Followers

Thursday, 29 May 2014

గోవింద పట్టాభిషేకం

                  

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే
గోలోకాదావ్రజత్కృష్ణం సురభిః శక్ర ఏవ చ

ఇలా ధారాపాతముతో బాధపడిన వ్రేపల్లెల్ను గోవర్థన పర్వతాన్ని ధరించి స్వామి రక్షిస్తే
గోలోకము నుండి కామధేనువూ ఇంద్రుడూ బయలు దేరి వచ్చారు. అందరూ చూడకుండా రహస్యముగా వచ్చి, చేసిన అపచారానికి సిగ్గుపడుతూ తన కిరీటముతో స్వామి పాదాల మీద పడ్డాడు

వివిక్త ఉపసఙ్గమ్య వ్రీడీతః కృతహేలనః
పస్పర్శ పాదయోరేనం కిరీటేనార్కవర్చసా

దృష్టశ్రుతానుభావోऽస్య కృష్ణస్యామితతేజసః
నష్టత్రిలోకేశమద ఇదమాహ కృతాఞ్జలిః

కనులారా స్వామి ప్రభావం చూసిన తరువాత "నేను త్రిలోకాధిపతిని" అన్న గర్వం పోయింది. చేతులు జోడించి ఇంద్రుడు అంటున్నాడు.

ఇన్ద్ర ఉవాచ
విశుద్ధసత్త్వం తవ ధామ శాన్తం తపోమయం ధ్వస్తరజస్తమస్కమ్
మాయామయోऽయం గుణసమ్ప్రవాహో న విద్యతే తే గ్రహణానుబన్ధః

పరమాత్మా, నీ నివాసం శాంతం. గుణత్రయ ఉత్తేజితం కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. రజో గుణ తమో గుణాలు నశించి ఉంటాయి. సంసారమంతా గుణ త్రయముతో ప్రసరిస్తోంది

కుతో ను తద్ధేతవ ఈశ తత్కృతా లోభాదయో యేऽబుధలిన్గభావాః
తథాపి దణ్డం భగవాన్బిభర్తి ధర్మస్య గుప్త్యై ఖలనిగ్రహాయ

జ్ఞ్యానం లేని వారికి కలిగేదే కామ క్రోధాధులు. మాలాంటి దుర్మార్గులను నిగ్రహించడానికీ ధర్మ రక్షణకూ నీవు దండిస్తావు.

పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్తదణ్డః
హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్జగదీశమానినామ్

నీవే తండ్రివీ గురువువూ జగన్నాధుడివి. నీవే కాలానివీ, దండం విధించేవాడివి, లోకహితంకోసం అనుకున్న రూపముతో అవతరిస్తున్నావు. మేము లోకేశులం అని గర్వించే వారి గర్వాన్ని అణచడానికి అవతరిస్తున్నావు. నాలాంటి అజ్ఞ్యానులు మేమే లోకేశులం అని గర్వించి నిన్ను చూసి అభయాన్ని పొందుతున్నాము

యే మద్విధాజ్ఞా జగదీశమానినస్త్వాం వీక్ష్య కాలేऽభయమాశు తన్మదమ్
హిత్వార్యమార్గం ప్రభజన్త్యపస్మయా ఈహా ఖలానామపి తేऽనుశాసనమ్

ఎలా సాధువులను కాపాడతావో దుష్టులనుకూడా వారి గర్వాన్ని అణచి కాపాడతావు

స త్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తేऽవిదుషః ప్రభావమ్
క్షన్తుం ప్రభోऽథార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశ మేऽసతీ

ఐశ్వర్య మదముతో ఉన్న నేను గర్వించి తప్పు చేసాను. నీ ప్రభావాన్ని తెలియని నా అపరాధాన్ని క్షమించండి.నా గర్వాన్ని నీవు అణచావు

తవావతారోऽయమధోక్షజేహ భువో భరాణామురుభారజన్మనామ్
చమూపతీనామభవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినామ్

తమనే తాము పోషించుకుంటున్నామనే గర్వముతో భూమికి భారం కలిగించే సేనాధిపతులనూ రాక్షసులనూ రాజులను సంహరించి నీ పాదాలను చేరిన వారికి క్షేమం కలిగించడానికి నీ అవతారం . మహానుభావుడవైన పరమాత్మా నీకు నమస్కారం. వాసుదేవ కృష్ణ పరమాత్మకు నమస్కారం

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే
వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః

స్వచ్ఛన్దోపాత్తదేహాయ విశుద్ధజ్ఞానమూర్తయే
సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః

నీకుగా నీవు సంకల్పించుకుని దేహాన్ని తెచ్చుకున్నావు విశుద్ధ జ్ఞ్యాన స్వరూపిడివి, అన్నీ నీవే , అన్ని బీజములూ , అన్ని ప్రాణుల స్వరూపాలూ నీవే. నేను ఈ వ్రేపల్లెను ధ్వంసం చేయాలని ధారాపాతములతో వర్షించాను. కోపముతో గర్వముతో ఈ పని చెస్తే, అలాంటి నన్ను కూడా నీవు  అనుగ్రహించావు. నా గర్వం అంతా ధ్వంసం అయ్యింది, నా ప్రయత్నం వ్యర్థమయ్యింది. పరమాత్మవూ గురువువూ స్వామివీ ఐన నిన్ను శరణు వేడుతున్నాను.

మయేదం భగవన్గోష్ఠ నాశాయాసారవాయుభిః
చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా

త్వయేశానుగృహీతోऽస్మి ధ్వస్తస్తమ్భో వృథోద్యమః
ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః

శ్రీశుక ఉవాచ
ఏవం సఙ్కీర్తితః కృష్ణో మఘోనా భగవానముమ్
మేఘగమ్భీరయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్

ఇలా ఇంద్రుడు స్తోత్రం చేస్తే మేఘ గంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
మయా తేऽకారి మఘవన్మఖభఙ్గోऽనుగృహ్ణతా
మదనుస్మృతయే నిత్యం మత్తస్యేన్ద్రశ్రియా భృశమ్

నిన్ను అనుగ్రహించ దలచే నీ యజ్ఞ్యాన్ని నేను భంగం చేసాను. నేనే ఇంద్రున్నని ఐశ్వర్య గర్వం పెరిగి నన్ను మరచావు. మళ్ళీ  నన్ను జ్ఞ్యాపకం ఉంచుకోవడానికీ నిరంతరం నన్ను స్మరించడానికీ ఇలా చేసాను.

మామైశ్వర్యశ్రీమదాన్ధో దణ్డ పాణిం న పశ్యతి
తం భ్రంశయామి సమ్పద్భ్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహమ్

ఐశ్వర్య శ్రీ మదముతో ఉన్నవాడు చేసిన తప్పుకు నిరంతరం శిక్ష వేయడానికి దండధారి అయి సిద్ధముగా ఉంటాను. ఐశ్వర్య మద మత్తులకు ఈ విషయం తెలియదు.

నేను ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వారిని సంపదలనుండి భ్రష్టు పట్టిస్తాను

గమ్యతాం శక్ర భద్రం వః క్రియతాం మేऽనుశాసనమ్
స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వః స్తమ్భవర్జితైః

స్వర్గానికి వెళ్ళి నేను చెప్పినట్లు విను. నా శాసనాన్ని పాలించు. నీ ధర్మం నీవు చేయి. గర్వం లేకుండా మీ మీ అధికారాలలో ఉండండి. బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించండి

అథాహ సురభిః కృష్ణమభివన్ద్య మనస్వినీ
స్వసన్తానైరుపామన్త్ర్య గోపరూపిణమీశ్వరమ్

అపుడు కామధేనువు పరమాత్మకు నమస్కరించి తన సంతానమైన గోవులతో కలసి, గోరూపి ఐన ఈశ్వరునికి

సురభిరువాచ
కృష్ణ కృష్ణ మహాయోగిన్విశ్వాత్మన్విశ్వసమ్భవ
భవతా లోకనాథేన సనాథా వయమచ్యుత

త్వం నః పరమకం దైవం త్వం న ఇన్ద్రో జగత్పతే
భవాయ భవ గోవిప్ర దేవానాం యే చ సాధవః

పరమాత్మ సకల జగద్స్వరూపా, మహాయోగీ, సకల ప్రపంచాన్నీ సృష్టించిన వాడా, నీలాంటి లోకనాధులు ఉండడం వలనే మేము సనాధులం (దిక్కు ఉన్నవారం) అయ్యాము. నీవే పరదైవానివి, నీవే మాకు ఇంద్రుడవు
గోవులకూ బ్రాహ్మణులకూ దేవతలకూ సజ్జనులకూ క్షేమాన్ని ప్రసాదించు

ఇన్ద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణా చోదితా వయమ్
అవతీర్ణోऽసి విశ్వాత్మన్భూమేర్భారాపనుత్తయే

చతుర్ముఖ బ్రహ్మ మమ్ము పంపాడు నీకు గోవిందుడిగా అభిషేకం చేయమని. భూభారాన్ని తొలగించడానికి నీవు అవతరించావు. అటువంటి నిన్ను మేము పూజిస్తాము.

శృశుక ఉవాచ
ఏవం కృష్ణముపామన్త్ర్య సురభిః పయసాత్మనః
జలైరాకాశగఙ్గాయా ఐరావతకరోద్ధృతైః

ఐరావతం తన తొండములతో ఆకాశ గంగను చిమ్మింది. కామధేనువు తన పాలతో

ఇన్ద్రః సురర్షిభిః సాకం చోదితో దేవమాతృభిః
అభ్యసిఞ్చత దాశార్హం గోవిన్ద ఇతి చాభ్యధాత్

దేవేంద్రుడు సకల దేవతా ఋషులతో దేవమాతలతో కలసి , దేవర్షులూ దిగ్పాలకులూ కలసి స్వామిని గోవిందుడిగా అభిషేకం చేసారు.

తత్రాగతాస్తుమ్బురునారదాదయో గన్ధర్వవిద్యాధరసిద్ధచారణాః
జగుర్యశో లోకమలాపహం హరేః సురాఙ్గనాః సన్ననృతుర్ముదాన్వితాః

పరమాత్మకు అభిషేకం జరుగుతూ ఉంటే తుంబురు నారదాదులూ గంధర్వ సిద్ధ చరణాదులూ విద్యాధరులూ  మొదలైన వారు ఆయన కీర్తిని గానం చేసారు
దేవతా స్త్రీలు నాట్యం చేసారు

తం తుష్టువుర్దేవనికాయకేతవో హ్యవాకిరంశ్చాద్భుతపుష్పవృష్టిభిః
లోకాః పరాం నిర్వృతిమాప్నువంస్త్రయో గావస్తదా గామనయన్పయోద్రుతామ్

అఖిల దేవతా లోకాలలో ఉండే దేవతలనదరూ ఏకకంఠముతో పరమాత్మను స్తోత్రం చేసారు. లెక్కలేనన్ని పుష్పాలతో స్వామిని కప్పేసారు,పూలతో ఉన్న గోవర్ధనములా ఉన్నాడు స్వామి
మూడు లోకాలూ ఎన్నడూ లేని ఆనందాన్ని పొందాయి. భూలోకం మొత్తం గోవుల పాలతో నిండిపోయింది. అన్ని గోవులూ పాలను  వర్షించాయి.  ఆకాశమునుండి ఆకాశగంగ, కామధేనువు. 

నానారసౌఘాః సరితో వృక్షా ఆసన్మధుస్రవాః
అకృష్టపచ్యౌషధయో గిరయోऽబిభ్రనున్మణీన్

అంతేకాకుండా ఎక్కడెక్కడి నదులూ కూడా తమ రసాన్ని తీసుకు వచ్చి అభిషేకం చేసాయి, చెట్లు తీగలతో, పళ్ళు తన రసాలతో అభిషేకం చేయాసి. అన్ని వనస్పతులు వనౌషధములూ నదులు వృక్షములూ పర్వతములూ, పర్వతాలు తమ  పర్వత ప్రాంతాలలో ఉన్న తేనెను స్వామి మీద కురిపించాయి. మూడు లోకాలలో ఉన్న అనంతమైన దేవతలూ ఋషులు అందరూ అభిషేకం చేసారు. గోలోకమే భూలోకమయ్యిందేమో అనిపించేట్లుగా ఉంది. ఈ అనుభూతి వచ్చిన వారందరూ పొందారు.

కృష్ణేऽభిషిక్త ఏతాని సర్వాణి కురునన్దన
నిర్వైరాణ్యభవంస్తాత క్రూరాణ్యపి నిసర్గతః

భూమి దున్నకుండానే విత్తనం వేయకుండానే ఇంతకాలం చుట్టుపక్కల వారు ఏ ఏ పంటలు వేసారో ఆ పంటలన్నీ భూమిని పెకిలించుకుని వచ్చి స్వామిని అభిషేకించాయి.పాలూ నీరూ పళ్ళూ అమృతం తేనే, దున్నకుండానే పంటపండి ధాన్యం ,
ఏనుగులు కూడా మదజలాన్ని తెచ్చి వర్షించాయి. (పాద్మములో చెప్పబడి ఉంది - ఆ ఏనుగులను సింహాలు మోసుకుని వచ్చాయి మద జలం వర్షించమని. కృరమృగాలు కూడా సహజముగానే తమ వైరాన్ని విడిచిపెట్టాయి, )చెట్లూ పుట్టలూ గుహలూ గనులూ అన్నీ వచ్చాయి. 

ఇతి గోగోకులపతిం గోవిన్దమభిషిచ్య సః
అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివమ్

గోకుల పతి ఐన స్వామిని గోవిందుడిగా అభిషేకం చేసాయి. చేసిన తరువాత స్వామి వద్ద ఆజ్ఞ్య పొంది అందరినీ తీసుకుని ఎంత వేగముగా వచ్చారో అంత వేగముగా తమ లోకాలకు వెళ్ళారు. 

                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

           

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః 


ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంభుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమ




ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః


)

ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః




ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః

ఓం ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః నమః ........!


శ్రీ కృష్ణ ప్రార్ధన



కృష్ణో రక్షతునోజగత్రయగురుః కృష్ణం నమస్యమ్యహం

కృష్ణేనామరశ్త్రవో వినిహతాః కృష్ణాయ తస్త్మైనమః

కృష్ణా దేవ సముత్ధితాం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం

కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ! రక్షస్వమాం...!

పురుషసూక్తమ్









అథ పురుషసూక్తమ్ ||
 
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీ స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |

హరిః ఓం |
ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాంగులమ్ | ౧
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్|
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ౨
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ౩
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విశ్వజ్‍వ్యక్రామత్ | సాశనానశనే అభి | ౪
తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ౫
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసంతో అస్యాసీదాజ్యమ్| గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః | ౬
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ౭
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్| పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే | ౮
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ౯
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్‍ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ౧౦
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ౧౧
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ౧౨
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‍ం శూద్రో అజాయత | ౧౩
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ |  ప్రాణాద్వాయురజాయత | ౧౪
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్‍ం అకల్పయన్ | ౧౫
వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే| ౧౬
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే | ౧౭
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః | ౧౮

|| ఓం నమో నారాయణాయ ||

|| ఉత్తరనారాయణమ్ ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే | ౧
వేదాహమేతం పురుషం మహాన్తమ్| ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా విద్యతేయఽనాయ | ౨
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్| మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః | ౩
యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | ౪
రుచం బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే| ౫
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ| అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్|  ఇష్టమ్ మనిషాణ |
అముం మనిషాణ|  సర్వమ్  మనిషాణ | ౬

ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీస్స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

తాత్పర్యము: 

భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.

మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.

ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.

భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.

ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.

భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం  నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.

ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.

మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).

ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.

ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.

అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.

బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి?

ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.

మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.

నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.

సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.

ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.

దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.

(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).

నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.

మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.

భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.

ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో,  దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."

హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.

ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.

