Pages

Wednesday, 17 June 2015

సునఫాయోగం అనఫాయోగం దురధురాయోగం కేమద్రువ యోగం

చంద్ర సంబందితయోగాలు

సునఫా యోగం , అనఫాయోగం,డురుదురాయోగం చంద్ర గ్రహ సంబంధిత యోగం.
చంద్రునికి రెండవ స్థానములో గ్రహము ఉన్నచో దానిని సునఫా యోగం అంటారు. చంద్రునికి పన్నెండవ స్థానంలో గ్రాహు ఉన్నచో అనఫాయోగం అంటారు.చంద్రునికి ఇరు వైపులా గ్రహము ఉన్నచో దానిని దురధురాయోగం అంటారు. రవి ఉన్నచో యోగాకర్తలలో గణించ పడడు కాని రవి ఉంటే యోగానికి భంగం లేదు. చంద్రునికి ద్వితీయ ద్వదాశమున , లగ్నమునకు కేంద్రమున ఉన్నకుజాది గ్రహములు సూర్యాది గ్రహములతో కలవక లేక చూడ బడబడక ఉన్న దానిని కేమద్రువ యోగం అంటారు. కేమద్రువ యోగం దుఃఖకరం.

అయిదు యోగాలు
చంద్రునికి రెండవ స్థానంలో కాని పన్నెండవ స్థానంలో కాని ఒక గ్రహమున్నచో దానిని ఏక వికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో రెండు గ్రహములు ఉన్నచో ద్వివికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో మూడు గ్రహములు ఉన్నచో త్రి వికల్ప యోగం అంటారు.


చంద్రునికి రెండవ స్థానంలో నాలుగు గ్రహములు ఉన్నచో కాతుర్వికల్ప యోగం అంటారు.

చంద్రునికి రెండవ స్థానంలో అయిదు గ్రహములు ఉన్నచో పంకా వికల్ప యోగం అంటారు. ముందుగా ఏక వికల్ప యోగాల వివరణ చూద్దాం.



చంద్ర యోగ ఫలములు

అనఫా యోగమున పుట్టిన జాతకుడు వివేకముతో మాటలాడు వాడు, ప్రభు సమానుడు, ధనము కలవాడు, యోగ్యుడు, సుఖ్యములను అనుభవించు వాడు.

సునఫా యోగమున పుట్టిన జాతకుడు ఐశ్వర్యం అనుభవించు వాడు, స్వరజిత దానం కలిగిన వాడు, ధర్మమూ, విద్య, యోగ్యమైన బుద్ధి, యశస్సు, శాంతం, సుఖం కలవదగును. రాజు లేక మంత్రి , లేక తత్సమాన పదివి కలుగును. ఇవి వ్రత్తిని అనుసరించి కలుగును.

దురుదురాయోగమున పుట్టిన జాతకుడు వాక్కు, బుద్ధి, పరాక్రమములచే ప్రసిద్ధుడు. స్వతంత్రుడు, ధనికుడు, కూడబెట్టక అనుభవించు వాడు, దాత, జనపోషకుడు, అగ్రేసరుడు అగును.
కేమద్రువయోగమున పుట్టిన జాతకుడు గ్రహము, భార్య, అన్నము మొదలైనవి లేని వాడు, దారిద్ర్యముచేత అధికముగా కలత చెందు వాడు.

సునఫా యోగము

సునఫాయోగము అందు చంద్రునికి రెండవ స్థానంలో కుజుడు ఉన్నచో కఠిన వాక్కు, దంభం, హింస, సేనదిపత్యం, విరోధం కలిగిన వాడు.

సునఫాయోగం అందు చంద్రునికి రెండవ స్థానమున బుధుడు ఉండగా పుట్టిన జాతకుడు వేద శాస్త్రజ్ఞుడు, ధార్మికుడు, కవి, మానధనుడు, సుందర శరీరం కల వాడు, సర్వజన ప్రియుడు.

సునఫాయోగమంమున చంద్రునికి రెండవ స్థానమున గురువు ఉండగా పుట్టిన జాతకుడు. సర్వసాస్త్రములు తెలిసిన వాడు, కుటుంబము, దానం కలిగిన వాడు, రాజు లేక రాజ ప్రియుడు అవుతాడు.

సునఫాయోగమున శుక్రుడు ఉన్నచో స్త్రీ, పశువులు ,ధనము, పశువులు మొదలైన ఐశ్వైర్యం పరాక్రమము, రాజసన్మానముకలవాడు అగును.

