Pages

Monday, 1 April 2013

ఇందరు దేవుళ్లు, దేవతలు ఎందుకు ఉన్నారు?


ఈప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అయితే ఇందరు దేవుళ్లు, దేవతలు ఎందుకు ఉన్నారు? ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? మనం ఎవరినైనా ఈ ప్రశ్నలడిగితే సాధారణంగా వచ్చే సమాధానం ఒకటే. ”దారులు వేరైనా గమ్యం ఒక్కటే, దేవుడిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. ఒక్కో పద్ధతిలో ఆరాధిస్తారు. అందుకు వేరువేరు మతాలు, వేరువేరు దేవుళ్లు, దేవతలు. నిజానికి దేవుడొక్కడే.” ఇటువంటి సమాధానాలు పైకి చాలా బాగుంటాయి. కాని ఇవి అసలు ప్రశ్నకు సమాధానం ఎంతమాత్రమూ కావు. ఒక సూర్యుడు అందరికీ ఒకేలా కనపడ తాడు. ఒక మాట అందరికీ ఒకేలా వినపడు తుంది. మరి ఒక్క దేవుడు మాత్రం అందిరికీ ఒకేలా ఎందుకుండడు? 


శూన్యంలో సూర్యుడు చుట్టూ భూమి తిరగడాన్ని సూర్యునికి ఉన్న శక్తి అని మన చెప్పుకుంటున్నా... శూన్యంలో ఓ చిన్న గోళంపై సమస్త జీవులు తమ జీవనాన్ని సాగిస్తున్నాయంటే ప్రకృతే కారణమని అంటున్నా... వీటన్నిటి వెనుకా ఓ అదృశ్య శక్తి ఉంది. కాదనగలమా...? అలాగే ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకూ ఎక్కడో ఓ దగ్గర ప్రతి మనిషీ ఓ విశ్వాసాన్ని నమ్ముతాడు. దానికి శిరసు వంచి సాష్టాంగ ప్రమాణం చేసి తన జీవితం ఉన్నతంగా ఉండాలని ప్రార్థిస్తాడు. ఇది నిజం కాదా..? 

అలాగే దేశం, ప్రపంచం... ఇలా పేరు ఏదయినప్పటికీ చరాచర జగత్తులో సమస్త జీవకోటికీ ఓ నమ్మకం.. ఓ విశ్వాసం.. ఓ దేవుడు... ఖచ్చితంగా ఉన్నారు. ఆ నమ్మకమనే శక్తిపై భారం వేసి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటప్పుడు వారివారి నమ్మకాలను కించపరిచే హక్కు మనకు ఎక్కడిది..? అందుకే ఎవరు నమ్మకాలు వారివి. వాటిని గౌరవిస్తూ ముందుకు కదలడమే మానవులుగా మనం చేయాల్సిన పని. అది భవిష్య తరాలకు మంచి దీవెన. మరి మీరేమంటారు..?!!






000