Pages

Thursday, 13 June 2013

పెంపుడు జంతువుల పెంపకం - వాస్తు


indian-modelవాస్తు ప్రకారం ఇంట్లో పెంపుడు జంతువు లను పెంచడం మంచిదా కాదా అనే అనుమానం మీకుందా.. అయితే ఈ కథనం చదవండి. ఇంటి లో పెంపుడు జంతువుల్ని పెంచడం కచ్చితంగా హితకరమేనని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు కానీ ఉన్నట్లయితే, అవి (వాస్తుదోషాలు) పరోక్ష ముగా ఇంట్లో పెంచే పెంపుడు జంతువుల మీద తమ దుష్ప్రభావాన్ని చూపిన తర్వాతే గృహస్తులను బాధిస్తాయి. జంతువుల పెంపకం కోసం మీ ఇంట్లో షెడ్డును నిర్మించా లనుకుంటే, దక్షిణ-మధ్యస్థ భాగం, నైరుతి లేదా వాయువ్యం వైపో లేదా పడమర-మధ్యస్థ భాగములోనో నిర్మించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.అలాగే వాస్తు దోష నివృత్తికి తాత్కాలిక పరి హారం కోసం అద్దె ఇంటిలో ఉన్నవారు, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా తమ ఇంటిని పునర్ని ర్మించడానికి ఆర్థికస్తోమతలేనివారు, దోష నివృత్తి కోసం ప్రతిరోజూ వాస్తుశాస్త్రాన్ని అను సరించి నిర్మించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని వెచ్చించిన తర్వాత తమ పనిని ప్రారంభిస్తే సత్ఫలితాలని స్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సుఖశాంతులనొసగే 42X42
German_Shepherdఇంటిలో చోటుచేసుకున్న మంచి, చెడులు ఆ ఇల్లు పొడవు, వెడల్పులపై ఆధారపడి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 42 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టినట్లైతే ఆ ఇల్లు ఉత్సాహవంతమైన జీవితాన్ని అందిస్తుంది. ఎల్లవేళలా కుటుం బంలో ఆనందం వెల్లివిరిసేందుకు దోహదపడు తుంది. ఇల్లంతా పిల్లాపాపలతో చిరకాలం కళకళలాడుతుంది. అదే 43 అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టుకున్నట్లైతే ఆ ఇంటిలో నివసించేవారు ఎల్లవేళలా కష్టాలు, కడగండ్ల తో జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. ఒక వేళ 44 అడుగుల పొడవు, 44 అడుగుల వెడల్పు తో ఇంటిని నిర్మించినట్లైతే ఆస్తి నష్టం కలగ డమే కాకుండా, ఆ ఇం టికి కష్టాలు వెన్నంటే ఉంటా యని వాస్తు శాస్త్ర గ్రంధాలు తెలుపుతున్నాయి.

ఆగ్నేయంలో ఖాళీ ఉండరాదు...
ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉంటే సమస్త సంపదలు చే కూరుతా యని వాస్తు నిపుణు లు అంటున్నారు. కానీ మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు, నమ్మినవారి చేతిలో మోస పోవడం వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కోర్టు సమస్యలు, అనేక వ్యాధులు, ఆపదలు సంభవించే అ వకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకా కుం డా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.