Followers

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఎనిమిదవ అధ్యాయం

            ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఎనిమిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఏకదా పాణ్డవాన్ద్రష్టుం ప్రతీతాన్పురుషోత్తమః
ఇన్ద్రప్రస్థం గతః శృమాన్యుయుధానాదిభిర్వృతః

ఈ రీతిలో ఒక సారి పరమాత్మ పాండవులని చూడడానికి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఇలా వచ్చిన కృష్ణున్ని చూచి

దృష్ట్వా తమాగతం పార్థా ముకున్దమఖిలేశ్వరమ్
ఉత్తస్థుర్యుగపద్వీరాః ప్రాణా ముఖ్యమివాగతమ్

ప్రాణం లేచి వచ్చినట్లుగా ఎదురు వెళ్ళి

పరిష్వజ్యాచ్యుతం వీరా అఙ్గసఙ్గహతైనసః
సానురాగస్మితం వక్త్రం వీక్ష్య తస్య ముదం యయుః

కృష్ణున్ని కౌగిలించుకుని ఆయన స్పర్శతో అన్ని పాపాలూ తొలగించుకుని పరమాత్మ ముఖమండలాన్ని చూచి పరమానందాన్ని పొందారు

యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివన్దనమ్
ఫాల్గునం పరిరభ్యాథ యమాభ్యాం చాభివన్దితః

పరమాత్మ క్సృష్ణుడు ధర్మరాజుకూ భీమునకూ పాదాభివందనం చేసాడు, అర్జనుడిని ఆలింగనం చేసుకున్నాడు, నకుల సహ దేవుల చేత నమస్కారం తీసుకున్నాడు. భీమ ధర్మరాజులు కృష్ణుడికన్నా పెద్ద

పరమాసన ఆసీనం కృష్ణా కృష్ణమనిన్దితా
నవోఢా వ్రీడితా కిఞ్చిచ్ఛనైరేత్యాభ్యవన్దత

కొత్త పెళ్ళికూతురైన ద్రౌపతి సిగ్గుపడుతూ వచ్చి కృష్ణునికి నమస్కరించింది.

తథైవ సాత్యకిః పార్థైః పూజితశ్చాభివన్దితః
నిషసాదాసనేऽన్యే చ పూజితాః పర్యుపాసత

సాత్యకి కూడా వారి చేత పూజించబడ్డాడు

పృథామ్సమాగత్య కృతాభివాదనస్తయాతిహార్దార్ద్రదృశాభిరమ్భితః
ఆపృష్టవాంస్తాం కుశలం సహస్నుషాం పితృష్వసారమ్పరిపృష్టబాన్ధవః

ఆ సమయములో కుంతీ దేవి వద్దకు వెళ్ళి కృష్ణుడు నమస్కరించాడు
అందరూ బాగున్నారా, నీవెలా ఉన్నావు

తమాహ ప్రేమవైక్లవ్య రుద్ధకణ్ఠాశ్రులోచనా
స్మరన్తీ తాన్బహూన్క్లేశాన్క్లేశాపాయాత్మదర్శనమ్

ప్రేమతో దైన్యముతో గొంతు బొంగురు పోయింది. తన అన్ని కష్టాలనూ తలచుకుంది.

తదైవ కుశలం నోऽభూత్సనాథాస్తే కృతా వయమ్
జ్ఞతీన్నః స్మరతా కృష్ణ భ్రాతా మే ప్రేషితస్త్వయా

ఎపుడు నీవు మాకు రక్షకుడిగా అవతరించావో అపుడు మాకు అన్ని కష్టాలూ పోయాయి
నీవు చాలా చిన్నప్పుడే మమ్ము జ్ఞ్యాపకం ఉంచుకున్నావు. మా అన్న ఐన అకౄరుడిని మా దగ్గరకు పంపావు.పరమాత్మ దృష్టి ఉన్నాక ఇంకెక్కడి కష్టాలు

న తేऽస్తి స్వపరభ్రాన్తిర్విశ్వస్య సుహృదాత్మనః
తథాపి స్మరతాం శశ్వత్క్లేశాన్హంసి హృది స్థితః

నీవు సకల జగన్మిత్రుడవు. నీకు నీవారూ శత్రువులూ అన్న భేధ బుద్ధి లేకున్నా నిన్ను తలచేవారి కష్టాలను వారి హృదయములోనే ఉండి పోగొడతావు. (మన కష్టాలూ బాధలూ తాపములూ హృదయములోనే ఉంటాయి.నీవు కూడా అక్కడే ఉండి బాధపడకుండా చేస్తావు)

యుధిష్ఠిర ఉవాచ
కిం న ఆచరితం శ్రేయో న వేదాహమధీశ్వర
యోగేశ్వరాణాం దుర్దర్శో యన్నో దృష్టః కుమేధసామ్

మేము నిజముగా ఎంత పుణ్యం చేసుకున్నామో మహా యోగులకు కూడా కనపడని నీవు మా కంటికి కనపడ్డావు

ఇతి వై వార్షికాన్మాసాన్రాజ్ఞా సోऽభ్యర్థితః సుఖమ్
జనయన్నయనానన్దమిన్ద్రప్రస్థౌకసాం విభుః

బంధువుల ఇంటికి వెళ్ళే ముందు వర్షాకాలములో వెళ్ళేవారు. వానాకాలం గడిచేదాకా అక్కడే ఉండవచ్చను. ఇలా ధర్మరాజు అడుగగా ఆ నాలుగు నెలలూ అక్కడే ఉండి ఇంద్రప్రస్థ వాసులకు నయనానందాన్ని కలిగిస్తూ అక్కడే ఉన్నాడు

ఏకదా రథమారుహ్య విజయో వానరధ్వజమ్
గాణ్డీవం ధనురాదాయ తూణౌ చాక్షయసాయకౌ

ఒక రోజు కృష్ణార్జనులు రథమెక్కి గాండీవాన్నీ ధనసునూ తీసుకుని విహరించడానికి ఇద్దరూ కలసి అరణ్యం అంతా తిరిగి వేట మృగాలని సంహరించుకుంటూ

సాకం కృష్ణేన సన్నద్ధో విహర్తుం విపినం మహత్
బహువ్యాలమృగాకీర్ణం ప్రావిశత్పరవీరహా

తత్రావిధ్యచ్ఛరైర్వ్యాఘ్రాన్శూకరాన్మహిషాన్రురూన్
శరభాన్గవయాన్ఖడ్గాన్హరిణాన్శశశల్లకాన్

తాన్నిన్యుః కిఙ్కరా రాజ్ఞే మేధ్యాన్పర్వణ్యుపాగతే
తృట్పరీతః పరిశ్రాన్తో బిభత్సుర్యమునామగాత్

తిరిగి తిరిగి అలసిపోయి పక్కన చూస్తే యమునా నది కనిపించింది. అక్కడ మంచి నీళ్ళు తాగారు. స్నానం చేసి నీళ్ళు తాగి చూస్తే ఒక అమ్మాయి తపస్సు చేస్తూ కనపడింది

తత్రోపస్పృశ్య విశదం పీత్వా వారి మహారథౌ
కృష్ణౌ దదృశతుః కన్యాం చరన్తీం చారుదర్శనామ్

ఎవరో కనుక్కో అని అన్నాడు కృష్ణుండిని అర్జనుడు.

తామాసాద్య వరారోహాం సుద్విజాం రుచిరాననామ్
పప్రచ్ఛ ప్రేషితః సఖ్యా ఫాల్గునః ప్రమదోత్తమామ్

కా త్వం కస్యాసి సుశ్రోణి కుతో వా కిం చికీర్షసి
మన్యే త్వాం పతిమిచ్ఛన్తీం సర్వం కథయ శోభనే

శ్రీకాలిన్ద్యువాచ
అహం దేవస్య సవితుర్దుహితా పతిమిచ్ఛతీ
విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థితః

అలా అర్జనుడు అడుగగా నేను సూర్య పుత్రికను. నా పేరు కాలింది.

