Pages

Friday, 10 May 2013

ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటె క్రియా శీలురు ధనికులు అవుతారు.

ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటె క్రియా శీలురు ధనికులు అవుతారు. ఇది హస్తసాముద్రికం లో ఒక సూత్రం. ఒక విదేశీ యూనివర్శిటీ లో స్టాటిస్టికల్ స్టడీ ద్వారా ఈ మధ్యనే పరిశోధన చేసి ఇది నిజమేనని తేల్చారు. ఈ వార్త ఈ మధ్యనే "ఈనాడు" లో వచ్చింది కూడా.

అయితే స్టాటిస్టికల్ పరిశోధకులు గణాంకాలను బట్టి ఇది నిజమే అని తేల్చారు గాని ఎందుకు ఎలా ఇది జరుగుతుంది అనేది వారి బుర్రలకు తట్టలేదు. శాస్త్రం దీనిని వివరించి చెప్పింది. ఉంగరపు వేలు సూర్యునికి సూచిక. చూపుడు వేలు గురువు గారికి సూచిక. ఉంగరపు వేలు పొడవుగా ఉన్నప్పుడు అతనికి ఉత్సాహం, దూసుకుపోయే తత్వం,క్రియేటివిటీ,ధైర్యం ఉంటాయి. తినడం కంటే పనిచెయ్యటం మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. కనుక అలాటివాళ్ళు జీవితంలో త్వరగా ఎదుగుతారు. ధనాన్ని, ఇన్ప్లూయెన్స్ ను సంపాదిస్తారు. ఆయా వ్యక్తిత్వలక్షణాలు ఈవిధంగా ఆయా శరీరభాగాలలో ప్రతిబింబిస్తుంటాయి. డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్ ను ఉపయోగించి ఇలాటి పరిశీలన ద్వారా మనిషి మనస్తత్వాన్ని, అతని అలవాట్లను స్వభావాన్ని, దాన్నిబట్టి భవిష్యత్తును ఊహించవచ్చు. అది చాలావరకు నిజం అవుతుంది.