్పమాలికలు, అమ్ము వాడు, గ్రహములు, వాస్తు శాస్త్రము తెలిసిన వాడు, రత్నపరీక్షకుడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా చందుని చేత చూడబడిన జాతకుడు స్త్రీల వలన నష్టమొదిన బలము కల వాడు, స్త్రీలకొరకై దుఃఖ పొందిన శరీరం కలవాడు, సుఖములు లేని వాడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా కునుని చేత చూడబడిన జాతకుడు స్వల్పంగా చదువుకొన్న వాడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా గురుని చేత చూడబడిన జాతకుడు , అతిగా మాటాడు వాడు, ఇతరుల సంతోషము కొరకు అబద్ధం పలుకు వాడు, ప్రజాపాలకుడు, చోరుడు, సాక్ష్యము చెప్పు వాడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా శుక్రుని చేత చూడబడిన జాతకుడు మన్మధుని వంటి ఆకృతి కలవాడు, ప్రియముగా మాట్లాడు వాడు, గానవాద్యములయందు ప్రజ్ఞ కల వాదు, సౌందర్యవంతుడు, మృదువైన వాడు ఔతాడు.

బుధుడు చంద్ర క్షేత్రమున (కటకమున)ఉండగా శని చేత చూడబడిన జాతకుడు అతిశయోక్తులు చెప్పు వాడు, పాపకార్యములు చేయు వాడు, బంధనముల చిక్కు వాడు, గుణహీనుడు, గురువులందు ద్వేషం కల వాడు ఔతాడు.

బుధుడు రవి క్షేత్రము



బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా రవి చేత చూడబడిన జాతకుడు ఇతరుల చేత సేవింపదగిన వాడు, మంచి గుణము, ధనము కల వాడు, హింసించు వాడు, నీచుడు, సంపద స్థిరముగా ఉండని వాడు, సిగ్గు లేని వాడు ఔతాడు.

బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా చంద్రుని చేత చూడబడిన జాతకుడు సౌందర్యవంతుడు, ధనవంతుడు, సదాచారసంపన్నుడు, కావ్యరచయిత, నాట్యము, గానము తెలిసిన వాడు,మిక్కిలి నేర్పరి ఔతాడు.

బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా కుజుని చేత చూడబడిన జాతకుడు నీచుడు, దుఃఖ్ పీడితుడు, గాయములు కల శరీరం కల వాడు, నేర్పు విలాసము అందము లేని వాడు, నపుంసకుడు ఔతాడు.

బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా గురుని చేత చూడబడిన జాతకుడు సుకుమారుడు, మిక్కిలి ప్రాజ్ఞుడు, నేర్పుగా మాటాడు వాడు, గొప్ప ఖ్యాతి కలవాడు, సేవకులు వాహనములు కల వాడు ఔతాడు.

బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా శుకృని చేత చూడబడిన జాతకుడు మిక్కిలి అందగాడు, ప్రియ భాషి, వాహనములు కలవాడు, మృదువైన వాడు, ధైర్యవంతుడు, రాజు కాని మంత్రి కాని కాగల వాడు.

బుధుడు రవి క్షేత్రమున (సింహమున)ఉండగా శని చేత చూడబడిన జాతకుడు ఉష్ణ ప్రకృతి, విశాలదేహం కల వాడు, స్వేదజలమున దుర్ఘంధం కలవాడు, మిక్కిలి దుఃఖవంతుడు, సుఖము లేని వాడు ఔతాడు.

బుధుడు గురు క్షేత్రము


బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా రవి చేత చూడబడిన జాతకుడు శూరుడు, దుఃఖితుడు, శాంతుడు ఔతాడు.బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా చంద్రి చేత చూడబడిన జాతకుడు లేఖకుడు, మిక్కిలి సుకుమారుడు, నలుగురి నమ్మకం అభిమానం పొందిన వాడు, గొప్ప కుటుంబము కల వాడు, సుఖవంతుడు, సంపన్నుడు ఔతాడు.

బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా కుజుని చేత చూడబడిన జాతకుడు వీధులకు, పట్టణములకు దొంగలకు, అరణ్యమునవషించు బోయిలకు అధిపతి కాగలడు, లేఖకుడు ఔతాడు.

బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా గురుని చేత చూడబడిన జాతకుడు ఉన్నత వంశస్థుడు, నిశితబుద్ధి, జ్ఞాపక శక్తి, సాటిలేని సౌందర్యము, పెద్దలు సముపార్జించిన జ్ఞానము, కోశాధికారి,లేఖకుడు ఔతాడు.

బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా శుకృని చేత చూడబడిన జాతకుడు కన్యలకు , యువకులకు గురువు, సుకుమారుడు, ధనవంతుడు, శౌర్యం కల వాడు ఔతాడు.


బుధుడు గురు క్షేత్రమున (సింహమున)ఉండగా శని చేత చూడబడిన జాతకుడు దుర్గములు, అరణ్యములందు ఆసక్తి కల వాడు, దుష్టశీలుడు, మిక్కిలి నీచుడు, అతి భోజి , బాధ్యతలను తప్పించుకొను వాడు ఔతాడు.

బుధుడు శని క్షేత్రము




బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా రవి చేత చూడబడిన జాతకుడు మల్లుడు, అతిసార రోగము కల వాడు, అతి భోజి, కఠినమైన వాడు, ప్రియ భాషి, ప్రసిద్ధుడు ఔతాడు.


బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా చంద్రుని చేత చూడబడిన జాతకుడు సంపన్నుడు, పుష్పములు, దుంపలు, మద్యము మొదలైన వ్యాపారం చేయు వాడు ,భయస్తుడు, నడ్చే శక్తి లేని వాడు ఔతాడు.


బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా కుజుని చేత చూడబడిన జాతకుడు దుడుకుగా మాట్లాడు వాడు, సుఖవంతుడు, సౌమ్యుడు, సిగ్గు , సోమరితనం కల వాడు ఔతాడు.


బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా గురుని చేత చూడబడిన జాతకుడు ధన ధాన్యములు విరివిగా కల వాడు, పట్టణముల గ్రామముల పూజింప బడు వాడు, సుఖవంతుడు, ప్రసిద్ధుడు ఔతాడు.


బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా శుక్రుని చేత చూడబడిన జాతకుడు కురూపి, దుష్టస్త్రీకి భర్త, అతి కాముకుడు, మిక్కిలి సంతానవంతుడు , బుద్ధి లేని వాడు ఔతాడు.


బుధుడు శని క్షేత్రమున (సింహమున)ఉండగా శని చేత చూడబడిన జాతకుడు కూలి చేయువాడు, పాపపు పనులు చేయు వాడు, దరిద్రుడు,దుఃఖితుడు , దీనుడు ఔతాడు.

నాభాస యోగాలు

నాభాస యోగాలు

నాభాస యోగములు ౩౨. అవి వరుసగా నౌక , చత్ర , కూట,కార్ముఖ, శృంగాటక, వజ్ర, దామపాళ,వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్దేందు,యవ, కేదార, గడ, విహగ, యుప, యుగ, శకట, శూల, రజ్జు, శక్తి, నల, గోళము అను నామములు కలవు. జాతకాలు ఈ యోగాలలో ఏదో ఒక దానికి సరి పోతాయి .

ముసల , రజ్జు, నల యోగములు ఆశ్రయ యోగములు.
గోళ, యగ, శూల, పాశ, వీణ, కేదార, దామని సఖ్యాయోగములు .
మాలా యోగములు దళ యోగములు. వీటిని ఆకృతి యోగాములని కూడా అంటారు.

