ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఐదవ అధ్యాయం
శ్రీబాదరాయణిరువాచ
అథైకదాత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివన్దనౌ
వసుదేవోऽభినన్ద్యాహ ప్రీత్యా సఙ్కర్షణాచ్యుతౌ
బలరామ కృష్ణులు తల్లి తండ్రులకు నమస్కారం చేయడానికి ఒక సారి వారి ఇంటికి రాగా
మునీనాం స వచః శ్రుత్వా పుత్రయోర్ధామసూచకమ్
తద్వీర్యైర్జాతవిశ్రమ్భః పరిభాష్యాభ్యభాషత
అలా వారిని కూర్చోబెట్టుకొనగా ఋషులు మాట్లాడిన మాటలంతా జ్ఞ్యప్తికి వచ్చాయి. వారి పుత్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అన్న విషయం గుర్తుకు వచ్చాయి
వారి లీలలూ ప్రభావాలూ కొన్ని చూచారూ, కొన్ని విన్నారు, దానితో ఆశ్చర్యము పొంది
కృష్ణ కృష్ణ మహాయోగిన్సఙ్కర్షణ సనాతన
జానే వామస్య యత్సాక్షాత్ప్రధానపురుషౌ పరౌ
వారిని భగవద్స్వరూపముగా భావించి
"మీరు మా పుత్రులు కాక, పరమ పురుషులుగా తెలుసుకున్నాము"
యత్ర యేన యతో యస్య యస్మై యద్యద్యథా యదా
స్యాదిదం భగవాన్సాక్షాత్ప్రధానపురుషేశ్వరః
ఒక పని జరగడానికి కర్త కర్మ కరణం సంప్రదానమూ (ఉద్దేశ్యం) అపాదానమూ (అవధి, అవకాశం, ("అధర్మాన్ని ఆచరించడం వలన" రావణున్ని రాముడు చంపాడు)) సంబంధమూ అధికరణం (ఆధారం - రాముడు రావణున్ని చంపడానికి సీతాపహరణం కారణం) కావాలి. వీటిని తారకములు అంటారు.
యత్ర - ఆధారం - ఎక్కడా
యేన - సాధనం దేనితో
యతః - అవధి దేనివలా
యస్య - సంబంధం - దేనికీ
యస్మై - ఉద్దేశ్యం - దేనికొరకూ
యత్ - కర్త - ఏదీ
యధ - విధానం - ఏరీతిగా
యదా - కారణం - ఎప్పుడు
ఒక పని చేయడానికి ఏమేమి కావాలో అవి అన్నీ నీవే. ఎక్కడ ఏది ఎపుడు ఎలా దేనితో దేని కొరకు దేని వలన దేనికి జరిగినా అన్నీ నీవే. అన్నీ వ్యవహార సౌకర్యం కోసం చెప్పుకునేదే గానీ అంతా నీవే.
ఏతన్నానావిధం విశ్వమాత్మసృష్టమధోక్షజ
ఆత్మనానుప్రవిశ్యాత్మన్ప్రాణో జీవో బిభర్ష్యజ
పలు రకములుగా ఉండే ఈ ప్రపంచం నీ చేత సృజించబడింది. ప్రాణాన్ని జీవుడిగా పరస్పరం భరిస్తున్నావు. నీకు మాత్రం ఏ పుట్టుకా లేదు. జగత్తును పుట్టించి, అనుద్లో ప్రవేశించి, ఆజగత్తును పోషిస్తున్నావు భరిస్తున్నావు
ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్య తాః
పారతన్త్ర్యాద్వైసాదృష్యాద్ద్వయోశ్చేష్టైవ చేష్టతామ్
ప్రజాపతుల ఏ ఏ అనంతములైన శక్తులు ఉన్నాయో వారి చేష్టలూ, ప్రాణము మనసూ బుద్ధీ ఇంద్రియములూ దేహమూ, వీటి యొక్క చేష్టలూ , ఈ రెండూ నీవే. జ్ఞ్యాని ఐన వాడు వారితో చేయించే నిన్ను చూస్తాడు
కాన్తిస్తేజః ప్రభా సత్తా చన్ద్రాగ్న్యర్కర్క్షవిద్యుతామ్
యత్స్థైర్యం భూభృతాం భూమేర్వృత్తిర్గన్ధోऽర్థతో భవాన్
ప్రకాశమూ తేజస్సూ ఉనికీ చంద్రుడూ సూర్యుడూ అగ్నీ ఇంద్రియమూ భూమి యొక్క గంధమూ వాయువు యొక్క స్పర్శ తేజస్సు యొక్క కాని జలం యొక్క రుచి ఆకాశం యొక్క శబ్దమూ అన్నీ నీవే
తర్పణం ప్రాణనమపాం దేవ త్వం తాశ్చ తద్రసః
ఓజః సహో బలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వర
నీరు బతికిస్తుంది. నీరు తృప్తి కలిగిస్తుంది. ఎంత భోజనం పెట్టినా చివరకు తృప్తి ఇచ్చేది నీరు. తర్పణం.అది నీవే.
