Pages

Friday, 24 May 2013

వైవాహిక జీవితములో బాదలను కలిగించు గ్రహముల యోగములు



ఒక స్త్రీ మరియు పురుషుడు వైవాహిక జీవితములో ప్రవేశించునప్పుడు వారి మనస్సులో అనేక కోరికలు మరియు కళలు వుండును. కుండలిలో ఉపస్థితిలో వున్న గ్రహములు అప్పుడప్పుడు వైవాహిక జీవితములో వున్న సుఖములపై సమస్యలను కలిగించును.

భార్య భర్తలు వారి మద్య కలహము ఏ కారణముగా జరుగుతున్నదని కూడా అర్ధము చేసుకో లేక పోతారు మరియు వారి కలలు, కలలుగానే మిగిలి పోవును.

వైవాహిక జీవితములో లభించే సుఖములపై గ్రహముల ప్రభావము చాలా వరకు వుండును. జ్యోతిష్య సాశ్త్ర ఆదారముగా సప్తమ అనగా కేంద్ర స్థానము వివాహము మరియు జీవిత బాగస్వామి యొక్క గృహముగా వుండును. ఈ గృహములో అశుభ గ్రహముల ప్రభావము వుండిన ఎడల వివాహము సమస్యలతో కూడినదై వుండును లేదా వివాహము తరువాత వైవాహిక జీవితములో ప్రేమ మరియు సమ్యోగములో లోపము ఏర్పడవచ్చును. ఇదే కాకుండా గ్రహముల మరి కొన్ని యోగములు గృహస్థ జీవితములో బాదలను కలిగించును.

ఏ స్త్రీ లేదా పురుషుని కుండలిలో సప్తమ బావము యొక్క పంచమ లేదా నవమ బావములో వుండిన వారి వైవాహిక సుఖమయముగా వుండదని జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడుతున్నది. ఈ విధమైన స్థితి ఎవరి కుండలిలో అయితే వుండునో వారి మద్య మతబేదములు కలిగి వుండును. దాని వలన ఒకరినొకరు దూరము చేసుకొనెదరు. జీవిత బాగస్వామికి వియోగమును భరించవలసి వచ్చును. ఒకవేళ జీవిత బాగస్వామిని వివాహ రద్దు చేసి రెండవ వివాహము చేసుకొనే పరిస్థితి కూడా ఏర్పడ వచ్చును.  అదే విధముగా సప్తమ బావము యొక్క అధిపతి యది శత్రు నక్షత్రముతో వుండిన ఎడల వైవాహిక జీవితములో సమస్యలు వుండగలవు.

ఎవరి కుండలిలో అయితే గ్రహ స్థితి బలహీనముగా వుండి మరియు కుజుడు మరియు శుక్రుడు కలిసి ఒకే చోటు వుండిన ఎడల వారి వైవాహిక జీవితములో అశాంతి మరియు సమస్యలు వుండగలవు. గ్రహముల ఈ యోగము కారణముగా బార్యా భర్తల మద్య వొడిదుడుకులు వుండగలవు. జ్యోతిష్య శాస్త్ర నియమాను సారముగా బలహీన గ్రహ స్థితి వున్న ఎడల మహాదశ కారణముగా భార్య భర్తల మద్య సంబందములలో లోపము ఏర్పడును. కేంద్ర బావములో కుజుడు, కేతువు మరియు ఉచ్చరాశిలో శుక్రుడు యుక్తముకాని జంటను చేయును. ఈ బావములో స్వరాశి మరియు ఉచ్చరాశిలో వున్న గ్రహములు వుండుట వలన మనస్సుతగ్గ జీవిత బాగస్వామి లభించుట కఠినముగా వుండును. శని మరియు రాహువు సప్తమ బావములో వుండుట కూడా వైవాహిక జీవితము కొరకు శుభకరముగా వుండదు. అనగా రెండు పాప గ్రహములు రెండవ వివాహమునకు అవకాశములు శృష్టించును.

సప్తమాదిపతి యది యది అష్టమ మరియు షష్టమ బావములో వుండిన ఎడల ఇది బార్యా భర్తల మద్య మతబేధములను సృష్టించును. ఈ యోగములో భార్యా భర్తలు ఇరువు ఒకరిని విడిచి మరొకరు దూరముగా వెల్లవలసిన పరిస్థితి కూడా ఏర్పడ వచ్చును. వారి మద్య వివాదములకు పరిస్థితులు ఏర్పడ వచ్చును. ఈ యోగము వివాహేతర సంబందములను కూడా కలిగించును. అందువలన ఎవరి కుండలిలో అయితే ఈ విధమైన యోగము వారు పరస్పర బావనలను అర్ధముచేసుకొని సపర్పణా బావనలతో వుండవలెను. సప్తమ బావము లేదా లగ్నస్థానములో ఒకటి కన్నా ఎక్కువ శుభ గ్రహములు వున్న లేదా ఈ బావములపై రెంటి కన్నా అధిక శుభ గ్రహముల దృష్టి వున్న ఎడల జీవిత బాగస్వామి పీడించబడగలరు. దానికారణముగా వైవాహిక జీవితము కష్టమయముగా వుండును.

సప్తమ బావము యొక్క స్వామి యది అనేక గ్రహముల కలయిక ఏదో ఒక బావములో యుతి చేయుచున్న ఎడల లేదా దీనికి రెండవ లేదా పన్నెండవ బావములో అశుభ గ్రహము వుండిన ఎడల మరియు సప్తమ బావములో పాప గ్రహముల దృష్టి వుండిన ఎడల గృహస్థ జీవితము సుఖమయముగా వుండదు. చతుర్ధ బావములో ఎవరికైతే శుక్ర గ్రహము వుండునో వారి వైవాహిక జీవితములో కూడా సుఖములో లోపము ఏర్పడును. కుండలిలో సప్తమాదిపతి మరియు సప్తమ బావములో లేదా అస్తముగా వున్న ఎడల ఇది వైవాహిక జీవితములో లోపములను కలిగించును.