Pages

Wednesday, 5 August 2015

కర్మయోగః 3 (అథ తృతీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


తస్మాదసక్త స్సతతం
కార్యం కర్మ సమాచర,‌
అసక్తోహ్యాచరన్‌ కర్మ
పర మాప్నోతి పూరుషః‌.


కాబట్టి నీవు సంగము (ఫలాపేక్ష) లేనివాడవై, చేయదగిన కర్మను ఎల్లపుడును చక్కగ చేయుచుండుము. అసక్తుడై కర్మ నాచరించు మనుజుడు (క్రమముగ) మోక్షము నొందుచున్నాడు.

*******************************************************************************************  19

కర్మణైవ హి సంసిద్ధి
మాస్థితా జనకాదయః,
లోకసంగ్రహ మేవాపి
సంపశ్యన్‌ కర్తు మర్హసి‌.


జనకుడు మున్నగువారు నిష్కామకర్మము చేతనే మోక్షమును బొందిరి. జనులను సన్మార్గమున ప్రవర్తింపజేయు నుద్దేశ్యముచేనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు.

*******************************************************************************************  20

యద్యదాచరతి శ్రేష్ఠ
స్తత్త దేవేతరో జనః,
స యత్ర్పమాణం కురుతే
లోక స్తదనువర్తతే.


గొప్పవా డేకర్మను చేయునో దానినే తక్కినవారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగగైకొనునో, తక్కినవారును దానినే అనుసరింతురు..

*******************************************************************************************  21

న మే పార్థాస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కించన,
నానవాప్త మవాప్తవ్యం
వర్త ఏవ చ కర్మణి‌.


అర్జునా! నా కీ మూడులోకములందును చేయదగిన కార్యమేదియును లేదు. మఱియు పొందబడనిదియు, పొందదగినదియునగు వస్తువును ఏదియులేదు. అయినను నేను కర్మమందు ప్రవర్తించుచునేయున్నాను.

*******************************************************************************************  22

యది హ్యహం న వర్తేయం
జాతు కర్మణ్యతంద్రితః,
మమ వర్త్మానువర్తంతే
మనుష్యాః పార్థ సర్వశః.


ఏలయనగా, అర్జునా! నేనెల్లప్పుడును జాగరూకుడనై కర్మమందు ప్రవర్తింపక పోయినచో, మనుష్యులు సర్వవిధముల నాయొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు.

*******************************************************************************************  23

ఉత్సీదేయు రిమే లోకా
న కుర్యాం కర్మచేదహమ్‌,
సంకరస్య చ కర్తా స్యా
ముపహన్యామిమాః ప్రజాః‌


మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తఱి సంఘమునం దేర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టినవాడ నగుదును.

*******************************************************************************************  24

సక్తాః కర్మణ్యవిద్వాంసో
యథా కుర్వంతి భారత!
కుర్యా ద్విద్వాం స్తథాసక్త
శ్చికీర్షు ర్లోకసజ్గ్రహమ్‌.


ఓ అర్జునా! అజ్ఞానులు కర్మలందు తగుల్కొని ఫలాపేక్షతో నేప్రకారము చేయుచున్నారో, ఆ ప్రకారమే జ్ఞానులు వానియందుతగుల్కొనక ఫలాసక్తిరహితులై లోకకల్యాణము నిమిత్తము కార్యముల నాచరించవలెను.

*******************************************************************************************  25

న బుద్ధిభేదం జనయే
దజ్ఞానాం కర్మసజ్గినామ్‌,
జోషయేత్సర్వకర్మాణి
విద్వాన్యుక్తః సమాచరన్‌.


జ్ఞానియగువాడు కర్మఫలాసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మల నాచరించుచు, తన యాచరణనుజూచి వారును ఆ ప్రకార మనుష్ఠించునట్లు చేయవలెను.

*******************************************************************************************  26

ప్రకృతేః క్రియమాణాని
గుణైః కర్మాణి సర్వశః,
అహంకార విమూఢాత్మా
కర్తాహ మితి మన్యతే


ప్రకృతివలన బుట్టిన సత్త్వరజస్తమోగుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా, అహంకారముచే వివేకశూన్యమైన మనస్సుగలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు.

*******************************************************************************************  27