Pages

Friday, 15 March 2013

వినియోగం - దుర్వినియోగం (Budha's Lesson)

ఓ రోజు బుద్దుడు భోది వృక్షం కింద కూర్చుని లోకానికి తన సిద్దాంతాలని బోదించి మానవ జాతికి పరమార్దాన్ని ఎలా తేలియ జేయాలో తీక్షణం గా ఆలోచిస్తున్నాడు.
ఇంతలో కొంతమంది శిష్యులు తన దగ్గరికి వచ్చి, "గురువర్యా..!,మా నుండి చిన్న విన్నపం..!" అని వివరిస్తారు.

బుద్దుడు: "చెప్పండి..నేను మీకు ఏమి సహాయం చేయగలను ?"
శిష్యుడు: "మా ఈ దుస్తులు చిరిగిపోయినవి, తమరు దయ వుంచి మాకు క్రొత్త దుస్తులు ఇప్పించగలరు"
బుద్దుడు ఇంతలో వారికి కొత్త దుస్తుల్ని దుకాణం నుండి తెప్పించి ఇస్తాడు.

అవి తీసుకొని శిష్యులు అక్కడి నుండి సెలవు తీసుకుంటారు,

కాని బుద్దుడు వారి అవసరాన్ని మాత్రమే తీర్చానని ఆలోచిస్తూ ఏదో వెలితిని సంగ్రహించాడు,
తిరిగి శిష్యులు వుండే గదులకి వెళ్ళి,"కొత్త దుస్తులతో మీరు సంతోషమేనా?" అని అడుగుతాడు.
శిష్యులు: "సంతోషమే గురువర్యా..!"
బుద్దుడు: "మీరు కొత్త దుస్తుల్ని తీసుకొని,పాత దుస్తుల్ని ఏమి చేసారు?  " శిష్యులు: "పాత బట్టల్ని నేలపై పడుకోవడానికి దుప్పటిలా ఉపయోగిస్తున్నాము గురువర్యా..! "
బుద్దుడు: "మరి పాత దుప్పటి ఏమి చేసారు..! " శిష్యులు:  "పాత దుప్పటిని కిటికీకి తెరలా ఉపయోగిస్తున్నాము..!"
బుద్దుడు: " మరి పాత కిటికీ తెర ఏమి చేసారు" శిష్యులు: " పాత కిటికీ తెరని వంట గదిలో వేడిగా వున్న పాత్రల్ని పట్టుకోవడంలో ఉపయోగిస్తున్నాము ...!"
బుద్దుడు: " మరి ముందుటి బట్ట..?"
శిష్యులు: "ఆ బట్టని నేలని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నాము ..! "
బుద్దుడు: " మరి ఈ బట్ట..?"
శిష్యులు: " బాగా చిరిగి పోయిన ఈ బట్టని ఏమి చేయాలో అర్దం కాలేదు, వీలుఫడితే దీన్ని దీపంలో ఒత్తిలా ఉపయోగించవచ్చు. "
బుద్దుడు, ఒక్కసారిగా తన శిష్యుల సమాధానంతో ఆనందపడి అక్కడినుండి వెళ్ళిపోతాడు.

ఒక వేళ బుధ్ధుని శిష్యులు ఇంతకంటే ఉపయోగకరమైన సమాధానం ఇచ్చి వుండక పోయి ఉంటే బుధ్ధుడు కలత చెంది వుండేవాడు, కాని తన బోదనలు శిష్యులకి సరిగ్గా  చేరుతున్నాయని సంతోషించాడు. 


collection from:http://creativekiranteja.blogspot.in/2010_09_01_archive.html