ప్రవృత్తి ధారణ సామర్ధ్యాలు కలిగిన వాయు స్వరూపమూ నీవే.
దిశాం త్వమవకాశోऽసి దిశః ఖం స్ఫోట ఆశ్రయః
నాదో వర్ణస్త్వమోంకార ఆకృతీనాం పృథక్కృతిః
ఆకాశం అంటే దిక్కుల మధ్య ఉండేది. ఆకాశం అంటే అవకాశం. ప్రతీ దానికీ అదే అవకాశం. అంతరిక్షములో ఉండే అన్ని గోళాలూ ఆకాశములోనే ఉన్నాయి. ఎన్నో రకముల పాదార్థముల ఉనికికి అవకాశం ఇచ్చేది ఆకాశం. అదే ఆశ్రయం. అదే స్ఫోటము (వెలువరించేది) . శబ్దాన్ని వెలువరించేది ఆకాశం. వాయువుకూ ఆకాశానికి కలిగిన ఘర్షణ వలనే శబ్దం వస్తుంది. అదే స్పోటము. నీవే వర్ణము, నీవే ఓంకారం. రకరకాల ఆకృతులను నీవే వేరు చేస్తావు. నీవే కలుపుతావు.
ఇన్ద్రియం త్విన్ద్రియాణాం త్వం దేవాశ్చ తదనుగ్రహః
అవబోధో భవాన్బుద్ధేర్జీవస్యానుస్మృతిః సతీ
అన్ని ఇంద్రియాలకూ నీవే ఇంద్రియం. దేవతలకు దేవతవు. నీవే జ్ఞ్యాన స్వరూపుడవు. జీవుని యొక్క బుద్ధికి అనుస్మృతివి నీవు.
భూతానామసి భూతాదిరిన్ద్రియాణాం చ తైజసః
వైకారికో వికల్పానాం ప్రధానమనుశాయినమ్
నీవే తామస అహంకారానికి, రాజస అహంకారానివి, మనసుకు సాత్విక అహంకారానివి.
నశ్వరేష్విహ భావేషు తదసి త్వమనశ్వరమ్
యథా ద్రవ్యవికారేషు ద్రవ్యమాత్రం నిరూపితమ్
నశించే అన్ని వస్తువులలో నశించకుండా ఉండేవాడవు నీవే.
సత్త్వమ్రజస్తమ ఇతి గుణాస్తద్వృత్తయశ్చ యాః
త్వయ్యద్ధా బ్రహ్మణి పరే కల్పితా యోగమాయయా
ద్రవ్యం యొక్క వికారాలు (గంధమూ రసమూ మొదలైనవి) మారినా వాటి ద్రవ్యత్వం మాత్రం మారదు. భూమి మారదు, గంధం మారుతుంది. వస్తువులో ఎన్ని వికారాలు ఉన్నా మారని ఏ ధర్మం ఉందో అది నీవు
తస్మాన్న సన్త్యమీ భావా యర్హి త్వయి వికల్పితాః
త్వం చామీషు వికారేషు హ్యన్యదావ్యావహారికః
కొన్ని సందర్భాలలో వికారాన్ని చెప్పుకుంటాము గానీ వికారాలని కలిగించే నిన్ను చూడలేము
గుణప్రవాహ ఏతస్మిన్నబుధాస్త్వఖిలాత్మనః
గతిం సూక్ష్మామబోధేన సంసరన్తీహ కర్మభిః
ఈ సంసారములో సత్వ రజ తమో గుణాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక గుణం ఎక్కువ, ఒక గుణం తక్కువా అవుతుంది. మూడూ సమానముగా ఉంటే అది ప్రళయం.
