Pages

Wednesday, 20 March 2013

"రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు"

"రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు"
సాధారణంగా ప్రతి మానవుడు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. అయితే ఈ మానవులు చేసే తప్పులను క్షమించేందుకు సాక్షాత్ శ్రీ మహావిష్ణు రూపుడైన శ్రీరామచంద్రుడు భూలోకంలో ఓ లింగాన్ని స్థాపించినట్టు మన పురాణేతిహాసాలు చెపుతున్నాయి. ఈ లింగమే రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి.

రాముని కాలం నుంచి నేటి వరకు ఈ శివలింగం భక్తుల పాపాలను పోగొడుతూ సకల జనుల పూజలను అందుకుంటోంది. "రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు" అనేది ఒక నానుడి. అంటే సకల పాపాలు తొలగిపోవాలంటే చివరి మజలీ రామేశ్వర దర్శనం అనేది వారి భావన. ఏ విధంగానైనా సరే రామేశ్వర లింగాన్ని స్మరిస్తే చాలు ఇహపరలోకాలలో దుఃఖం దూరం అవుతుందట.

ఆవుపాలు, పెరుగుతో, నెయ్యితో రామనాథ మహాలింగానికి అభిషేకం చేస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాపఫలంతో పాప విముక్తి దూరమవుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆవు పాలంటే మహావిష్ణువుకు అమిత ఇష్టమని, అందువల్ల గోవు పాలతో శివలింగాన్ని అభిషేకించే భక్తుడు శివుడికి ఇష్టమైన విష్ణులోకంలో సుఖంగా ఉండే అదృష్టం పొందుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.