Pages

Friday, 31 May 2013

నారాయణ సూక్తం - తాత్పర్యము


తైత్తిరీయ అరణ్యకంలో చెప్ప బడిన నారాయణ సూక్తంలో ఈ స్థూల శరీరంలో ఆ పరమాత్ముని చిరునామా, ఆయన ధ్యానించే పధ్ధతి విస్పష్టంగా చెప్పబడింది. నారాయణ సూక్తం పురుష సూక్తానికి ఉత్తర పీఠిక లాంటింది. పురుష సూక్తంలోని విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నారాయణ సూక్తం నారాయణుని రూపంలో విశదీకరిస్తుంది. ఆ విశ్వమంతటా ఉన్నవాడిని అణురూపంలో విశ్లేషించి చెపుతుంది. వైదిక విధులలో పురుష సూక్తము, నారాయణ సూక్తము, మంత్ర పుష్పము కలిపి చదవటం ఆనవాయితీ.

ధ్యానము చేయటానికి ముందు ఈ సూక్తాన్ని పారాయణ చేసి దీని భావాన్ని చింతన చేస్తూ ఉండటం ప్రగాఢ ధ్యానానికి దోహదం చేస్తుందిట. ఇందులో మొదట భగవంతుని మహిమ తెలుప బడినది. పిదప ఆయనను ఎక్కడ, ఎలా ధ్యానిన్చాలో, క్రమంగా ధ్యానంలో మనస్సును ఎలా లగ్నం చేయాలో అన్న విషయం ఈ సూక్తంలో అద్భుత రీతిలో వివరించబడింది. 

నారాయణ సూక్తం, తాత్పర్యము, శ్రవణం
 
 
విశ్వం నారాయణం దేవం

అథ శ్రీ నారాయణ సూక్తం
ఓం | సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం | 
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం || 

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం | 
విశ్వ మేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి || 

పతిం విశ్వస్య ఆత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం | 
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం || 

నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః | 
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః | 
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః || 

యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా | 
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః || 

అనంతమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వ శంభువం | 
పద్మ కోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖం || 

అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి | 
జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాఽయతనం మహత్ || 

సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం | 
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం || 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః | 
సోఽగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహార మజరః కవిః || 

తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయ స్తస్య సంతతా | 
సంతాపయతి స్వం దేహమాపాదతల మస్తకః | 
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః || 

నీలతో యదమధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా | 
నీవారశూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా || 

తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః | 
స బ్రహ్మ స శివః స హరిః స్సేన్ద్ర స్సోఽక్షరః పరమ స్స్వరాట్ || 

ఓం తద్బ్రహ్మ | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | ఓం తత్సత్యం | ఓం తత్సర్వం | ఓం తత్పురోర్నమః |

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | 
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం 
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః |

త్వం తదాప ఆపో జ్యోతి రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి | 
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||

తాత్పర్యము: 

వేలాది తలలు కలవాడు, ప్రకాశిస్తున్న వాడు, సమస్తాన్ని చూస్తున్న వాడు, యావత్ప్రపంచానికీ మంగళకారుడు, నాశనము లేని వాడు, అత్యున్నత స్థితి అయిన వాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.

ఈ విశ్వాని కన్నా ఉన్నతుడు, నిత్యుడు, ఈ విశ్వమై ఉంటున్న వాడు, భక్తుల కష్టాలను బాపు వాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.

విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశము లేని వాడు, విశిష్టముగా తెలుసుకోవలసిన వాడు, సమస్తానికి ఆత్మయైన వాడు, శరణు పొందదగిన ఉత్క్రుష్టుడు అయిన నారాయణుని ధ్యానిస్తున్నాను.

నారాయణుడే పరంజ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్త్వము, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే. నారాయణుడే ఉత్ర్క్రుష్టమైన ధ్యానం.

ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా, వాటన్నిట లోపల వెలుపల పరివ్యాపించి నారాయణుడే నెలకొని ఉన్నాడు.

(ఇది ధ్యానం తదుపరి మెట్టు. మొదట మనస్సు సర్వవ్యాపియైన భగవంతుని స్మరించడంలో నిమగ్నం అయింది. ఇప్పుడు దాని పరిధి సంకోచింప బడింది. వ్యాపితమైన మనస్సు మనలో ఒకటిగా కలిసిపోయింది. ధ్యానం తుది మెట్టు మనస్సు హృదయ సీమలో కేంద్రీకృతం కావడం).

అనంతుడు, అవినాశుడు, సర్వజ్ఞుడు, సంసార సాగర అంతాన ఉండే వాడు, ప్రపంచం మొత్తానికీ మంగళ కారుడు అయిన నారాయణుని అదోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.

(సముద్రే అంతం అనే పదం ఇక్కడ గమనించ దగినది  - సంసార సాగరాంతన భగవంతుడు ఉన్నట్లుగా తెలుపబడింది. కోరికలు భావోద్వేగాలు అనే అలలతో అల్లకల్లోలమైన జీవితమే సంసార సాగరంగా పేర్కొన బడింది. ఈ అలలు ఉధృతమై ఉన్నంత వరకు ధ్యానం మూలంగా భగవంతుని దరి చేరలేము. మనస్సు ప్రశాంత మైనప్పుడే ధ్యానము కుదురుతుంది).

అధో నిష్ట్యా....అనే మంత్రములో హృదయం గురించి చెప్పబడింది. లబ్ డబ్ అని కొట్టుకునే భౌతిక హృదయం కాదు ఇది. ఇది పారమార్థిక హృదయం. దీనికి మూడు లక్షణాలు. ఒకటి, నాభికి జానెడు దూరంలో ఉండి. భౌతిక హృదయము కూడా అంటే దూరంలో ఉండి కాని అది కాస్త ఎడమ వైపు ఉంది. కానీ, ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంది. రెండవది, దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది. మూడవది, ఆ హృదయం దేదీప్యమానమైనది. ఈ మూడు లక్షణములు భౌతిక హృదయానికి వర్తించవు. కానీ దీనిని మనము గ్రహించకున్నాము. గ్రహించకున్నప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది.

తామర మొగ్గ వంటి ఈ హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశము ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉన్నది.

సర్వత్రా ప్రకాశిస్తూ, అన్ని దిశలా వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని ఆకాశానికి నడుమన ఉన్నది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, ఆహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనది గాను, పాతపడనిది గాను, అన్నింటినీ చూసేదిగాను ఉంది.

ఆ ప్రాణం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, పాదం నుండి తల వరకు తన శరీరాన్ని వెచ్చగా ఉండేట్లు చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్ని జ్వాల ఊర్ధ్వ ముఖంగా అమరి ఉంది.

కారు మేఘం మధ్యనుండి వెలుగును విరజిమ్మే మెరపు తీగలా, వరి మొలకలా, సన్నమైనదిగా, బంగారు చాయగాను, అనువులా సూక్ష్మమైనదిగాను ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంది.

ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠుడై  ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, శివుడు, విష్ణువు. ఆయనే ఇంద్రుడు. ఆయన నాశనము లేని వాడు, స్వప్రకాశుడు. ఆయన కంటే అధికుడు ఎవరూ లేని వాడు.

కానవచ్చే వస్తుజాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారం గాను ఉన్న భగవంతుని ప్రతి శరీరం అంతటా నిండిఉన్న వాణ్ణి, నల్లని మేను విష్ణువు తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని, సమస్తాన్ని తన స్వరూపంగా పరిగ్రహించిన వానిని పదే పదే నమస్కరిస్తున్నాను.

నారాయణుని తెలుసుకుందాము. అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాము. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నములో ప్రేరేపించు గాక!

ఓం శాంతి శాంతి శాంతి

విష్ణు సూక్తం ( Vishnu Suktham )



ఓం విష్ణోర్నుకం’ వీర్యా’ణి ప్రవో’చం యః పార్థి’వాని విమమే రాజాగ్‍మ్’సి యో అస్క’భాయదుత్త’రగ్‍మ్ సధస్థం’ విచక్రమాణస్త్రేధోరు’గాయో విష్ణో’రరాట’మసి విష్ణో”ః పృష్ఠమ’సి విష్ణోః శ్నప్త్రే”స్థో విష్ణోస్స్యూర’సి విష్ణో”ర్ధ్రువమ’సి వైష్ణవమ’సి విష్ణ’వే త్వా ||
తద’స్య ప్రియమభిపాథో’ అశ్యామ్ | నరో యత్ర’ దేవయవో మద’ంతి | ఉరుక్రమస్య స హి బంధు’రిత్థా | విష్ణో” పదే ప’రమే మధ్వ ఉథ్సః’ | ప్రతద్విష్ణు’స్స్తవతే వీర్యా’య | మృగో న భీమః కు’చరో గి’రిష్ఠాః | యస్యోరుషు’ త్రిషువిక్రమ’ణేషు | అధి’క్షయంతి భువ’నాని విశ్వా” | పరో మాత్ర’యా తనువా’ వృధాన | న తే’ మహిత్వమన్వ’శ్నువంతి ||
ఉభే తే’ విద్మా రజ’సీ పృథివ్యా విష్ణో’ దేవత్వమ్ | పరమస్య’ విథ్సే | విచ’క్రమే పృథివీమేష ఏతామ్ | క్షేత్రా’యవిష్ణుర్మను’షే దశస్యన్ | ధ్రువాసో’ అస్య కీరయో జనా’సః | ఊరుక్షితిగ్‍మ్ సుజని’మాచకార | త్రిర్దేవః పృ’థివీమేషఏతామ్ | విచ’క్రమే శతర్చ’సం మహిత్వా | ప్రవిష్ణు’రస్తు తవసస్తవీ’యాన్ | త్వేషగ్గ్ హ్య’స్య స్థవి’రస్య నామ’ ||
అతో’ దేవా అ’వంతు నో యతో విష్ణు’ర్విచక్రమే | పృథివ్యాః సప్తధామ’భిః | ఇదం విష్ణుర్విచ’క్రమే త్రేధా నిద’ధే పదమ్ | సమూ’ఢమస్య పాగ్‍మ్ సురే || త్రీణి’ పదా విచ’క్రమే విష్ణు’ర్గోపా అదా”భ్యః | తతో ధర్మా’ణి ధారయన్’ | విష్ణోఃకర్మా’ణి పశ్యత యతో” వ్రతాని’ పస్పృశే | ఇంద్ర’స్య యుజ్యః సఖా” ||
తద్విష్ణో”ః పరమం పదగ్‍మ్ సదా’ పశ్యంతి సూరయః’ | దివీవ చక్షురాత’తమ్ | తద్విప్రా’సో విపన్యవో’ జాగృవాగ్‍మ్ సస్సమి’ంధతే | విష్ణోర్యత్ప’రమం పదమ్ | పర్యా”ప్త్యా అన’ంతరాయాయ సర్వ’స్తోమో‌உతి రాత్ర ఉ’త్తమ మహ’ర్భవతి సర్వస్యాప్త్యై సర్వ’స్య జిత్త్యై సర్వ’మేవ తేనా”ప్నోతి సర్వం’ జయతి ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

మౌనవ్రతం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసా......!?



పూర్వం మునులు, యోగులు, మహర్షులు మౌనవ్రతాన్ని పాటించేవారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంతమంది మతాచార్యులు చాతుర్మాస దీక్షలో మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఇంకా కొంతమంది నెలలో కొన్ని రోజులు లేక వారానికి ఒక రోజున మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. 

ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం పాఠించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆధ్యాత్మికంగా మౌనాన్ని పాటిస్తే వాక్‌సుద్ధి, వాక్‌శక్తి పెరుగుతాయి. ఇంకా ఆవేశం, కోపం, రోగాలను నియంత్రిస్తుంది.

అలాగే మనం ఇతరులపై కోపతాపాల్ని ప్రదర్శించకుండా కొంత సంయమనాన్ని పాటించినట్లయితే అనవసరమైన గొడవలు ఉండవు. కానీ మౌన వ్రతాన్ని పాటించడం ద్వారా మనస్సులో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది.

ఈ ప్రశాంతత ద్వారా టెంక్షన్లు, అశాంతి, కోపతాపాలకు దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగానూ మౌనవ్రతం మేలు చేస్తుందని వారు అంటున్నారు.

గృహంలో పూజచేసేటప్పుడు మంత్రపుష్పాన్ని చదవండి......!?



దేవాలయంలో పూజ చేసేటప్పుడు, ఇంట్లో దేవతార్చన చేసే సమయంలోనూ మంత్ర పుష్పాన్ని తప్పకుండా చదవడం మంచిది. పవిత్రమైన మంత్రపుష్పాన్ని చదవడంలో ఓ రహస్యం ఇమిడి ఉంది. అదేమిటంటే.. భగవంతుడు నా శరీరంలోనే ఉన్నాడు. పరమాత్మ, నేను ఒక్కటే అనే అద్వైత భావం కలగడం కోసం మంత్ర పుష్పాన్ని చదువుతారని పురోహితులు చెబుతున్నారు. 

మన శరీరంలో నాభికి పైభాగంలో హృదయ కమలం ఉంది. దానికి పైభాగాన అగ్నిశిఖలా పసుపురంగులో వడ్లగింజ మొనలా దేవదేవుడు అణురూపంలో ఉన్నాడని వర్ణించబడింది.

చేతిలోకి మంత్రపుష్పాలను తీసుకుని మంత్ర పుష్పం చదవిన తర్వాత ఆ పుష్పాలను భగవంతునికి సమర్పించి, నమస్కరించి ఆ పూలను మన శిరస్సు మీద వేసుకుంటే దైవశక్తి మనస్సులోకి ప్రవేశిస్తుంది. ఇంకా మంత్రపుష్పం చదవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు. 

మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..!? ఐతే ఫలితాలు ఇలా ఉంటాయ్!!



మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది. 

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి. 

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు. 

ఆ జాతకం మహిళను వివాహమాడితే తిరుగేలేదు

మేషలగ్నంలో పుట్టిన మహిళలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరి అందానికి పురుషులు దాసోహమవుతారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ లగ్నంలో పుట్టిన మహిళలు గుణవంతులుగా ఉంటారు. వంట చేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు.


ప్రేమతో మెలగటం వీరి స్వభావం. పొగడ్తలంటే వీరికి ఇష్టం. ఇంకా ఈ లగ్నంలో పుట్టిన మహిళలను వివాహం చేసుకునే పురుషులు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 


ఇకపోతే.. మేషలగ్నంలో జన్మించిన పురుషుల విషయానికొస్తే.. తల్లిందండ్రుల వద్ద ప్రేమతో ఉంటారు. వీరికి అందంతో పాటు గుణవంతురాలైన భార్య లభిస్తుంది. భార్య పక్షంలోని బంధువుల సహాయం లోటుగానే ఉంటుంది. కుటుంబ అభివృద్దికి తీవ్రంగా శ్రమిస్తారు. కుటుంబంలో పలు సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఉద్భవిస్తాయి. వాటిని సామర్థ్యవంతంగా పరిష్కరిస్తారు. మీ భాగస్వామి, సంతానం మీ మాటలను వినయంతో పాటిస్తారు. అయితే వారిని కొన్ని సందర్భాలలో తృప్తి పరచటం కష్టతరం. 


జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఉబలాటం ఉంటుంది. కష్టపడి శ్రమించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కళలంటే ఆసక్తి మెండు. పోలీసుశాఖ, సైన్యం, అగ్నిమాపక దళం వంటి శాఖల్లో రాణిస్తారు. ధైర్యం, మొండితనం ఎక్కువ. ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్యంలో ఉన్నత పదవులను అలంకరిస్తారు.


