ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఆరవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
అథాన్యదపి కృష్ణస్య శృణు కర్మాద్భుతం నృప
క్రీడానరశరీరస్య యథా సౌభపతిర్హతః
కృష్ణ పరమాత్మ ఆచరించిన ఇంకొక పరామాద్భుతమైన చర్యను చెబుతున్నాను
ఇంకో రాజుని లీలగా చంపాడు
శిశుపాలసఖః శాల్వో రుక్మిణ్యుద్వాహ ఆగతః
యదుభిర్నిర్జితః సఙ్ఖ్యే జరాసన్ధాదయస్తథా
శిశుపాలునికి శాల్వుడు మిత్రుడు. రుక్మిణీ కళ్యాణములో ఇతను కూడా అడ్డుబడి యాదవుల చేత ఓడించబడ్డాడు
శాల్వః ప్రతిజ్ఞామకరోచ్ఛృణ్వతాం సర్వభూభుజామ్
అయాదవాం క్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత
రాజులందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ్య చేసాడు ఈ శాల్వుడు. యాదవులు ఈ భూమండలములో లేకుండా చేస్తాను, నా పౌరుషాన్ని చూడండి అని
ఇతి మూఢః ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుమ్
ఆరాధయామాస నృపః పాంశుముష్టిం సకృద్గ్రసన్
శంకరుని గురించి భయంకరమైన తపస్సు చేసాడు. రోజుకు పిడికెడు మట్టి తినేవాడు
సంవత్సరాన్తే భగవానాశుతోష ఉమాపతిః
వరేణ చ్ఛన్దయామాస శాల్వం శరణమాగతమ్
ఇలా ఒక సంవత్సరం చేయగా శంకరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగాడు
దేవాసురమనుష్యాణాం గన్ధర్వోరగరక్షసామ్
అభేద్యం కామగం వవ్రే స యానం వృష్ణిభీషణమ్
దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది సకల ఖేచర భూచరాలకూ వశం కాని విమానం కావాలి, అది యాదవులకు భయం కలిగించాలి అని అడిగితే
తథేతి గిరిశాదిష్టో మయః పరపురంజయః
పురం నిర్మాయ శాల్వాయ ప్రాదాత్సౌభమయస్మయమ్
సరే అని ఆ వరమిచ్చాడు శంకరుడు. ఉక్కుతో బంగారముతో కూడిన నగరాన్ని విమానముగా నిర్మించి అతనికి ఇచ్చాడు
స లబ్ధ్వా కామగం యానం తమోధామ దురాసదమ్
యయస్ద్వారవతీం శాల్వో వైరం వృష్ణికృతం స్మరన్
యాదవులతో ఏర్పడిన వైరాన్ని స్మరించుకుంటూ లభించిన విమానాన్ని తీసుకుని ద్వారకా నగరం మీదకు యుద్ధానికి వెళ్ళి తన సేనతో ద్వారకా నగరాన్ని అరికట్టాడు. ఉపవనాలని భమగం చేసాడు. గోపురాలూ ప్రాసాదాలు విహారములూ మొదలైనవి విమానం మీద నుంచి వెళుతూ పడవేసాడు. రాళ్ళూ చెట్లూ పిడుగులూ పాములు సుడిగాలి ఇలాంటివన్నీ తన మాయ చేత చేస్తూ ఉన్నాడు.
నిరుధ్య సేనయా శాల్వో మహత్యా భరతర్షభ
పురీం బభఞ్జోపవనానుద్యానాని చ సర్వశః
సగోపురాణి ద్వారాణి ప్రాసాదాట్టాలతోలికాః
విహారాన్స విమానాగ్ర్యాన్నిపేతుః శస్త్రవృష్టయః
శిలాద్రుమాశ్చాశనయః సర్పా ఆసారశర్కరాః
ప్రచణ్డశ్చక్రవాతోऽభూద్రజసాచ్ఛాదితా దిశః
ఇత్యర్ద్యమానా సౌభేన కృష్ణస్య నగరీ భృశమ్
నాభ్యపద్యత శం రాజంస్త్రిపురేణ యథా మహీ
ఇలా శాల్వుడు ఇంత బాధపెడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు శాంతిని పొందలేకపోయారు. అపుడు కృష్ణుడు హస్తినలో ఉన్నాడు
ప్రద్యుమ్నో భగవాన్వీక్ష్య బాధ్యమానా నిజాః ప్రజాః
మ భైష్టేత్యభ్యధాద్వీరో రథారూఢో మహాయశాః
ప్రద్యుమ్నుడు సాత్యకీ సాంబుడూ అకౄరుడు మొదలైన వారు వచ్చారు
సాత్యకిశ్చారుదేష్ణశ్చ సామ్బోऽక్రూరః సహానుజః
హార్దిక్యో భానువిన్దశ్చ గదశ్చ శుకసారణౌ
అపరే చ మహేష్వాసా రథయూథపయూథపాః
నిర్యయుర్దంశితా గుప్తా రథేభాశ్వపదాతిభిః
కొడుకులందరూ వచ్చారు. చతురంగ బలముతో ఆ వీరులు వచ్చారు. ఇరువురికీ దేవతలకూ రాక్షసులకూ జరిగినటువంటి యుద్ధం జరిగింది
తతః ప్రవవృతే యుద్ధం శాల్వానాం యదుభిః సహ
యథాసురాణాం విబుధైస్తుములం లోమహర్షణమ్
తాశ్చ సౌభపతేర్మాయా దివ్యాస్త్రై రుక్మిణీసుతః
క్షణేన నాశయామాస నైశం తమ ఇవోష్ణగుః
వివ్యాధ పఞ్చవింశత్యా స్వర్ణపుఙ్ఖైరయోముఖైః
శాల్వస్య ధ్వజినీపాలం శరైః సన్నతపర్వభిః
శాల్వుడు ప్రయోగించిన మాయను ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో అంతం చేసి ఇరవై ఐదు బాణాలతో కొట్టాడు. అతని సైన్యాధిపతిని కొట్టాడు. సైన్యములో ఉన్న ఒక్కొక్కరినీ ఒక్కో శరముతో నాయకులను ఒక్కొక్కరినీ పది బాణములతో కొట్టాడు. ప్రద్యుమ్నుడి పరాక్రమాన్ని చూచి శత్రు సైన్యం కూడా పూజించారు. శంకరుడు ఇచ్చిన విమానం మాయా విమానం. ఒకసారి పదిగా కనపడుతుంది
శతేనాతాడయచ్ఛాల్వమేకైకేనాస్య సైనికాన్
దశభిర్దశభిర్నేతౄన్వాహనాని త్రిభిస్త్రిభిః
తదద్భుతం మహత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మనః
దృష్ట్వా తం పూజయామాసుః సర్వే స్వపరసైనికాః
బహురూపైకరూపం తద్దృశ్యతే న చ దృశ్యతే
మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్
క్వచిద్భూమౌ క్వచిద్వ్యోమ్ని గిరిమూర్ధ్ని జలే క్వచిత్
అలాతచక్రవద్భ్రామ్యత్సౌభం తద్దురవస్థితమ్
యత్ర యత్రోపలక్ష్యేత ససౌభః సహసైనికః
శాల్వస్తతస్తతోऽముఞ్చఞ్ఛరాన్సాత్వతయూథపాః
శరైరగ్న్యర్కసంస్పర్శైరాశీవిషదురాసదైః
పీడ్యమానపురానీకః శాల్వోऽముహ్యత్పరేరితైః
శాల్వానీకపశస్త్రౌఘైర్వృష్ణివీరా భృశార్దితాః
న తత్యజూ రణం స్వం స్వం లోకద్వయజిగీషవః
ప్రద్య్మ్నుడి బాణాల ధాటికి శాల్వుడు మూర్చపోయాడు,
ఎంత ఘోరమైన యుద్ధం జరుగుతున్నా, ఎంత హాని కలుగుతున్నా, తలలూ చేతులూ తెగిపడుతున్నా, రెండు లోకాలూ (ఇహ - పర) కోరుకున్నవారు కాబట్టి పారిపోలేదు.