ఓం శాంతి శాంతి శాంతి

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదమూడవ అధ్యాయం


                   ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదమూడవ అధ్యాయం
సూత ఉవాచ
యం బ్రహ్మా వరుణేన్ద్రరుద్రమరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైర్
వేదైః సాఙ్గపదక్రమోపనిషదైర్గాయన్తి యం సామగాః
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యన్తి యం యోగినో
యస్యాన్తం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః

బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు తన దివ్య స్తోత్రముతో ఎవరిని స్తోత్రం చేస్తారో
సామగానములు చేసే వారు ఎవరిని వేదములూ ఉపనిషత్తులూ (అందులో పదములూ క్రమములూ, వేదాంగములంటే శిక్ష వ్యాకరణం చంద్ర నిరుక్తం జ్యోతిషం కల్ప) ఎవరిని గానం చేస్తారో
యోగులు ఆయన యందే మనసు ఉంచి ధ్యానముతో ఎవరిని చూస్తారో
సకల దేవ దానవాది గణములు ఎవరి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలియలేరో అలాంటి పరమాత్మకు నమస్కారం

పృష్ఠే భ్రామ్యదమన్దమన్దరగిరిగ్రావాగ్రకణ్డూయనాన్
నిద్రాలోః కమఠాకృతేర్భగవతః శ్వాసానిలాః పాన్తు వః
యత్సంస్కారకలానువర్తనవశాద్వేలానిభేనామ్భసాం
యాతాయాతమతన్ద్రితం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతి

కూర్మభగవానుని ఉచ్చావస నిశ్వాసలు మమ్ము కాపాడు గాక.
తన వీపు మీద చాలా గొప్పదైన మదర గిరి పర్వతాన్ని దేవతలూ రాక్షసులూ తిప్పితే ఆయన వీపు దురద పోయి బాగా నిద్రపోయాడు. ఆయన శ్వాస వాయువులు మమ్ము కాపాడు గాక.
ఈ కూర్మ అవతారములో కూర్మ పీఠం మీద మందర పర్వతాన్ని పెట్టి అటూ ఇటూ లాగుతూ ఉంటే , ఇటు లాగుతున్నపుడు వెనక్కు వెళుతూ ఉన్నాయి, అటు లాగినపుడు ముందుకు వెళుతున్నాయి. ఆ సముద్రపు తరంగముల రాకపోకలు నేటికీ ఆగలేదు. ఆ రాకా పోకా తరంగాలు ఇప్పటికీ సందురానికి అలల రూపములో అలాగే ఉన్నాయి.

పురాణసఙ్ఖ్యాసమ్భూతిమస్య వాచ్యప్రయోజనే
దానం దానస్య మాహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత

పురాణాల గురించి చెబుతాను వినండి. ఏ పురాణములో ఎన్ని శ్లోకాలూ ఏ పురాణం ఎలా చదవాలో చెబుతాను వినండి

బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పఞ్చోనషష్టి చ
శ్రీవైష్ణవం త్రయోవింశచ్చతుర్వింశతి శైవకమ్

బ్రహ్మ పురాణం పదివేలూ
పద్మ పురాణం యాభై ఐదు వేలు
విష్ణు పురాణం ఇరవై మూడు వేలు
శివ పురాణం ఇరవై నాలుగు వేలు

దశాష్టౌ శ్రీభాగవతం నారదం పఞ్చవింశతి
మార్కణ్డం నవ వాహ్నం చ దశపఞ్చ చతుఃశతమ్

భాగవతం పద్దెనిమిది వేలు
నారద పురాణం ఇరవై ఐదు వేలు
మార్కండేయ పురాణం తొమ్మిది వేలు
అగ్ని పురాణం పదిహేను వేలు, దాని మీద మరో నాలుగు వందలు

చతుర్దశ భవిష్యం స్యాత్తథా పఞ్చశతాని చ
దశాష్టౌ బ్రహ్మవైవర్తం లైఙ్గమేకాదశైవ తు

భవిష్య పురాణం పధ్నాలుగు వేల ఐదు వందలు
బ్రహ్మ వైవర్తపురాణం పద్దెనిమిది వేలు
లింగ పురాణం పదకొండు వేలు
చతుర్వింశతి వారాహమేకాశీతిసహస్రకమ్
స్కాన్దం శతం తథా చైకం వామనం దశ కీర్తితమ్

వారాహ పురాణం ఇరవై నాలుగు వేలు
స్కంధ పురాణం ఎనభై యొక్క వేలు
వామన పురాణం పదివేలు

కౌర్మం సప్తదశాఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్దశ
ఏకోనవింశత్సౌపర్ణం బ్రహ్మాణ్డం ద్వాదశైవ తు

కూరమం పదిహేడు వేలు
మాత్స్యం పధ్నాలుగు వేలు
గరుడ పురాణం పంతొమ్మిది వేలు
బ్రహ్మాండం పన్నెండు వేలు

ఏవం పురాణసన్దోహశ్చతుర్లక్ష ఉదాహృతః
తత్రాష్టదశసాహస్రం శ్రీభాగవతం ఇష్యతే

మొత్తం పద్దెనిమిది పురాణాలలో కలసి నాలుగు లక్షల శ్లోకాలు చెప్పబడినవి
అందులో పద్దెనిమిది వేల శ్లోకాలు గలవు

ఇదం భగవతా పూర్వం బ్రహ్మణే నాభిపఙ్కజే
స్థితాయ భవభీతాయ కారుణ్యాత్సమ్ప్రకాశితమ్

ఈ భాగవతాన్ని మొదలు శ్రీమన్నారాయణుడు తన నాభినుండి పుట్టిన బ్రహ్మకు దయతో చెప్పాడు

ఆదిమధ్యావసానేషు వైరాగ్యాఖ్యానసంయుతమ్
హరిలీలాకథావ్రాతా మృతానన్దితసత్సురమ్

ఈ భాగవతానికి మొదలు మధ్యా చివరా అంతా వైరాగ్యమే.
హరి లీల అనే మహా కథా సమూహ అమృతముతో దేవతలను కూడా ఆనందింపచేసినది

సర్వవేదాన్తసారం యద్బ్రహ్మాత్మైకత్వలక్షణమ్
వస్త్వద్వితీయం తన్నిష్ఠం కైవల్యైకప్రయోజనమ్

సర్వ వేదాంత సారము. పర బ్రహ్మ స్వరూపాన్ని పరిపూర్ణముగా చెప్పింది
ఈ భాగవతానికి మోక్షం మాత్రమే ఫలం

ప్రౌష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహసమన్వితమ్
దదాతి యో భాగవతం స యాతి పరమాం గతిమ్

భాద్రపద పూర్ణిమ నాడు బంగారు సింహాసనం మీద ఎవరు భాగవతాన్ని ఇస్తారో వారు ఉత్తమ గతిని పొందుతారు

రాజన్తే తావదన్యాని పురాణాని సతాం గణే
యావద్భాగవతం నైవ శ్రూయతేऽమృతసాగరమ్

శ్రీమద్భాగవతం ప్రకాశించనంత వరకూ చెప్పనంత వరకూ విననంతవరకూ తక్కిన పురాణాలన్నీ బాగుంటాయి
భాగవత రసామృతముతో తృప్తి పొందినవారికి మరి ఏది విన్నా తృప్తి కలుగదు

సర్వవేదాన్తసారం హి శ్రీభాగవతమిష్యతే
తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్

నిమ్నగానాం యథా గఙ్గా దేవానామచ్యుతో యథా
వైష్ణవానాం యథా శమ్భుః పురాణానామిదమ్తథా

నదులలో ఎలా గంగ ఉత్తమమో
దేవతలలో విష్ణువు ఎలా ఉత్తముడో
వైష్ణవులలో శంకరుడు ఎలా ఉత్తముడో
పురాణాలలో భాగవతం అంత ఉత్తమం

క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ హ్యనుత్తమా
తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః

కాశీ ఎలా అన్ని క్షేత్రాలలో ఉత్తమమో అన్ని పురాణాలలో శ్రీమద్భాగవతం శ్రేష్టము

శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం
యస్మిన్పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే
తత్ర జ్ఞానవిరాగభక్తిసహితం నైష్కర్మ్యమావిస్కృతం
తచ్ఛృణ్వన్సుపఠన్విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః

ఇది పరిశుద్ధమైన పురాణం
విష్ణు భక్తులకు అత్యంత ప్రీతి పాత్రం
పరమ హంసలు అనుసరించదగిన అనుసరించవలసిన అవలంబించదగిన ఉత్తమ జ్ఞ్యానం గానం చేయబడుతున్నది
ఈ భాగవతములో జ్ఞ్యానమూ భక్తీ విరాగమూ వీటితో కూడుకున్న నివృత్తి ధర్మం బోధించబడుతున్నది
భాగవతాన్ని విన్నా చదివినా పరిశీలించినా (భక్తితో) జీవుడు ముక్తి పొందుతాడు

కస్మై యేన విభాసితోऽయమతులో జ్ఞానప్రదీపః పురా
తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా
యోగీన్ద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతస్
తచ్ఛుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి

ఈ శ్లోకాన్ని రోజూ చదువుకోవాలి
దీన్ని బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు చెప్పాడు
ఆ బ్రహ్మ నారదునికి చెప్పాడు
ఆ నారదుడు వ్యాసునికి చెప్పాడు
ఆ వ్యాసుడు శుకమహర్షికీ ఆ శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు దయతో చెప్పాడు
ఇది పరిశుద్ధమైనది ఎలాంటి మురికీ దుఃఖమూ లేనిది
మోక్షమును ఇచ్చేది, పరమైన పరబ్రహ్మ ఐన సత్యమైన, పరమైన, పరబ్రహ్మ రూపమైన భాగవతాన్ని ధ్యానిస్తున్నాను. పరమాత్మ రూపమైన భాగవతన్ని ధ్యానం చేస్తున్నాను

నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే
య ఇదమ్కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే

సకల జగత్సాక్షి ఐన పరమాత్మ వాసుదేవునికి నమస్కారం
ఆయన దయతో తన పుత్రుడైన మోక్షం కోరిన బ్రహ్మకు చెప్పాడు

యోగీన్ద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే
సంసారసర్పదష్టం యో విష్ణురాతమమూముచత్

శుకబ్రహ్మ, యోగీంద్రుడు. ఆయనకు నమస్కరిస్తున్నాను.
సంసారమనే మహాసర్పం కాటు వేసిన పరీక్షిత్తును మోక్షానికి పంపించిన శుకయోగీంద్రునికి నమస్కారం.సకల జీవులనూ మోక్షానికి పంపించేది శ్రీమద్భాగవతం

భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే
తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో

ఈ శ్లోకాన్ని కూడా రోజూ చదువుకోవాలి
నన్ను ఎన్ని సార్లైనా పుట్టించు. ప్రతీ జన్మలో నీ పాదముల మీదే భక్తి కలిగేలా అనుగ్రహించు.
ఎన్ని జన్మలైనా కానీ,నాకు నీ పాదముల యందే భక్తి కలిగి ఉండాలి. నీవే మా నాథుడవు. నీవు మాకు ప్రభువువు కాబట్టి నీవు మాకు నీ మీద భక్తి ఇచ్చి తీరాలి.
ఎన్ని జన్మలైనా కానీ , నీ పాదముల మీద భక్తి ఉండాలి

నామసఙ్కీర్తనం యస్య సర్వపాప ప్రణాశనమ్
ప్రణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరమ్

ఏ పరమాత్మ నామ సంకీర్తనం అన్ని పాపాలనూ పోగొడుతుందో, ఎవరికి నమస్కరిస్తే అన్ని దుఃఖాలూ పోతాయో, అలాంటి హరి పాదాలకు నమస్కరిస్తున్నాను.
 
                             ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసిక్యాం అష్టాదశ సాహస్ర్యాయాం పారమహంస్యాం ద్వాదశ స్కంధే త్రయోదశ అధ్యాయః ద్వాదశ స్కంధః అయం గ్రధస్య ఓం తత్ సత్.

                                              శ్రీ శుకబ్రహ్మణే నమః
                                              శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం

      

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం


సూత ఉవాచ
నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే
బ్రహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్వక్ష్యే సనాతనాన్

పరమాత్మకు నమస్కారము. ఇంతవరకూ భాగవతములో ఏమేమి చదువుకున్నామో అది చెబుతున్నారు.

ఏతద్వః కథితం విప్రా విష్ణోశ్చరితమద్భుతమ్
భవద్భిర్యదహం పృష్టో నరాణాం పురుషోచితమ్

పరమాత్మ యొక్క అద్భుత చరిత చెబుతున్నాను
మానవులుగా పుట్టినవారు తమ జీవితములో చేయదగినది ఏది అని అడిగారు.

అత్ర సఙ్కీర్తితః సాక్షాత్సర్వపాపహరో హరిః
నారాయణో హృషీకేశో భగవాన్సాత్వతామ్పతిః

ఈ భాగవతములో మీ ప్రశ్నకు సమాధానముగా సకలపాపములనూ నశింపచేసే శ్రీమన్నారాయణుడు కీర్తించబడ్డాడు.

అత్ర బ్రహ్మ పరం గుహ్యం జగతః ప్రభవాప్యయమ్
జ్ఞానం చ తదుపాఖ్యానం ప్రోక్తం విజ్ఞానసంయుతమ్

సకల జగత్తు యొక్క సృష్టి సంహార కారణమైన పరమ రహస్యమైన పరమాత్మ, ఆయన చరిత్ర అనే జ్ఞ్యానాన్ని నేను చెప్పాను

భక్తియోగః సమాఖ్యాతో వైరాగ్యం చ తదాశ్రయమ్
పారీక్షితముపాఖ్యానం నారదాఖ్యానమేవ చ

భాగవతములో భక్తి యోగాన్ని చెప్పాను.దాని వలన వైరాగ్యం వస్తుంది.
పరీక్షిత్తు కథా నారదుని కథా

ప్రాయోపవేశో రాజర్షేర్విప్రశాపాత్పరీక్షితః
శుకస్య బ్రహ్మర్షభస్య సంవాదశ్చ పరీక్షితః

పరీక్షిత్తు ప్రాయోపవేశము
శుకబ్రహ్మ రావడమూ

యోగధారణయోత్క్రాన్తిః సంవాదో నారదాజయోః
అవతారానుగీతం చ సర్గః ప్రాధానికోऽగ్రతః

బ్రహ్మ నారదుల సంవాదమూ
పరమాత్మ ఇర్వై నాలుగు అవతార గీతమూ
ప్రకృతి సృష్టి

విదురోద్ధవసంవాదః క్షత్తృమైత్రేయయోస్తతః
పురాణసంహితాప్రశ్నో మహాపురుషసంస్థితిః

విదుర ఉద్ధవ సంవాదమూ, విదుర మైత్రేయుని సంవాదమూ
పురాణ సంహిత ప్రశ్న, మహా పురుష సంస్థుతి

తతః ప్రాకృతికః సర్గః సప్త వైకృతికాశ్చ యే
తతో బ్రహ్మాణ్డసమ్భూతిర్వైరాజః పురుషో యతః

ప్రకృతి సృష్టి, బ్రహ్మాణ్డమూ

కాలస్య స్థూలసూక్ష్మస్య గతిః పద్మసముద్భవః
భువ ఉద్ధరణేऽమ్భోధేర్హిరణ్యాక్షవధో యథా

విరాట్ పురుషుడూ
కాలం యొక్క లెక్కలూ, పద్మకోశమూ
భూమి యొక్క ఉద్ధరణ (వరాహ అవతారం)
హిరణ్యాక్ష వధా

ఊర్ధ్వతిర్యగవాక్సర్గో రుద్రసర్గస్తథైవ చ
అర్ధనారీశ్వరస్యాథ యతః స్వాయమ్భువో మనుః

పశు పక్షాదుల దేవతలా మానవుల సృష్టీ
శివుని సృష్టి
స్వాయంభువ మనువూ

శతరూపా చ యా స్త్రీణామాద్యా ప్రకృతిరుత్తమా
సన్తానో ధర్మపత్నీనాం కర్దమస్య ప్రజాపతేః

కర్దముని గాధ, కపిల ముని అవతారమూ

అవతారో భగవతః కపిలస్య మహాత్మనః
దేవహూత్యాశ్చ సంవాదః కపిలేన చ ధీమతా

కపిల దేవహూతి సంవాదమూ, దక్ష యజ్ఞ్య వినాశనం

నవబ్రహ్మసముత్పత్తిర్దక్షయజ్ఞవినాశనమ్
ధ్రువస్య చరితం పశ్చాత్పృథోః ప్రాచీనబర్హిషః

ద్రువుని చరిత్ర పృధు చైర్తం
ప్రాచీన బర్హి,

నారదస్య చ సంవాదస్తతః ప్రైయవ్రతం ద్విజాః
నాభేస్తతోऽనుచరితమృషభస్య భరతస్య చ

నారదునితో సంవాదము
ప్రియవ్రతుని ఉపాఖ్యానమూ
నాభీ చరితం
వృషభునీ భరతుని చరితమూ

ద్వీపవర్షసముద్రాణాం గిరినద్యుపవర్ణనమ్
జ్యోతిశ్చక్రస్య సంస్థానం పాతాలనరకస్థితిః

ద్వీప వర్ష సముద్రాలూ గిరులూ మొదలైనవాటి వర్ణనం
ఆకాశం నక్షత్రలూ గ్రహాల గురించీ
నరకాల గురించీ

