Pages

Friday, 15 March 2013

మరి దైవాన్ని స్తుతిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందా?

మరి దైవాన్ని స్తుతిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందా? అని సందేహం రావచ్చు. ఈ స్తోత్రంలో ఉండే అక్షరాల సమాహారం శరీర భాగాలను శుద్ధిచేయడానికి ఉపకరిస్తాయి. ఒక్కో అక్షరం ఒక్కో అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వేదాలను రాగయుక్తంగా చదువుతున్నప్పుడు ఊపిరితిత్తులు, గుండె ఎంతో చక్కగా పనిచేస్తాయని యోగానిపుణులు చెబుతున్నారు. ఈ మంత్రాలు... మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా కలుగచేస్తాయి.

ఒక మంత్రాన్ని బ్రేక్‌లేకుండా ఊపిరిబిగపట్టి చదవడం వల్ల, బలహీనంగా ఉన్న ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. ఉదాహరణకు ‘ఓం’ కారం. ‘ఓం’ అనడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధమవుతాయి. దీనివల్ల జీవితకాలం పెరుగుతుందని చెబుతారు. అప్పుడు మన శరీరం మీద, మనసు మీద నియంత్రణ సాధ్యమవుతుంది.

మంత్రాలను రకరకాల స్వరాలలో ఉచ్చరిస్తారు. కొన్నిటిని గట్టిగాను, కొన్నిటిని నెమ్మదిగాను, కొన్నిటిని మంద్రంగాను పలుకుతారు. ఆ మూడుస్థాయుల ఉచ్చారణే శ్వాసను నియంత్రిస్తూ, ఆర్గాన్స్‌కు శక్తిని కలిగిస్తుంది. మంత్రోచ్చారణ ద్వారా యోగసాధన చేయగలుగుతారు. యోగసాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. మహాభాగ్యంగా చెప్పబడే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి మంత్రోచ్చారణ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

పంచాక్షరీ మంత్రం, అష్టాక్షరీ మంత్రం... ఇలా మంత్రాలు రకరకాలుగా ఉంటాయి. గాయత్రీమంత్రం 24 అక్షరాలతో ఉంటుంది. ఇవన్నీ కూడా మనసును ప్రశాంతపరచి, ఒత్తిడుల నుంచి దూరం చేసి, శారీరక ఉత్సాహాన్ని కలుగచేస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ సమకూరతాయో, అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం చేకూరినట్లే.