Pages

Sunday, 28 April 2013

హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.

ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.


పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.
ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.


ప్రత్యాహర: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహర. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటివుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్ర్నయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైనచెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.


ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.

ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.


సమాధి: ధ్యానానికి, యోగకి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటిని దాటుకుని, ఈ ఉన్నతస్థితికి చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ అనుభూతి చెందగలడు. ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు.