సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Friday, 15 March 2013
సంజీవిని తెచ్చేందుకు శ్రీరామచంద్రుడు ఆంజనేయుణ్ణ ఎందుకు పంపించాడు?
వానరవీరుల్లో అత్యంత పరాక్రమవంతుడు,
సమయస్ఫూర్తి, అంకితభావం, బుద్ధికుశలత కలిగిన వాడు కనుకనే ఆంజనేయుణ్ణి
శ్రీరాముడు పంపాడు. అసలు ఎవరినీ పంపనవసరం లేకుండానే అవతారపురుషుడైన
శ్రీరామచంద్రుడు తన సోదరునికి స్పృహ వచ్చేట్టు చేయగల శక్తిని కలిగి
ఉన్నప్పటికీ, ఆంజనేయుని శక్తి అమోఘమైనదని నిరూపించడం కోసమే ఆ బాధ్యతను పవన తనయునికి అప్పగించాడు.అంతేకాక,ఆంజనేయుని
సమయస్ఫూర్తి చాలా గొప్పది. ఎంతటి కష్టాన్ని అయినా ఓర్చుకోగల ధీశాలి.
అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడానికి అవసరమైన దీక్షా దక్షతలు ఆంజనేయునికి
ఉన్నాయి. ఈ కారణంగానే సంజీవిని తెచ్చే బాధ్యతను హనుమకు శ్రీరామచంద్రుడు
అప్పగించాడు. హనుమ, అంగద, నల, నీలుడు,తదితర వానర వీరులందరి కన్నా హనుమంతుడు
అత్యంత పరాక్రమవంతుడు. అన్నింటిని మించి స్వామిభక్తి పరాయణుడు. ఎన్ని
ఒడుదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగల సహనశీలి. రాక్షసులందరినీ వంటి
చేత్తో సంహరించగల బలవంతుడు. వాయువేగ,మనోవేగాలతో పోయి రాగల ధీరుడు. ఎన్ని
అడ్డంకులు వచ్చినా, వాటిని సమయోచితంగా తొలగించుకుంటూ ముందుకు సాగిపోగల
చతురుడు.రావణాసురుడు లక్ష్మణుని ఎత్తి తన రథంపై కూర్చోపెట్టుకుని పోవడానికి
సంసిద్ధమైనప్పుడు ఆంజనేయుడు రావణాసురుడిని తన పిడికిటతో రొమ్ములో పొడిచి
లక్ష్మణుణ్ణి తన భుజముపై పెట్టుకుని వాయువేగంతో శ్రీరాముని చెంతకు
చేర్చాడు.
దీంతో అతడి సామర్ధ్యం ఏపాటిదో రామచంద్రునికి అర్ధమైంది. అందుకే, సంజీవిని తెచ్చేందుకు ఆంజనేయుణ్ణి పంపాడు