మనమందరం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తాం కదా? కానీ ఎందుకని చేస్తాం అన్నది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.
మనం ఏ పనిని చేసినా చేసే దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుని చేయడం మంచిదన్న భావనతో ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో ప్రస్తావించ తలచాను. సంస్కృతములో ప్రదక్షిణం అంటే దక్షిణ ముఖముగా తిరగడం దానినే కుడి చేతి వైపు తిరగడం అంటారు. ఇక్కడ మనం దక్షిణ ముఖముగా (కుడి చేతి వైపు) తిరగడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటంటే, మనం కుడిచేతి వైపుగా గుండ్రముగా దేవుని చుట్టూ తిరగడం వలన అయన మన కుడిభుజము లాగా ఉండి మనకి కావలసినవాటన్నిటినీ చూసుకుంటారులే అన్న నమ్మకం. పైగా దేవుడిని నాభిగా చేసుకుని అయన చుట్టూ మనం ఒక వృత్తము లాగా తిరగడం వలన మనము ప్రదక్షిణము చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా(వృత్తము మీద ఏ బిందువు మీద ఉన్నా) దేవునికి సమానమయిన దూరములో ఉంటాము కనుక ఆయన కృపా కటాక్ష వీక్షణలు అందరి మీద సరి సమానముగా ఉంటాయి. ఇలా చేయడం వలన మనకి కొంత శక్తి వచ్చి తద్వారా మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలతో ఉంటాము. దీనినే positive energy అంటారు.
దీనినే కొంతమంది పండితులు ఇలా సమర్ధించారు. మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది . భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది.
అలాగే భక్తులు కూడా ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. నిజమే మరి మనం కూడా ఆత్మ ప్రదక్షిణలు చేస్తాం. కానీ అది కేవలం పూజా కార్యక్రమం అంతా అయిన తరువాత ఆత్మప్రదక్షిణం చేస్తాం. ఆత్మ అంటే మనకి జీవాత్మ, పరమాత్మ అని రెండు ఉన్నాయి మనిషిలో అంటారు. మనలో ఉండే పరమాత్మని గుర్తించి ఆయనకి చేసే ప్రదక్షిణమే ఆత్మప్రదక్షిణం.ఇక్కడ మనలో ఉండే పరమాత్మని గుర్తించడం ఎలా? అంటే మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడమే మనలోని మంచిని గుర్తించి ప్రశాంతతని పొందడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.