Pages

Wednesday, 3 April 2013

నామకరణం చేసేటప్పుడు ఎన్నిరకాలుగా పేర్లు పెట్టాలి?

నామకరణం చేసేటప్పుడు ఎన్నిరకాలుగా పేర్లు పెట్టాలి? 


దేవతానామం, మాసనామం, నక్షత్రనామం, వ్యవహారిక నామం అని నాలుగు పేర్లు పెడతారు.
దేవతకు భక్తుడు అని తెలిపేది దేవతానామం. చైత్రాదిమాసాలలో జన్మించిన వ్యక్తికి వైమం ఈది నామాలు పెట్టడం అనేది మాసనామం. ఏ నక్షత్రంలో జన్మించాడో తెలియజేసేది నక్షత్రనామం. మరికొందరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రానికి జ్యోతిష్యశాస్త్రంలో అవకహడ చక్రాన్ని అనుసరించి ఏర్పడే అక్షరంతో ఆరంభించి పేరు పెడతారు. దీనినే జన్మనామం అని కూడా వ్యవహరిస్తారు.

నాలుగవది వ్యవహార నామం. దీనిని నక్షత్రానికి ఏర్పడే అక్షరంతో ఆరంభించి పెట్టడం కొందరు చేస్తారు.మరికొందరు తాత, మామ్మ, అమ్మమ్మల పేర్లు పెడతారు. సరి అక్షరాలతో పురుషులకు, బేసి అక్షరాలతో స్ర్తీలకు పేరు పెట్టాలని ధర్మ సింధువు చెబుతోంది. కీర్తి కోరేవారు రెండక్షరాల పేరు పెట్టాలి. బ్రహ్మవర్చస్సు కోరేవారు నాలుగక్షరాల పేరు పెట్టాలి. పేరు చివర్లో ల కారం గాని, రేఫగాని ఉండరాదు. సంకల్పంలో ఆయుష్యాభివృద్ధి, వ్యవహార స్థితి, బీజ, గర్భదోష నివారణ, అనే ప్రయోజనాలు కనిపిస్తాయి. మాలతీ మొదలైన లతల పేర్లు కూడా నిషేధకోటిలో చేరినవే �సు� శబ్దంతో ప్రారంభమయ్యే పేర్లు మంచివి