నాభాస యోగ ఫలితాలు

ఆశ్రయ యోగములు సంకరం లేకుండా ఉన్నా ఎడలసౌఖ్యం లభించును. మిశ్రమముగా ఉన్నా ఫలితం శూన్యం. ఈ యోగ జాతకుడు సంత్రుప్తుడు, రాజ ధన ప్రాప్తుడు ఔతాడు.
సంఖ్యాయోగ జాతకుడు పరధనమును పొంది సౌఖ్యం పొంద కలడు.
దళ యోగమున పుట్టిన జాతకుడు సుఖ దుఃఖ్ములు సమముగా చూచు వాడు ఔతాడు.

నాభాస యోగ వివరణ


లగ్నము నుండి కేంద్రం వరకు ఏడు రాసులలో గ్రహములన్ని ఉన్న నౌకా యోగము అనబడును.
నాలుగవ రాసి నుండి ఉన్న ఎడల ఛత్ర యోగము అంటారు.
ఏడవ స్థానము నుండి కూట యోగం అంటారు.
దశమ నుండి ఉన్న కార్ముక యోగం అంటారు.
లగ్న కేంద్రం నుండి నాలుగు రాశుల అందు గ్రహములన్ని ఉన్న యుప అంటారు.
నాలుగవ స్థానం నుండి గ్రహములు ఉన్న శర యోగం అంటారు.
ఏడవస్థానం నుండి గ్రహములు అన్నియు ఉన్న శక్తి యోగం అంటారు.
దశమ రాశి నుండి ఉన్న దండ యోగం అంటారు.
నాలుగవ స్థానాం నుండి పదవ స్థానం వరకు అనగా ఏడుస్థానములు లోపల అలాగే ఏడవ స్థానం నుండి ఒకటవ స్థానం వరకు అంటే ఏడు స్తానాల లోపల ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
గ్రహములన్నీ లగ్నం నుండి నాలుగవ స్థానం వరకు కాని, నాలుగవ స్థానం నుండి ఏడవ స్థానం వరకు కాని, ఏడవష్తానం నుండి దశమ స్థానం వరకు కాని, దశమ స్థానం నుండి లగ్నం వరకు కాని ఉన్న గదా యోగం అంటారు.
లగ్నం మరియుఏడవ స్థానం లో శుభ గ్రహాలు ఉండి నాలుగవ మరియు దశమ స్థానాలలో పాప గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
లగ్నం ఏడవ స్థానంలో పాప గ్రహములు ఉండి దశమ చతుర్ధ స్థానాలలో శుభ గ్రహాలు ఉన్న యవ యోగం అంటారు
లగ్నం , నాలుగు ఏడు, పది స్థానాలలో మిశ్రమంగా గ్రహములు ఉన్న పద్మ యోగం అంటారు . ఈ నాలుగు స్థా నాలో మాత్రమే గ్రహములన్నీఉండాలి.ఈ యోగానికి శుభగ్రహాలన్ని ఒక రాశిలో అశుభ గ్రహాలన్ని ఒక రాశిలో ఉండాలి
ఒక రాసి లో , శుభ గ్రహాలన్నీ ఒక రాసిలో ఉంటే రాశులలో కానీ గ్రహములన్ని మిశ్రమంగా ఉన్న వాపి యోగం అంటారు.
గ్రహములన్నీ లగ్నంలో ఏడవ స్థానంలో ఉన్న శకట యోగం అంటారు.
గ్రహములన్నీ చతుర్ధ దశమంలో ఉన్న విహగ యోగం అంటారు.
గ్రహములన్నీ రెండవ , ఆరవ, పదవ స్థానాలలో లేక మూడవ, ఏడవ, ప్దకొడవ స్థాఆనాలలో లేక మూడవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానాల్ళొ ఉన్న వాల యోగం యోగం అంటారు.
గ్రహములన్నీ త్రికోణములందు అనగా లగ్నం, పంచమం, నవము స్థానాలలో ఉన్న శ్రంగాటక యోగం అంటారు.
గ్రహములన్నీ రాశ్యాంతర్గతులయిన అనగా మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ , పదకొండవ స్థానములలో ఉన్న చక్రయోగం అంటారు
గ్రహములన్నీ రెండవ, నాలుగవ, ఆరవ, ఎనిమిదవ, పదవ, పన్నెండవ స్థానమలో ఉన్న సముద్ర యోగం అంటారు.
గ్రహములన్ని ద్వి స్వభావ రాసుల అందు ఉన్నా నల యోగం అంటారు.
రవ్యాది ఏడు గ్రహములన్నీస్థిర రాశుల అందు ఉన్నా ముసల యాగం అంటారు.
రవ్యాది ఏడు గ్రహములన్నీచర రాశుల అందు ఉన్నా రజ్జు యాగం అంటారు
మూడు కేంద్రం ల అందు శుభ గ్రహములు అంటే చంద్రుడు కాకా మిగిలిన బుధ, గురు, శుక్రులు ఉన్నా దళాంఖ్య మాలా యోగం అంటారు.
రావ్యది ఏడు గ్రహాలు ఏదైనా ఒక రాసిలో ఉంటే గోళ యోగం అంటారు.
రవ్యాది ఏడు గ్రహాలురెండు రాసుల అందు ఉండిన యుగ యోగాం అంటారు.
రవ్యాది ఏడు గ్రహాలుమూడు రాసులు అందు ఉండిన శూల యోగం అంటారు.
రవ్యాది ఏడు గ్రహాలునాలుగు రాశుల అందు ఉన్నా కేదార యోగం శూల అంటారు.
రవ్యాది ఏడు గ్రహాలుఐదు రాసుల అందు ఉన్నా పాశ యోగం అంటారు .
రవ్యాది ఏడు గ్రహాలుఆరు రాశుల అందు ఉన్నా దామని యోగం అంటారు.
రవ్యాది ఏడు గ్రహాలుఏడు రాశుల అందు ఉన్నా వీణా యోగం అంటారు
మూడు కేంద్రం ల అందు రవి, కుజ, శనులు ఉన్నా దళాంఖ్య సర్ప యోగం అంటారు.

ద్విగ్రహయోగం

జనన కలమున రెండు గ్రహముల చేరిక ఉన్న జాతకుని గ్రహ చేరికను అనుసరించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రాశికి తగినట్లు స్తానానికి తగినట్లు ఫలితాలు మారుతూ ఉంటాయి.
రవి ఇతరగ్రహ కలయిక
ద్విగ్రహ యోగంలో రవి, చంద్రులు కలిసి ఉన్న జాతకుడు, స్త్రీ వశవర్తి , నీతి హీనుడు, కపటమెరిగిన వాడు, ధనికుడు, కార్యములందు నిపుణత కల వాడు.

రవి, కుజులు కలిసి ఉన్న జాతకుడు సాహసము, మూర్ఖత, బలము,సత్వము,అనృతము, పాపబుద్ధి కోపం మొదలైనవి కల వాడు, వధ అందు ఆసక్తి కలిగి ఉంటాడు.

రవి,బుధులు కలసి ఉన్నట్లయితే సేవ, అస్థిరమైన ధనం, యసస్సే ధనంగా కల వాడు,రాజ ప్రియుడు, పూజ్యుడు, సత్పురుషులలో శ్రేష్టుడు, బలము, రూపము, ద్రవ్యము కలవాడు ఔతాడు.

రవి,గురులు కలిసి ఇన్న జాతకుడు ధార్మికుడు, మంత్రి, బుద్ధిమంతుడు, మిత్రుల వలన ధనం ప్రాప్తించిన వాడు, ఉపాధ్యాయుడు ఔతాడు.