శాల్వామాత్యో ద్యుమాన్నామ ప్రద్యుమ్నం ప్రక్ప్రపీడితః
ఆసాద్య గదయా మౌర్వ్యా వ్యాహత్య వ్యనదద్బలీ
శాల్వుడు మంత్రి ద్యుమ అన్నవాడు ప్రద్యుమ్నుడి చేత పీడించబడి ఆ పగను మనసులో పెట్టుకుని ప్రద్యుముని గదతో కొట్టగా ప్రద్యుమ్నుని గుండె చీలింది. కృష్ణుని సారధి ఐన దారుకుని కొడుకు ప్రద్యుమ్నుడికి సారధి. అతను ప్రద్యుమ్నుడు మూర్చపోవడం చూచి యుద్ధములోనుండి రథాన్ని దూరముగా తీసుకు వెళ్ళాడు
ప్రద్యుమ్నం గదయా సీర్ణ వక్షఃస్థలమరిందమమ్
అపోవాహ రణాత్సూతో ధర్మవిద్దారుకాత్మజః
లబ్ధసమ్జ్ఞో ముహూర్తేన కార్ష్ణిః సారథిమబ్రవీత్
అహో అసాధ్విదం సూత యద్రణాన్మేऽపసర్పణమ్
న యదూనాం కులే జాతః శ్రూయతే రణవిచ్యుతః
వినా మత్క్లీబచిత్తేన సూతేన ప్రాప్తకిల్బిషాత్
ప్రద్యుమ్నుడికి మెలకువ వచ్చిన తరువాత యుద్ధమునుండి బయటకు తొలగించి తప్పు చేసావు. యదు వంశములో పుట్టినవారు యుద్ధమునుండి వెనుతిరగడం తెలియదు. నీ వల్ల అపకీర్తి పొందాను. బలరామకృష్ణులు వస్తే వారికి ఏమి చెప్పాలి. యుద్ధములో ఎందుకు పారిపోయావు అంటే నేను ఏమి చెప్పాలి. నా సోదరులూ బంధువులూ ఈ విషయం తెలిసి పరిహాసం చేస్తారు. ఇతరుల వలె నీవు ఈ పిరికితనాన్ని ఎలా నేర్చుకున్నావు.
కిం ను వక్ష్యేऽభిసఙ్గమ్య పితరౌ రామకేశవౌ
యుద్ధాత్సమ్యగపక్రాన్తః పృష్టస్తత్రాత్మనః క్షమమ్
వ్యక్తం మే కథయిష్యన్తి హసన్త్యో భ్రాతృజామయః
క్లైబ్యం కథం కథం వీర తవాన్యైః కథ్యతాం మృధే
అపుడు సారధి ఇలా అన్నాడు
సారథిరువాచ
ధర్మం విజానతాయుష్మన్కృతమేతన్మయా విభో
సూతః కృచ్ఛ్రగతం రక్షేద్రథినం సారథిం రథీ
ఇది అధర్మం, అపకీర్తీ కాదు. సారధి ధర్మం తెలిసిన వాడినైన నేను తెలిసే ఈ పని చేసాను.
ఏతద్విదిత్వా తు భవాన్మయాపోవాహితో రణాత్
ఉపసృష్టః పరేణేతి మూర్చ్ఛితో గదయా హతః
ఆపదలో ఉన్న రధికున్న రక్షించే బాధ్యత సారధిది. ఈ సంగతి తెలుసు కాబట్టి మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి రథాన్ని వెనక్కు మరల్చాను. మిమ్ములను కాపాడడం ధర్మముగా భావించి ఈ పని చేసాను
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు