Pages

Saturday, 23 March 2013

శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు...

మహిమాన్వితుడైన శ్రీ కృష్ణుడు తన కృష్ణావతారంలో మూడుసార్లు విశ్వరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. 

అందులో కౌరవ సభ ఒకటైతే.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసే సమయం, దానకర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడిచే సందర్భాన కృష్ణ పరమాత్మ విశ్వరూపమెత్తినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

అందుచేత మానవుని రూపంలో జన్మించి, నవభారత నిర్మాణానికి సూత్రధారి అయిన ఆ దేవదేవుని శ్రీ కృష్ణాష్టమి రోజున ప్రార్థించేవారికి తెలియక చేసిన పాపాలు హరించిపోతాయని పురోహితులు అంటున్నారు. 

అంతేగాకుండా.. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంకా కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణ నామ స్మరణ, భజన చేసేవారికి వైకుంఠవాసం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.