Pages

Saturday, 8 August 2015

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః 4 ( అథ త్రయోదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యదా భూత పృథగ్భావ
మేకస్థ మనుపశ్యతి,
తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సంపద్యతే తదా.


ఎవడు వేఱ్వేరుగనున్న ఈ భూత ప్రపంచమంతను ఒక్కదానియందు (పరమాత్మయందు) ఉన్న దానిగను, మఱియు దానినుండియే విస్తరించుచున్నదానిగను వీక్షించునో, అపుడు (మనుజుడు) బ్రహ్మనును పొందుచున్నాడు. (లేక బ్రహ్మముగనే అగుచున్నాడు.).

******************************************************************************************* 31

అనాదిత్వాన్నిర్గుణత్వా
త్పరమాత్మాయ మవ్యయః,
శరీరస్థోపి కౌంతేయ
న కరోతి న లిప్యతే.


ఓ అర్జునా! ఆదిలేనివాడు (కారణరహితుడు) అగుచేతను, (త్రి) గుణరహితుడగుటచేతను, ఈ పరమాత్మ శరీరమందున్నప్పటికిని ఏమియు చేయకయు, దేనిచేతను అంటబడకయు నున్నాడు.

******************************************************************************************* 32

యథా సర్వగతం సౌక్ష్మ్యా
దాకాశం నోపలిప్యతే,
సర్వత్రావస్థితో దేహే
తథా త్మానోపలిప్యతే.


సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన ఏ ప్రకారము (ధూళి మున్నగువానిచే) అంటబడదో, ఆ ప్రకారమే శరీరమంతటను (లేక సకలశరీరములందును) వెలయుచున్న పరమాత్మ (శరీర గుణదోషములచే) అంటబడకయున్నాడు.

******************************************************************************************* 33

యథా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః,
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం
ప్రకాశయతి భారత.


ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్తక్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు.

******************************************************************************************* 34

క్షేత్రక్షేత్రజ్ఞ యోరేవ
మంతరం జ్ఞానచక్షుషా,
భూతప్రకృతిమోక్షం చ
యే విదుర్యాంతి తే పరమ్‌.


ఎవరు జ్ఞానదృష్టిచేత ఈ ప్రకారముగ క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించియుండు (లేక, కారణమైన) ప్రకృతి (అవిద్య) నుండి విముక్తిని కలుగజేయు ఉపాయమును తెలిసికొందురో వారు పరమాత్మపదమును (మోక్షమును) బొందుదురు.

******************************************************************************************* 35


ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగోనామ, త్రయోదశోధ్యాయః