నాన్యం పతిం వృణే వీర తమృతే శ్రీనికేతనమ్
తుష్యతాం మే స భగవాన్ముకున్దోऽనాథసంశ్రయః

నేను వసుదేవుని పుత్రుడిని మాత్రమే పెళ్ళి చేసుకుందామని నిర్ణ్యైంచుకుని కృష్ణుని అనుగ్రహం కోసం ఇక్కడే ఉంటున్నాను. మా తండ్రి ఇక్కడే నివాసం ఏరపరిచారు

కాలిన్దీతి సమాఖ్యాతా వసామి యమునాజలే
నిర్మితే భవనే పిత్రా యావదచ్యుతదర్శనమ్

తథావదద్గుడాకేశో వాసుదేవాయ సోऽపి తామ్
రథమారోప్య తద్విద్వాన్ధర్మరాజముపాగమత్

ఈ వార్త అర్జనుని ద్వారా విన్న కృష్ణుడు, సరే ఆమెను కూడా రథం ఎక్కమను అని.

యదైవ కృష్ణః సన్దిష్టః పార్థానాం పరమాద్బుతమ్
కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణా

ఇంద్ర ప్రస్థానికి వచ్చాడు. ఆమెను తీసుకు వచ్చిన తరువాత పాండవులకు మంచి నగరం కావాలని విశ్వకర్మను పిలిచి ఒక అందమైన నగరాన్ని నిర్మింపచేసాడు

భగవాంస్తత్ర నివసన్స్వానాం ప్రియచికీర్షయా
అగ్నయే ఖాణ్డవం దాతుమర్జునస్యాస సారథిః

అక్కడ ఉంటూ ఉంటూ ఒక సాయం కాలం అర్జనున్ని తీసుకుని రథం ఆయుధాలూ లేకుండా చేయిపట్టుకుని అర్జనున్ని తీసుకుని వెళ్ళాడు

సోऽగ్నిస్తుష్టో ధనురదాద్ధయాన్శ్వేతాన్రథం నృప
అర్జునాయాక్షయౌ తూణౌ వర్మ చాభేద్యమస్త్రిభిః

కొద్ది దూరం వెళ్ళాక  ఒక అరణ్యం కనిపిస్తే అక్కడ కూర్చున్నారు. అపుడు బక్కపలచని బ్రాహ్మణుడు ఒకడు వచ్చి శరణని ప్రార్థించాడు

మయశ్చ మోచితో వహ్నేః సభాం సఖ్య ఉపాహరత్
యస్మిన్దుర్యోధనస్యాసీజ్జలస్థలదృశిభ్రమః

శరణు ఇచ్చిన తరువాత తన గురించి చెప్పాడు. నేను అగ్నిహోత్రుడీని నాకు అజీర్ణం చేసింది. ఈ వనాన్ని ఒక సారి భుజిస్తే తప్ప నా అజీర్ణం తీరదు. ఇది ఖాండవ వనం. ఇక్కడ చాలా మూలికలు ఉన్నాయి. కానీ ఇది ఇంద్రునికి చాలా ప్రీతి కరం. అందుకు ఆయన వర్షిస్తూఉ నన్ను తిననివ్వట్లేదు. ఇంద్రుని నుంచి నన్ను కాపాడితే నేను వనాన్ని భుజిస్తాను. అపుడు అర్జనుడు మేము ఊరికే వచ్చాము మాకు రథమూ ఆయుధమూ ధనువులూ శస్త్రాలూ లేవు. అపుడు అగ్నిహోత్రుడు అర్జనుడికి రథం గాండీవం ధనువు అక్షయ తూణీరం కవచం శక్తీ, కృష్ణుడికి సుదర్శనాన్నీ ఇచ్చాడు. ఇలా ఖాండవ దహనం జరిగింది. మయుడు ఒక సర్ప రూపములో అక్కడ ఉన్నాడు. వనం దహించుకుపోతుంటే కేకలు వేయగా అర్జనుడు కాపాడాడు. తనను కాపాడినందుకు వరం కోరుకోమనగా, మా కృష్ణుడిని అడుగమన్నాడు.కృష్ణుడిని అడుగగా ధర్మరాజుని అడుగమన్నాడు. ధర్మరాజుని అడుగగా, ధర్మరాజు, కృష్ణుడు నిర్మించి ఇచ్చిన ఈ భవనములో ఒక మంచి సభను ఏర్పాటు చేయమని అడిగాడు. అపుడు మయుడు, సభా భవనాన్ని ఏర్పాటు చేసాడు. అదే మయ సభ. కృష్ణార్జనులు ఖాండవ వానానికి బయలుదేరేముందే పాతాళములో ఉన్న మయుడిని "ఖాండవ వనములో చాలా మణులు ఉంటాయి. నీవు మణి పతివి కదా, అక్కడకు వెళ్ళు" అని నారదునితో చెప్పించాడు. ఖాండవ వనములో మయున్ని ఏర్పాటు చేసాడు. మయున్ని అక్క్డ ఇరికించి అర్జనుని చేత రక్షింపచేసి వరం ఇప్పించాడు. అర్జనునికి గాండీవం కవచం రథం ఆయుధములూ స్వామికి సుదర్శనమూ అగ్నిహోత్రుడు ఇచ్చేట్లు చేసాడు.
ఈ మయసభలోనే నేల చూసి నేలనీ నేలని చూసి నీరని భ్రమించాడు

స తేన సమనుజ్ఞాతః సుహృద్భిశ్చానుమోదితః
ఆయయౌ ద్వారకాం భూయః సాత్యకిప్రమఖైర్వృతః

పాండవులకు ఇంత ఉపకారం చేసి అందరి అనుమతీ పొంది ద్వారకకు విచ్చేసాడు

అథోపయేమే కాలిన్దీం సుపుణ్యర్త్వృక్ష ఊర్జితే
వితన్వన్పరమానన్దం స్వానాం పరమమఙ్గలః

తీసుకుని వచ్చిన కాలిందిని మంచి ముహూర్తములో వివాహం చేసుకుని తనవారందరికీ శుభాన్ని కలిగించాడు

విన్ద్యానువిన్ద్యావావన్త్యౌ దుర్యోధనవశానుగౌ
స్వయంవరే స్వభగినీం కృష్ణే సక్తాం న్యషేధతామ్

మిత్ర విందా అని తన మేనత్త రాజాధిదేవి కూతురు,

రాజాధిదేవ్యాస్తనయాం మిత్రవిన్దాం పితృష్వసుః
ప్రసహ్య హృతవాన్కృష్ణో రాజన్రాజ్ఞాం ప్రపశ్యతామ్

విందుడూ అనివిందుడూ అని ఇద్దరు అన్నలు ఉన్నారు. దుర్యోధనుడి మీద ప్రేమతో మిత్ర విందను కృష్ణుడికి ఇవ్వకుండా ఆపారు. కృష్ణుడు ఈమెనూ అపహరించి వివాహం చేసుకున్నాడు

నగ్నజిన్నామ కౌశల్య ఆసీద్రాజాతిధార్మికః
తస్య సత్యాభవత్కన్యా దేవీ నాగ్నజితీ నృప

కౌసల రాజ్యాధిపతి, అతి ధార్మికుడు నగజిత్, అతని కుమార్తే నాగ్న జిత్. ఈమెను సత్యా అంటారు

న తాం శేకుర్నృపా వోఢుమజిత్వా సప్తగోవృషాన్
తీక్ష్ణశృఙ్గాన్సుదుర్ధర్షాన్వీర్యగన్ధాసహాన్ఖలాన్

ఈమెను వివాహం చేసుకుందామని మిత్రులందరూ పోటీపడితే, అందరూ మిత్రులే కదా, ఎవరికివ్వాలో తెలియక తప్పించుకుందామని, ఏడు బలిసిన ఎద్దులను ఒక్కసారి ఓడించి ఒక తాటితో కట్టేస్తాడో వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తా అని చాటింపు వేస్తే అది చేయలేక అందరూ వెనక్కు మళ్ళారు.

తాం శ్రుత్వా వృషజిల్లభ్యాం భగవాన్సాత్వతాం పతిః
జగామ కౌశల్యపురం సైన్యేన మహతా వృతః

ఈ వార్త విని కృష్ణుడు కూడా వచ్చాడు. అందరిచేతా పూజలు పొంది.

స కోశలపతిః ప్రీతః ప్రత్యుత్థానాసనాదిభిః
అర్హణేనాపి గురుణా పూజయన్ప్రతినన్దితః

వరం విలోక్యాభిమతం సమాగతం నరేన్ద్రకన్యా చకమే రమాపతిమ్
భూయాదయం మే పతిరాశిషోऽనలః కరోతు సత్యా యది మే ధృతో వ్రతః

ఇలా అందరూ అనుకుంటూ ఉంటే, అమ్మాయి కూడా స్వామిని చూచి కృష్ణున్నే కోరింది భర్తగా, అందరూ అలాగే కోరుకున్నారు.

యత్పాదపఙ్కజరజః శిరసా బిభర్తి
శృరబ్యజః సగిరిశః సహ లోకపాలైః
లీలాతనుః స్వకృతసేతుపరీప్సయా యః
కాలేऽదధత్స భగవాన్మమ కేన తుష్యేత్

ఇలాంటి పరమాత్మ, బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈయన పాద పరాగాన్ని శిరస్సున ధరిస్తారు. ఏమి చేసి ఈ స్వామికి ప్రీతిని కలిగించాలి.

అర్చితం పునరిత్యాహ నారాయణ జగత్పతే
ఆత్మానన్దేన పూర్ణస్య కరవాణి కిమల్పకః

శ్రీశుక ఉవాచ
తమాహ భగవాన్హృష్టః కృతాసనపరిగ్రహః
మేఘగమ్భీరయా వాచా సస్మితం కురునన్దన

భగవానుడు రాజును ఉద్దేశ్యించి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
నరేన్ద్ర యాచ్ఞా కవిభిర్విగర్హితా రాజన్యబన్ధోర్నిజధర్మవర్తినః
తథాపి యాచే తవ సౌహృదేచ్ఛయా కన్యాం త్వదీయాం న హి శుల్కదా వయమ్

మహారాజా పెద్దలంతా యాచన పనికిరాదంటారు, కానీ అది తెలిసి కూడా నేను మీ అమ్మాయిని యాచించడానికి వచ్చాను
మీ అమ్మాయిని కోరుతున్నాను. శుల్కం మేము ఇచ్చుకోలేము

శ్రీరాజోవాచ
కోऽన్యస్తేऽభ్యధికో నాథ కన్యావర ఇహేప్సితః
గుణైకధామ్నో యస్యాఙ్గే శ్రీర్వసత్యనపాయినీ

నీకన్నా ఉత్తమమైన భర్త నా కుమార్తెకు ఎక్కడ దొరుకుతాడు. ఐనా మేమొక నియమం పెట్టుకున్నాము

కిన్త్వస్మాభిః కృతః పూర్వం సమయః సాత్వతర్షభ
పుంసాం వీర్యపరీక్షార్థం కన్యావరపరీప్సయా

సప్తైతే గోవృషా వీర దుర్దాన్తా దురవగ్రహాః
ఏతైర్భగ్నాః సుబహవో భిన్నగాత్రా నృపాత్మజాః

బలిసిన ఏడు వృష్భాలను ఎవడు తన బలముతో కట్టేస్తాడో అలాంటి వాడికి ఇవ్వాలనుకున్నాము. ఆ పని మీరు చేస్తే మీఎకే ఇచ్చి వివాహం చేస్తాను

యదిమే నిగృహీతాః స్యుస్త్వయైవ యదునన్దన
వరో భవానభిమతో దుహితుర్మే శ్రియఃపతే

ఏవం సమయమాకర్ణ్య బద్ధ్వా పరికరం ప్రభుః
ఆత్మానం సప్తధా కృత్వా న్యగృహ్ణాల్లీలయైవ తాన్

ఇది విన్న కృష్ణుడు తన వస్త్రం బిగించి కట్టి ఒకే సారి ఏడు రూపాలలో ఏడు కోడెలనూ బంధించి తన వశములో చేసుకున్నాడు.

బద్ధ్వా తాన్దామభిః శౌరిర్భగ్నదర్పాన్హతౌజసః
వ్యకర్సల్లీలయా బద్ధాన్బాలో దారుమయాన్యథా

కట్టెను ఎలా ఐతే తన వశములోకి తెచ్చుకుంటారో అలా చేసుకున్నాడు. ఈమెనే సాంప్రదాయములో నీలాదేవి అంటారు. నీలాతుంగ స్తంగిరీ తటీ సుప్తం....

తతః ప్రీతః సుతాం రాజా దదౌ కృష్ణాయ విస్మితః
తాం ప్రత్యగృహ్ణాద్భగవాన్విధివత్సదృశీం ప్రభుః

సంతోషించి రాజు కృష్ణుడికి ఈమెనిచ్చి వివాహం చేసాడు

రాజపత్న్యశ్చ దుహితుః కృష్ణం లబ్ధ్వా ప్రియం పతిమ్
లేభిరే పరమానన్దం జాతశ్చ పరమోత్సవః

అందరూ ఆనందాన్ని పొంది పెద్ద పండగ చేసుకున్నారు.

శఙ్ఖభేర్యానకా నేదుర్గీతవాద్యద్విజాశిషః
నరా నార్యః ప్రముదితాః సువాసఃస్రగలఙ్కృతాః

శంఖ భేరీ మొదలైన దుంద్భుభులు మోగాయి

దశధేనుసహస్రాణి పారిబర్హమదాద్విభుః
యువతీనాం త్రిసాహస్రం నిష్కగ్రీవసువాససమ్

నాగ్నజితికి కానుకగా పదివేల ఆవులనూ మూడువేల దాసీ జనాన్నీ తొమ్మిది వేల ఏనుగులనూ, తొమ్మిది లక్షల రథములనూ దానికి నూరు రెట్లు గుర్రాలను కానుకగా అమ్మాయి వెంట ఇచ్చి రథాన్ని ఎక్కించి పంపించాడు కౌశలాధిపతి

నవనాగసహస్రాణి నాగాచ్ఛతగుణాన్రథాన్
రథాచ్ఛతగుణానశ్వానశ్వాచ్ఛతగుణాన్నరాన్

దమ్పతీ రథమారోప్య మహత్యా సేనయా వృతౌ
స్నేహప్రక్లిన్నహృదయో యాపయామాస కోశలః

శ్రుత్వైతద్రురుధుర్భూపా నయన్తం పథి కన్యకామ్
భగ్నవీర్యాః సుదుర్మర్షా యదుభిర్గోవృషైః పురా

ఈ విషయాన్ని విని ఇదివరలో ఈమెను వివాహం చేసుకుందామని అనుకున్న రాజులందరూ కృష్ణునికి అడ్డుపడ్డారు. అక్కడకు అర్జనుడు వచ్చాడు. అతని బలముతో యుద్ధములో ఓడిపోఆయారు. సింహం మృగాలను తరిమేసినట్లుగా తరిమాడు అర్జనుడు

తానస్యతః శరవ్రాతాన్బన్ధుప్రియకృదర్జునః
గాణ్డీవీ కాలయామాస సింహః క్షుద్రమృగానివ

పారిబర్హముపాగృహ్య ద్వారకామేత్య సత్యయా
రేమే యదూనామృషభో భగవాన్దేవకీసుతః

అమ్మాయిని ద్వారకకు తీసుకు వచ్చాడు కృష్ణుడు

శ్రుతకీర్తేః సుతాం భద్రాం ఉపయేమే పితృష్వసుః
కైకేయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణః సన్తర్దనాదిభిః

తరువాత ఇంకో మేనత్తగారున్నారు శృతకీర్తి. ఆమె పుత్రిక భద్ర. కైకయ రాజ్యాధిపతి ఆమెను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేసాడు

సుతాం చ మద్రాధిపతేర్లక్ష్మణాం లక్షణైర్యతామ్
స్వయంవరే జహారైకః స సుపర్ణః సుధామివ

మద్రాధిపతి కూతురు లక్షణను స్వయం వరములో అపహరించుకుని వచ్చారు,
రుక్మిణీ జాంబవతీ సత్య్భామా కాలిందీ మిత్రవిందా భద్రా నాగ్నజితి లక్షణ అనే అష్ట  భార్యలు

అన్యాశ్చైవంవిధా భార్యాః కృష్ణస్యాసన్సహస్రశః
భౌమం హత్వా తన్నిరోధాదాహృతాశ్చారుదర్శనాః

వేల మంది భార్యలున్నారు కృష్ణుడికి. నరకాసురున్ని చంపి అతను బంధించిన పదుహారువేల మందిని వివాహం చేసుకున్నాడు

                                        
                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts