Pages

Saturday, 23 March 2013

డబ్బు కావాలా, మనశ్శాంతి కావాలా!


మీకు డబ్బు కావాలా మనశ్శాంతి కావాలా! అని మనం ఎవరినైనా అడిగితే చాలా మంది ముందుగా డబ్బు కావాలని అంటారు. అదే డబ్బున్న వారిని అడిగితే మనశ్శాంతి కావాలని అంటారు. ఇది అక్షరాల నిజం. డబ్బును సంపాదించవచ్చు కానీ, మనశ్శాంతిని సంపాదించడం చాలా కష్టం.

ప్రస్తుతం మన జెట్ యుగంలో ప్రతి ఒక్కటీ వేగమే. అందుకే మనం ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. అసలు ఇంతకీ మనకి ఏం కావాలి? ఎందుకీ పరుగు? డబ్బు ఎంత సంపాదించినా తృప్తి తీరదు. అదే మనశ్శాంతి కాస్త ఉన్నా తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా భ్రతుకు జీవినం సాగించగలం.

వాస్తు అనేది ఇక్కడే కచ్చితంగా పనిచేస్తుంది. వాస్తురీత్యా గృహము నిర్మిస్తే గృహస్థులకు మనశ్శాంతి లభిస్తుంది. ఎంత డబ్బు ఉన్నా, మనశ్శాంతి లేనప్పుడు ఏం చేస్తారు. డబ్బు సంపాదించిన వారికి మనశ్శాంతి విలువ బాగా తెలుస్తుంది.

వాస్తు పాటిస్తే గృహమునందలి గృహస్థులకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. అయితే వాస్తు పాటించినంత మాత్రాన మీరు కోట్లకు అధిపతులు త్వరగా కాలేరు. ఒక విషయం మాత్రం నిజం. మీకు మనశ్శాంతి లభిస్తుంది. అదే వాస్తు బలం, వాస్తు పాటించి కోట్లకు కోట్లు సంపాదిస్తారు అని ఎవరైనా చెబితే నమ్మాల్సిన అవసరం లేదు. కావాల్సినంత మనశ్శాంతి లభిస్తుంది అంటే మాత్రం నమ్మండి.

వాస్తు పాటిస్తే కచ్చితంగా కోటీశ్వరులు కాలేరు. అయ్యే అవకాశమైతే ఉంటుంది. అయితే తప్పకుండా మీకు మనశ్శాంతి లభిస్తుంది.