Pages

Friday, 22 March 2013

తులసీ దళాలను త్రుంచేందుకు నిబందనలు మీకు తెలుసా ?

శ్లో. పూర్ణిమాయాం అమాయాం చ ద్వాదశ్యాం రవి సంక్రమే|
తైలాభ్యంగేచ స్నాతేన మధ్యాహ్నే నిశి సంధ్యయోఃఅశౌచ అశుచి కాలేచ రాత్రి వాసాన్వితే పివా|

తులసీం మేచ ఛిన్యంతితే ఛిన్దన్తి హరేఃశిర.||

పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లోనూ, తైలాభ్యంగానికి తర్వాతా, పట్ట పగలూ, నిశి సంధ్య వేళల్లోనూ. అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ, రాత్రి అంతా ధరించి ఉన్న దుస్తులతోనే ఉన్నపుడూ తులసీ దళాలను త్రుంచకూడదు అని భావం. అలా ఈ నియామాలను పాటించకుండా తులసీదళాలను సేకరించినవారు సాక్షాత్తూ శ్రీహరి శిరస్సునే త్రుంచినంతటి పాపులవుతారని కూడా ఈ శ్లోక పాదాలు హెచ్చరిస్తున్నారు.