యదృచ్ఛయా నృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభామ్
స్వార్థే ప్రమత్తస్య వయో గతం త్వన్మాయయేశ్వర
ఇలాంటి స్వరూపాన్ని తెలియని వారే సంసారములో తిర్గుతూ ఉంటారు. తెలిసిన వారు సంసారాన్ని విడిచి మోక్షాన్ని పొంద్తారు.
నీ సంకల్పముతో నీవు మానవత్వాన్ని పొంది మాకు పుత్రునిగా అవతరించావు. ఇంతకాలం స్వార్థ పరులమై మాయతో వాస్తవాన్ని తెలుసుకోలేకపోయాము.,
అసావహమ్మమైవైతే దేహే చాస్యాన్వయాదిషు
స్నేహపాశైర్నిబధ్నాతి భవాన్సర్వమిదం జగత్
నేనూ నాది అన్న రెండూ మమ్ము బాధిస్తూ ఉంటాయి. ఈ రెంటితో "ఈ శరీరం నాది, వీరంతా నావారు, ఇది నేను, ఇది నా వశము" ఇలాంటి మాటలతో ప్రేమ మమకారాది బంధనములతో బంధించబడుతూ ఉన్నాము
సకల జగత్తునూ ప్రేమ పాశముతో బంధిస్తూ ఉన్నావు
యువాం న నః సుతౌ సాక్షాత్ప్రధానపురుషేశ్వరౌ
భూభారక్షత్రక్షపణ అవతీర్ణౌ తథాత్థ హ
మీరుమా కొడుకులు కారు. మీరు ప్రధాన పురుషులూ. జగన్నాధులు. భూమికి బరువుగా ఏర్పడిన శత్రువులను నశింపచేయడానికి పుట్టారని చెప్పారు
తత్తే గతోऽస్మ్యరణమద్య పదారవిన్దమ్
ఆపన్నసంసృతిభయాపహమార్తబన్ధో
ఏతావతాలమలమిన్ద్రియలాలసేన
మర్త్యాత్మదృక్త్వయి పరే యదపత్యబుద్ధిః
ఆపన్నులమైన మా సంసార భయాన్ని తొలగించే నీ పాదాలను శరణు వేడుతున్నాము. ఇంతకాలం నిన్ను మా కొడుకుగా భావించి చేసిన పొరబాట్లకు ఇంతటితో స్వస్తి. ఇంతటితో ఆ భావాలు చాలు
సూతీగృహే నను జగాద భవానజో నౌ
సఞ్జజ్ఞ ఇత్యనుయుగం నిజధర్మగుప్త్యై
నానాతనూర్గగనవద్విదధజ్జహాసి
కో వేద భూమ్న ఉరుగాయ విభూతిమాయామ్
పుట్టగానే "నేను శ్రీమన్నారాయణున్ని" అని నీవు స్పష్టముగా చెప్పావు.ధర్మాన్ని కాపాడడానికి నీవు ప్రతీ యుగములో పుడుతూ ఉంటావనీ, ఎన్నో శరీరాలు ధరిస్తావనీ, ఎన్నో రూపాలు ధరిస్తావనీ చెప్పావు. ఇలాంటి మహానుభావుడవైన నీ స్వరూపాన్నీ, మాయనూ ఎవరు తెలుసుకుంటారు
శ్రీశుక ఉవాచ
ఆకర్ణ్యేత్థం పితుర్వాక్యం భగవాన్సాత్వతర్షభః
ప్రత్యాహ ప్రశ్రయానమ్రః ప్రహసన్శ్లక్ష్ణయా గిరా
ఇలా వసుదేవుడు కృష్ణ బలరాములతో అన్న మాటలు విని వినయముతో వంగినవాడై చిరునవ్వు నవ్వుతూ అన్నాడు
శ్రీభగవానువాచ
వచో వః సమవేతార్థం తాతైతదుపమన్మహే
యన్నః పుత్రాన్సముద్దిశ్య తత్త్వగ్రామ ఉదాహృతః
అగాధమైన వేదాంత జ్ఞ్యానాన్ని మొత్తం ముద్ద చేసి మాకు బోధించారు. వీటిని మేము అర్థం చేసుకుంటాము. తల్లి తండ్రులు పిల్లలకు తత్వాన్ని ఉపదేశించాలి కాబట్టి, మీరు మాకు తత్వ జ్ఞ్యానాన్ని ఉపదేశించారు. దాన్ని మేము అర్థం చేసుకుంటాము
