సుఖశాంతులనొసగే 42X42
ఆగ్నేయంలో ఖాళీ ఉండరాదు...
ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉంటే సమస్త సంపదలు చే కూరుతా యని వాస్తు నిపుణు లు అంటున్నారు. కానీ మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు, నమ్మినవారి చేతిలో మోస పోవడం వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి. తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కోర్టు సమస్యలు, అనేక వ్యాధులు, ఆపదలు సంభవించే అ వకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకా కుం డా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్ ఉంటే కుటంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.