రవి,శుక్రులు కలిసి ఉన్నచో శస్త్ర విద్యలు మొదలైన వాటి అందు ప్రావిణ్యం కలవాడు, వార్ధక్యములో దృష్టి బలం లేని వాడు, నాట్య క్రియలు తెలిసిన వాడు వివాహానంతరం ధనం బంధువులు కలవాడు ఔతాడు.

రవి , శనులు కలిసి ఉన్న జాతకుడు స్వ దర్మమున ఆసక్తి కలవాడు, భార్యా పుత్రుల అందు ఖేదం కల వాడు ఔతాడు.
చంద్రుడు ఇతరగ్రహముల చేరిక

చంద్రుడు, కుజుడు కలసి ఉన్న జాతకుడు శూరుడు, రణరంగమున ప్రతాపం కలవాడు, బాహుయుద్ధం చేయు వాడు, రక్త హీనత కలవాడు, మత్తుడు, కపటం కలవాడు, ధర్మపన్నాలు వల్లించు వాడు ఔతాడు.

చంద్రుడు, బుధుడు కలిసి ఉన్న జాతకుడు కావ్య కథలురచన చేయుటలో నిపుణుడు. ధనికుడు, స్త్రీ జితుడు, ధర్మం అందు ఆసక్తి, చిరునవ్వు ముఖము కలవాడు, సుందరుడు ఔతాడు.

చంద్రుడు, గురువు కలిసి ఉన్న జాతకుడు స్థిరమైన మిత్రులు కల వాడు, ధనికుడు, దేవ బ్రాహ్మణ భక్తి కల వాడు, బంధువులను సత్కరించు వాడు ఔతాడు.

చంద్రుడు , శుక్రుడు కలిసి ఉన్న జాతకుడు పుష్ప మాలికలు, దేవతా వస్త్రాలు, పరిమళ ద్రవ్యములను అనుభవించు వాడు , వంశ శ్రేష్టుడు, కార్య విధులను తెలిసిన వాడు, మిక్కిలి నిర్లక్ష్యము, క్రయ విక్రయముల అందు నేర్పరి అగును.

చంద్రుడు, శని కలిసి ఉన్న జాతకుడు వ్రుద్దాంగానలను ప్రేమించు వాడు, గజములు, అశ్వములు కలవాడు, ధనము లేని వాడు , పరాజితుడు, జన వశ్యుడు ఔతాడు.
కుజుడు ఇతరగ్రహముల కలయిక

కుజుడు ,బుధుడు చేరిక ఉన్న జాతకుడు దుష్ట స్త్రీ సాంగత్యం కలవాడు, స్వల్ప ధనికుడు, సువర్ణము మొదలైనవి చేయువాడు, దుష్టులైన విధవ అంగనా సఖుడు, ఔషధం చేయుటలో నేర్పరి ఔతాడు.

కుజుడు, గురువు కలిసి ఉన్న జాతకుడు శిల్ప శాస్త్రం, వేద శాస్త్రం తెలిసిన వాడు, ధారణా శక్తి కల వాడు, బుద్ధిమంతుడు, మాటలలో నేర్పరి, అస్త్ర ప్రయోగంలో నేర్పరి శ్రేష్ట్రుడు అగును.

కుజుడు, శుక్రుడు కలయిక కలిగిన జాతకుడు పూజ్యుడు, సేనానాయకుడు, గణితజ్ఞుడు, పరస్త్రీ ఆసక్తుడు, కోపం కలవాడు, జూదము, అనృతం తెలిసిన వాడు ఔతాడు.

కుజుడు శనుల కలయిక ధాతువులతో ఇంద్రజాలము చేయుటలో ఘటికుడు, ప్రబలుడు, చొరవిద్యలో నేర్పరి, అనృతుడు , ధర్మ హీనుడు, సత్రములు విషము మొదలైన వాటితో మరణమును పొందు వాడు.

బుధుడు ఇతర గ్రహముల కలయిక

గురువు, బుధులు బుధుడు, గురువుల కలయిక ఉన్న జాతకుడు నాట్య విద్య తెలిసిన వాడు , ప్రాజ్ఞుడు, సంగీత శాస్త్రం తెలిసిన వాడు, బిద్ధిమంతుడు , సౌఖ్యం మొదలైన ఉత్తమ గుణములు కల వాడు ఔతాడు.

బుధుడు, శుక్రుడు గొప్ప ధనికుడు, నీతి తెలిసిన వాడు, మాట్లాడటంలో నేర్పరి, నీతి, శిల్పం, వేదాలు తెలిసిన వాడు, గానం, హాస్యం తెలిసిన వాడు, సౌక్యములను అనుభవించు వాడు.
బుధుడు, శని కలిసి ఉన్న జాతకుడు రుణ గ్రస్తుడు, డంభం కలవాడు, ఆహరం లేక తిరుగు వాడు, విస్తరించు వాడు , దేశ శుక్రుడు ఇతర, దేశ దిమ్మరి చేరిక అధికంగా తిరిగేస్వభావం కల వాడు, నేర్పరితనం కలవాడు ఔతాడు.
గురువు ఇతర గ్రహ కలయిక

గురువు శుక్రుడు చేరిక కలిగిన జాతకుడు విద్యచేత జీవించు వాడు, ధార్మికుడు, ప్రామాణికుడు, ఉన్నతమైన భార్య కల వాడు, బుద్ధిమంతుడు మొదలైన ఉన్నత గుణవంతుడు.
గురు శనులు చేరిక కలిగిన జాతకుడు శూరుడు, నగరాధిపతి, యశస్సు కల వాడు, సభలలో ప్రధానుడు.
శుక్రుడు ఇతర గ్రహముల చేరిక

శుక్ర శనుల కలయిక కలిగిన జాతకుడు చెట్లు కొట్టుట, చిత్రిక పట్టుట( కొయ్య శిల్పాలు చెక్కుట ), చిత్రమైన రాతి పనియందు సమర్ధుడు, బాహు యుద్ధము చేయువాడు, పశువులు కలవాడు ఔతాడు.

శుభావాసి యోగం శుభ వేసి యోగం ఉభాయచరియ యోగం

రవి యోగములు
రవికి పన్నెండవ స్థానమున చంద్రుడు కాక ఇతర గ్రహమున్నచో శుభావాసి యోగామనబడును. రవికి రెండవ స్థానమున చంద్రుడు కాక ఇతర గ్రహమున్న శుభ వేసి యోగానమనబడును. రవికి ఇరు వైపులా చంద్రుడు కాక ఇతర గ్రహములు ఉన్నా ఉహ్బయ చర యోగామనబడును.

శుభావేసి యోగం
శుభ వేసి యోగామము అందు పుట్టిన జాతకుడు మందదృష్టి, స్థిర వాక్కు, తిరస్కరింపబడిన వ్యాపారం కలవాడు అగును.

శుభ వేసి యోగమున రవికి రెండవ స్థానమున గురువు ఉన్నజాతకుడు ధనార్జన అందు ఆసక్తి, స్నేహితులు కలవాడు అగును.

శుభ వేసి యోగామండు శుక్రుడు ఉన్న భయము, అల్ప ఆరంభము కలవాడు అగును.

శుభ వేసి స్థానమున బుధుడు ఉన్నచో పనులు చేయు వాడు, సిగ్గు , బిడియము, దారిద్యము కలవాడు ఔతాడు.

వేసి స్థానమున సాని ఉండగా పుట్టిన జాతకుడు పరదారాసక్తుడు, పరాక్రమము కలవాడు, పాళీ పోయిన శరీరం కలవాడు ఔతాడు.

శుభ వాసి యోగం



శుభ వాసి యోగమున పుట్టిన జాతకుడు విరివిగా మాటాడు వాడు, జ్ఞాపక శక్తి కలవాడు, చూసి చూడనట్లు చూసే వాడు, విశాల దేహం, రాజతుల్యుడు, సాత్వికుడు అగును.