జర్నలిస్టులు అయ్యే అవకాశాలున్నాయి. వృత్తి పరమైన వాటిలోనూ మంచి అభివృధ్ది ఉంటుంది. వ్యవసాయం, హోటల్ నిర్వాహం వీరికి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కళలు అంటే వీరికి ఎక్కువ మక్కువ. ఆర్థిక శాఖలో మాత్రం కాస్త అభివృధ్ది అవకాశాలుండవు. 


ఇతరులకు సహాయం చేసే గుణవంతులు. అయితే ఇతరులకు అప్పులిస్తే వాటిని తిరిగి పొందటం కష్టం. స్నేహితులు, కుటుంబంకోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.


ఖర్చులు అధికంగా ఉండటంతో కాస్త ఇక్కట్లకు గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని జ్యోతిష్కులు అంటున్నారు. అందుచేత ఈ లగ్నంలో పుట్టిన జాతకులు శుక్రవారం పూట అమ్మవారిని, శనివారం హనుమంతుడి ఆలయాలకు వెళ్లి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే ఈతిబాధలు, ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వారు చెబుతున్నారు.

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?:


జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది. 

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం.

Thursday, 30 May 2013

జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు

   జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...

    ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆ అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. ఈ భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా ఆ సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. ఆ తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.

    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. ఆ విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.

    ఈ ప్రకృతిలో... ఆ మాటకొస్తే ఈ విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్‌ డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.

అష్టాదశ పురానాలు (Ashta Dhasa Puranalu)



1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ 


మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. 

యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో 

ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన 

పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.


2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి 


చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, 

విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు 

గురించి ఇందులో వివరించారు.


3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి 


అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది 

చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు 

అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి 

వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల 

గ్రంధం. 


4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు 


మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల 

ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే 

పరిణామాల గురించి వివరించారు.


5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు 


చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, 

కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.


6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన 



పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి 

గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. 

ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి. 


7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి 


సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక 

జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో 

ఉంది.



8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన 



పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, 

వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.


9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి 


వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, 

కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో 

ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ 

పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.


10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు 


ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో 

పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా 

ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని 

కూడా అధ్యయనం చేశారు.


11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి 


ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, 

భరతుల గురించి విపులంగా వివరించారు. 


12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ 


మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల 

గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ 

పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.


13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన 


పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ 

శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.


14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన 


పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, 

శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల 

గురించి వివరించారు. 
15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి 

(గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన 

పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు 

స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన 

గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, 


ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన 

వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో 


ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. 

ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం 

గురించి వివరించారు. భూగోళం గురించి కూడా 

వివరించారు. 


18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. 


ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం 

గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా 

విధానం గురించి వివరంగా వర్ణించారు.

తపస్సుతో ఏదయినా సాధించవచ్చు - Achieve Anything by Tapassu



పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో ''తపస్సు'' అనే పదం తరచూ వినిపిస్తుంది. మన మహర్షులు తపస్సు చేసి అద్వితీయమైన శక్తులను సాధించేవారు. ఆఖరికి హిరణ్యాక్షుడు, రావణాసురుడు తదితర రాక్షసులు కూడా తపస్సు (Tapassu) చేయడం ద్వారా ఎన్నో వరాలు పొందారు. ఇంతకీ తపస్సు అంటే ఏమిటి.. చందమామ కథల్లో కూడా ''తపస్సు'' అనే పదం చాలాసార్లు వస్తుంది కనుక ''ఏముంది.. ముక్కు మూసుకుని కూర్చోవడమే'' అని చెప్పేస్తే సరిపోతుందా?! తపస్సు అందరికీ సాధ్యమయ్యేది కాదు. అది అంత సులువే అయితే ప్రతి ఒక్కరూ తపస్సు చేసి మహర్షులు అయ్యేవారు. తపస్సు మహాద్భుతమైందని పురాణాలు వర్ణించడమే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆ విషయాన్ని నిరూపించారు. కనుక తపస్సు అంటే ఏమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.
తపస్సుకు విగ్రహాలు, నైవేద్యాలు అక్కర్లేదు. మందిరాలు, ఆర్భాటాలు అవసరం లేదు. మనసా, వాచా, కర్మణా.. అంటారు చూడండి.. అలా త్రికరణశుద్ధిగా దేవుని ధ్యానించాలి. దృఢ సంకల్పంతో, ఎలాంటి సంశయం లేకుండా ధ్యానించినట్లయితే ఇక ఆ ఆరాధనకు తిరుగులేదు. అదే తపస్సు. అలా దీక్షగా చేసే తపశ్శక్తి (Tapasshakti) సామాన్యమైంది కాదు. అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అకుంఠిత దీక్ష, (Akunthita Deeksha) చాంచల్యం లేని స్థిర చిత్తం (sthira chittam) ఉంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఎందరో మహా మునులు నిరూపించారు. పులిని పిల్లిగా మార్చడమూ, బొందితో స్వర్గానికి చేరడమూ కూడా సాధ్యమని మహర్షులు ప్రవచించారు.
తపశ్శక్తితో తలచిన పనులు నేరవేరడమే కాదు, నుదుట త్రినేత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి టెలిఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులు లేని పూర్వకాలంలోనే మన మహర్షులు ఉన్న చోటే ఉండి దివ్య దృష్టితో అన్నీ చూడగలిగేవారు, తెలుసుకునేవారు. అదంతా తపశ్శక్తి మహిమే.
మెదడులో ఏనియల్ గ్లాండ్ ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినప్పుడు ఈ గ్రంధినుండి అపురూపమైన, మహాద్భుతమైన దివ్య కిరణాలు ప్రసరిస్తాయి. ఈ కిరణాలు విశ్వంలో తిరుగుతున్న ఎలక్ట్రో మేగ్నటిక్ పవర్ ను కదిలించివేస్తుంది. ఆ కిరణాలు మేఘాలను, ట్రోపోస్పియర్ని, , స్ట్రేటోస్పియర్ని, ధర్మోస్పియర్ని, ఎక్సోస్పియర్ని, మించి అంతరిక్షం లోనికి దూసుకువెళ్ళి విశ్వశక్తుల వైపు దూసుకుపోతుంది.
ఒక వ్యక్తి కఠోర దీక్షలో నిమగ్నమైనప్పుడు మాజిక్ సర్కిల్ ఏర్పడుతుంది. ఆ దీక్ష, ధ్యానంతో, వారి నుదుటినుండి మహోజ్జ్వలమైన కాంతి కిరణాలు వెలువడి, అవి అంతే ప్రకాశవంతంగా, మనోహరంగా ప్రసరిస్తాయి. అయితే, ఈ దివ్య తేజో కిరణాలు సాధారణ వ్యక్తులకు కనిపించవు. తపశ్శక్తి ఉన్నవారు మాత్రమే దర్శించగలరు.
కిర్లియాన్ ఫొటోగ్రఫీ ఈ తేజో కిరణాలను పట్టుకోగలుగుతోంది. కారణం కఠోర దీక్ష వల్ల మాజిక్ సర్కిల్ నుండి వెలువడే తేజో కిరణాలు బహుశా అతి నీలలోహిత (Ultra Violet) కిరణాలు అయ్యుండటమే. కాస్మిక్ కిరణాల్లా అంగ్ స్ట్రమ్ యూనిట్ లో అత్యంత సూక్ష్మమై, బహు వేగంగా పయనించే కిరణాలు అయ్యుంటాయి. విశ్వంలో మనకు కనిపించే శక్తులు కాకుండా కనపడని అదృశ్య, అతీత శక్తులు ఎన్నో ఉంటాయి. మహర్షులు తపస్సుతో సాధించే శక్తి కూడా అలాంటిదే. తపశ్శక్తితో విశ్వంలోని విద్యుదయస్కాంత శక్తులు సైతం కల్లోలమౌతాయి.
మహర్షులు కన్నెర్ర చేసి ఆగ్రహోదగ్రులైతే సముద్రాలు అల్లకల్లోలం అయ్యేవని, పర్వతాలు బద్దలయ్యేవని పురాణాల్లో వర్ణించారు. అవి కట్టుకథలు, పిట్టకథలు కాదని, తపశ్శక్తి అంత మహాద్భుతమైందని అర్ధం చేసుకోవాలి.
ముక్కు మూసుకుని ఒక మూల కూర్చుని తపస్సు (Tapassu) చేసుకోవడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. క్షణం కూడా నిలకడగా ఉండని మనసును నియంత్రిస్తూ ఒకచోట కేంద్రీకరించడమే తపస్సు. మనసు పగ్గాలు గనుక పట్టుకోగలిగితే ఉంటే ఇక లోకంలో దేన్నయినా అదుపు చేయగల రిమోట్ కంట్రోలు మన చేతిలో ఉన్నట్లే. ఏమయినా చేయగలం. దేన్నయినా శాసించగలం. రోజులో కాసేపు ధ్యానం (meditation) చేయమని చెప్పేది అందుకే. మనం ప్రతిరోజూ చేసేది చిన్నసైజు తపస్సు అన్నమాట.

మంత్రానికి నియమం......



పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.
మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే  మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.

విభూతి, మట్టి ఎందుకు గొప్పవి? (Vibhuti and Soil – Precious)






"నా దగ్గరేముంది బూడిద..", "మట్టే మిగిలింది, ఇంకేం 

లేదు" లాంటి మాటలు వింటుంటాం. తమ దగ్గర ఏమీ 

లేనప్పుడు, లేదా, ఇతరులకు పైసా కూడా 

ఇవ్వదల్చుకోనప్పుడు ఇలా మాట్లాడతారు. నిజానికి 

బూడిద, మట్టి చాలా గొప్పవి, అమూల్యమైనవి. వాటి 

విలువ తెలీక మాత్రమే, మట్టి (మృత్తిక), బూడిదలను 

(విభూతి) నిరర్ధకాలుగా, అవి నిష్ప్రయోజనమైనవి 

అన్నట్లుగా చెప్తారు.


విభూతి, మట్టి చాలా గొప్పవని ధర్మ శాస్త్రాలు 

చెప్తున్నాయి. పంచ స్నానాల్లో ఆగ్నేయ స్నానం, 

వాయవ్య స్నానం ఉన్నాయి. ఆగ్నేయ స్నానం అంటే 

విభూతిని ధరించడం. వాయవ్య స్నానం అంటే గోవులు 

నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టిలో తేలుతూ 

నడవడం. కనుక విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో 

విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ 


పురాణం చెప్తోంది.

భస్మ స్నానం, మృత్తికా 


స్నానం పూర్తయిన తర్వాతనే 

కొత్త యజ్ఞోపవీతం 

వేసుకోవాలనేది శాస్త్రం.


పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, 

మనకు సర్వాన్నీ ప్రసాదించే 

చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి 


లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, 

చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని 

సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన 

తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది.


నిప్పు కాలుస్తుంది. కట్టెలు, పిడకలు లాంటివి నిప్పు 

సోకినప్పుడు కాలిపోతాయి.. ఈ రెండింటి కలయికతో 

పుట్టిన విభూతి, ఆ రెండు గుణాలనూ వదిలి, కొత్త 

రూపాన్ని, శాశ్వతత్వాన్నీ సంతరించుకుంది. ఏదైనా ఒక 

వస్తువును లేదా పదార్ధాన్ని కాల్చినప్పుడు బూడిదగా 

మారడం మనకు తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ 

మార్పూ జరగదు. ఎంతమాత్రం రూపాంతరం చెందదు. 

తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు 

లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో 

మార్పులేని మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి 

శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు 

ఆరోగ్యదాయిని కూడా. విభూతి దహించదు, 

దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. 

నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా 

ప్రీతికరమైంది.

కనుక, మట్టిని, విభూతిని నిరర్ధకాలుగా 

ఎన్నటికీభావించకండి. ఈ రెండూ చాలా పవిత్రమైనవి, 

అమూల్యమైనవి.