Pages

Saturday, 23 March 2013

ద్వారక - భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం

ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను "సప్త పురిస్"(ఏడూ పవిత్ర నగరాలు) లో ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలలో భావించబడే ఏకైక నగరం ఈ ద్వారక.


పౌరాణిక సంబంధం భగవంతుడు శ్రీ కృష్ణుడు మేనమామ మథుర రాజు అయిన కంసుని చంపటం వల్ల, కంసుని మామ అయిన జరాసంధునికి యాదవులకు ఎడతెగని శత్రుత్వం ఏర్పడింది. జరాసంధుడు కృష్ణుని చంపటానికి పదిహేడు సార్లు దాడి చేసాడు. ఈ సందర్భం లో శ్రీ కృష్ణుడు యాదవులను భవిష్యత్తు లో ఇటువంటి దాడులనుండి తప్పించటానికి గిర్నార్ పర్వతాల గుండా ద స్టేట్ అఫ్ సౌరాష్ట్ర లేదా గుజరాత్ కు తీసుకు వెళ్ళాడు. యుద్దాన్ని వదిలి నందుకు శ్రీ కృష్ణుడు రంచ్చోద్రై (యుద్ద భూమిని వదిలిన వాడు) అని అభిమానంగా పిలువబడ్డాడు. మథుర ని వదిలి పోర్ట్ ఒఖ కి దగ్గరలోని బెయ్ట్ ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించటానికి పూనుకొన్నాడు. ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రాముఖ్యమైన జీవిత భాగాన్ని గడిపాడు. శ్రీ కృష్ణుని మరణానంతరం పెద్ద వరద ఈ నగరాన్ని ముంచేసింది. ద్వారక ఆరు సార్లు మునిగిపోయిందని నమ్ముతారు. ఇప్పటి ద్వారకని అందుకే ఈ ప్రాంతం లో ఏడవ సారి నిర్మిత నగరంగా భావిస్తారు.
పవిత్ర నగరం
ద్వారకకు ఆ పేరు సంస్కృతమ్ లోని 'ద్వార్' అనే పదం, అంటే తలుపు అనే అర్ధం నుండి వచ్చింది, ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. విష్ణు భక్తులకు ఈ నగరం ఒక విశిష్టమైనది. ఇక్కడి జగత్మందిర్ దేవాలయం లో ద్వారకాదీష్ (శ్రీ కృష్ణుడు)ని పూజిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన నాగేశ్వర జ్యోతిర్లింగ కూడా ఈ ద్వారకలో ఉన్నది.
బెయ్ట్ ద్వారకభగవంతుడు శ్రీ కృష్ణుడు తన రాజ్యాన్ని స్థాపించిన ప్రదేశంగా భావించే బెయ్ట్ ద్వారక గల్ఫ్ అఫ్కచ్ లో నెలకొని ఉన్న ఒక చిన్న ద్వీపం. ఒఖ ఓడ రేవు కు మునుపు ముఖ్య రేవుగా ఈ ద్వీపం ఉండేది. ద్వారక నుండి ఇక్కడికి చేరటానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టికి చేరుకొని అక్కడ నుండి పడవలో ఈ ప్రదేశానికి వెళ్ళాలి. క్రీ.పూ. 3 వ శతాబ్దపు చారిత్రిక అవశేషాలు ఇక్కడ గుర్తించబడ్డాయి.
శంఖసురుని భగవంతుడు విష్ణువు సంహరించిన ప్రదేశంగా కూడా బెయ్ట్ ద్వారక ఇతిహాసం చెపుతుంది. అందుకే ఈ ద్వీపం బెయ్ట్ శంఖోధర అని కూడా పిలువబడుతుంది. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని చూడవచ్చు. ఇక్కడ పిక్నిక్ లకు, కాంపింగ్లకు మరియు సముద్ర విహారానికి వెళ్ళవచ్చు.
భౌగోళిక విశేషాలుగుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలో ఉన్నది ఈ ద్వారకా నగరం. గుజరాత్ ద్వీపకల్పం లోని పశ్చిమ భాగాన ఉన్నది ద్వారక.
పర్యాటక ఆకర్షణలు ద్వారకా మరియు బెయ్ట్ ద్వారకా లోని అనేక పవిత్ర దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రతి ఏడూ అనేక మంది పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ద్వారకదిశ దేవాలయం, నాగేశ్వర జ్యోత్ర్లింగం దేవాలయం, మీరాబాయి దేవాలయం, శ్రీ కృష్ణ దేవాలయం, హనుమంతుని దేవాలయం మరియు బెయ్ట్ ద్వారకా లోని కచోరియు మొదలగు ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశాలు ద్వారకాలో ఉన్నాయి. ఇటువంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కల ద్వారకా అప్పటికి ఎప్పటికీ గుజరాత్ లోని ముఖ్య పర్యాటక ప్రదేశం గా ఉన్నది.