అహం యూయమసావార్య ఇమే చ ద్వారకాకసః
సర్వేऽప్యేవం యదుశ్రేష్ఠ విమృగ్యాః సచరాచరమ్
ఈ చరా చర జగత్తులో నేనూ మీరు అన్నగారు ఈ ద్వారకా వాసులు తక్కిన ప్రజలూ యాదవులూ అందరూ ఇలాగే ఆలోచించి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందరూ తెలియదగిన విషయం ఇదే
ఆత్మా హ్యేకః స్వయంజ్యోతిర్నిత్యోऽన్యో నిర్గుణో గుణైః
ఆత్మసృష్టైస్తత్కృతేషు భూతేషు బహుధేయతే
ఆత్మ స్వయం ప్రకాశం, నిత్యం , అన్నిటికంటే విలక్షణం, గుణాలతో ఉన్న గుణాలు భాసించనిది. పరమాత్మ చేత సృజించబడినవాటిలో సృజించబడిన ప్రాణులలో ఈ ఆత్మే పలురాకలుగా కనపడుతుంది.
ఖం వాయుర్జ్యోతిరాపో భూస్తత్కృతేషు యథాశయమ్
ఆవిస్తిరోऽల్పభూర్యేకో నానాత్వం యాత్యసావపి
ఆకాశమూ వాయువూ అగ్నీ జలమూ భూమీ, ఈ పంచభూతములూ రకరకాలుగా తన నుండి ఎన్నో రకాలుగా తన నుండి ఆకారాలు పొందుతుంది. కుండ కొండ గుట్ట రాయీ - అన్నీ భూమే. దీపమూ జఠరాగ్నీ మెరుపూ - ఇవన్నీ అగ్ని. సముద్రం నదీ మడుగూ సెలయేరు చెబులో ఉన్న నీరు, మనలో శ్లేషమమూ - ఇవన్నీ జలమే. ప్రతీ భూతమూ బహురూపాలలో అవతరిస్తుంది. ప్రతీ రూపములో ఒక కర్మ ఉంటుంది. ఒక సారి కనపడుతుంది. ఒక సారి కనపడదు. పలు రూపాలను పొందుతుంది. పొందిన రూపాలన్నీ కనపడవచ్చూ కనపడకపోనూ వచ్చు. ఈ తత్వాన్ని మాకు చాలా చక్కగా అర్థమయ్యే విధముగా బోధించారు
శ్రీశుక ఉవాచ
ఏవం భగవతా రాజన్వసుదేవ ఉదాహృతః
శ్రుత్వా వినష్టనానాధీస్తూష్ణీం ప్రీతమనా అభూత్
ఈ మాటలతో కృష్ణ పరమాత్మ మీద ఉన్న జ్ఞ్యానం అంతా పోయింది. తత్వ జ్ఞ్యానం కలగబోతూ ఉండగా స్వామి మరలా మాయ కప్పేసాడు.
అథ తత్ర కురుశ్రేష్ఠ దేవకీ సర్వదేవతా
శ్రుత్వానీతం గురోః పుత్రమాత్మజాభ్యాం సువిస్మితా
తరువాత దేవకికి జ్ఞ్యాపకం వచ్చింది. కృష్ణ బలరాములు గురువుగారి వద్ద చదువుకుంటూ ఉండగా వారి చనిపోయిన కుమారున్ని తీసుకు వచ్చారన్న సంగతి జ్ఞ్యాపకం వచ్చింది
కృష్ణరామౌ సమాశ్రావ్య పుత్రాన్కంసవిహింసితాన్
స్మరన్తీ కృపణం ప్రాహ వైక్లవ్యాదశ్రులోచనా
చనిపోయిన తమ కుమారులను కూడా అలా తీసుకు వస్తారా అనిపించి ఇలా అంది
శ్రీదేవక్యువాచ
రామ రామాప్రమేయాత్మన్కృష్ణ యోగేశ్వరేశ్వర
వేదాహం వాం విశ్వసృజామీశ్వరావాదిపూరుషౌ
కృష్ణా రామా! మీరే ఆదిపురుషులూ, మీరే పరమాత్మ స్వరూపం అని మాకు తెలుసు.
