Pages

Wednesday, 20 March 2013

ఇల్లాలు ఉప్పు, నీటిని ఉపయోగించే విధానాన్ని బట్టే ఆ ఇంటి లక్ష్మి వృద్ధి చెందుతుందని వాస్తు చెబుతోంది....


ఇల్లాలు ఉప్పు, నీటిని ఉపయోగించే విధానాన్ని బట్టే ఆ ఇంటి లక్ష్మి వృద్ధి చెందుతుందని వాస్తు చెబుతోంది. ఉప్పును మితంగా వాడటం, నీటిని వృధా చేయకపోతేనే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

అయితే ఇంటి అలంకరణ కోసం కొంతమంది ఇళ్లల్లో వాటర్ ఫౌంటైన్‌ను ఉంచుకొంటారు. అయితే ఇది చూడటానికి అందంగా ఉన్నా దీని వల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది. నీటిని ఎంత వృధా చేస్తే అంత డబ్బు ఖర్చు అవుతుందని చాలామంది నమ్ముతుంటారు.

మరి వాటర్ ఫౌంటైన్లో నీరు ఎప్పుడూ దారలాగ ప్రవహించడం వల్ల డబ్బుకూడా అలాగే ఖర్చయిపోతుంది. అందుచేత చేతిలో డబ్బునిలవదని వాటర్ ఫౌంటైన్లు ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.