Pages

Tuesday, 26 March 2013

రంగులపండుగహోలీ (HOLI)

రంగులపండుగహోలీ (HOLI) 

   ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో 

వేనవేల రకాల రంగులున్నాయి. అసలీ ప్రపంచమే 

రంగులమయం. మన జీవనవిధానమే రంగులతో 

మమేకమై ఉంది. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవిత 

తత్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే వేడుకే 

హోలీ. పురాణాల్లో హోలీ గురించి రకరకాల 

కథనాలున్నప్పటికీ జీవితాన్ని రంగులమయం 

చేసుకోగలిగితేనే ఆనందం సాధ్యమన్న సందేశం ఈ 

పండగలో అంతర్లీనంగా ఉంది.