కలవిధ్వస్తసత్త్వానాం రాజ్ఞాముచ్ఛాస్త్రవర్తినామ్
భూమేర్భారాయమాణానామవతీర్ణౌ కిలాద్య మే
అధర్మముగా ప్రవర్తించే రాజులను సంహరించడానికి ఇలా అవతరించారని మాకు తెలుసు. మీ అంశలో అంశలో అంశతో ఈ ప్రపంచం అంతా సృష్టించబడి రక్షించబడి లయం చేయబడుతున్నదని తెలుసు
యస్యాంశాంశాంశభాగేన విశ్వోత్పత్తిలయోదయాః
భవన్తి కిల విశ్వాత్మంస్తం త్వాద్యాహం గతిం గతా
అటువంటి నిన్ను శరణు వేడుతున్నాను
చిరాన్మృతసుతాదానే గురుణా కిల చోదితౌ
ఆనిన్యథుః పితృస్థానాద్గురవే గురుదక్షిణామ్
చాలా కాలం కిందట నాకు ఆరుగురు పుత్రులు పుట్టి చనిపోయారు. వారిని మళ్ళీ చూడాలని అనుకుంటూ ఉన్నాము. మీరు గురువుగారి దక్షిణగా చనిపోయిన గురుపుత్రున్ని తీసుకుని అర్పించారు అని విన్నాను. నా ఈ కోరికను తీర్చండి
తథా మే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరౌ
భోజరాజహతాన్పుత్రాన్కామయే ద్రష్టుమాహృతాన్
ఒక సారి కంసుడు చంపిన ఆ పిల్లలను చూడాలని అనుకుంటూ ఉన్నాము
ఋషిరువాచ
ఏవం సఞ్చోదితౌ మాత్రా రామః కృష్ణశ్చ భారత
సుతలం సంవివిశతుర్యోగమాయాముపాశ్రితౌ
ఇలా ప్రార్థిస్తే బలరామ కృష్ణులిద్దరూ సుతలానికి వెళ్ళారు
అక్కడ బలి చక్రవతి పరిపాలిస్తూ ఉన్నాడు
తస్మిన్ప్రవిష్టావుపలభ్య దైత్యరాడ్
విశ్వాత్మదైవం సుతరాం తథాత్మనః
తద్దర్శనాహ్లాదపరిప్లుతాశయః
సద్యః సముత్థాయ ననామ సాన్వయః
బలి చక్రవర్తి వారిని ఎదుర్కొని స్వాగతాదులు చెప్పి ఉన్నతాసనములో కూర్చోబెట్టి
తయోః సమానీయ వరాసనం ముదా నివిష్టయోస్తత్ర మహాత్మనోస్తయోః
దధార పాదావవనిజ్య తజ్జలం సవృన్ద ఆబ్రహ్మ పునద్యదమ్బు హ
సమర్హయామాస స తౌ విభూతిభిర్మహార్హవస్త్రాభరణానులేపనైః
తామ్బూలదీపామృతభక్షణాదిభిః స్వగోత్రవిత్తాత్మసమర్పణేన చ
స ఇన్ద్రసేనో భగవత్పదామ్బుజం బిభ్రన్ముహుః ప్రేమవిభిన్నయా ధియా
ఉవాచ హానన్దజలాకులేక్షణః ప్రహృష్టరోమా నృప గద్గదాక్షరమ్
బలి చక్రవర్తి ఇలా కీర్తించాడు
బలిరువాచ
నమోऽనన్తాయ బృహతే నమః కృష్ణాయ వేధసే
సాఙ్ఖ్యయోగవితానాయ బ్రహ్మణే పరమాత్మనే
జ్ఞ్యాన యోగాన్ని విస్తరింపచేసిన నీకు నమస్కారం
దర్శనం వాం హి భూతానాం దుష్ప్రాపం చాప్యదుర్లభమ్
రజస్తమఃస్వభావానాం యన్నః ప్రాప్తౌ యదృచ్ఛయా
ప్రాణులకు మీ దర్శనం సులభముగా దొరికేది కాదు.