శుభ వాసి యోగమున గురువు ఉండగా పుట్టిన జాతకుడు ధైర్యము, ఓర్పు, వాక్కుల అందు నైపుణ్యము కలవాడుఔతాడు.

శుభ వాసి యోగమున శుక్రుడు ఉన్నచొ శూరుడు, గుణవంతుడు, యశస్వి ఔతాడు.

శుభ వాసి యోగమున బుధుడు ఉండగా పుట్టిన జాతకుడు ప్రియభాషి, సుందరుడు ఔతాడు.

శుభ వాసయోగమున కుజుడుడు ఉన్నచో యుద్ధము అందు ఖ్యాతి, యుక్తము కానిది మాటలాడు వాడు ఔతాడు.

శుభ వాసి యోగమున శని ఉన్నచో వ్యాపార స్వభావం, పర ద్రవ్యాపహరణ, గురుద్వేషి, వాడి కలిగిన పెద్ద కత్తి కలవాడు ఔతాడు.

ఉభయ చర యోగం

ఉభయ చర యోగమున పుట్టిన జాతకుడు సుందరుడు, విస్తారమైన దానం కల వాడు, విస్తారమైన సేవకులు కల వాడు, బందుపోషకుడు, రాజపుజ్యత కలవాడు, ఉత్సాహ వంతుడు, భోగములను అనుభవించు వాడు ఔతాడు.

సునఫాయోగం అనఫాయోగం దురధురాయోగం కేమద్రువ యోగం

చంద్ర సంబందితయోగాలు

సునఫా యోగం , అనఫాయోగం,డురుదురాయోగం చంద్ర గ్రహ సంబంధిత యోగం.
చంద్రునికి రెండవ స్థానములో గ్రహము ఉన్నచో దానిని సునఫా యోగం అంటారు. చంద్రునికి పన్నెండవ స్థానంలో గ్రాహు ఉన్నచో అనఫాయోగం అంటారు.చంద్రునికి ఇరు వైపులా గ్రహము ఉన్నచో దానిని దురధురాయోగం అంటారు. రవి ఉన్నచో యోగాకర్తలలో గణించ పడడు కాని రవి ఉంటే యోగానికి భంగం లేదు. చంద్రునికి ద్వితీయ ద్వదాశమున , లగ్నమునకు కేంద్రమున ఉన్నకుజాది గ్రహములు సూర్యాది గ్రహములతో కలవక లేక చూడ బడబడక ఉన్న దానిని కేమద్రువ యోగం అంటారు. కేమద్రువ యోగం దుఃఖకరం.

అయిదు యోగాలు
చంద్రునికి రెండవ స్థానంలో కాని పన్నెండవ స్థానంలో కాని ఒక గ్రహమున్నచో దానిని ఏక వికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో రెండు గ్రహములు ఉన్నచో ద్వివికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో మూడు గ్రహములు ఉన్నచో త్రి వికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో నాలుగు గ్రహములు ఉన్నచో కాతుర్వికల్ప యోగం అంటారు.

చంద్రునికి రెండవ స్థానంలో అయిదు గ్రహములు ఉన్నచో పంకా వికల్ప యోగం అంటారు. ముందుగా ఏక వికల్ప యోగాల వివరణ చూద్దాం.



చంద్ర యోగ ఫలములు

అనఫా యోగమున పుట్టిన జాతకుడు వివేకముతో మాటలాడు వాడు, ప్రభు సమానుడు, ధనము కలవాడు, యోగ్యుడు, సుఖ్యములను అనుభవించు వాడు.

సునఫా యోగమున పుట్టిన జాతకుడు ఐశ్వర్యం అనుభవించు వాడు, స్వరజిత దానం కలిగిన వాడు, ధర్మమూ, విద్య, యోగ్యమైన బుద్ధి, యశస్సు, శాంతం, సుఖం కలవదగును. రాజు లేక మంత్రి , లేక తత్సమాన పదివి కలుగును. ఇవి వ్రత్తిని అనుసరించి కలుగును.

దురుదురాయోగమున పుట్టిన జాతకుడు వాక్కు, బుద్ధి, పరాక్రమములచే ప్రసిద్ధుడు. స్వతంత్రుడు, ధనికుడు, కూడబెట్టక అనుభవించు వాడు, దాత, జనపోషకుడు, అగ్రేసరుడు అగును.
కేమద్రువయోగమున పుట్టిన జాతకుడు గ్రహము, భార్య, అన్నము మొదలైనవి లేని వాడు, దారిద్ర్యముచేత అధికముగా కలత చెందు వాడు.

సునఫా యోగము

సునఫాయోగము అందు చంద్రునికి రెండవ స్థానంలో కుజుడు ఉన్నచో కఠిన వాక్కు, దంభం, హింస, సేనదిపత్యం, విరోధం కలిగిన వాడు.

సునఫాయోగం అందు చంద్రునికి రెండవ స్థానమున బుధుడు ఉండగా పుట్టిన జాతకుడు వేద శాస్త్రజ్ఞుడు, ధార్మికుడు, కవి, మానధనుడు, సుందర శరీరం కల వాడు, సర్వజన ప్రియుడు.

సునఫాయోగమంమున చంద్రునికి రెండవ స్థానమున గురువు ఉండగా పుట్టిన జాతకుడు. సర్వసాస్త్రములు తెలిసిన వాడు, కుటుంబము, దానం కలిగిన వాడు, రాజు లేక రాజ ప్రియుడు అవుతాడు.

సునఫాయోగమున శుక్రుడు ఉన్నచో స్త్రీ, పశువులు ,ధనము, పశువులు మొదలైన ఐశ్వైర్యం పరాక్రమము, రాజసన్మానముకలవాడు అగును.

సునఫా యోగము అందు శని ఉండగా పుట్టిన జాతకుడు జన పూజితుడు , మంచి గుణవంతుడు, దానం, ధైర్యం కల వాడు , గోప్యముగా కార్యములు సాధించు వాడు ఔతాడు.

అనఫా యోగము

కుజుడు అనఫాయోగమున కుజుడు ఉన్నచో చోరాధిపతి , యుద్దోత్సాహి, క్రోధము మొదలైన ఉగ్ర స్వభావితుడుగా ఉంటాడు.

అనఫాయోగమున బుధుడు ఉన్నచో చిత్రలేఖనము అందు సమర్ధుడు, కవి, మధురముగా మాటాడు వాడు, సుందరమైన శరీరం కలవాడు ఔతాడు, రాజానుగ్రహమున ఐశ్వర్యం కలవాడు ఔతాడు.



అనఫాయోగమున గురువు ఉన్నచో గాంభీర్యం, సత్వము, మేధాశక్తి, రాజ పూజ్యత మొదలగు శుభ గుణ సంపన్నుడు ఔతాడు.



అనఫాయోగమున శుక్రుడు ఉండగా పుట్టిన జాతకుడు స్త్రిజన ఆకర్షితుడు , రాజప్రియుడు, భోగము, ఖ్యాతి, అందం, ధనము, కల వాడు అగును.



అనఫాయోగమున శని ఉన్నచో పొడవైన భుజములు కల వాడు, ఇంగిత జ్ఞానం కలవాడు, పాసు సమృద్ధి కలవాడు, మంచి గుణం కలవాడు, దుష్ట స్త్రీల అందు ఆసక్తి కలవాడు అగును.
దురధురా యోగము

దురధురా యోగమున చంద్రుడు బుధ కుజుల మద్య ఉన్నచో జాతకుడు అబద్ధం కల్లమాటలలో ఆసక్తి, మిక్కిలి ధనవంతుడు, నిపుణుడు, కపటం కలవాడు, లుబ్ధుడు, వృద్ధ స్త్రీలందు ఆసక్తి కలవాడు, కులశ్రేష్ట్రుడు అగును.


దురధురా యోగమున చంద్రుడు గురు కుజుల మద్య ఉన్నచో జాతకుడు దయకలవాడు, కులరక్షకుడు, సమర్ధుడు, సంగ్రహం అంటే ఆసక్తి కలవాడు అగును.


దురధురా యోగమున చంద్రుడు శుక్ర కుజుల మద్య ఉన్నచో సుందరుడు, కలహ ప్రియుడు, శుచి కలవాడు, యుద్దోత్సాహి, సమర్ధత కలవాడు.


దురధురా యోగమున చంద్రుడు శని కుజుల మద్య ఉన్నచో కుత్సిత భార్య కలవాడు, ఆర్జన అంటే ఆసక్తి కలవాడు, వ్యసనముచే తపన చెందు వాడు, లుబ్ధత్వము, శత్రువులు కల వాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ గురుల మధ్య ఉన్నజాతకుడు కవిత్వం, ధనము, ఖ్యాతి, త్యాగము మొదలగు గుణములు కవాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ శుక్రుల మద్య ఉన్న జాతకుడు ప్రియమైన మాటలు చెప్పువాడు, సుందరుడు, నృత్య గీతములు అంటే ఆసక్తి కలవాడు, సేవకులు కలవాడు, శూరుడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ,శనుల మద్య ఉన్న జాతకుడు స్వల్పమైన విద్య కలవాడు, ధనము అందు ఆసక్తి కలవాడు, సర్వజన విరోధి, దేశాటన అందు ఆసక్తి కలవాడుఅన్యులచే పూజింపబడువాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు గురు శుక్రుల మద్య ఉన్న జాతకుడు ధైర్యము, మేధా, శుర్యము, ఖ్యాతి , నీతి, రాజకార్యాసక్తి , బంగారము, రత్నములు కలవాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు గురు శనుల మద్య ఉన్న జాతకుడు విద్య, నిటి, జ్ఞానము, ప్రియ వాక్కులు కలవాడు ఔతాడు.శుక్రుడు చంద్రుడు శుక్ర శనుల మద్య ఉన్న జాతకుడు కుల శ్రేష్ట్రుడు, నిపుణుడు, దానం, రాజసన్మానము కలవాడు, స్త్రీలోలుడు ఔతాడు.

గ్రహ ఉచ్చ నీచ స్థానాలు మరి కొన్ని విశేషాలు

మూడు, ఆరు, పది, పదకొండు ఉపజయ స్థానాలు.
ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పన్నెండు అనుపజయ స్థానాలు.

రవికి సింహము, చంద్రునకు వృషభం, కుజునకు మేషం, బుధునకు కన్య, గురువుకు ధనుస్సు, శుక్రునకు తుల, శనికి కుంభం త్రికోణ రాశులు.

సూర్యునకు మేషం, చంద్రుడికి వృషభం, కుజునకు మకరం, బుధునకు కన్య, శుక్రునకు మీనం, గురువుకు కటకం, శనికి తుల ఉచ్చ రాశులు.



సూర్యునకు పది (౧౦) ,చంద్రుడికి (3) , కుజుడికి పద్దేనిమి(౧౮), బుధుడికి పదిహేను (15), శుక్రుడికి ఐదు (౫), గురువుకు పదిహేడు (17) , శనికి పది (10) పరమోచ భాగములు.



సూర్యుడికి తుల, చంద్రుడికి వృశ్చికం, కుజుడికి కటకం, బుధునకు మీనం, శుక్రుడికి కన్య, గురువుకు మకరం, శనికి మేషం నీచ రాశులు.



మీన, మేష, కుంభం, వృషభంలు పొట్టి రాశులు. మిధున, కటక, ధనుస్సు, మకరములు సమరాశులు, వృశ్చిక, కన్య, సింహ, తులరాశులు పొడుగు రాశులు.



కాల పురుషునకు సూర్యుడు ఆత్మ, చంద్రుడు మనస్సు, కుజుడు శక్తి, బుధుడు వాక్కు, గురువు జ్ఞాన సుఖములు, శుక్రుడు కామము, శని దుఃఖం



రవి చంద్రులు రాజులు, కుజుడు సేనాధిపతి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు, శని దాసుడు.



పూర్ణ చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు శుభ గ్రహములు, క్షీణ చంద్రుడు , రవి , కుజ , శని గ్రహములు పాప గ్రహములు.



స్త్రీలకు చంద్ర శుక్రులు, నపుంసకులకు బుధ శనులు, పురుషులకు రవి, కుజులు అధిపతులు.



బ్రాహ్మణులకు గురు శుక్రులు, క్షత్రియులకు రవి , వైశ్యులకు చంద్రుడు, సంకరజాటికి శని, శూద్రులకు బుధుడు అధిపతులు.



కుజుడు అగ్నికి, బుధుడు భూమికి, గురుడు అకాశాముకు, శుక్రుడు జలముకు, శని వాయువుకు అధిపతులు.



దేవస్థానమునకు రవి, సమిపభుమికి చంద్రుడు, అగ్ని సమీప భూమికి కుజుడు, క్రీడ ప్రదేశమునకు బుధుడు, ధనగారముకు గురువు, శాయనాగారమునకు శుక్రుడు, భుపరాగానికి శని అధిపతులు.



ముదుగు వస్త్రమునకు రవి,


బేసి రాశులు క్రూర రాశులు. అనగా మేషము, మిధునము, సింహము, తుల, ధనుస్సు, కుంభము రుర రాశులు. వీటిని పురుష రాశులని కూడా అంటారు.


సమరాశులు శుభ రాశులు. వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము శుభరాశులు. వీటిని స్త్రీ రాశులని కూడా అంటారు.


, మిధునము తూర్పు దిక్కున, కటకము,సింహము, కన్య దక్షిణ దిక్కున, తుల, వృశ్చికము, ధనుస్సు పడమటి దిక్కున, మకరము, కుంభము, మీనము ఉత్తర దిక్కున ఉంటాయి.
సర రాశులు లగ్నమైన బలవంతములు.


పశు రాశులు మేష ,వృషభ,సింహములు పడమట ఇంత ఉంటే బలమైనవి. ల పదవ స్థానమైతే బలమైనవి.కటక లగ్నానికి మేషము, వృషభ లగ్నానికి కుంభము, సింహానికి వృషభము దశమ స్థానంలో ఉంటాయి.


సప్తమ స్థానంలో ఉంటే బలమైనది . వృషభ లగ్నానికి వృశ్చికము సప్తమ స్థానము.
కటక,మకర, మీనములు నాల్గవ స్థానంలో ఉంటే బలమైనవి. మేష లగ్నానికి కటకము, తులా లగ్నానికి మకరము, ధనుర్లజ్ఞానికి మీనము నాల్గవ స్థానంలో ఉంటాయి.


కటక, మిధున,వృషభ, మేష, మైన, కుంభ రాశులు రాత్రియందు బలము కలవి. సింహము,కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు ,మకర రాశులుపగటి యందు బలము కలవి.


మేషము, వృషభము, కటకము, ధనుస్సు, మకరము షష్ఠ ఉదయ రాశులు. సింహ, కన్య, తులా, వృశ్చిక, కుంభ రాశులు శిర్శోదయ రాశులు. మీనము ఉభయ ఉదయ రాశి.


ఎ రాశి అయినా తన అధిపతితో చూడబడినను, చేరిక కలిగి ఉన్నా, మిత్ర గ్రహములతో చేరిక కలిగి ఉన్నా, చూడబడినను లేక బుధ, గురువులతో చేరిక కలిగి ఉన్నా , చూడబడినను అ గ్రహము బలము కలిగి ఉన్నట్లు భావిస్తారు.


