Pages

Thursday, 13 June 2013

సింహద్వారం ఎటువైపు ?


ఇంటికి ప్రధాన ద్వారం.. సింహద్వారం. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలని నిర్ణయించిన తరువాత అన్నింటికంటే.. ముందుగా చర్చించేది సింహద్వారం గురించే. ఎందుకంటే.. వాస్తు ప్రకారం సింహద్వారానిి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. సింహద్వారం సరైన దిశలో అమరితే.. సగం వాస్తు కుదిరనట్టే...

housetసింహ ద్వార గృహం ఏదైనప్పటికీ రహదారి ఉన్న వైపునకు ఉన్న దిశలో స్థలానికి ఉచ్ఛ స్థానంలో ప్రహరీ గేటును పెట్టుకోవాలి. తూర్పు స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉచ్ఛంలో గేటు ఉండేలా చూసుకోవాలి. విశాలమైన స్థలం కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింగద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

విశాలమైన స్థలం కలిగి రెండుగేట్లు పెట్టదలచినవారు.. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణ ఉచ్ఛంలో చిన్న గేటు పెట్టాలి. నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. దక్షిణంలో అయితే దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణంలో చిన్న గేటు పెట్టాలి.
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిది. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
vast-houseపశ్చిమంలో అయితే పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే పశ్చిమ స్థలంలో గేటు ఉన్నప్పుడు.. పశ్చిమ స్థలంలో నిర్మించిన గృహంలో పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఉన్న స్థలంలో ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చు. ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. sidebysideఒకవేళ రెండేసి గేట్లు పెట్టదలచిన వాళ్లు ఉత్తర ఈశాన్యంలో పెద్దగేటు, ఉత్తర ఉచ్ఛంలో చిన్న గేటు, పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమలో చిన్న గేటు పెట్టాలి. ఉత్తర స్థలంలో గేటు పెట్టదలుచుకుంటే.. ఉత్తర స్థలంలో నిర్మించిన గృహంలో ఉత్తర ఉచ్ఛం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఎక్కడైనా, సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి. విశాలమైన ఆవరణ ఉంటే రెండు గేట్లు పెట్టదలిస్తే ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు, ఉత్తర ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. ఇకపోతే ఈశాన్య స్థలంలో గేటు పెట్టాలను కుంటే.. తూర్పు, ఉత్తరం రహదారి ఉన్న స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు, ఉత్త ర దిశల వైపు పెట్టాలి. తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.