దైత్యదానవగన్ధర్వాః సిద్ధవిద్యాధ్రచారణాః
యక్షరక్షఃపిశాచాశ్చ భూతప్రమథనాయకాః
ప్రపంచములో ఎన్ని రకముల ప్రాణులు ఉంటాయో వారందరమూ రోజు రోజూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ బతుకుతున్నాము
విశుద్ధసత్త్వధామ్న్యద్ధా త్వయి శాస్త్రశరీరిణి
నిత్యం నిబద్ధవైరాస్తే వయం చాన్యే చ తాదృశాః
కేచనోద్బద్ధవైరేణ భక్త్యా కేచన కామతః
న తథా సత్త్వసంరబ్ధాః సన్నికృష్టాః సురాదయః
మాతో మాకు వైరమే కాదు. నిన్ను కూడా ద్వేషించేవారు ఉన్నారు. సత్వ గుణం ఉన్న వారు భక్తితో స్నేహముతో, రజో గుణం ఉన్నవారు కామముతో లోభముతో చేరుతారు. తమో గుణం ఉన్న వారు వైరముతో ద్వేషముతో చేరుతారు
ఇదమిత్థమితి ప్రాయస్తవ యోగేశ్వరేశ్వర
న విదన్త్యపి యోగేశా యోగమాయాం కుతో వయమ్
ఇది ఇలాగే జరుగుతుంది, వీరు ఇలాగే ఉంటారు అని చెప్పడానికి మేము సరిపోము. మేము తెలుసుకోలేము
మనసును మీ పాదముల మీద ఉంచి సంసార సాగరాన్ని దాటగలమని అలాంటి వైరాన్నీ మోహాన్ని మాయనూ నీ దయతో దాటి అన్ని వేళలా నిన్నే స్మరిస్తూ ఈ ప్రపంచములో సంచరిస్తూ ఉన్నాను. నీ చల్లని చూపుతో మమ్ము పాపము లేని వారిగా చేయి.
తన్నః ప్రసీద నిరపేక్షవిమృగ్యయుష్మత్
పాదారవిన్దధిషణాన్యగృహాన్ధకూపాత్
నిష్క్రమ్య విశ్వశరణాఙ్ఘ్ర్యుపలబ్ధవృత్తిః
శాన్తో యథైక ఉత సర్వసఖైశ్చరామి
శాధ్యస్మానీశితవ్యేశ నిష్పాపాన్కురు నః ప్రభో
పుమాన్యచ్ఛ్రద్ధయాతిష్ఠంశ్చోదనాయా విముచ్యతే
పరమాత్మ యందు భక్తి ఉన్నవాడు మాత్రమే సంసార బంధం నుండి విడివడతాడు
మమ్ము ఈ బంధం నుండి తొలగించు
శ్రీభగవానువాచ
ఆసన్మరీచేః షట్పుత్రా ఊర్ణాయాం ప్రథమేऽన్తరే
దేవాః కం జహసుర్వీక్ష్య సుతం యభితుముద్యతమ్
ప్రథం మన్వంతరములో మరీచికి ఆరుగురు కుమారులు కలిగారు. తరువాత బ్రహ్మ సరస్వతిని సృష్టించి తన పుత్రికనే ఆయన కామ ప్రవృత్తితో ముందుకు వెళితే ఈ ఆరుగురూ నవ్వి పరిహసించారు.
తేనాసురీమగన్యోనిమధునావద్యకర్మణా
హిరణ్యకశిపోర్జాతా నీతాస్తే యోగమాయయా
దానితో బ్రహ్మ, "ధర్మం తెలియని మీరు అసుర జాతిలో పుట్టండి అని శపించాడు" వారు హిరణ్య కశిపుని కడుపున పుట్టారు. ఆ ఆరుగురినే దేవకీ గర్భములో మళ్ళీ ఉంచగా, వారు దేవకీ గర్భాన పుట్టారు
దేవక్యా ఉదరే జాతా రాజన్కంసవిహింసితాః
సా తాన్శోచత్యాత్మజాన్స్వాంస్త ఇమేऽధ్యాసతేऽన్తికే
మా తల్లి దేవకీ దేవి చనిపోయిన తన ఆరుగురు పుత్రులనూ తలుస్తూ ఉంది
ఇత ఏతాన్ప్రణేష్యామో మాతృశోకాపనుత్తయే
తతః శాపాద్వినిర్మక్తా లోకం యాస్యన్తి విజ్వరాః
స్మరోద్గీథః పరిష్వఙ్గః పతఙ్గః క్షుద్రభృద్ఘృణీ
షడిమే మత్ప్రసాదేన పునర్యాస్యన్తి సద్గతిమ్
ఇవి వారి పేర్లు. నా అనుగ్ర్హముతో వారు పూర్వ స్థానాన్ని పొందుతారు. నా స్పర్శతో వారు తమ పాపాలను పోగొట్టుకుంటారు.