దక్షజన్మ ప్రచేతోభ్యస్తత్పుత్రీణాం చ సన్తతిః
యతో దేవాసురనరాస్తిర్యఙ్నగఖగాదయః

దక్షపుత్రికల సంతానమైన దేవతలూ రాక్షసులూ పశువులూ పక్షులూ పాములూ

త్వాష్ట్రస్య జన్మనిధనం పుత్రయోశ్చ దితేర్ద్విజాః
దైత్యేశ్వరస్య చరితం ప్రహ్రాదస్య మహాత్మనః

వృత్తాసురుడూఉ, దితి యొక్క పుత్రుల మరణమూ
మహాత్ముడైన ప్రహ్లాద చరిత్ర

మన్వన్తరానుకథనం గజేన్ద్రస్య విమోక్షణమ్
మన్వన్తరావతారాశ్చ విష్ణోర్హయశిరాదయః

మన్వంతరాల చరితమూ, గజేంద్రమోక్షమూ
విష్ణువు యొక్క హయగ్రీవ అవతారం

కౌర్మం మాత్స్యం ధాన్వంతరం వామనం చ జగత్పతేః
క్షీరోదమథనం తద్వదమృతార్థే దివౌకసామ్

కూర్మ అవతారం, మత్స్య అవతారం, నారసింహ అవతారం ధన్వతరం
వామనం, క్షీరసాగర మధనం,

దేవాసురమహాయుద్ధం రాజవంశానుకీర్తనమ్
ఇక్ష్వాకుజన్మ తద్వంశః సుద్యుమ్నస్య మహాత్మనః

దేవాసుర యుద్ధం, రాజ వంశముల కీర్తనము
ఇక్ష్వాకు జన్మా సుద్యుమ్నుడూ

ఇలోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ
సూర్యవంశానుకథనం శశాదాద్యా నృగాదయః

ఇలోపాఖ్యానం, తారోపాఖ్యానం
సూర్య వంశ రాజుల కథనం
నృగుని చరితమూ

సౌకన్యం చాథ శర్యాతేః కకుత్స్థస్య చ ధీమతః
ఖట్వాఙ్గస్య చ మాన్ధాతుః సౌభరేః సగరస్య చ

సుకన్య చరితము, శర్యాతి, కకుత్సుడు, ఖట్వాంగుడు, మాంధాత సౌభరి సగరుడు

రామస్య కోశలేన్ద్రస్య చరితం కిల్బిషాపహమ్
నిమేరఙ్గపరిత్యాగో జనకానాం చ సమ్భవః

రామ చరితం
నిమి యొక్క దేహ పరిత్యాగము

రామస్య భార్గవేన్ద్రస్య నిఃక్షతృకరణం భువః
ఐలస్య సోమవంశస్య యయాతేర్నహుషస్య చ

పరశురాముని చరితం
పురూరవుని చరితము
యయాతి నహుషుడూ

దౌష్మన్తేర్భరతస్యాపి శాన్తనోస్తత్సుతస్య చ
యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశోऽనుకీర్తితః

భరతుని చరితమూ శంతనుని చరితమూ
యదువంశము

యత్రావతీఋణో భగవాన్కృష్ణాఖ్యో జగదీశ్వరః
వసుదేవగృహే జన్మ తతో వృద్ధిశ్చ గోకులే

ఈ యదువంశములో పరమాత్మ అవతరించాడు
ఇక్కడ పుట్టి గోకులములో పెరిగాడు

తస్య కర్మాణ్యపారాణి కీర్తితాన్యసురద్విషః
పూతనాసుపయఃపానం శకటోచ్చాటనం శిశోః

పరమాత్మ యొక్క అనంతమైన కథలు చెప్పుకున్నాము
పూతన పాలు తాగి చంపుట, శకటాసుర వధ

తృణావర్తస్య నిష్పేషస్తథైవ బకవత్సయోః
అఘాసురవధో ధాత్రా వత్సపాలావగూహనమ్

తృణావర్తుని వధా, బకాసుర వత్సాసుర వధా
అఘాసుర వధ,దేనుకాసుర వధ

ధేనుకస్య సహభ్రాతుః ప్రలమ్బస్య చ సఙ్క్షయః
గోపానాం చ పరిత్రాణం దావాగ్నేః పరిసర్పతః

ప్రలభాస్రుఇని వధా
దావానలం నుంచి గోపులను కాపాడుట

దమనం కాలియస్యాహేర్మహాహేర్నన్దమోక్షణమ్
వ్రతచర్యా తు కన్యానాం యత్ర తుష్టోऽచ్యుతో వ్రతైః

కాలీయ దమనం
నందున్ని పాము నోటిలోంచి రక్షించుట
గోపికల చరిత

ప్రసాదో యజ్ఞపత్నీభ్యో విప్రాణాం చానుతాపనమ్
గోవర్ధనోద్ధారణం చ శక్రస్య సురభేరథ

కృష్ణుడు సంతోషించి యజ్ఞ్యపత్నులను అనుగ్రహించుట
గోవర్ధనోద్ధారము
గోవింద పట్టాభిషేకము

యజ్ఞభిషేకః కృష్ణస్య స్త్రీభిః క్రీడా చ రాత్రిషు
శఙ్ఖచూడస్య దుర్బుద్ధేర్వధోऽరిష్టస్య కేశినః

రాసలీల,
శంఖచూడుని వధా, అరిష్ట, కేశి వధలు

అక్రూరాగమనం పశ్చాత్ప్రస్థానం రామకృష్ణయోః
వ్రజస్త్రీణాం విలాపశ్చ మథురాలోకనం తతః

అకౄర ఆగమనం, బలరామ కృష్ణులను వెంట తీసుకుని వెళ్ళుట
వ్రజ స్త్రీలు విలపించుట, కృష్ణుడూ బలరాముడూ మధురానగరికి వెళ్ళుట

గజముష్టికచాణూర కంసాదీనాం తథా వధః
మృతస్యానయనం సూనోః పునః సాన్దీపనేర్గురోః

గజ ముష్ఠిక చాణూరుల వధ
కంస వధ
గురుపుత్రున్ని తీసుకుని వచ్చుట

మథురాయాం నివసతా యదుచక్రస్య యత్ప్రియమ్
కృతముద్ధవరామాభ్యాం యుతేన హరిణా ద్విజాః

కృష్ణుడూ బలరాముడూ ఉద్ధవుడూ కలసి ద్వారకా నగరములో యాదవులకు ప్రియాన్ని ఆచరించుట

జరాసన్ధసమానీత సైన్యస్య బహుశో వధః
ఘాతనం యవనేన్ద్రస్య కుశస్థల్యా నివేశనమ్

జరాసంధుని  సైన్య వధా,
కాలయవనుడి వధా
ద్వారక నిర్మాణం

ఆదానం పారిజాతస్య సుధర్మాయాః సురాలయాత్
రుక్మిణ్యా హరణం యుద్ధే ప్రమథ్య ద్విషతో హరేః

పారిజాతమును తీసుకు వచ్చుట
రుక్మిణీ కళ్యాణం,

హరస్య జృమ్భణం యుద్ధే బాణస్య భుజకృన్తనమ్
ప్రాగ్జ్యోతిషపతిం హత్వా కన్యానాం హరణం చ యత్

బాణాసుర వధ,
నరకాసుర సంహారం, కన్యల విముక్తి

చైద్యపౌణ్డ్రకశాల్వానాం దన్తవక్రస్య దుర్మతేః
శమ్బరో ద్వివిదః పీఠో మురః పఞ్చజనాదయః

చేది(శిశుపాలుడూ) పౌండ్రక శాల్వ దంతవక్త్ర వధ
శంబర ద్వివిద ముర పీఠ పంచజనుడి వధ

మాహాత్మ్యం చ వధస్తేషాం వారాణస్యాశ్చ దాహనమ్
భారావతరణం భూమేర్నిమిత్తీకృత్య పాణ్డవాన్

కాశీని దహింపచేయుటా
పాండవులను నిమిత్తముగా చేసుకుని భూభారాన్ని కురుక్షేత్ర యుద్ధము ద్వారా తొలగించుట

విప్రశాపాపదేశేన సంహారః స్వకులస్య చ
ఉద్ధవస్య చ సంవాదో వసుదేవస్య చాద్భుతః

తన కులాన్ని కూడా సంహరించుట
ఉద్ధవ గీత,

యత్రాత్మవిద్యా హ్యఖిలా ప్రోక్తా ధర్మవినిర్ణయః
తతో మర్త్యపరిత్యాగ ఆత్మయోగానుభావతః

ధర్మ నిర్ణయమూ.
తన యోగముతో మర్త్యలోకాన్ని విడిచిపెట్టుట

యుగలక్షణవృత్తిశ్చ కలౌ నౄణాముపప్లవః
చతుర్విధశ్చ ప్రలయ ఉత్పత్తిస్త్రివిధా తథా

ఆయా యుగ లక్షణాలూ, మనవ ప్రవృత్తి
నాలుగు రకాల ప్రళయాలు, మూడు రకాల సృష్టి

దేహత్యాగశ్చ రాజర్షేర్విష్ణురాతస్య ధీమతః
శాఖాప్రణయనమృషేర్మార్కణ్డేయస్య సత్కథా
మహాపురుషవిన్యాసః సూర్యస్య జగదాత్మనః

పరీక్షిత్తు దేహ త్యాగమూ
వేద విభాగమూ, మార్కండేయుని సత్కథా
మహాపురుష లక్షణము సూర్యభగవానుని వైభవమూ

ఇతి చోక్తం ద్విజశ్రేష్ఠా యత్పృష్టోऽహమిహాస్మి వః
లీలావతారకర్మాణి కీర్తితానీహ సర్వశః

మీరు ఏమేమి అడిగారో అవి ఈ రీతిలో చెప్పాను
పరమాత్మ యొక్క లీలావతార కర్మల్ను చెప్పాను

పతితః స్ఖలితశ్చార్తః క్షుత్త్వా వా వివశో గృణన్
హరయే నమ ఇత్యుచ్చైర్ముచ్యతే సర్వపాతకాత్

అనుకున్నా అనుకోకున్నా తెలిసినా తెలియకున్నా, జారిపడబోతూ తుమ్ముతూ దగ్గుతూ తూలుతూ నిద్రపోతూ కలగంటూ పక్కవానితో మాట్లాడుతూ ఏ రకముగా ఐనా ఒక్కసారి సిగ్గు విడిచి పెట్టి పెద్దగా హరయే నమః అని ఒక్క సారి అంటే అన్ని పాపాలూ పోతాయి.
ఒక్క సారి అంటేనే అన్ని పాపాలు పోతాయి

సఙ్కీర్త్యమానో భగవాననన్తః శ్రుతానుభావో వ్యసనం హి పుంసామ్
ప్రవిశ్య చిత్తం విధునోత్యశేషం యథా తమోऽర్కోऽభ్రమివాతివాతః

పరమాత్మ సంకీర్త్యమానుడై ఆయన ప్రభావాన్ని వింటే చాలు మానవుల అన్ని పాపాలూ పోతాయి
ఆయన మనలోపలకి వెళ్ళి, మన హృదయములోకి వెళ్ళి అన్ని పాపాలనూ శేషం లేకుండా, సూర్యుడు చీకటిని పోగొట్టినట్లూ, పెద్దగాలి మేఘాలను పోగొట్టినట్లూ పరమాత్మ మన పాపాలను పోగొడతాడు

మృషా గిరస్తా హ్యసతీరసత్కథా న కథ్యతే యద్భగవానధోక్షజః
తదేవ సత్యం తదు హైవ మఙ్గలం తదేవ పుణ్యం భగవద్గుణోదయమ్

ఎక్కడ పరమాత్మ కథలు చెప్పబడవో
భగవంతుని వర్ణించని మాటలన్నీ అసత్యవాక్యాలు. అవి మంచి కథలు కావు. దుష్ట కథలు. అవన్నీ లేని కథలు.
ఎక్కడ పరమాత్మ గుణములను వృద్ధి పరుస్తూ వర్ణిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తామో అదే సత్యమూ అదే మంగళమూ అదే పుణ్యము

తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్మనసో మహోత్సవమ్
తదేవ శోకార్ణవశోషణం నృణాం యదుత్తమఃశ్లోకయశోऽనుగీయతే

అదే సుందరము, నిత్యనూతనమైనది. మనసుకు అదే పెద్ద పండుగ (భగవంతుని నామసంకీర్తన)
పరమాత్మ యొక్క కీర్తి ఎక్కడ గానం చేయబడుతుందొ మానవుల దుఃఖసాగరాన్ని ఇంకింపచేసేది, పాపాలను పోగొట్టేది.

న యద్వచశ్చిత్రపదం హరేర్యశో
జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్
తద్ధ్వాఙ్క్షతీఋథం న తు హంససేవితం
యత్రాచ్యుతస్తత్ర హి సాధవోऽమలాః

ఎక్కడ సకల లోకాలనూ పవిత్రం చేయబడే పరమ పావనమైన పరమాత్మ కీర్తి గానం చేయబడని వాక్కు వాక్కే కాదు. అది కాకులు తిరిగే మడుగు. రెక్కలు కూడా తడవంత తక్కువ నీరు ఉంటేనే కాకి వెళుతుంది. పరమాత్మ కథలు చెప్పని మాటలన్నీ చిన చిన్న మురికి గుంటలు. అక్కడ హంసలు సేవించవు. పరమాత్మ ఉన్న చోటే పరిశుద్ధమైన సజ్జనులు ఉంటారు.

తద్వాగ్విసర్గో జనతాఘసమ్ప్లవో యస్మిన్ప్రతిశ్లోకమబద్ధవత్యపి
నామాన్యనన్తస్య యశోऽఙ్కితాని యత్శృణ్వన్తి గాయన్తి గృణన్తి సాధవః

ఒక్కొక్క శ్లోకాన్ని చందోబద్ధము కాకున్నా, శ్లోక లక్షణాలు లేకున్నా కావ్య లక్షణాలు లేకున్నా అలంకార లక్షణాలు లేకున్నా పరమాత్మ యొక్క నామాలతో కీర్తి ముద్ర గలిగిన మాటలు మానవ పాపాలు నశింపచేసేవి.
వాటిని విన్నా గానము చేసినా, అన్నా, ఆ వాక్కులలో ఏ కవితా రీతులు లేకున్నా అది మహా కావ్యము. ఉత్తమ రక్షణ ఇస్తుంది, పాపాలు పోగొడుతుంది.

నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం
న శోభతే జ్ఞానమలం నిరఞ్జనమ్
కుతః పునః శశ్వదభద్రమీశ్వరే
న హ్యర్పితం కర్మ యదప్యనుత్తమమ్

ఎంత జ్ఞ్యానమున్నా ఎంత వైరాగ్యమున్నా భక్తి లేకుండా ఉండే జ్ఞ్యానము శోభించదు.
ఎంత గొప్ప పని ఐనా పరమాత్మకు అర్పించకుంటే అది పని కాదు.

యశఃశ్రియామేవ పరిశ్రమః పరో వర్ణాశ్రమాచారతపఃశ్రుతాదిషు
అవిస్మృతిః శ్రీధరపాదపద్మయోర్గుణానువాదశ్రవణాదరాదిభిః

వర్ణాచారం ఆశ్రమాచారమూ తపస్సూ జపమూ శాస్త్రమూ హోమమూ అంటూ చాలా కష్టపడతారు. వారికి ఆ పరిశ్రమే మిగులుతుంది.
భగవంతుని అనంతమైన కళ్యాణ గుణములను పలుకుట వినుట ఉంటే వేరే శ్రమ ఏదీ ఉండదు. అది లేకుండా ఏమి చేసినా శ్రమ తప్ప మరేదీ మిగలదు

అవిస్మృతిః కృష్ణపదారవిన్దయోః క్షిణోత్యభద్రాణి చ శం తనోతి
సత్త్వస్య శుద్ధిం పరమాత్మభక్తిం జ్ఞానం చ విజ్ఞానవిరాగయుక్తమ్

పరమాత్మ పాద పద్మములను మరువకుండా ఉండుట అన్ని అమంగళాలనూ పొగొట్టి మంగళాలను కలిగిస్తుంది
సత్వ శుద్ధినీ పరమాత్మ భక్తినీ, విజ్ఞ్యానముతో కూడిన జ్ఞ్యానాన్నీ,వైరాగ్యముతో కూడిన జ్ఞ్యానాన్నీ అందిస్తుంది

యూయం ద్విజాగ్ర్యా బత భూరిభాగా యచ్ఛశ్వదాత్మన్యఖిలాత్మభూతమ్
నారాయణం దేవమదేవమీశమజస్రభావా భజతావివేశ్య

బ్రాహ్మణోత్తములారా మీరంతా గొప్ప అదృష్టం చేసుకున్నారు.
మీ మనసులో మీరు మాటి మాటికీ సకల ఆత్మభూతుడైన నారాయణున్ని నిరంతరం భక్తి భావముతో సేవించారు, విన్నారు. మీరంతా గొప్ప అదృష్టవంతులు

అహం చ సంస్మారిత ఆత్మతత్త్వం శ్రుతం పురా మే పరమర్షివక్త్రాత్
ప్రాయోపవేశే నృపతేః పరీక్షితః సదస్యృషీణాం మహతాం చ శృణ్వతామ్

మీరే కాదు నేను కూడా అదృష్టవంతున్ని. మీలాంటి మాహాత్ములు పరమాత్మ గురించి చెప్పమని అడిగి భగవంతున్ని నాచేత స్మరింపచేసేలా చేసారు. పరమాత్మ తత్వాన్ని నా చేత గుర్తుచేయించారు.
వ్యాసభగవానుని నోటి నుండి ఎపుడో విన్నాను. పరీక్షిత్తు మహరాజు ప్రాయోపవేశ సమయములో శుక ముని నుండి నేను విన్నాను. పెద్దలందరితో కలసి నేను కూడా విన్నాను

ఏతద్వః కథితం విప్రాః కథనీయోరుకర్మణః
మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభవినాశనమ్

చెప్పదగిన గొప్ప పనులు చేసిన పరమాత్మ కథను, సకల అశుభాలనూ తొలగించే పరమాత్మ మాహాత్మ్యం నేను చెప్పాను

య ఏతత్శ్రావయేన్నిత్యం యామక్షణమనన్యధీః
శ్లోకమేకం తదర్ధం వా పాదం పాదార్ధమేవ వా
శ్రద్ధావాన్యోऽనుశృణుయాత్పునాత్యాత్మానమేవ సః

రోజూ దీన్ని వినిపించేవారు, ఏకాగ్ర చిత్తముతో విన్నవారు,
ఎవరు శ్రద్ధతో వింటారో వారు తనను తాను పావనం చేసుకున్నవాడవుతాడు

ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్భవేత్
పఠత్యనశ్నన్ప్రయతః పూతో భవతి పాతకాత్

ఈ భాగవతాన్ని ఏకాదశీ ద్వాదశి నాడు వింటే ఆయుష్యాన్ని పొందుతారు,
తిని చదివితే ఆరోగ్యం వస్తుంది. తినకుండా చదివితే పాపాలు పోతాయి.

పుష్కరే మథురయాం చ ద్వారవత్యాం యతాత్మవాన్
ఉపోష్య సంహితామేతాం పఠిత్వా ముచ్యతే భయాత్

పుష్కరములో మధురలో ద్వారకా నగరములో మనో నిగ్రహం కలిగి ఉపవాసం చేసి ఈ సంహితను పఠిస్తే సంసార భయం నుండి విడుదల చెందుతాడు

దేవతా మునయః సిద్ధాః పితరో మనవో నృపాః
యచ్ఛన్తి కామాన్గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్

పరమాత్మ కథలు వింటూ భగవంతున్ని కీర్తిస్తున్న వారికి దేవతలూ మున్లూ సిద్ధులూ పితృదేవతలూ యక్షులూ మనువులూ అందరూ అడగకుండానే అన్ని కోరికలూ ఇస్తారు. నిజమైన భక్తులు వాటిని కోరరు.

ఋచో యజూంషి సామాని ద్విజోऽధీత్యానువిన్దతే
మధుకుల్యా ఘృతకుల్యాః పయఃకుల్యాశ్చ తత్ఫలమ్

ఋక్ యజు సామ అనే వేదాన్ని బ్రాహ్మణులు చదివి
స్వర్గమూ రసాతలమూ బ్రహ్మలోకము అనే ఈ మూడు లోకాలను పొందుతాడు. ఈ ఫలితాన్ని భాగవతం విన్నా పఠించినా పొందుతాడు.

పురాణసంహితామేతామధీత్య ప్రయతో ద్విజః
ప్రోక్తం భగవతా యత్తు తత్పదం పరమం వ్రజేత్


శ్రద్ధతో సావధానముతో ఈ పురాణ సంహితను చదివినవారూ చెప్పినవారూ విన్నవారూ పరమాత్మ యొక్క పరమపదమును చేరతారు

విప్రోऽధీత్యాప్నుయాత్ప్రజ్ఞాం రాజన్యోదధిమేఖలామ్
వైశ్యో నిధిపతిత్వం చ శూద్రః శుధ్యేత పాతకాత్

బ్రాహ్మణులు చదివితే జ్ఞ్యానాన్నీ రాజు విశాల సామ్రాజ్యాన్నీ, వైశ్యులు ధనాన్ని శూద్రులు పాప నివృత్తినీ పొందుతారు

కలిమలసంహతికాలనోऽఖిలేశో హరిరితరత్ర న గీయతే హ్యభీక్ష్ణమ్
ఇహ తు పునర్భగవానశేషమూర్తిః పరిపఠితోऽనుపదం కథాప్రసఙ్గైః

కలియుగములో పాపాన్ని నశింపచేసేవాడు అఖిల జగదధిపతి, ఇతర పురాణాలలో గ్రంధాలలో పరమాత్మ ఇంతగా మాటిమాటికీ గానం చేయబడడు
ఈ భాగవతములో పరమాత్మ యొక్క అన్ని ఆకారాలూ వర్ణించబడినవి. ఆయా కథల ప్రసంగములో ప్రతీ పదములో పలు రకముల పలు నామముల పలు గుణముల పలు స్వభావములు ప్రతీక్షణం పరమాత్మ గురించే చెప్పబడి ఉన్నవి

తమహమజమనన్తమాత్మతత్త్వం జగదుదయస్థితిసంయమాత్మశక్తిమ్
ద్యుపతిభిరజశక్రశఙ్కరాద్యైర్దురవసితస్తవమచ్యుతం నతోऽస్మి

దేవతాధిపతులూ బ్రహ్మ రుద్రేంద్రులు స్తోత్రం చేసే పరమాత్మకు నమస్కరిస్తున్నాను.

ఉపచితనవశక్తిభిః స్వ ఆత్మన్యుపరచితస్థిరజఙ్గమాలయాయ
భగవత ఉపలబ్ధిమాత్రధమ్నే సురఋషభాయ నమః సనాతనాయ

నవశక్తులు తీసుకుని తనలో తాను స్థావర జంగమాలను తన ఆత్మ శక్తితో సృష్టించిన పరమాత్మ, ఆయన కేవలం ఉన్నాడు అని మాత్రమే తెలియబడే స్వామికీ, సనాతునికీ నమస్కారము

స్వసుఖనిభృతచేతాస్తద్వ్యుదస్తాన్యభావో
ऽప్యజితరుచిరలీలాకృష్టసారస్తదీయమ్
వ్యతనుత కృపయా యస్తత్త్వదీపం పురాణం
తమఖిలవృజినఘ్నం వ్యాససూనుం నతోऽస్మి

ఆత్మారముడు, తన సుఖములోనే తాను పరిపూర్ణ తృప్తి చెందినవాడు
ఆత్మానందముతో తొలగించబడిన సకల భావములు కలవాడు
ఐనా పరమాత్మ యొక్క లీలలతో ఆకర్షించబడిన చిత్తం గలవాడై పరమాత్మ లీలలచే ఆకర్షించబడి, లోకుల కష్టాలను చూచి దయతలచి భగవత్ తత్వాన్ని తత్వ దీపమైన భాగవతాన్ని విస్తరింపచేసాడు, అన్ని పాపాలనూ తొలగించిన వ్యాస కుమారుడైన శుకయోగీంద్రునికి నమస్కారం.

స్వసుఖ నిభృత చేతా తద్వ్యుదాత్త అన్యభావ
అజిత రుచిర లీల ఆకృష్ట సార తదీయం
వ్యతనుత కృపయా యత్ తత్వ దీపం పురాణం
తం అఖిల వృజినఘ్నం వ్యాస సూనుం నతోస్మి

                                              శ్రీ శుకబ్రహ్మణే నమః
                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

       

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశౌనక ఉవాచ
అథేమమర్థం పృచ్ఛామో భవన్తం బహువిత్తమమ్
సమస్తతన్త్రరాద్ధాన్తే భవాన్భాగవత తత్త్వవిత్

ఇంకో విషయం ఉంది, అడుగుతున్నాము. ఉన్న సకల శాస్త్రములలో భాగవత తత్వం తెలిసింది మీకు ఒక్కరికే

తాన్త్రికాః పరిచర్యాయాం కేవలస్య శ్రియః పతేః
అఙ్గోపాఙ్గాయుధాకల్పం కల్పయన్తి యథా చ యైః

తాంత్రికులు పరమాత్మ యొక్క ఆరాధన చేస్తారు శ్రియః పతికి
అవయవములూ ఉప అవయవములూ ఆయుధములనూ ఆరాధిస్తారు కదా

తన్నో వర్ణయ భద్రం తే క్రియాయోగం బుభుత్సతామ్
యేన క్రియానైపుణేన మర్త్యో యాయాదమర్త్యతామ్

వీటి తత్వం ఏమిటి. ఇలాంటి దాన్ని చేస్తే మానవుడు అమర్త్యుడవుతాడు

సూత ఉవాచ
నమస్కృత్య గురూన్వక్ష్యే విభూతీర్వైష్ణవీరపి
యాః ప్రోక్తా వేదతన్త్రాభ్యామాచార్యైః పద్మజాదిభిః

పరమాత్మ యొక్క విభూతులు చెప్పండి
కౌస్తుభం, శంఖం చక్రం మొదలైన్వాటి తత్వం ఏమిటి
బ్రహ్మా వశిష్టుడు విశ్వక్సేనుడు మొదలైన మునులు ఏమేమి చేసారో

మాయాద్యైర్నవభిస్తత్త్వైః స వికారమయో విరాట్
నిర్మితో దృశ్యతే యత్ర సచిత్కే భువనత్రయమ్

పరమాత్మ తొమ్మిది రకముల తత్వములతో సకల ప్రపంచం యొక్క వికారములను చూపెడతాడు, తాను ఉంటాడు.
జీవుడితో ఉన్న సకల జగములు మూడింటిలో పరమాత్మ వేంచేసి ఉన్నాడు

ఏతద్వై పౌరుషం రూపం భూః పాదౌ ద్యౌః శిరో నభః
నాభిః సూర్యోऽక్షిణీ నాసే వాయుః కర్ణౌ దిశః ప్రభోః

పాదములు భూమి.
ద్యు లోకం అనేది ఆయన శిరో భాగం
ఆకాశం ఆయన నాభి
సూర్యుడు నేత్రములు
వాయువు నాసిక
కర్ణములు దిక్కులు

ప్రజాపతిః ప్రజననమపానో మృత్యురీశితుః
తద్బాహవో లోకపాలా మనశ్చన్ద్రో భ్రువౌ యమః

ప్రజాపతి ప్రజననమూ
అపానము మృత్యువు
బాహువులు లోకపాలకులు
మనసు చంద్రుడు
కనుబొమ్మలు యముడు

లజ్జోత్తరోऽధరో లోభో దన్తా జ్యోత్స్నా స్మయో భ్రమః
రోమాణి భూరుహా భూమ్నో మేఘాః పురుషమూర్ధజాః

లజ్జ పైపెదవి
లోభము కిందిపెదవు
దంతములు వెన్నెల
నవ్వు భ్రమ
రోమాలు వృక్షములు
కేశములు మేఘములు

యావానయం వై పురుషో యావత్యా సంస్థయా మితః
తావానసావపి మహా పురుషో లోకసంస్థయా

ఈయన ఎంత ఉన్నాడో ఏ రూపములో ఉన్నాడో , ఎన్ని లోకాలను మనం చూస్తున్నామో అది అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు

కౌస్తుభవ్యపదేశేన స్వాత్మజ్యోతిర్బిభర్త్యజః
తత్ప్రభా వ్యాపినీ సాక్షాత్శ్రీవత్సమురసా విభుః

కౌస్తుభం అంటే జీవాత్మ
సకల ఆత్మలను కౌస్తుభముగా చేసుకుని తన హృదయములో ధరించాడు. అందుకే అది సముద్రములోంచి పుట్టింది. దాని కాంతే అంతటా వ్యాపిస్తుంది

స్వమాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్
వాసశ్ఛన్దోమయం పీతం బ్రహ్మసూత్రం త్రివృత్స్వరమ్

వనమాల పరమాత్మ యొక్క మాయ. ఇది నానా గుణములు కలది. స్వామి యొక్క పీతాంబరం సకల వేదమయము
యజ్ఞ్యోపవీతమే ఓంకారము

బిభర్తి సాఙ్ఖ్యం యోగం చ దేవో మకరకుణ్డలే
మౌలిం పదం పారమేష్ఠ్యం సర్వలోకాభయఙ్కరమ్

స్వామికి ఉన్న మకర కుండలాలు ఒకటి సాంఖ్యము రెండవది యోగము.
కిరీటము పారమేష్ఠ్యము. సకల లోకములకూ అభయాన్ని ఇచ్చేది

అవ్యాకృతమనన్తాఖ్యమాసనం యదధిష్ఠితః
ధర్మజ్ఞానాదిభిర్యుక్తం సత్త్వం పద్మమిహోచ్యతే

స్వామి యొక్క ఆసనం అనంతం - అంటే ప్రకృతి.
స్వామి ఉండే పద్మము ధర్మమూ జ్ఞ్యానమూ వైరాగ్యమూ ,మొదలైనవి గలిగి ఉంటుంది
ఈ సత్వాన్ని పద్మం అని అంటారు

ఓజఃసహోబలయుతం ముఖ్యతత్త్వం గదాం దధత్
అపాం తత్త్వం దరవరం తేజస్తత్త్వం సుదర్శనమ్

గద ముఖ్య తత్వము
శంఖం అంటే జలతత్వం
చక్రం తేజస్సు

నభోనిభం నభస్తత్త్వమసిం చర్మ తమోమయమ్
కాలరూపం ధనుః శార్ఙ్గం తథా కర్మమయేషుధిమ్

ఖడ్గం ఆకాశ తత్వం
చర్మం తమో మయము
శాంఖం కాలరూపము
అమ్ములపొది కర్మమయము

ఇన్ద్రియాణి శరానాహురాకూతీరస్య స్యన్దనమ్
తన్మాత్రాణ్యస్యాభివ్యక్తిం ముద్రయార్థక్రియాత్మతామ్

ఆయనన్ బాణములు ఇంద్రియములు
మన సంస్కారాలు ఆయన రథములు
తన్మాత్రలు ఆయన అభివ్యక్తి

మణ్డలం దేవయజనం దీక్షా సంస్కార ఆత్మనః
పరిచర్యా భగవత ఆత్మనో దురితక్షయః

మండలం దేవుని ఆరాధన
ఇదంతా భగవంతుని పరిచర్య

భగవాన్భగశబ్దార్థం లీలాకమలముద్వహన్
ధర్మం యశశ్చ భగవాంశ్చామరవ్యజనేऽభజత్

స్వామి వద్ద ఉండే పద్మం భగ శబ్దానికి అర్థం
జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు భగ శబ్దానికి అర్థం
ధర్మము చామరం
కీర్తి వ్యజనం

ఆతపత్రం తు వైకుణ్ఠం ద్విజా ధామాకుతోభయమ్
త్రివృద్వేదః సుపర్ణాఖ్యో యజ్ఞం వహతి పూరుషమ్

వైకుంఠము ఆతపత్రము
వేదము గరుత్మంతుడు. ఈయన యజ్ఞ్య పురుషున్ని వహిస్తాడు

అనపాయినీ భగవతీ శృః సాక్షాదాత్మనో హరేః
విష్వక్షేనస్తన్త్రమూర్తిర్విదితః పార్షదాధిపః
నన్దాదయోऽష్టౌ ద్వాఃస్థాశ్చ తేऽణిమాద్యా హరేర్గుణాః

పరమాత్మ ఆత్మ అమ్మవారు
విశ్వక్సేనుడు తంత్రానికి ప్రతినిధి
అష్ట ద్వారపాలకులు అష్ట సిద్ధులకు ప్రతీక

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నః పురుషః స్వయమ్
అనిరుద్ధ ఇతి బ్రహ్మన్మూర్తివ్యూహోऽభిధీయతే

వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనే తత్వాలు పరమాత్మే. అవి ఆయన వ్యూహములు

స విశ్వస్తైజసః ప్రాజ్ఞస్తురీయ ఇతి వృత్తిభిః
అర్థేన్ద్రియాశయజ్ఞానైర్భగవాన్పరిభావ్యతే

వీటినే విస్మ విశ్వ తైజసా ప్రాజ్ఞ్య తురీయ అని చెప్పుకుంటాము
అర్థ ఇంద్రియ ఆశయ జ్ఞ్యాన అనే భావాలతో ఈయనే తెలియబడతాడు

అఙ్గోపాఙ్గాయుధాకల్పైర్భగవాంస్తచ్చతుష్టయమ్
బిభర్తి స్మ చతుర్మూర్తిర్భగవాన్హరిరీశ్వరః

ఈ నాలుగూ పైన చెప్పిన అంగములూ ఉపాంగములూ అవయవములూ ఆయుధములూ కలసి పరమాత్మ ఉంటాడు
ఈయనే నాలుగు రూపములతో ఉంటాడు

ద్విజఋషభ స ఏష బ్రహ్మయోనిః స్వయందృక్
స్వమహిమపరిపూర్ణో మాయయా చ స్వయైతత్
సృజతి హరతి పాతీత్యాఖ్యయానావృతాక్షో
వివృత ఇవ నిరుక్తస్తత్పరైరాత్మలభ్యః

ఈయనే బ్రహ్మయోని
స్వయం ప్రకాశకుడు
తన మాయతో తానే పరిపూర్ణుడు
సృష్టిస్తాడూ సంహరిస్తాడూ రక్షిస్తాడు
వివరించబడిన వేదార్థములాగ భగవంతుని భక్తులకు మాత్రమే ఈయన లభిస్తాడు

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిధ్రుగ్
రాజన్యవంశదహనానపవర్గవీర్య
గోవిన్ద గోపవనితావ్రజభృత్యగీత
తీర్థశ్రవః శ్రవణమఙ్గల పాహి భృత్యాన్

శ్రీకృష్ణా, అర్జున సఖా, భూమికి ద్రోహం చేసిన రాజుల వధించినవాడా
మోక్ష వీర్యం గలవాడా
గోపికల చేతా గోపాలుర చేతా కీర్తించబడిన కీర్తి గలవాడా
మీ భక్తుల కాపాడు
శ్రీ కృష్ణా!యదుభూషణా!నరసఖా!శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా!దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!

నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

య ఇదం కల్య ఉత్థాయ మహాపురుషలక్షణమ్
తచ్చిత్తః ప్రయతో జప్త్వా బ్రహ్మ వేద గుహాశయమ్

ఈ మహాపురుష లక్షణాలను పొద్దున్నే లేచి ఆయన యందే మనసు ఉంచి అధయయనం చేస్తే పరబ్రహ్మ జ్ఞ్యానం కలుగుతుంది

శ్రీశౌనక ఉవాచ
శుకో యదాహ భగవాన్విష్ణురాతాయ శృణ్వతే
సౌరో గణో మాసి మాసి నానా వసతి సప్తకః

పరీక్షిత్తుకి శుకయోగీంద్రుడు సూర్యభగవానుని గురించి చెప్పాడని చెప్పారు.
సూర్యభగవానుడు ఒక్కో నెలా ఒక్కో రూపముతో తమ గణముతో(గణసప్తకం) కలసి సంచరిస్తాడు

తేషాం నామాని కర్మాణి నియుక్తానామధీశ్వరైః
బ్రూహి నః శ్రద్దధానానాం వ్యూహం సూర్యాత్మనో హరేః

వారి పేర్లేమిటి వారేమి చేస్తారో చెప్పవలసింది.
దీన్ని సూర్యవ్యూహం అంటారు. సంధ్యావందన యోగ్యత లేని వారు ఈ సూర్యవ్యూహాన్ని రోజూ అధయయనం చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో బ్రాహ్మణులుగా చెబుతారు

సూత ఉవాచ
అనాద్యవిద్యయా విష్ణోరాత్మనః సర్వదేహినామ్
నిర్మితో లోకతన్త్రోऽయం లోకేషు పరివర్తతే

పరమాత్మ యొక్క మాయతో పరమాత్మ యొక్క సంకల్పమే ఈ లోక తంత్రముగా వ్యవహరిస్తున్నారు

ఏక ఏవ హి లోకానాం సూర్య ఆత్మాదికృద్ధరిః
సర్వవేదక్రియామూలమృషిభిర్బహుధోదితః

సకల లోకములను పరిపాలింపచేసేవాడు లోకములను నాశం చేసేవాడు సూర్యభగవానుడు
అన్ని వేదాలకూ క్రియలకూ సూర్యుడే మూలం అని ఋషులు చాలా విధాలుగా చెప్పి ఉన్నారు.

కాలో దేశః క్రియా కర్తా కరణం కార్యమాగమః
ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్నవధోక్తోऽజయా హరిః

పరమాత్మ మాయ తొమ్మిది రకాలుగా ఉంటుంది
కాలమూ దేశమూ క్రియా కర్తా కరణం కార్యం ఆగమం ద్రవ్యం ఫలం

మధ్వాదిషు ద్వాదశసు భగవాన్కాలరూపధృక్
లోకతన్త్రాయ చరతి పృథగ్ద్వాదశభిర్గణైః

కాలరూపధారి ఐన సూర్యభగవానుడు మధ్వాది మాసం (మధు  - చైత్రం, మాధవ - వైశాఖం శుక్ర జ్యేష్ఠం శుచి - ఆషాడం) చైత్రాది మాసాలలో స్వామి సకల లోకాలనూ కాపాడడానికి తన గణములతో తిరుగుతాడు.
విడివిడిగా పన్నెండు గణములు ఉన్నాయి. ఒక్కో నెలా ఒక్కో గణముతో సంచరిస్తాడు

ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ

ధాతా కృతస్థలీ హేతీ వాసుకీ రథకృత్ పులస్త్య తుంబురూ - ఈ ఏడుగురూ మధుమాసములో ఉంటారు
ఈ ఏడుగురిలో ఒక యక్షుడూ ఒక అప్సరసా రాక్షసుడూ సర్పమూ మహర్షి ఒక గాయకుడు ఉంటారు
మొదటివాడు ధాతా - సూర్యునికి కూడా ధాతా అనే పేరు ఉంది. వీరు ఆయన వెంట ఉంటారు

అర్యమా పులహోऽథౌజాః ప్రహేతిః పుఞ్జికస్థలీ
నారదః కచ్ఛనీరశ్చ నయన్త్యేతే స్మ మాధవమ్

వైశాఖ మాసములో ఆయన పేరు అర్యమ.
పులహ ఓజ ప్రహేతీ పుంజకస్థలీ నారద కచ్చనీర అనే గణాలతో సంచరిస్తారు

మిత్రోऽత్రిః పౌరుషేయోऽథ తక్షకో మేనకా హహాః
రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయన్త్యమీ

జ్యేష్ఠ మాసములో మిత్ర అనే పేరుతో
ఋషి పేరు అత్రి.పౌరుషేయుడూ తక్షకుడూ మేనకా హహా, రథస్వన అనే వారు గణాలు

వసిష్ఠో వరుణో రమ్భా సహజన్యస్తథా హుహూః
శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయన్త్యమీ

వసిష్ఠ వరుణా రంభా సహజన్య హుహూ, చిత్రస్వన అనేవారు ఆషాఢ మాసములో తిరుగుతారు

ఇన్ద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఙ్గిరాః
ప్రమ్లోచా రాక్షసో వర్యో నభోమాసం నయన్త్యమీ

శ్రావణ మాసములో సూర్యునిపేరు ఇంద్రుడు (అందుకే వర్షాలు ఎక్కువ వస్తాయి ఆ మాసములో)
విశ్వావసు శ్రోతా ఏలాతపత్ర అంగీరస ప్రంలోచా రాక్షస వర్య అనే వారు నభో (శ్రావణ) మాసము.

వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః
అనుమ్లోచా శఙ్ఖపాలో నభస్యాఖ్యం నయన్త్యమీ

వివస్వానుడు ఆషఢ మాసములో సూర్యుని పేరు
ఉగ్రసేన వ్యాఘ్ర ఆసారణ భృగు అనుంలోచ శంఖపాల అనే వారు ఆషాఢ మాసములో గణాలు

పూషా ధనఞ్జయో వాతః సుషేణః సురుచిస్తథా
ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయన్త్యమీ

పూష దనంజయ వాత సుషేణ సురుచి ఘృతాచీ గౌతమ - ఆశ్వయుజ మాసము

ఋతుర్వర్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్తథా
విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయన్త్యమీ

ఋతూ వర్చా భరద్వాజ పర్జన్యా సేనజిత్ విశ్వ ఐరావత  అనే గణాలు తపస్య (కార్తీక మాసము)

అథాంశుః కశ్యపస్తార్క్ష్య ఋతసేనస్తథోర్వశీ
విద్యుచ్ఛత్రుర్మహాశఙ్ఖః సహోమాసం నయన్త్యమీ

అంసు, కశ్యప కార్క్ష్య ఋతసేన ఊర్వశీ విద్యుత్ శత్రు మహాశంఖ - సహో (మార్గశీర్ష మాసం)

భగః స్ఫూర్జోऽరిష్టనేమిరూర్ణ ఆయుశ్చ పఞ్చమః
కర్కోటకః పూర్వచిత్తిః పుష్యమాసం నయన్త్యమీ

భగ (సూర్య్నిపేరు) , స్పూర్జ అరిష్టనేమి ఊర్ణ ఆయు కర్కోటక పూర్వచిత్తీ - పుష్య మాసము

త్వష్టా ఋచీకతనయః కమ్బలశ్చ తిలోత్తమా
బ్రహ్మాపేతోऽథ సతజిద్ధృతరాష్ట్ర ఇషమ్భరాః

త్వష్ట - మాఘ మాసములో సూర్యునిపేరు
కంబలా తిలోత్తమా బ్రహ్మాపేతా సతహిత్ దృతరాష్ట్ర ఇషంభర

విష్ణురశ్వతరో రమ్భా సూర్యవర్చాశ్చ సత్యజిత్
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయన్త్యమీ

విష్ణు - సూర్యుని పేరు
అశ్వతరా రంభా సూర్య వర్చా సత్యజిత్ విశ్వామిత్ర మఖాపేత ఊర్జమాసములో

ఏతా భగవతో విష్ణోరాదిత్యస్య విభూతయః
స్మరతాం సన్ధ్యయోర్నౄణాం హరన్త్యంహో దినే దినే

ఇలా పన్నెండు నెలలలో సూర్యభగవానుని పన్నెండు విభూతులు చెబుతున్నాము
సంధ్యా సమయములో దీన్ని ప్రతీ రోజూ అనుసంధానం చేస్తే సంధ్యావంద ఫలితం బ్రహ్మజ్ఞ్యానమూ కలుగుతుంది

ద్వాదశస్వపి మాసేషు దేవోऽసౌ షడ్భిరస్య వై
చరన్సమన్తాత్తనుతే పరత్రేహ చ సన్మతిమ్

ఈ పన్నెండు నెలలలో ప్రతీ నెలలోనూ తాను కాక ఇంకొక ఆరుగురు తన గణముతో తిరుగుతూ
ఈ లోకములోనూ పరలోకములోనూ అందరికీ ఉత్తమ బుద్ధిని కలిగిస్తాడు

సామర్గ్యజుర్భిస్తల్లిఙ్గైరృషయః సంస్తువన్త్యముమ్
గన్ధర్వాస్తం ప్రగాయన్తి నృత్యన్త్యప్సరసోऽగ్రతః

ఈయన సంచరిస్తూ ఉంటే ఆయన గుర్తులైన ఋక్ యజు సామ వేదాలతో ఋషులు స్తోత్రం చేస్తారు
ఋషులు వేదములతో స్తోత్రం చేస్తారు
గంధర్వులు గానం చేస్తారు
అప్సరసలు నాట్యం చేస్తారు

ఉన్నహ్యన్తి రథం నాగా గ్రామణ్యో రథయోజకాః
చోదయన్తి రథం పృష్ఠే నైరృతా బలశాలినః

నాగులు రథాన్ని మోస్తాయి
రాక్షసులు తమ వీపు మీద ఉండి తోస్తారు

వాలఖిల్యాః సహస్రాణి షష్టిర్బ్రహ్మర్షయోऽమలాః
పురతోऽభిముఖం యాన్తి స్తువన్తి స్తుతిభిర్విభుమ్

అరవైవేల వాలఖిల్య మహర్షులు, పరిశుద్ధులు సూర్యభగవానుని ముందు వెళుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు

ఏవం హ్యనాదినిధనో భగవాన్హరిరీశ్వరః
కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహ్య లోకానవత్యజః

ఆద్యంతములు లేని పరమాత్మ ఒక్కో కల్పములో తన స్వరూపాన్ని ఒక్కో వ్యూహముగా చెప్పి లోకాన్ని కాపాడతాడు. ఆయన మాత్రం పుట్టేవాడు కాడు


                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదవ అధ్యాయం

             

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం పదవ అధ్యాయం

సూత ఉవాచ
స ఏవమనుభూయేదం నారాయణవినిర్మితమ్
వైభవం యోగమాయాయాస్తమేవ శరణం యయౌ

పరమాత్మ నారాయణుని యోగమాయ చూచి, ఆ వైభవాన్ని చూచి

శ్రీమార్కణ్డేయ ఉవాచ
ప్రపన్నోऽస్మ్యఙ్ఘ్రిమూలం తే ప్రపన్నాభయదం హరే
యన్మాయయాపి విబుధా ముహ్యన్తి జ్ఞానకాశయా

పరమాత్మా, నిన్ను ఆశ్రయించిన వారికి అభయమిచ్చే నీ పాద మూలాన్ని ఆశ్రయిస్తున్నాను
కొంచెం జ్ఞ్యానం ఉంది అని భావించే దేవత్లు కూడా నీ మాయ వలన మోహం పొందుతూ ఉంటే నేను ఎంతటివాడిని

సూత ఉవాచ
తమేవం నిభృతాత్మానం వృషేణ దివి పర్యటన్
రుద్రాణ్యా భగవాన్రుద్రో దదర్శ స్వగణైర్వృతః

పరమభాగవతోత్తముడైన మార్కండేయుని పార్వతీ దేవితో వెళుతున్న పరంశివుడు చూచాడు

అథోమా తమృషిం వీక్ష్య గిరిశం సమభాషత
పశ్యేమం భగవన్విప్రం నిభృతాత్మేన్ద్రియాశయమ్

ఈయనను చూస్తే శరీరం ఉన్నట్లు కనప్డడం లేదు
ఇంద్రియాలనూ మనసునూ ఎక్కడో ఉంచాడు

నిభృతోదఝషవ్రాతో వాతాపాయే యథార్ణవః
కుర్వస్య తపసః సాక్షాత్సంసిద్ధిం సిద్ధిదో భవాన్

తపస్సు బాగా చేస్తున్నాడు నీ కోసమే
అటువంటి వారిని నీవు అనుగ్రహిస్తావు కద. ఏమి కోరబోతున్నాడో అడిగి చూదాము అని అన్నది పార్వతి

శ్రీభగవానువాచ
నైవేచ్ఛత్యాశిషః క్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుత
భక్తిం పరాం భగవతి లబ్ధవాన్పురుషేऽవ్యయే

ఈ మార్కండేయుడు పరమాత్మ యందు పరమ భక్తి పొందాడు. ఇలాంటి వారు ఏ కోరికా కోరరు. చివరకు ఆయనే వచ్చి మోక్షం ఇస్తానని అన్నా కోరరు

అథాపి సంవదిష్యామో భవాన్యేతేన సాధునా
అయం హి పరమో లాభో నృణాం సాధుసమాగమః

ఐనా నీవు అన్నావు కాబట్టి ఆయన వద్దకు వెళదాము. సకల ప్రాణులకూ సజ్జన సమాగమం పెద్ద లాభం

సూత ఉవాచ
ఇత్యుక్త్వా తముపేయాయ భగవాన్స సతాం గతిః
ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వదేహినామ్

ఇలా చెప్పి స్వామి అక్కడకు వెళ్ళాడు
ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వదేహినామ్

తయోరాగమనం సాక్షాదీశయోర్జగదాత్మనోః
న వేద రుద్ధధీవృత్తిరాత్మానం విశ్వమేవ చ

ఈ మార్కండేయునికి వారు వచ్చిన సంగతే తెలియలేదు. జగత్తును చూడడమే లేదు.

భగవాంస్తదభిజ్ఞాయ గిరిశో యోగమాయయా
ఆవిశత్తద్గుహాకాశం వాయుశ్ఛిద్రమివేశ్వరః

శంకరుడు ఆ విషయం తెలుసుకుని తన యోగ మాయతో ఆయన హృదయములో తాను భాసించాడు, చిద్రం లభిస్తే వాయువు వెళ్ళినట్లుగా అతని హృదయాకాశానికి ఆయన వెళ్ళాడు

ఆత్మన్యపి శివం ప్రాప్తం తడిత్పిఙ్గజటాధరమ్
త్ర్యక్షం దశభుజం ప్రాంశుముద్యన్తమివ భాస్కరమ్

త్రినేత్రుడు, పది భుజాలతో ( పంచముఖుడై), ఉదయిస్తున్న సూర్యునిలా ఉన్నాడు

వ్యాఘ్రచర్మామ్బరం శూల ధనురిష్వసిచర్మభిః
అక్షమాలాడమరుక కపాలం పరశుం సహ

పది ఆయుధాలతో

బిభ్రాణం సహసా భాతం విచక్ష్య హృది విస్మితః
కిమిదం కుత ఏవేతి సమాధేర్విరతో మునిః

ఇటువంటి పరమ శివుడు హృదయములో భాసించడం చూచి సమాధినుండి బయటకు వచ్చి పార్వతితో ఉన్న స్వామిని సేవించాడు

నేత్రే ఉన్మీల్య దదృశే సగణం సోమయాగతమ్
రుద్రం త్రిలోకైకగురుం ననామ శిరసా మునిః

శిరస్సు వంచి స్వామికి నమస్కరించాడు

తస్మై సపర్యాం వ్యదధాత్సగణాయ సహోమయా
స్వాగతాసనపాద్యార్ఘ్య గన్ధస్రగ్ధూపదీపకైః

అర్ఘ్య పాద్యాదులతో పూజించాడు

ఆహ త్వాత్మానుభావేన పూర్ణకామస్య తే విభో
కరవామ కిమీశాన యేనేదం నిర్వృతం జగత్

మహానుభావా నీవు పూర్ణ కాముడవు. నీకు మేమేమి సేవ చేయగలము.

నమః శివాయ శాన్తాయ సత్త్వాయ ప్రమృడాయ చ
రజోజుషేऽథ ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే

నీవే రజో గుణ తమో గుణ స్వరూపుడవు. ఐనా నీవు అఘోరుడవు (భయంకరుడవు కావు) సుఘోరుడవు ( భయంకరుడవూ అవుతావు) అని స్తోత్రం చేసాడు

సూత ఉవాచ
ఏవం స్తుతః స భగవానాదిదేవః సతాం గతిః
పరితుష్టః ప్రసన్నాత్మా ప్రహసంస్తమభాషత

ఇలా స్తోత్రం చేయబడి సంతోషించి ఇలా అంటున్నాడు

శ్రీభగవానువాచ
వరం వృణీష్వ నః కామం వరదేశా వయం త్రయః
అమోఘం దర్శనం యేషాం మర్త్యో యద్విన్దతేऽమృతమ్

బ్రహ్మ విష్ణు పరమేశ్వరులమైన మేము ముగ్గురమూ వరములిచ్చేవారము.
మా దర్శనం వ్యర్థం కాకూడదు. మా దర్శనముతో మర్త్యుడు అమర్త్యుడవుతాడు

బ్రాహ్మణాః సాధవః శాన్తా నిఃసఙ్గా భూతవత్సలాః
ఏకాన్తభక్తా అస్మాసు నిర్వైరాః సమదర్శినః

వైరం లేని వారు సమభావనతో ఉండేవారు ఏకాంత భక్తులు, అందరూ మమ్ము సమభావముతో నమస్కరిస్తారు పూజిస్తారు ఉపాసిస్తారు

సలోకా లోకపాలాస్తాన్వన్దన్త్యర్చన్త్యుపాసతే
అహం చ భగవాన్బ్రహ్మా స్వయం చ హరిరీశ్వరః

నేనూ బ్రహ్మా హరి,

న తే మయ్యచ్యుతేऽజే చ భిదామణ్వపి చక్షతే
నాత్మనశ్చ జనస్యాపి తద్యుష్మాన్వయమీమహి

జ్ఞ్యానులైన వారు నా యందూ విష్ణువు యందూ భేధమును ఏ కొంచెమూ కూడా చూడరు
నేను ఇక్కడకు రావడానికి కారణం నీలో ఇంకా ఆ భేధ బుద్ధీ ఇంకా ఏమైనా ఉన్నదేమో చూద్దామని వచ్చాను

న హ్యమ్మయాని తీర్థాని న దేవాశ్చేతనోజ్ఝితాః
తే పునన్త్యురుకాలేన యూయం దర్శనమాత్రతః

నీకు వరాలివ్వడానికి రాలేదు. నిన్ను చూచి నేను పవిత్రతను పొందడానికి వచ్చాను
నీరు మాత్రమే పుణ్య తీర్థములు కావు
చైతన్యం లేకుండా శిలామయముగాఉన్నవారే దేవతలు కాదు.
నదులనూ ఆలయాలలో అర్చావతారాలనీ ఎంతో కాలం సేవిస్తే గానీ అనుగ్రహించరు.
కానీ నీవంటి సజ్జనులను చూడడం చేతనే పవిత్రులవుతారు

బ్రాహ్మణేభ్యో నమస్యామో యేऽస్మద్రూపం త్రయీమయమ్
బిభ్రత్యాత్మసమాధాన తపఃస్వాధ్యాయసంయమైః

వేదమయమైన మా రూపాన్ని ధరించే బ్రాహ్మణోత్తములకు మేము నమస్కారం చేస్తున్నాము
సమాధీ తపస్సు స్వాధ్యాయమూ నిగ్రహముతో మా రూపాన్ని ధరించే బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేస్తున్నాము

శ్రవణాద్దర్శనాద్వాపి మహాపాతకినోऽపి వః
శుధ్యేరన్నన్త్యజాశ్చాపి కిము సమ్భాషణాదిభిః

మీలాంటి మహానుభావులను వింటే చాలు చూస్తే చాలు, మాహా పాపాలు పోతాయి, మహాపాపులు కూడా తరిస్తారు
మీ పేరు వింటేనే మిమ్ము చూస్తేనే మహాపాతకులైన తరిస్తారు. ఇంక మీలాంటి వారితో మాట్లాడితే మేలు కలుగుతుంది అని వేరే చెప్పాలా. అందుకే మేము వచ్చాము

సూత ఉవాచ
ఇతి చన్ద్రలలామస్య ధర్మగహ్యోపబృంహితమ్
వచోऽమృతాయనమృషిర్నాతృప్యత్కర్ణయోః పిబన్

ఇలా పరమశివుడు మాట్లాడిన అమృతం వంటి ధర్మ రహస్యాన్ని విని చెవులతో తాగుతూ తృప్తి పొందలేదు

స చిరం మాయయా విష్ణోర్భ్రామితః కర్శితో భృశమ్
శివవాగమృతధ్వస్త క్లేశపుఞ్జస్తమబ్రవీత్

చాలా కాలం పరమాత్మ మాయ వలన చిక్కిపోయాడు.
పరమాత్మ మాయలో తిరిగి తిరిగి అలసిన మార్కండేయుని అలసటను తగ్గించాడు పరమ శివుడు

శ్రీమార్కణ్డేయ ఉవాచ
అహో ఈశ్వరలీలేయం దుర్విభావ్యా శరీరిణామ్
యన్నమన్తీశితవ్యాని స్తువన్తి జగదీశ్వరాః

పరమాత్మ లీల దేహధారుల ఊహకు అందనిది
తమ చేత పరిపాలించబడే వారికి తామే నమస్కరించి తామే స్తోత్రం చేస్తారు

ధర్మం గ్రాహయితుం ప్రాయః ప్రవక్తారశ్చ దేహినామ్
ఆచరన్త్యనుమోదన్తే క్రియమాణం స్తువన్తి చ

లోకములో ధర్మాన్ని ఆచరింపచేయడానికి ఇలా వీరు మాట్లాడుతూ ఉంటారు
సజ్జనులు ఆచరించిన దానిని ఆమోదిస్తారు, స్వయముగా ఆచరిస్తారు, చేస్తున్నా వారిని పొగడుతూ స్తోత్రం చేస్తారు

నైతావతా భగవతః స్వమాయామయవృత్తిభిః
న దుష్యేతానుభావస్తైర్మాయినః కుహకం యథా

ఇలా స్తోత్రం చేసినంత మాత్రాన మీ ప్రభావానికీ మహిమకూ లోటు ఉండదు.

సృష్ట్వేదం మనసా విశ్వమాత్మనానుప్రవిశ్య యః
గుణైః కుర్వద్భిరాభాతి కర్తేవ స్వప్నదృగ్యథా

జగత్తును సృష్టించి అందులో తాను ప్రవర్తించి, కలగంటున్నట్లుగా జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి వాటిని గుణములతో కలుపుతారు

తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే
కేవలాయాద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే

పరబ్రహ్మ, గురువైన ఆ స్వామికి నమస్కరిస్తున్నాను.

కం వృణే ను పరం భూమన్వరం త్వద్వరదర్శనాత్
యద్దర్శనాత్పూర్ణకామః సత్యకామః పుమాన్భవేత్

మీరు మాకు దర్శనం ఇవ్వడమే గొప్ప వరము.
మీ వంటి మాహానుభావుల దర్శనముతో పూర్ణకాములవుతారు, సత్యకాములవుతారు

వరమేకం వృణేऽథాపి పూర్ణాత్కామాభివర్షణాత్
భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు తథా త్వయి

ఐనా నేను ఒక వరం అడుగుతాను
పరమాత్మ యందు ఉన్న భక్తి తొలగిపోకుండా
పరమాత్మ భక్తులయందూ, మీయందూ భక్తీ తొలగిపోకుండా ఉండు గాక. (భగవత్ భాగవత ఆచార్యుల యందు ఉన్న భక్తి తొలగిపోకుండా ఉండు గాక)

సూత ఉవాచ
ఇత్యర్చితోऽభిష్టుతశ్చ మునినా సూక్తయా గిరా
తమాహ భగవాఞ్ఛర్వః శర్వయా చాభినన్దితః

అలా స్తోత్రం చేయబడీ పూజించబడి, పార్వతీ దేవితో కలసి మార్కండేయున్ని అభినందించారు

కామో మహర్షే సర్వోऽయం భక్తిమాంస్త్వమధోక్షజే
ఆకల్పాన్తాద్యశః పుణ్యమజరామరతా తథా

నీవు పరమాత్మ యందే భక్తి కలిగి ఉన్నావు
కల్పాంతం వరకూ ఆయువును ఇస్తున్నాను.జరా మరణం లేకుండా వరం ఇస్తున్నాను

జ్ఞానం త్రైకాలికం బ్రహ్మన్విజ్ఞానం చ విరక్తిమత్
బ్రహ్మవర్చస్వినో భూయాత్పురాణాచార్యతాస్తు తే

త్రికాల జ్ఞ్యానం ఇస్తున్నాను. అహంకారం రాకుండా వైరాగ్యముతో కూడిన విజ్ఞ్యానాన్ని ఇస్తున్నాను
నీవు ఒక పురాణాన్ని కూడా చెప్పేవాడవు అవుతావు

సూత ఉవాచ
ఏవం వరాన్స మునయే దత్త్వాగాత్త్ర్యక్ష ఈశ్వరః
దేవ్యై తత్కర్మ కథయన్ననుభూతం పురామునా

ఇలా శంకరుడు వరాన్ని ఇచ్చాడు.ఇలా శంకరుడు వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు
ఇదంతా పార్వతీ దేవికి వివరించుకుంటూ వచ్చాడు

సోऽప్యవాప్తమహాయోగ మహిమా భార్గవోత్తమః
విచరత్యధునాప్యద్ధా హరావేకాన్తతాం గతః

మార్కండేయుడు కూడా ఇంత గొప్ప మహిమను పొంది, శ్రీమన్నారాయణుని యందు ఏకాంత భక్తి గలవాడై ఇప్పటికీ మార్కండేయుడు సంచరిస్తూ ఉన్నాడు

అనువర్ణితమేతత్తే మార్కణ్డేయస్య ధీమతః
అనుభూతం భగవతో మాయావైభవమద్భుతమ్

ఇలాంటి మార్కండేయుని ప్రభావాన్ని నీకు వివరించాను.
ఎవడూ ఇప్పటివరకూ శ్రీమన్నారాయణుని అద్భుతమైన మాయా వైభవాన్ని ఈయన తప్ప ఎవరూ చూడలేదు

ఏతత్కేచిదవిద్వాంసో మాయాసంసృతిరాత్మనః
అనాద్యావర్తితం నౄణాం కాదాచిత్కం ప్రచక్షతే

ఇదంతా కాదాచిత్కముగా (ఎపుడో ఒకప్పుడు జరిగేదిగా) కొందరు మహానుభావులు పరమాత్మ మాయా ప్రభావాన్ని చెబుతారు

య ఏవమేతద్భృగువర్య వర్ణితం రథాఙ్గపాణేరనుభావభావితమ్
సంశ్రావయేత్సంశృణుయాదు తావుభౌ తయోర్న కర్మాశయసంసృతిర్భవేత్

చక్రపాణి ఐన పరమాత్మ ప్రభావముతో ఏర్పడిన ఈ గొప్ప ఆశ్చర్యకరమైన ఈ వర్ణనను వినిపించినవాడూ విన్నవాడికి, మళ్ళీ ఈ సంసారము అంటదు

                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

           

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

సూత ఉవాచ
సంస్తుతో భగవానిత్థం మార్కణ్డేయేన ధీమతా
నారాయణో నరసఖః ప్రీత ఆహ భృగూద్వహమ్

ఇలా స్తోత్రం చేయబడిన పరమాత్మ సంతోషించి

శ్రీభగవానువాచ
భో భో బ్రహ్మర్షివర్యోऽసి సిద్ధ ఆత్మసమాధినా
మయి భక్త్యానపాయిన్యా తపఃస్వాధ్యాయసంయమైః

మహానుభావా నీవు ఆత్మ సమాధి స్థితిఓ సిద్ధుడవయ్యావు
నా యందు భక్తితో, తపస్వాధ్యాయ ఇంద్రియ నిగ్రహాదులతో నీవు సాధించావు

వయం తే పరితుష్టాః స్మ త్వద్బృహద్వ్రతచర్యయా
వరం ప్రతీచ్ఛ భద్రం తే వరదోऽస్మి త్వదీప్సితమ్

మేము సంతోషించాము నీ బ్రహ్మ చర్య వ్రతముతో
వరాన్ని కోరుకో నీకు శుభం కలుగుతుంది. వరములిచ్చేవారందరికీ నేనే అధిపతిని (కంచి వరదరాజస్వామి)

శ్రీఋషిరువాచ
జితం తే దేవదేవేశ ప్రపన్నార్తిహరాచ్యుత
వరేణైతావతాలం నో యద్భవాన్సమదృశ్యత

ఇంకా నాకు వరములెందుకు. దేవ దేవా నీవు ఆశ్రయించిన వారి బాధలను తొలగిస్తావు
నీవు నాకు ఇచ్చిన ఈ వరము చాలు. నీ సాక్షాత్కారమే చాలు.

గృహీత్వాజాదయో యస్య శ్రీమత్పాదాబ్జదర్శనమ్
మనసా యోగపక్వేన స భవాన్మేऽక్షిగోచరః

బ్రహ్మాది దేవతలు కూడా యోగముతో నీ పాద పద్మాలను దర్శించాలని ఎంతో తపిస్తూ ఉంటారు
అలాంటి మీరు నా కన్నులకు కనపడ్డారు

అథాప్యమ్బుజపత్రాక్ష పుణ్యశ్లోకశిఖామణే
ద్రక్ష్యే మాయాం యయా లోకః సపాలో వేద సద్భిదామ్

నాకు ఒక్కసారి నీ మాయను చూడాలని ఉంది. లోకములూ లోకపాలకులూ పోతున్నారూ వస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో చూడాలని ఉంది అని అడుగగా

సూత ఉవాచ
ఇతీడితోऽర్చితః కామమృషిణా భగవాన్మునే
తథేతి స స్మయన్ప్రాగాద్బదర్యాశ్రమమీశ్వరః

అది విని భగవానుడు అలాగే అని బదరికాశ్రమానికి వెళ్ళారు

తమేవ చిన్తయన్నర్థమృషిః స్వాశ్రమ ఏవ సః
వసన్నగ్న్యర్కసోమామ్బు భూవాయువియదాత్మసు

పంచభూతాలనూ వాటి స్వరూపాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ
తాను పరమాత్మను కోరిన వరాన్ని గురించి ఆలోచిస్తూ కొన్నాళ్ళు కాలం గడిపాడు

ధ్యాయన్సర్వత్ర చ హరిం భావద్రవ్యైరపూజయత్
క్వచిత్పూజాం విసస్మార ప్రేమప్రసరసమ్ప్లుతః

పరమాత్మను చూచినందు వలన నిరంతరం ఆ రూపమే కళ్ళముందు కదలాడుతూ
ఆ ప్రేమా ఆ ఆకారమూ తలచుకున్నప్పుడల్లా కళ్ళూ చెమ్మగిలూతూ, సంధ్యావందనం మరచిపోయాడు పూజా స్నానం మరచిపోయాడు

తస్యైకదా భృగుశ్రేష్ఠ పుష్పభద్రాతటే మునేః
ఉపాసీనస్య సన్ధ్యాయాం బ్రహ్మన్వాయురభూన్మహాన్

ఇలా ఉండగా, ఈ ముని పుషభద్రా నదీ తీరములో సంధ్యావందనం చేస్తూ ఉండగా పెద్ద వాయువు వచ్చింది మహాప్రళయముగా

తం చణ్డశబ్దం సముదీరయన్తం బలాహకా అన్వభవన్కరాలాః
అక్షస్థవిష్ఠా ముముచుస్తడిద్భిః స్వనన్త ఉచ్చైరభి వర్షధారాః

దాని వెంటనే పెద్ద పెద్ద మేఘాలూ వచ్చాయి
మెరుపులతో కనులూ అన్ని ఇంద్రియాలూ మిరుమిట్లు గొలిపాయి.
ఉరుముతూ మెరుస్తూ గాలితో బ్రహ్మాండమైన వర్షం కురిసింది

తతో వ్యదృశ్యన్త చతుః సముద్రాః సమన్తతః క్ష్మాతలమాగ్రసన్తః
సమీరవేగోర్మిభిరుగ్రనక్ర మహాభయావర్తగభీరఘోషాః

ఈ ఆశ్రమములోకే నాలుగు సముద్రాలూ వచ్చాయి.
మొత్తం భూమండలాన్ని మింగివేస్తున్నాయి
వాయు వేగముతో తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి

అన్తర్బహిశ్చాద్భిరతిద్యుభిః ఖరైః
శతహ్రదాభిరుపతాపితం జగత్
చతుర్విధం వీక్ష్య సహాత్మనా మునిర్
జలాప్లుతాం క్ష్మాం విమనాః సమత్రసత్

ముసళ్ళూ తిమింగలాలతో సుడిగుండాలతో లోపలా వెలుపలా ఎక్కడ చూచినా నీరే
మెరుపులే మేఘాలే
జగత్తు మొత్తం మెరుపులతో ఉరుములతో వణికిపోయింది
ఎక్కడ చూసినా నాలుగు దిక్కులా నీరే. మార్కండేయుని మనసు ఖేధబడి కొద్దిగా భయపడ్డాడు

తస్యైవముద్వీక్షత ఊర్మిభీషణః ప్రభఞ్జనాఘూర్ణితవార్మహార్ణవః
ఆపూర్యమాణో వరషద్భిరమ్బుదైః క్ష్మామప్యధాద్ద్వీపవర్షాద్రిభిః సమమ్

ఇలా ఉండగానే నీరు అంతటా వ్యాపించి ఎత్తూ వంపూ ఏమీ లేకుండా మొత్తం నీటితో సమానమైపోయినిద్

సక్ష్మాన్తరిక్షం సదివం సభాగణం
త్రైలోక్యమాసీత్సహ దిగ్భిరాప్లుతమ్
స ఏక ఏవోర్వరితో మహామునిర్
బభ్రామ విక్షిప్య జటా జడాన్ధవత్

ఆకాశమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ  మూడు లోకాలూ దిగ్గజాలూ
అంతా జలమే.
ఈ మహాప్రళయముతో భయపడిన మార్కండేయుడు తన జటలను విప్పి అందులో సంచరిస్తున్నాడు ఏమీ గానక.

క్షుత్తృట్పరీతో మకరైస్తిమిఙ్గిలైర్
ఉపద్రుతో వీచినభస్వతాహతః
తమస్యపారే పతితో భ్రమన్దిశో
న వేద ఖం గాం చ పరిశ్రమేషితః

ఆకలీ దప్పీ వేస్తున్నాయి
ముసళ్ళూ తిమింగలాలూ మీదకు వస్తున్నాయి మింగడానికి
పక్కకు పోతే తరంగాలూ వాయువు
ఇంకో దిక్కుకు వెళితే ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి
మొత్తం కటిక చీకటి
భూమి ఎక్కడ ఉందో
ఆకాశస్మ్ ఎక్కడ ఉందో తాను ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు

క్రచిన్మగ్నో మహావర్తే తరలైస్తాడితః క్వచిత్
యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్యఘాతిభిః

ఇలా వెళ్ళి వెళ్ళి తరంగాలచేత కొట్టబడి ఒక పెద్ద సుడిగుండం లోపలకు వెళ్ళాడు
అక్కడ పెద చేపలు చిన చేపలను తింటూ ఉన్నాయి

క్వచిచ్ఛోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయమ్
క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దితః

ఒక చోట మోహం ఒక చోట శోకమూ భయమూ దుఃఖమూ మృత్యువూ
కొందరు వ్యాధులతో చస్తున్నారు, కొందరు దుఃఖిస్తున్నారు
కొందరికి జ్వరాలు వస్తున్నాయి. కొందరు ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు,
కొందరు చస్తున్నారు కొందరు పుడుతున్నారు

అయుతాయతవర్షాణాం సహస్రాణి శతాని చ
వ్యతీయుర్భ్రమతస్తస్మిన్విష్ణుమాయావృతాత్మనః

ఇలా మొత్తం ఒక పది లక్షల సంవత్సరాలు తిరిగుతూనే ఉన్నాడు భగవంతుని మాయతో

స కదాచిద్భ్రమంస్తస్మిన్పృథివ్యాః కకుది ద్విజః
న్యాగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితమ్

ఇలా తిరుగుతూ ఉండగా ఒక గడ్డ కనపడింది. దాని మీద ఒక చిన్న మఱ్ఱి చెట్టు కనపడింది
దానికి మఱ్ఱి కాయలూ పళ్ళూ చిగురుటాకులూ ఆకులూ అన్నీ ఉన్నాయి

ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుమ్
శయానం పర్ణపుటకే గ్రసన్తం ప్రభయా తమః

ఆ చెట్టుకు ఈశాన్య శాఖ యందు ఒక చిన్న పిల్లవాడిని చూచాడు
మఱ్ఱి ఆకు యొక్క పుట భాగం యందు పడుకుని తన కాంతితో మొత్తం చీకటిని మింగివేస్తున్నాడు

మహామరకతశ్యామం శ్రీమద్వదనపఙ్కజమ్
కమ్బుగ్రీవం మహోరస్కం సునసం సున్దరభ్రువమ్

శ్వాసైజదలకాభాతం కమ్బుశ్రీకర్ణదాడిమమ్
విద్రుమాధరభాసేషచ్ ఛోణాయితసుధాస్మితమ్

పద్మగర్భారుణాపాఙ్గం హృద్యహాసావలోకనమ్
శ్వాసైజద్వలిసంవిగ్న నిమ్ననాభిదలోదరమ్

పగడం వంటి పెదవుల కాంతి పళ్ళ మీద పడి చిరునవ్వు ఎర్రగా ప్రకాశిస్తోంది.
ఆయన నవ్వూ చూపూ హృద్యముగా ఉన్నాయి

చార్వఙ్గులిభ్యాం పాణిభ్యామున్నీయ చరణామ్బుజమ్
ముఖే నిధాయ విప్రేన్ద్రో ధయన్తం వీక్ష్య విస్మితః

ఆ స్వామి పరమ సుకుమారమైన తన వేళ్ళతో తన పాదపద్మాన్ని తీసుకుని నోటిలో పెట్టుక్ని బొటన వేలుని ఆస్వాదిస్తున్నాడు
ఆ స్వామిని చూచి మార్కండేయుడు ఆశ్చర్యపోయి

తద్దర్శనాద్వీతపరిశ్రమో ముదా ప్రోత్ఫుల్లహృత్పౌల్మవిలోచనామ్బుజః
ప్రహృష్టరోమాద్భుతభావశఙ్కితః ప్రష్టుం పురస్తం ప్రససార బాలకమ్

మొత్తం అలసట పోయింది
సంతోషముతో హృదయమూ కనులూ వికసించాయి.
ఇంత చిన్న చెట్టుకు,ఇంత చిన్న ఆకు మీద చిన్న పిల్లవాడా, ఆయనకు ఈ ఆభరణాలా

తావచ్ఛిశోర్వై శ్వసితేన భార్గవః
సోऽన్తః శరీరం మశకో యథావిశత్
తత్రాప్యదో న్యస్తమచష్ట కృత్స్నశో
యథా పురాముహ్యదతీవ విస్మితః

ఈ పిల్లవాడెవరు అని అడుగుదామని దగ్గరకు వెళ్ళగా
ఆ పిల్లవాడు ఉచ్చ్వాస తీసుకున్నాడు
వెంటనే గాలి పీల్చుకుంటే దోమ నోటిలోకి వెళ్ళినట్లుగా పరమాత్మ గాలి పీల్చుకోగానే మార్కండేయుడు లోపలకు వెళ్ళాడు
అక్కడకు వెళ్ళగా తాను అంతకు ముందు వేటి  వేటిని చూచాడో, మునిగిపోయినవీ, కనపడకుండా పోయినవి నశించనివీ నశించినవీ చూచి ఆశ్చర్యపోయాడు

ఖం రోదసీ భాగణానద్రిసాగరాన్ద్వీపాన్సవర్షాన్కకుభః సురాసురాన్
వనాని దేశాన్సరితః పురాకరాన్ఖేటాన్వ్రజానాశ్రమవర్ణవృత్తయః

ఆకాశమూ దిక్కులూ అంతరిక్షమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ సముద్రాలూ ద్వీపములూ పర్వతాలూ నదులూ దిక్కులూ దేవతలూ రాక్షసులూ అడవులూ దేశములూ పురములూ వ్ర్జములూ పల్లెలూ పట్టణములూ ఆశ్రమాలూ మహాభూతాలూ కాలమూ

మహాన్తి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలం చ నానాయుగకల్పకల్పనమ్
యత్కిఞ్చిదన్యద్వ్యవహారకారణం దదర్శ విశ్వం సదివావభాసితమ్

మనం ప్రపంచములో వేటి వేటిని వ్యవహరిస్తామో అది మొత్తం ఉన్నట్టే కనపడింది
అది చూచి

హిమాలయం పుష్పవహాం చ తాం నదీం నిజాశ్రమం యత్ర ఋషీ అపశ్యత
విశ్వం విపశ్యఞ్ఛ్వసితాచ్ఛిశోర్వై బహిర్నిరస్తో న్యపతల్లయాబ్ధౌ

అందులో హిమాలయాన్నీ, తను ఉన్న నదీ తన ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న ఋషులనూ చూచాడు
అవి అన్నీ చూచి ఆశ్చర్యముతో ఇదేమిటా అనుకుంటూ ఉంటే స్వామి మళ్ళీ శ్వాస తీయగా బయటకు వచ్చి ప్రళయ సాగరములో పడ్డాడు

తస్మిన్పృథివ్యాః కకుది ప్రరూఢం వటం చ తత్పర్ణపుటే శయానమ్
తోకం చ తత్ప్రేమసుధాస్మితేన నిరీక్షితోऽపాఙ్గనిరీక్షణేన

మళ్ళీ బయటకు వచ్చి చెట్టూ ఆకూ పిల్లవాడు ఆయన నవ్వునీ చూచాడు
ఈయనను ఆ పిల్లవాడు (స్వామి) చూచాడు

అథ తం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది
అభ్యయాదతిసఙ్క్లిష్టః పరిష్వక్తుమధోక్షజమ్

పిల్లవాడు ముద్దుగా ఉండడముతో కౌగిలించుకుందామని దగ్గరకు వచ్చాడు

తావత్స భగవాన్సాక్షాద్యోగాధీశో గుహాశయః
అన్తర్దధ ఋషేః సద్యో యథేహానీశనిర్మితా

అంతలోనే స్వామి అంతర్ధానమయ్యాడు
సామర్ధ్యం లేని వారు పెంచుకున్న ఆశలాగ అంతర్ధానమయ్యాడు పరమాత్మ

తమన్వథ వటో బ్రహ్మన్సలిలం లోకసమ్ప్లవః
తిరోధాయి క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్స్థితః

పరమాత్మ అంతర్ధానమవ్వగానే సముద్రమూ తుఫానూ గాలీ భూతాలూ ఏదీ లేక మళ్ళీ తాను తన ఆశ్రమ నదీ తీరములో సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

              

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీశౌనక ఉవాచ
సూత జీవ చిరం సాధో వద నో వదతాం వర
తమస్యపారే భ్రమతాం నౄణాం త్వం పారదర్శనః

సూతా, నీవు చాలా కాలం జీవించి ఉండుగాక.
అజ్ఞ్యానమనే మహా అంధకారములో సంచరించే మానవులకు వెలుగు చూపే వాడవు

ఆహుశ్చిరాయుషమృషిం మృకణ్డుతనయం జనాః
యః కల్పాన్తే హ్యుర్వరితో యేన గ్రస్తమిదం జగత్

నీవు మార్కండేయుని గురించి చెప్పావు
ఆయన చిరంజీవి అని లోకాలన్నీ చెప్పుకుంటున్నాయి

స వా అస్మత్కులోత్పన్నః కల్పేऽస్మిన్భార్గవర్షభః
నైవాధునాపి భూతానాం సమ్ప్లవః కోऽపి జాయతే

ప్రళయకాల చివరలో కూడా ఈయన ఉన్నాడట. స్వామే ఈయనను మింగివేసాడట
ఈయన మా కులం వాడు. ఆయన గొప్ప తనాన్ని మేము కూడా వినాలనుకుంటున్నాము
ప్రళయాన్ని చూచాడు ప్రళయ కాలములో స్వామి చేత మింగబడి, తరువాత బయటకు వచ్చాడు అని చెప్పుకుంటున్నారు

ఏక ఏవార్ణవే భ్రామ్యన్దదర్శ పురుషం కిల
వటపత్రపుటే తోకం శయానం త్వేకమద్భుతమ్

మాకు తెలియకుండా ఈ ప్రళయం ఎలా వచ్చింది
ఏకార్ణవములో తిరుగుతూ ఉన్న ఈ మహాత్ముడు పరమాత్మను చూచాడట
సముద్రములో వటపత్రం మీద ఒంటిగా పడుకున్న పరమాత్మను చూచాడట
మా ఈ సందేహాన్ని తొలగించవలసింది

ఏష నః సంశయో భూయాన్సూత కౌతూహలం యతః
తం నశ్ఛిన్ధి మహాయోగిన్పురాణేష్వపి సమ్మతః

సూత ఉవాచ
ప్రశ్నస్త్వయా మహర్షేऽయం కృతో లోకభ్రమాపహః
నారాయణకథా యత్ర గీతా కలిమలాపహా

లోకుల భ్రమ పోగొట్టడానికి చాలా చక్కని ప్రశ్న వేశావు. ఇది నారాయణ కథ, కలి పాపాలను పోగొడుతుంది

ప్రాప్తద్విజాతిసంస్కారో మార్కణ్డేయః పితుః క్రమాత్
ఛన్దాంస్యధీత్య ధర్మేణ తపఃస్వాధ్యాయసంయుతః

ఈయన తండ్రిగారి దగ్గరనుండి వరుసలో ఉపనయనాదులన్నీ చేసుకుని
వేదములు ధర్మముగా చదువుకుని

బృహద్వ్రతధరః శాన్తో జటిలో వల్కలామ్బరః
బిభ్రత్కమణ్డలుం దణ్డముపవీతం సమేఖలమ్

బృహద్వ్రతం (బ్రహ్మచర్యవ్రతము) తీసుకుని జటలు ధరించి వల్కలు ధరించి

కృష్ణాజినం సాక్షసూత్రం కుశాంశ్చ నియమర్ద్ధయే
అగ్న్యర్కగురువిప్రాత్మస్వర్చయన్సన్ధ్యయోర్హరిమ్

రెండు సంధ్యలలో పరమాత్మను అగ్ని అర్క గురు విప్ర ఆత్మ స్వరూపులుగా పూజిస్తూ

సాయం ప్రాతః స గురవే భైక్ష్యమాహృత్య వాగ్యతః
బుభుజే గుర్వనుజ్ఞాతః సకృన్నో చేదుపోషితః

సాయం ప్రాతః కాలలో భిక్షాటన చేసి గురువుగారికి అర్పిస్తూ ఆయన అనుజ్ఞ్య ఇస్తే రోజుకు ఒక్క సారి భుజించేవాడు

ఏవం తపఃస్వాధ్యాయపరో వర్షాణామయుతాయుతమ్
ఆరాధయన్హృషీకేశం జిగ్యే మృత్యుం సుదుర్జయమ్

ఇలా తపస్వాధ్యాయ పరుడై పదివేల సంవత్సరాలు గురువును సేవిస్తూ పరమాత్మను ఆరాధిస్తూ జయింపరాని మృత్యువును కూడా గెలిచాడు

బ్రహ్మా భృగుర్భవో దక్షో బ్రహ్మపుత్రాశ్చ యేऽపరే
నృదేవపితృభూతాని తేనాసన్నతివిస్మితాః

బ్రహ్మా బృగు శంకరులూ దక్షాదులు ఈ మార్కండేయుని తపశ్శక్తిని చూచి అత్యాశ్చర్యపడ్డారు

ఇత్థం బృహద్వ్రతధరస్తపఃస్వాధ్యాయసంయమైః
దధ్యావధోక్షజం యోగీ ధ్వస్తక్లేశాన్తరాత్మనా

బ్రహ్మచర్యముతో తపస్వాధ్యాయముతో పరమాత్మను శ్రీమన్నారాయణున్ని హృదయములో నిలుపుకున్నాడు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం మహాయోగేన యోగినః
వ్యతీయాయ మహాన్కాలో మన్వన్తరషడాత్మకః

ఇలా ఆరు మన్వంతర కాలాలు ఉన్నాడు మార్కండేయుడు. ఇంత కాలం స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు

ఏతత్పురన్దరో జ్ఞాత్వా సప్తమేऽస్మిన్కిలాన్తరే
తపోవిశఙ్కితో బ్రహ్మన్నారేభే తద్విఘాతనమ్

ఈ విషయాన్ని సప్తమ మన్వంతరములో ఇంద్రుడు తెలుసుకుని
ఈయన చేస్తున్న తపస్సు వలన మా లోకానికి ప్రమాదం రవొచ్చు అని విఘ్నాలు కల్పించడం ప్రారంభించాడు

గన్ధర్వాప్సరసః కామం వసన్తమలయానిలౌ
మునయే ప్రేషయామాస రజస్తోకమదౌ తథా

గంధర్వులూ అప్సరసలూ మలయానిలం వసంతుడూ మొదలైన వారు, రజస్సునూ మదాన్నీ తమస్సునూ పెంచేవారిని పంపాడు

తే వై తదాశ్రమం జగ్ముర్హిమాద్రేః పార్శ్వ ఉత్తరే
పుష్పభద్రా నదీ యత్ర చిత్రాఖ్యా చ శిలా విభో

వారు అక్కడ ఆశ్రమానికి వెళ్ళారు

తదాశ్రమపదం పుణ్యం పుణ్యద్రుమలతాఞ్చితమ్
పుణ్యద్విజకులాకీఋనం పుణ్యామలజలాశయమ్

పవిత్రమైన ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆయన తపస్సు విఘ్నం కలిగించడానికి ప్రయత్నించారు
వసంత ఋతువు ప్రతీ చెట్టుకూ ప్రతీ కొమ్మకూ పూలు పూస్తూ కోకిల తన కూతలతో మయూరము నాట్యముతో గంధర్వులు గానముతో మన్మధుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు

మత్తభ్రమరసఙ్గీతం మత్తకోకిలకూజితమ్
మత్తబర్హినటాటోపం మత్తద్విజకులాకులమ్

వాయుః ప్రవిష్ట ఆదాయ హిమనిర్ఝరశీకరాన్
సుమనోభిః పరిష్వక్తో వవావుత్తమ్భయన్స్మరమ్

ఉద్యచ్చన్ద్రనిశావక్త్రః ప్రవాలస్తబకాలిభిః
గోపద్రుమలతాజాలైస్తత్రాసీత్కుసుమాకరః

అన్వీయమానో గన్ధర్వైర్గీతవాదిత్రయూథకైః
అదృశ్యతాత్తచాపేషుః స్వఃస్త్రీయూథపతిః స్మరః

హుత్వాగ్నిం సముపాసీనం దదృశుః శక్రకిఙ్కరాః
మీలితాక్షం దురాధర్షం మూర్తిమన్తమివానలమ్

అగ్నిని ఉపాసించే మార్కండేయున్ని చూచారు.
రూపుదాల్చిన అగ్నిహోత్రం వంటి ఆయనను చూచి

ననృతుస్తస్య పురతః స్త్రియోऽథో గాయకా జగుః
మృదఙ్గవీణాపణవైర్వాద్యం చక్రుర్మనోరమమ్

ఆయన ముందర స్త్రీలు నాట్యమూ గాయకులు గానమూ
మృదంగాలూ వీణా నాదాలు చేసారు
మన్మధుడు అస్త్రాన్ని సంధించాడు

సన్దధేऽస్త్రం స్వధనుషి కామః పఞ్చముఖం తదా
మధుర్మనో రజస్తోక ఇన్ద్రభృత్యా వ్యకమ్పయన్

క్రీడన్త్యాః పుఞ్జికస్థల్యాః కన్దుకైః స్తనగౌరవాత్
భృశముద్విగ్నమధ్యాయాః కేశవిస్రంసితస్రజః

పుంజకస్థలి అనే అప్సరస స్త్రీ ఉంది అక్కడ
మన్మధుడు తన బాణాన్నీ ప్రయోగించాడు

ఇతస్తతో భ్రమద్దృష్టేశ్చలన్త్యా అను కన్దుకమ్
వాయుర్జహార తద్వాసః సూక్ష్మం త్రుటితమేఖలమ్

విససర్జ తదా బాణం మత్వా తం స్వజితం స్మరః
సర్వం తత్రాభవన్మోఘమనీశస్య యథోద్యమః

కానీ ఆయన కనులు తెరవనే లేదు వారిని చూడనే లేదు

త ఇత్థమపకుర్వన్తో మునేస్తత్తేజసా మునే
దహ్యమానా నివవృతుః ప్రబోధ్యాహిమివార్భకాః

వీరి ప్రయత్నం వ్యర్థమయిపోయింది
ఇంత చేసినా ఆయనకు వీరి మీద కోపం కూడా రాలేదు
ఆయన తపస్సు యొక్క తేజస్సు వేడిని భరించలేక పాముని లేపిన పసిపిల్లల్లాగ పారిపోయారు

ఇతీన్ద్రానుచరైర్బ్రహ్మన్ధర్షితోऽపి మహామునిః
యన్నాగాదహమో భావం న తచ్చిత్రం మహత్సు హి

దృష్ట్వా నిస్తేజసం కామం సగణం భగవాన్స్వరాట్
శ్రుత్వానుభావం బ్రహ్మర్షేర్విస్మయం సమగాత్పరమ్

మన్మధుడు నిస్తేజుడయ్యాడు
ఆయన ప్రభావాన్ని చూచి ఆశ్చర్యపోయారు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం తపఃస్వాధ్యాయసంయమైః
అనుగ్రహాయావిరాసీన్నరనారాయణో హరిః

ఈయన చూపిన తపశ్శక్తీ ఇంద్రియ నిగ్రహాన్ని చూచి నర నారాయణులు వచ్చారు అక్కడకి

తౌ శుక్లకృష్ణౌ నవకఞ్జలోచనౌ
చతుర్భుజౌ రౌరవవల్కలామ్బరౌ
పవిత్రపాణీ ఉపవీతకం త్రివృత్
కమణ్డలుం దణ్డమృజుం చ వైణవమ్

అలా నలుపూ తెలుపూ మిశ్రమమైన నారాయణున్నీ నరున్నీ చూచి
పద్మాలవంటి కనులతో ఉన్నారు, నాలుగు భుజాలతో
కమండలమూ దండమూ జపమాలనూ తీసుకుని

పద్మాక్షమాలాముత జన్తుమార్జనం
వేదం చ సాక్షాత్తప ఏవ రూపిణౌ
తపత్తడిద్వర్ణపిశఙ్గరోచిషా
ప్రాంశూ దధానౌ విబుధర్షభార్చితౌ

వేదమూ తపస్సే రూపు దాల్చినట్లుగా ఉన్నారు.

తే వై భగవతో రూపే నరనారాయణావృషీ
దృష్ట్వోత్థాయాదరేణోచ్చైర్ననామాఙ్గేన దణ్డవత్

ఈ ఇద్దరినీ చూచి సంతోషముతో ఆశ్చర్యముతో లేచి దండములాగ పడి నమస్కరించాడు

స తత్సన్దర్శనానన్ద నిర్వృతాత్మేన్ద్రియాశయః
హృష్టరోమాశ్రుపూర్ణాక్షో న సేహే తావుదీక్షితుమ్

పరమాత్మ దర్శనముతో మనసుకూ ఇంద్రియాలకూ  తృప్తి కలగడముతో
ఆనంద బాష్పములు కనులలో నిండి ఎదురుగా ఉన్న వారిని సరిగా చూడలేకపోయాడు

ఉత్థాయ ప్రాఞ్జలిః ప్రహ్వ ఔత్సుక్యాదాశ్లిషన్నివ
నమో నమ ఇతీశానౌ బభాశే గద్గదాక్షరమ్

ఉత్సాహముగా వార్ని ఆలింగనం చేసుకున్నట్లుగా నమో నమః అంటూ మాటలు పెగలక ఉన్నాడు

తయోరాసనమాదాయ పాదయోరవనిజ్య చ
అర్హణేనానులేపేన ధూపమాల్యైరపూజయత్

వారికి ఆసనాన్నిచ్చి  పాద్యమూ అర్ఘ్యమూ ధూపమూ దీపమూ మాల్యములూ ఇలా పదుహారు ఉపచారాలు సక్రమముగా జరిపి

సుఖమాసనమాసీనౌ ప్రసాదాభిముఖౌ మునీ
పునరానమ్య పాదాభ్యాం గరిష్ఠావిదమబ్రవీత్

అనుగ్రహముతో ఉన్నవారిరువురినీ చూచి మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు

శ్రీమార్కణ్డేయ ఉవాచ
కిం వర్ణయే తవ విభో యదుదీరితోऽసుః
సంస్పన్దతే తమను వాఙ్మనైన్ద్రియాణి
స్పన్దన్తి వై తనుభృతామజశర్వయోశ్చ
స్వస్యాప్యథాపి భజతామసి భావబన్ధుః

మీ గురించి ఏమని వర్ణించాలి.
సకల జీవుల ప్రాణములూ వాక్కు మనసు ఇంద్రియములు నీ సంకల్పముతోనే పని చేస్తాయి, బ్రహ్మ రుద్రులకు కూడా.
ఐనా ఇంత గొప్ప వాడవైనా నిన్ను సేవించేవారికి నీవు బంధువు

మూర్తీ ఇమే భగవతో భగవంస్త్రిలోక్యాః
క్షేమాయ తాపవిరమాయ చ మృత్యుజిత్యై
నానా బిభర్ష్యవితుమన్యతనూర్యథేదం
సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః

స్వామీ, మీ ఈ రెండు రూపాలూ మూడు లోకముల తాపాన్ని పోగొట్టి క్షేమాన్ని అందించడానికి మృత్యువును జయించడానికి
సకల లోకాలను కాపాడడానికి ఇవే కాక చాలా రూపలను ధరిస్తూ ఉన్నావు
సాలెపురుగు ఎలా సృష్టించి మళ్ళీ మింగుతుందో నీవు జగత్తును సృష్టించి మరలా సంహరిస్తూ ఉన్నావు

తస్యావితుః స్థిరచరేశితురఙ్ఘ్రిమూలం
యత్స్థం న కర్మగుణకాలరజః స్పృశన్తి
యద్వై స్తువన్తి నినమన్తి యజన్త్యభీక్ష్ణం
ధ్యాయన్తి వేదహృదయా మునయస్తదాప్త్యై

ఇలా స్థావర జంగమాధిపతి ఐన నీ పాదపద్మములను,
కర్మ కాలముల గుణముల మురికి ఎక్కడ ఉంటే స్పృశించవో
వాటిని వేదముల యందే మనసు ఉన్న మునులు స్తోత్రం చేస్తారు నమస్కారం చేస్తారు, మాటి మాటికీ పూజిస్తారు ధ్యానం చేస్తారు

నాన్యం తవాఙ్ఘ్ర్యుపనయాదపవర్గమూర్తేః
క్షేమం జనస్య పరితోభియ ఈశ విద్మః
బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధధిష్ణ్యః
కాలస్య తే కిముత తత్కృతభౌతికానామ్

అన్ని వైపులా భయం ఆవరించి ఉన్న జీవునికి
నీ పాదపద్మాల చేరిక కంటే వేరే అభయాన్ని మేము తెలియము
సంసార తాప తప్తులకు భయాన్ని తొలగించేవి నీ పాదములే
ద్విపరార్థ కాల ఆయుష్యమున్న బ్రహ్మ కూడా కాలానికి భయపడుతూ ఉంటాడు
అలాంటపుడు బ్రహ్మ చేత సృష్టించబడిన వారు భయపడతారని వేరేగా చెప్పాలా

తద్వై భజామ్యృతధియస్తవ పాదమూలం
హిత్వేదమాత్మచ్ఛది చాత్మగురోః పరస్య
దేహాద్యపార్థమసదన్త్యమభిజ్ఞమాత్రం
విన్దేత తే తర్హి సర్వమనీషితార్థమ్

కాబట్టి ఉత్త్తమ భక్తి కలవారమై నీ పాద మూలాన్ని భజిస్తాము
శరీరము ఇంద్రియాలూ అన్నీ జీవుడు అందులో ఉన్నాడు అని చెప్పడానికి ఒక గుర్తు  మాత్రమే
అలాంటి ఆవరణలను విడిచిపెట్టి నీ పాదాలను సేవిస్తేనే అనుకున్నవన్నీ పొందగలడు

సత్త్వం రజస్తమ ఇతీశ తవాత్మబన్ధో
మాయామయాః స్థితిలయోదయహేతవోऽస్య
లీలా ధృతా యదపి సత్త్వమయీ ప్రశాన్త్యై
నాన్యే నృణాం వ్యసనమోహభియశ్చ యాభ్యామ్

నీ మాయతో వచ్చిన మూడు గుణాలు సృష్టి స్థితి సంహారాలను కలిగిస్తాయి
నీవే సత్వ రూపాన్ని ప్రశాంతి కోసం ధరిస్తావు. రజస్తమస్సుల వలన వ్యసన మోహాలు కలుగుతాయి. నీ దర్శనముతో అవి అన్నీ తొలగుతాయి

తస్మాత్తవేహ భగవన్నథ తావకానాం
శుక్లాం తనుం స్వదయితాం కుశలా భజన్తి
యత్సాత్వతాః పురుషరూపముశన్తి సత్త్వం
లోకో యతోऽభయముతాత్మసుఖం న చాన్యత్

నీ సత్వ రూపాన్ని ఉపాసించేవారికి ఏ భయమూ ఉండదు

తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే
విశ్వాయ విశ్వగురవే పరదైవతాయ
నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ
హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ

అటువంటి పరమాత్మకు నమస్కారము
నీవే ప్రపంచము, ప్రపంచానికి గురువూ
నీవే పరదేవతవు.
నరునికీ నారాయణునికీ నమస్కారం
మీరే హంసలు. మీరే మౌన స్వరూపులు
మీరే నిగమేశ్వరులు వేదాధిపతులు
అటువంటి మీకు నమస్కారం

యం వై న వేద వితథాక్షపథైర్భ్రమద్ధీః
సన్తం స్వకేష్వసుషు హృద్యపి దృక్పథేషు
తన్మాయయావృతమతిః స ఉ ఏవ సాక్షాద్
ఆద్యస్తవాఖిలగురోరుపసాద్య వేదమ్

రకరకముల ఇంద్రియముల మార్గములతో భ్రమ పడే వారు మీ స్వరూపాన్ని తెలుసుకోలేరు
నీవు మా హృదయాలలో ఇంద్రియాలలో ప్రాణాలలో మనసులో ఉన్నావు
ఐనా నిన్ను మేము తెలుసుకోలేకపోతున్నాము
నీ మాయ చేత మా అందరి బుద్ధీ కప్పబడుతూ ఉన్నది.
వేదానికి బ్రహ్మకు అందించినవాడవు
వేదాన్ని కాపాడినవాడవు

యద్దర్శనం నిగమ ఆత్మరహఃప్రకాశం
ముహ్యన్తి యత్ర కవయోऽజపరా యతన్తః
తం సర్వవాదవిషయప్రతిరూపశీలం
వన్దే మహాపురుషమాత్మనిగూఢబోధమ్

పరమాత్మను దర్శించుకుంటే వేదములు ఆత్మస్వరూపమూ స్పష్టముగా తెలుస్తాయి
ఇలాంటి నిన్ను తెలుసుకోవడానికి బ్రహ్మాది దేవతలు ప్రయత్నం చేస్తూ కూడా మోహాన్ని చెందుతారు
ఇటువంటి మహా పురుషున్ని, పరమ రహస్యమైన ఆత్మ స్వరూప ప్రకాశకునికి నమస్కరిస్తున్నాను అని మార్కండేయుడు శ్రీమన్నారాయణున్ని స్తోత్రం చేసాడు

                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts