హిందూమతంలో మూడు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నడచుకోవాలి. నదుల్లో కెళ్ళా పరమ పవిత్రమైనది గంగానది. గంగానదిలో స్నానం చేస్తే తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవద్గీత అత్యంత పవిత్ర గ్రంధం. గీతను అర్ధం చేసుకుని ఆచరించాలి. గీతా పారాయణం చేయడం ఉత్తమం. మంత్రాల్లో కెల్లా ఉత్తమోత్తమమైంది గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర స్మరణతో సర్వ సంపదలూ ప్రాప్తిస్తాయి.