సునఫా యోగము అందు శని ఉండగా పుట్టిన జాతకుడు జన పూజితుడు , మంచి గుణవంతుడు, దానం, ధైర్యం కల వాడు , గోప్యముగా కార్యములు సాధించు వాడు ఔతాడు.

అనఫా యోగము

కుజుడు అనఫాయోగమున కుజుడు ఉన్నచో చోరాధిపతి , యుద్దోత్సాహి, క్రోధము మొదలైన ఉగ్ర స్వభావితుడుగా ఉంటాడు.

అనఫాయోగమున బుధుడు ఉన్నచో చిత్రలేఖనము అందు సమర్ధుడు, కవి, మధురముగా మాటాడు వాడు, సుందరమైన శరీరం కలవాడు ఔతాడు, రాజానుగ్రహమున ఐశ్వర్యం కలవాడు ఔతాడు.



అనఫాయోగమున గురువు ఉన్నచో గాంభీర్యం, సత్వము, మేధాశక్తి, రాజ పూజ్యత మొదలగు శుభ గుణ సంపన్నుడు ఔతాడు.



అనఫాయోగమున శుక్రుడు ఉండగా పుట్టిన జాతకుడు స్త్రిజన ఆకర్షితుడు , రాజప్రియుడు, భోగము, ఖ్యాతి, అందం, ధనము, కల వాడు అగును.



అనఫాయోగమున శని ఉన్నచో పొడవైన భుజములు కల వాడు, ఇంగిత జ్ఞానం కలవాడు, పాసు సమృద్ధి కలవాడు, మంచి గుణం కలవాడు, దుష్ట స్త్రీల అందు ఆసక్తి కలవాడు అగును.
దురధురా యోగము

దురధురా యోగమున చంద్రుడు బుధ కుజుల మద్య ఉన్నచో జాతకుడు అబద్ధం కల్లమాటలలో ఆసక్తి, మిక్కిలి ధనవంతుడు, నిపుణుడు, కపటం కలవాడు, లుబ్ధుడు, వృద్ధ స్త్రీలందు ఆసక్తి కలవాడు, కులశ్రేష్ట్రుడు అగును.


దురధురా యోగమున చంద్రుడు గురు కుజుల మద్య ఉన్నచో జాతకుడు దయకలవాడు, కులరక్షకుడు, సమర్ధుడు, సంగ్రహం అంటే ఆసక్తి కలవాడు అగును.


దురధురా యోగమున చంద్రుడు శుక్ర కుజుల మద్య ఉన్నచో సుందరుడు, కలహ ప్రియుడు, శుచి కలవాడు, యుద్దోత్సాహి, సమర్ధత కలవాడు.


దురధురా యోగమున చంద్రుడు శని కుజుల మద్య ఉన్నచో కుత్సిత భార్య కలవాడు, ఆర్జన అంటే ఆసక్తి కలవాడు, వ్యసనముచే తపన చెందు వాడు, లుబ్ధత్వము, శత్రువులు కల వాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ గురుల మధ్య ఉన్నజాతకుడు కవిత్వం, ధనము, ఖ్యాతి, త్యాగము మొదలగు గుణములు కవాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ శుక్రుల మద్య ఉన్న జాతకుడు ప్రియమైన మాటలు చెప్పువాడు, సుందరుడు, నృత్య గీతములు అంటే ఆసక్తి కలవాడు, సేవకులు కలవాడు, శూరుడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు బుధ,శనుల మద్య ఉన్న జాతకుడు స్వల్పమైన విద్య కలవాడు, ధనము అందు ఆసక్తి కలవాడు, సర్వజన విరోధి, దేశాటన అందు ఆసక్తి కలవాడుఅన్యులచే పూజింపబడువాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు గురు శుక్రుల మద్య ఉన్న జాతకుడు ధైర్యము, మేధా, శుర్యము, ఖ్యాతి , నీతి, రాజకార్యాసక్తి , బంగారము, రత్నములు కలవాడు ఔతాడు.


దురధురా యోగమున చంద్రుడు గురు శనుల మద్య ఉన్న జాతకుడు విద్య, నిటి, జ్ఞానము, ప్రియ వాక్కులు కలవాడు ఔతాడు.శుక్రుడు చంద్రుడు శుక్ర శనుల మద్య ఉన్న జాతకుడు కుల శ్రేష్ట్రుడు, నిపుణుడు, దానం, రాజసన్మానము కలవాడు, స్త్రీలోలుడు ఔతాడు.