శరీరము, ధనము, కనిష్ట సహోదర, బందు, పుత్ర, శత్రు, కళత్ర, ఆయుష్షు, భాగ్య, రాజ్య, లాభ, వ్యయములని పన్నెండు రాశులకు పేర్లు.


శక్తి, ధన, పరాక్రమ, గ్రహ, ప్రజ్ఞా, వరణ, మదన, రుద్ర, గురువు, మాన, భావ, వ్యయములని ద్వాదశాభావములకు పేర్లు.


లగ్న, చతుర్ధ, సప్తమ, దశమ రాశులు చతుష్టయం అంటారు.


అయిదవ తొమ్మిదవ రాశులకు త్రికోణ రాశులని పేరు.

అంగారక దోషం

వివాహసమయంలో వదుఉవారుల జాతకాలను పరిశీలించి సరి చూసి వివాహనిర్ణయం చేయడం భారతీయ అనేక కుటుంబాలలో ఆచారంగా ఉంది. ముఖ్యంగా అంగారక దోష పరిగణన అవశ్యం. వధువుకు అంగారకుని స్థితి భర్త
స్థితికి కారకత్వంగా జ్యోతిష్కులు భావిస్తారు. మొదటగా చూడ వలసినది అంగారకుని స్థానం.
౧. అంగారకుడు.
అంగారకుడు వధూవరుల జాతకంలో రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాలలో ఉంటే దోషంగా భావిస్తారు.
కొందరు రెండవ స్థానం మినహాయిస్తారు. 
౨. అంగారక దోషలలో మినహాయింపులు ఉంటాయి. అవి వరసగా
కుజుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు అది మిధున లేక కన్య రాసి అయినప్పుడు. ఇవి బుధుని స్థానాలుగా గుర్తించాలి.
అంగారకుడు నాలుగవ ఉన్నప్పుడు అది మేష రాసిగా ఉంటే. అంటే అంగారకుని స్వస్తనాలలో ఇది ఒకటి.
అంగారకుడు ఏడవ స్థానంలో ఉంది అది కర్కాటక రాసిగా కానీ మకర రాసిగా కానీ ఉంటే. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, మకర రాశికి శని అధిపతి.
అంగారకుడు ఎనిమిదవ స్థానంలో ఉండి అది మీనరాశిగా ఉంటే. మీన రాశి గురువు అధిపతి.
అంగారకుడు పన్నెండులో ఉండి అది వృషభ రాశి కాని, మీనరాశిగా కానీ ఉంటే. వృషభ, మీమరాశులకు అధిపతి.
అంగారకుడు కర్కాటక సింహలగ్నాలలో యోగకుజుడు ఔతాడు. కర్కాటకలగ్నానికి పదవస్థానం మేషం కనుక మేషానికి అంగారకుడు అధిపతి కనుక దోషం ఉండదు.సింహలగ్నానికి మేషం తొమ్మిదవ స్థానం మేషం కనుక మేషానికి అధిపతి అంగారకుడు కనుక ఈ రెండు లగ్నాలకు అంగారకదోషం ఉండదు.
కుంభలగ్న జాతకులకు అంగారకుడు నాలుగు మరియు ఎనిమిది స్థానాలలో ఉన్నప్పుడు. అంటే కుంభలగ్న జాతకులకు నాలుగు వృషభం, ఎనిమిది కన్య కనుక ఆ రెరండు స్థానాలలో అంగారక దోషం ఉండదు.
అంగారకుడు గురువు మరియు చంద్రులతో ఉన్నప్పుడు దోషం ఉండదు.
అంగారకుడు రవి, బుధ, శని, రాహువులతో కలసి ఉన్నప్పుడు దోషం లేదు.

రాశులు వాటి ఆకారాలు

జ్యోషశాస్త్రంలో భూమిని కేంద్రంగా చేసుకుని రాశులు నిర్ణయిస్తారు.భూమిని చుట్టి ఉన్న ఆకాశాన్ని 12 భాగాలుగా విభజిస్తే పన్నెండు రాశులు వస్తాయి. ఆయా భాగంలో ఉన్న నక్షత్ర సమూహాలకు ఒక ఊహా రేఖతో కలిపి వచ్చిన ఆకారాన్ని ఆయా రాశులకు నామాలుగా నిర్ణయించారు. ఆయా రాశులకు ఒక్కో నిర్ధిష్ఠమైన ఆకారాం నిర్ణయించారు ఆవిధం గా రూపొందించినట్లు,

మేషరాశి ఆకారం మేకను పోలి ఉంటుంది కనుక అది సహజరూపమైన మేక ఆకారం నిర్ణయించ బడింది.
వృషభరాశికి సహజరూపమైన ఎద్దు ఆకారం నిర్ణయించబడింది.
మిధునరాశికి ఒకచేత గధను ఒక చేత వీణను ధరించిన పురుషరూపం నిర్ణయించబడింది.
కటక రాశికి సహజసిద్ధమైన పీత (ఎండ్రకాయ) రూపం నిర్ణయించ బడింది.
సింహరాశికి సహజసిద్దమైన సింహం రూపం నిర్ణయించబడింది.
కన్యారాశికి నౌకలో ఉన్న స్త్రీ రూపం నిర్ణయించబడింది.
తులారాశికి త్రాసుధరించిన స్త్రీరూపం నిర్ణయించబడింది.
వృశ్చికరాశికి సహజసిద్ధమైన తేలు ఆకారం నిర్ణయించబడింది.
ధనస్సురాశికి వెనుక భాగం గుర్రం ముందుభాగం ధనస్సు రూపం నిర్ణంఅయించబడింది.
మకరరాశికి జింకతల కలిగిన రూపం నిర్ణయించబడింది.
కుంభరాశికి రిక్తకుంభాన్ని ధరించిన పురుషరూపం నిర్ణయించ
మీనరాశికి వ్యతిరేక దిశను చూస్తున్న రెండు చేపల ఆకారం నిర్ణయించబడింది.

నవాంశారంభ రాశులు.


మేషము, కటకము, తుల, మకరము.


మేష,సింహం, ధనస్సులకు మేషము ఆరంభ రాశి.అనగా మేషము మొదటి ద్రేక్కాణాధిపతి కాగా రెండవ ద్రేక్కాణానికి సింహం అధిపతి మూడవ ద్రేక్కాణానికి ధనస్సు అధిపతి.

కటక,వృశ్చిక, మీనరాశులకు కటకము ఆరంభరాసి. అనగా కటకము మొదటి ద్రేక్కాణానికి అధిపతి రెండవ ద్రేక్కాణానికి వృశ్చికము అధిపతి మూడవ ద్రేక్కాణానికి మీనము అధిపతి.

తులా కుంభం మిదునంకు తుల ఆరంభరాశి.తుల మొదటి ద్రేక్కాణానికి అధిపతి కాగా కుంభం రెండవ ద్రేక్కాణాధిపతి మూడవ ద్రేక్కాణానికి మిధునం .

మకర, వృషభ, కన్యా రాశులకు మకరము ఆరంభ రాశి.అంటే మకరము మొదటి ద్రేక్కాణాధిపతి కాగా రెండవద్రేక్కాణాధిపతి వృషభం మూడవ ద్రేక్కాణానికి కన్య అధిపతిగా ఉంటారు.

నవాంశలోని అధిపతులలో ఒక్కోరాశిలో ఒక్కొకరు వర్గోత్తమంగా ఉంటారు.



చరరాశులకు మొదటి ద్రేక్కాణాధిపతి.

స్థిరరాశులకు ఐదవ అధిపథి అంటే రెండవ ద్రేక్కాణాధిపతి.

ఉభయరాశులకు మూడవ ద్రేక్కాణాధిపతి.

జ్యోతిర్మార్గం

జ్యోతి అంటే వెలుగు. జ్యోతిషం వెలుగును ఆధారంగా చేసుకున్న పరచిన శాస్త్రం. అనేకులు విశ్వసించేది కొందరు విమర్శించేది. ఏది ఏమైనా దీనికీ విశ్వాసం మాత్రమే ఆధారం. ఇందులో గోకారం ఒక పధ్ధతి. గోళాల సంచారం ఆధారం చేసుకుని నిర్ణయించేది. ముందుగా రాశులు. ఇవి పన్నెండు.
సూర్యుని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం చేస్తారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశిలో ప్రవేసించే సమయం సంక్రమణగా వ్యవరిస్తారు. సూర్యుని చుట్టు భూమి చేసే భ్రమణాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే వచ్చినవే పన్నెండు రాసులు. ఒక్కక్క రాశిలో ప్రవేశించే సమయయంలో ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహాలలో ఉండే మార్పులను బట్టి అవి వేరు వేరు నక్షత్రాలని ప్రసినులు గుర్తించారు. అ నక్షత్ర సముహ ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయించారు. వాటిలో మొదటిది మేషం., రెండవది వృషభం, మూడవది మిధునం, నాల్గవది కటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, ధనుస్సు, పదవది మకరం, పదకొండవది కుంభం, పన్నెండు మీనం.
మేషం రాశిలో అశ్విని నక్షత్ర నాలుగు పదాలు, భరణి నక్షత్రలో నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రలో మొదటి పాదం కలసి తొమ్మిది పాదాలు.
వృషభ రాశిలో మిగిలిన మూడు పదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు ఉంటాయి.మిదునరాశిలో మృగశిరలోని రెండు పాదాలు, ఆరుద్రలోని నాలుగు పాదాలు, పునర్వసులోని మూడు పాదాలు ఉంటాయి.కటకరాశిలో పునర్వసు నక్షత్రంలోని నాల్గవ పాదం, పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి.సింహరాశిలో మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని నాలుగు పాదాలు , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని ఒక పాదం ఉంటాయి. కన్యారాశిలో ఉత్తరఫల్గుణి నక్షత్రంలోని మిగిలిన మూడు పాదాలు, హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు, చిత్త నక్ష త్రంలోని రెండు పాదాలు ఉంటాయి.తులారాశిలో చిత్తానక్ష త్రంలోని మిగిలిన రెండు పాదాలు, స్వాతి నక్ష త్రం లోని నాలుగు పాదాలు, విశాఖనక్ష త్రం లోని మూడు పాదం ఉంటాయివృశికరాశిలో విశాఖ నక్ష త్రం లోనిమిగిలిన ఒక్క పాదం , అనురాధ నక్ష త్రం లోనినాలుగు పాదాలు, జ్యేష్ట నక్ష త్రం లొనినాలుగు పాదాలు ఉంటాయి.ధనుసు రాశిలో మూలా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్ష త్రం లోని ఒక్క పాదం ఉంటాయి.మకరరాశిలో ఉత్తరాషాడలోని మిగిలిన మూడు పాదాలు, శ్రవణా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ధనిష్ఠ నక్ష త్రం లోని రెండు పాదాలు ఉంటాయి. కుంభ రాశిలో ధనిష్ఠ నక్ష త్రం లోని మిగిలిన రెండు పాదాలు, శతభిష నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్ష త్రం లోని మూడు పాదాలు ఉంటాయి.మినరాశిలో పుర్వభద్ర నక్ష త్రం లోని ఒక్క పాదం, ఉత్తరాభద్ర నక్ష త్రం లోని నాలుగు పాదాలు, రేవతి నక్ష తరం లోని నాలుగు పాదాలు ఉంటాయి.
ఇలా పన్నెండు రాశులలో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి.

Sunday, 14 June 2015

ప్రయాణాలు చేసే ముందు చదవవలసిన శ్లోకం



సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క రథ సారధి మరియు సలహాదారుడు. అతనికి వ్యాస మహర్షి ఇచ్చిన వరం వలన దూరంగా జరిగే సంఘటనలను దగ్గరగా చూడగల శక్తి (ఒక విధంగా 'దివ్య దృష్టి' లేదా 'దూర దృష్టి') ఉంది. అతడు కురుక్షేత్రం లో జరుగుతున్న సంగ్రామమును, కృష్ణార్జునుల మధ్య "భగవద్గీత" రూపంలో జరిగిన సంభాషణను అంధుడైన ధృత రాష్ట్రునకు కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాడు. కురు పితామహుడైన భీష్ముడు ధర్మ సందేహ నివృత్తికోసం సమీపించిన ధర్మ రాజుకు సమాధానాన్ని "విష్ణు సహస్రనామం" రూపం లో వివరిస్తాడు.ఈ స్తోత్రంలోని ఫలశ్రుతి లో సంజయుడు కృష్ణార్జునుల గొప్పతనాన్ని ఈ శ్లోక రూపంలో వివరిస్తాడు. 
        మా అమ్మ నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడకైనా దూర ప్రయాణం అవుతూ ఉంటే ఎప్పుడూ ఈ శ్లోకం గుర్తు చేసేది. ఒక సారి అమెరికా వచ్చినపుడు నాకు ఒక కాయితం మీద ఈ శ్లోకం వ్రాసి ఇచ్చింది. "ఎక్కడకైనా వెళ్ళే ముందు ఈ శ్లోకం చదువుకోరా, శుభం కలుగుతుంది" అని చెప్పింది మా అమ్మ.

సంజయ ఉవాచ:
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ

ప్రతి పదార్థము: 
యత్ర = ఎక్కడ; యోగేశ్వరః = యోగులకే యోగియైన, యోగేశ్వరుడైన; కృష్ణః = కృష్ణుడు; యత్ర = ఎక్కడ; పార్థో = పార్థుడు / అర్జునుడు; ధనుర్ధరః = ధనుర్దారియైన; తత్ర = అక్కడ; శ్రీ = సిరి; విజయః = విజయము; భూతిః = ఐశ్వర్యము; నీతిః = నీతియును; మతిః = అభిప్రాయము; ధృవా = స్థిరముగా; మమ = నా యొక్క.

తాత్పర్యము:  సంజయుని పలుకులు: "ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడ ధనుర్దారియైన అర్జునుడు ఉందురో, అక్కడ సిరి, విజయము, ఐశ్వర్యము, నీతి స్థిరముగా ఉండునని నా యొక్క అభిప్రాయము" అని సంజయుడు చెప్పెను. 

యద్యదాచరతి శ్రేష్ఠః: తాత్పర్యం


యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః 
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

పద విచ్చేదన: యద్ + యద్ + ఆచరతి + శ్రేష్ఠః + తద్ + తద్ + ఏవ + ఇతరః + జనః + స + యత్ + ప్రమాణః +కురుతే + లోకః + తద్ + అనువర్తతే

ప్రతి పదార్ధము: 
యద్ = ఏది; యద్ = ఏది; యద్యద = ఏవేవి;  ఆచరతి = ఆచరించునో; శ్రేష్ఠః  = శ్రేష్టుడు, ఉత్తముడు, ఉన్నతుడు; తత్తదేవ = తద్ + తద్ + ఏవ;  తద్ = దానిని; తద్ = దానిని; తత్త = ఆయా వాటిని; ఏవ = కేవలం, మాత్రము;  ఇతరః = ఇతరులైన;  జనః = జనులు; స = కలసి; యత్ = ఏదైతే;  ప్రమాణం = ప్రమాణము, కొలబద్ద; కురుతే = తీసుకోనునో; లోకః = లోకము; తద్ = ఆవిధంగా; అనువర్తతే = అనుసరించును.

తాత్పర్యం: ఉత్తములు ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు. లోకము కూడా ఆ విధముగా అనుసరించును.

వసుదేవ సుతం దేవం శ్లోకం ప్రతి పదార్థము,తాత్పర్యం


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 

ప్రతి పదార్థము: వసుదేవ = వసుదేవుడు (శ్రీ కృష్ణుని తండ్రి); సుతం = కొడుకు; కంస = కంసుడు (కృష్ణుని మేనమామ); చాణూర = చాణూరుడు (కంసుని ఆస్థాన మల్లయోధుడు); మర్దనం = చంపిన వాడు; దేవకీ = కృష్ణుని తల్లి అయిన దేవకీ దేవి; పరమ = మిక్కిలి; ఆనందం = సంతోషం; కృష్ణం = కృష్ణుని; వందే = నమస్కరింతును; జగత్ = ప్రపంచము; గురుం = గురువుని.

తాత్పర్యం: వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.

సులభంగా పారాయణం చేయగల నవగ్రహ శ్లోకం: తాత్పర్యం



గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. 

ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు.  రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి.  నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.

నవగ్రహ శ్లోకం:
నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

ప్రతి పదార్ధం: నమః = నమస్కారం;  సూర్యాయ = సూర్య గ్రహమునకు; చంద్రాయ = చంద్రగ్రహమునకు; మంగళాయ = మంగళ గ్రహమునకు; చ = మరియు; గురుః = గురు గ్రహానికి; శుక్రః = శుక్ర గ్రహానికి; శనిభ్యః = శని గ్రహమునకు; రాహుః = రాహువునకు; కేతవః = కేతువునకు; నమః = నమస్కారము.

తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు. 

మహిషాసురమర్దిని స్తోత్రం - పద విభాగంతో పారాయణానికి అనువుగా



అయి గిరినందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని, నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హే! శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 01 ||

సురవర వర్షిణి, దుర్ధర ధర్షిణి, దుర్ముఖ మర్షిణి, హర్షరతే
త్రిభువన పోషిణి, శంకర తోషిణి, కిల్బిష మోషిణి, ఘోషరతే |
దనుజ నిరోషిణి, దితిసుత రోషిణి, దుర్మద శోషిణి, సింధుసుతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 02 ||

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 03 ||

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపుగజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే |
నిజభుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 04 ||

అయిరణ దుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే |
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 05 ||

అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే |
దుమిదుమి తామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 06 ||

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర శతే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే |
శివశివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 07 ||

ధనురనుసంగ రణక్షణ సంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే |
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బహు రంగ రటద్బటుకే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||               || 08 ||

జయ జయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
భణభణ భింజిమి భింకృత నూపుర శింజిత మోహిత భూత పతే |
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 09 ||

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్ర వృతే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 10 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్ల రతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే |
సిత కృత పుల్లి సముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||             || 11 ||

 మహిషాసురమర్దిని స్తోత్రమ్ - రెండవ భాగం


అవిరళ గండ గలన్మద మేదుర మత్త మతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే |
అయి సుదతీ జన లాలస మానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||                  || 12 ||

కమల దళామల కోమల కాంతి కలా కలితామల భాల లతే
సకల విలాస కళా నిలయక్రమ కేళి చలత్కల హంస కులే |
అలికుల సంకుల కువలయ మండల మౌలిమి లద్భ కులాలి కులే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 13 ||

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పులింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజ గతే |
నిజగుణ భూత మహా శబరీ గణ సద్గుణ సంభృత కేళి తలే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 14 ||

కటి తట పీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్ర రుచే
ప్రణత సురాసుర మౌలి మణిస్ఫుర దంశుల సన్నఖ చంద్ర రుచే |
జిత కనకాచల మౌళి పదోర్జిత నిర్భర కుంజర కుంభ కుచే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||             || 15 ||

విజిత సహస్ర కరైక సహస్ర కరైక సహస్ర కరైక నుతే
కృత సుర తారక సంగర తారక సంగర తారక సూను సుతే |
సురథ సమాధి సమాన సమాధి సమాధి సమాధి సుజాత రతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 16 ||

పద కమలం కరుణా నిలయే వరి వస్యతి యోనుదినం స శివే
అయి కమలే కమలా నిలయే కమలా నిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరం పదమిత్య నుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 17 ||

కనక లసత్కల సింధు జలైరను సించినుతే గుణ రంగ భువం
భజతి స కిం న శచీ కుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్ |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||             || 18 ||

తవ విమలేందు కులం వదనేందు మలం సకలం నం కూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే |
మమ తు మతం శివనామ ధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||             || 19 ||

అయి మయి దీన దయాళు తయా కృపయైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జనమీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే |
యదు చిత మత్ర భవత్యురరీ కురుతా దురుతా పమపా కురుతే
జయ జయ హే! మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ||              || 20 ||

|| ఇతి ఆది శంకరాచార్య విరచిత శ్రీమహిషాసురమర్దినిస్తోత్రం సంపూర్ణమ్ ||

ఆది శంకరాచార్య కృత నిర్వాణ షట్కము



జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు.  నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.    

 శివోహమ్ శివోహమ్ శివోహమ్

                         1. మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
                            న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
                            న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
                            చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
                            శివోహమ్ శివోహమ్ శివోహమ్

                       2.  న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
                           న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
                           న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
                           చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
                           శివోహమ్ శివోహమ్ శివోహమ్


                      3.  న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
                           మదో నైవ మే నైవ మాత్సర్య భావః
                           న ధర్మో న చార్థో న కామో న మోక్షః
                           చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
                           శివోహమ్ శివోహమ్ శివోహమ్


                     4.  న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ 
                         న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః  
                         అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
                         చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)   
                                                శివోహమ్ శివోహమ్ శివోహమ్

                    5.  న మే మృత్యు శంకా న మే జాతి భేదః
                         పితా నైవ మే నైవ మాతా న జన్మః
                         న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
                         చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)                
                         శివోహమ్ శివోహమ్ శివోహమ్

                   6.   అహం నిర్వికల్పో నిరాకార రూపో
                         విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
                         న చాసంగత నైవ ముక్తిర్ న మేయః
                         చిదానంద రూపః శివోహమ్ శివోహమ్  (2)                

                                                శివోహమ్ శివోహమ్ శివోహమ్


మంగళ శ్లోకం - సర్వ మంగళ మాంగళ్యే ( ప్రతి పదార్థము - తాత్పర్యము)


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.   

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

సూర్య శ్లోకం ( ప్రతి పదార్ధం - తాత్పర్యం )



సూర్య శ్లోకం 
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం 
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం 

ప్రతి పదార్ధం: జపాకుసుమం = మందార పువ్వు; సంకాశం = ఒప్పియుండు, వలె నుండు; కాశ్యపేయం = కశ్యపుని తనయుడు; మహా = మిక్కిలి; ద్యుతిం = కాంతి వంతమైన; తమోరిం = తమః + అరిం; తమః = చీకటి, తమస్సు; అరిం = శత్రువును; సర్వ = అన్ని; పాపఘ్నం = పాపములను దహించువాడు; ప్రణతోస్మి = నమస్కారము, ప్రణామము; దివాకరం = సూర్యునికి.

తాత్పర్యం: మందార పువ్వు వంటి ఎర్రని రంగు గలవాడు, కశ్యప ప్రజాపతి పుత్రుడు, మిక్కిలి కాంతివంతమైన వాడు, చీకటికి శత్రువు, సమస్త పాపములను దహింప జేయువాడు అయిన సూర్యునకు నమస్కారం.