ఇత్యుక్త్వా తాన్సమాదాయ ఇన్ద్రసేనేన పూజితౌ
పునర్ద్వారవతీమేత్య మాతుః పుత్రానయచ్ఛతామ్
అని ఆ ఆరుగురు పుత్రులనూ దేవకీ దేవి వద్దకు తీసుకు వెళ్ళాడు. వారిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని
తాన్దృష్ట్వా బాలకాన్దేవీ పుత్రస్నేహస్నుతస్తనీ
పరిష్వజ్యాఙ్కమారోప్య మూర్ధ్న్యజిఘ్రదభీక్ష్ణశః
శిరస్సుని ఆఘ్రానించి,
అపాయయత్స్తనం ప్రీతా సుతస్పర్శపరిస్నుతమ్
మోహితా మాయయా విష్ణోర్యయా సృష్టిః ప్రవర్తతే
పరమాత్మ మాయతో పుత్రస్నేహములో ఆమె తల మునకలైపోయింది. పరమాత్మ మాయతోనే సృష్టి అంతా ప్రవర్తిస్తోంది.
పీత్వామృతం పయస్తస్యాః పీతశేషం గదాభృతః
నారాయణాఙ్గసంస్పర్శ ప్రతిలబ్ధాత్మదర్శనాః
వారు తల్లి పాలు ఇపుడు తాగారు. అవి పరమాత్మ తాగా మిగిలిన పాలు కాబట్టి అవి ప్రసాదమయ్యాయి. ఈ ప్రసాదముతో వారు ఉత్తమ గతిని పొందుతున్నారు
పరమాత్మ అవయములను స్పృశించడం వలన ఆత్మ జ్ఞ్యానం కలిగి పరమాత్మకూ దేవకీ దేవికీ వసుదేవునికీ నమస్కరించి అందరూ చూస్తుండగా దేవతల నివాసానికి ఆరుగురూ వెళ్ళారు.
తే నమస్కృత్య గోవిన్దం దేవకీం పితరం బలమ్
మిషతాం సర్వభూతానాం యయుర్ధామ దివౌకసామ్
తం దృష్ట్వా దేవకీ దేవీ మృతాగమననిర్గమమ్
మేనే సువిస్మితా మాయాం కృష్ణస్య రచితాం నృప
చనిపోయినవారు రావడం, వచ్చిన వారు మాట్లాడం, వారు మళ్ళీ వెళ్ళడం కృష్ణ పరమాత్మ మాయగ దేవకీదేవి భావించింది
ఏవంవిధాన్యద్భుతాని కృష్ణస్య పరమాత్మనః
వీర్యాణ్యనన్తవీర్యస్య సన్త్యనన్తాని భారత
అంతులేని పరమాత్మ అనంత వీర్యుడు, అంతులేని పరాక్రమం కలవాడు. అనంతమైన లీలలను ఎన్నో ఆచరిస్తాడు.
శ్రీసూత ఉవాచ
య ఇదమనుశృణోతి శ్రావయేద్వా మురారేశ్
చరితమమృతకీర్తేర్వర్ణితం వ్యాసపుత్రైః
జగదఘభిదలం తద్భక్తసత్కర్ణపూరం
భగవతి కృతచిత్తో యాతి తత్క్షేమధామ
వ్యాసభగవానుడి పుత్రుడైన శుకయోగీంద్రుని చేత చెప్పబడిన ఈ పరమాత్మ చరితాన్ని విన్నా వినిపించినా, పరమాత్మ భక్తులను కర్ణములను అమృతముతో నింపేది, ప్రపంచములో పాపాలను పోగొట్టేదీ ఐన ఈ కథలను విన్నవారు పరమాత్మ యందు మనసు ఉంచి పరమపదాన్ని వారు చేరుతారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు