Followers

Monday, 30 September 2013

ఉపనిషత్తులు మెత్తం 108




 అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. అవి : 1.ఈశోపనిషత్తు 2. కఠోపనిషత్తు 3. ముండకోపనిషత్తు 4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు 6.మాండూక్యోపనిషత్తు 7.తైత్తరీయోపనిషత్తు 8. ఐతరీయోపనిషత్తు 9. బృహదారణ్యకోపనిషత్తు. 10. చాందోగ్యోపనిషత్తు.
1. ఈశావాస్యోపనిషత్
2. కేసోపనిషత్
3. కఠోపనిషత్
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. ఛాందోగ్యోపనిషత్
10. బౄహదారణ్య కోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమౄతబిందూపనిషత్
21. అమౄతబిందూపనిషత్
22. అథర్వనాదోపనిషత్
23. అథర్వఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్
26. బౄహజ్జాబాలోపనిషత్
27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యు పనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోపనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యోపనిషత్
55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ , ఉత్తరతాపిన్యుపనిషత్)
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షరోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. అధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతో పనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోఒపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహౄదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మజాబాలోపనిషత్
88. రుద్రాక్షజాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. దర్శనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కౄష్ణోపనిషత్
97. యాజ్ణ్జవల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయొపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వౄచోపనిషత్
108. ముక్తికోపనిషత్ 

విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?

విభూది ధారణ..ప్రాశస్త్యం


విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి 
హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము 
చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు.

విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా 

పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా 

చిటికెడు నోట్లో వేసికొంటారు...


నిత్య స్నానానంతరం విభూధిని కూడా శరీరానికి రాసుకోవాలి. భస్మం రాసుకో వడం ఏమిటీ? అని నాగరీక ప్రపంచంలో 

చాలామందికి విస్మయం కలుగు తుంది. మన శరీరంలో వాత, పిత్త, శ్లేష్మములనే మూడు ధాతులున్నాయి. రక్త ములో హీనత 

ఉన్నా, రక్తము వేడి వలన వేగవంతమైనా, దాని ప్రభావంతంలో ముందుగా వాత, శ్లేష్మములు ప్రకోపించును. అందువలన అధిక 

రక్తపోటు ఏర్పడును. స్నానానంతరం విభూది రాసుకోవడం మూలంగా రక్త ప్రసరణ నియంత్రించబడుతుంది. నాడీమండలములో 

ప్రవహించే రక్త వేగాని సమ తూల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంలో భస్మధారణని మించిన ఔషధం మరొ కటి లేదని చెప్ప వచ్చు. 

పతంజలి యోగ శాస్త్రంలో కూడా భస్మధారణ గావించి కొన్ని ఆసనాలు వేయడం వలన శల్య సంధులలో ఇరుక్కుని ఉన్న 

సూక్ష్మక్రి ములు బయటకు వచ్చి శరీర ధారుఢ్యాని పెంచుతుందని ప్రవచించడం జరి గింది. ఇది శాస్త్రీయ దృక్పథం. ఇక 

ఆధ్యాత్మికంగా శివుని మూడవ నేత్రము నుండి ఉద్భవించిన విభూదిని త్రయంబకం అని పిలుస్తారు. 

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనంఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోః మృక్షీర్యుమామృతాత్‌!అని 

మంత్రయుక్తంగా ధారణ చేస్తే అపమృత్యు భయం నుండి దూరంచేస్తుందని వేదవాక్కు. ఈ భస్మధారణ చేయునపుడు కనీసం శివ 

నామం జపించినా విశేష ఫలితం కలుగుతుంది. విభూది వెనుక ఒక చక్కని కథ కూడా ఉంది. ఒకనాడు అగస్త్య మహాముని 

శివదర్శ నార్ధియై శివలోకానికి వెళ్ళి అక్కడ విభూది ధరించాడు. తిరిగి వస్తూ గగన మార్గాన యమలోకాన్ని చూసాడు. అంతట 

అక్కడ శిక్షలు అనుభవిస్తున్న పాపులకు ఆ శిక్షల భాధ తొలగి ఆనందం కలిగింది. యమ దూతలు ఆశ్చర్యచకితులై, 

యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! మేం శిక్షిస్తుంటే ఈ పాపులు ఉన్నట్టుండి ఆనందం అనుభవిస్తున్నారు. కారణం 

తెలియటంలేదు. అని విన్నవించుకున్నారు. 

అప్పుడు యమధర్మరాజు పైకి చూసి అగస్త్యులవారిని ఆహ్వానించి తగిన విధంగా ఆతిధ్యమిచ్చాడు. మునీం ద్రా! తమ దృష్టి 

పారించినంత మాత్రాన నాలోకంలో శిక్షలనుభవిస్తున్న పాపులు కూడా ఆ శిక్షల బాధ మరిచి ఆనందం అనుభవిస్తున్నారు. ఇది 

ఎలా సాధ్యం అని అడిగాడు. అగస్త్యుడు జవాబు ఇవ్వకుండా చిరునవ్వుతూ యమలోకం నుంచి బయలు దేరాడు. కానీ, కొద్దిగా 

అహంభావం పొడచూ పింది. తన దృష్టి తాకినంత మాత్రాన లోకంలో శాంతి లభించిందని భావిస్తూ వెడుతున్న ఆ మహామునికి 

నారదుడు ఎదురు పడ్డాడు. సర్వాంతర్యామి అయిన నారదుడు అగస్త్యుని మనసులో ప్రవేశించిన అహాన్ని గమనించి, ఏం 

అగస్త్యా! ఎక్కడ నుండి వస్తున్నావు? అని అడిగాడు. అందుకు అగస్త్యుడు గర్వం నిండిన ముఖంతో ‘కైలాసంలో శివుని దర్శించి 

వస్తు న్నానని చెప్పాడు. 

అప్పుడు నారధుడు ఓహో అదా అసలు సంగతి! అని ఆగా డు. అగస్త్యుడు ఏమిటా అసలు సంగతి అని ప్రశ్నించాడు. అప్పుడు 

నారదుడు మందహాసంతో యమలోకవాసులు నీ దృష్టి చేత శాంతిపొందారని విన్నాను . అది నీకెలా సాధ్యమయ్యిందాని 

అనుమానం వచ్చింది. ఇప్పుడు నివృత్తి అయ్యిం ది. అన్నాడు. మళ్ళీ అగస్త్యుడు విషయం మీద ఆసక్తితో నీకేమని తెలిసింది 

నారదా! అని అడిగాడు. అది నీ మహిమ కాదు అగస్త్యా! శివలోకంలో నీవు ధరించిన విభూది, నువ్వు కిందనున్న 

యమలోకాన్ని వీక్షిస్తున్నప్పుడు నీ నుదుట నున్న విభూది కొద్దిగా రాలి పడింది. ఆ విభూధి మహిమ వలన అక్కడ పాపుల 

శిక్షలు వేస్తున్నా వారికి ఆనందం కలిగింది. యమలోకం శాంతపడింది. అన్నా డు. అది విని గర్వం నశించినవాడై తన 

అపరాధాన్ని తెలుసుకుని తన తప్పును క్షమించమని శివుని మనసులోనే ప్రార్ధించుకుంటూ నిజవా సానికి చేరాడు. 

నారదుడు కూడా చిరునవ్వు నవ్వుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు. సమంత్రయుక్తంగా విభూది ధరించడం వలన ఇంతటి 

శక్తి లభిస్తుంది. మనసు శాంత పడుతుంది. అపమృత్యు భయం తొలగిపోతుందని పురాణాలు ఘంటాపథంగా 

చెప్తున్నాయి.శాస్ర్తీయ పరంగా రుద్రాక్ష ధారణ వలన శరీర కాంతి పెరుగుతుంది. రుద్రాక్షలు ఒంటి మీద ఉండగా స్నానం చేస్తే 

వాటినుండి జారిన నీరు శరీరాన్నంతటినీ తాకి తేజోవం తంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తనాళాల్లో మలినములు మటుమాయ 

మవుతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. నరముల నిస్త్రాణ నివారించి ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. భారతీయ 

సంస్కృతిలో చిరకాలం జీవించడానికి వీలుగా సదాచా రాలు నిర్ణయించారు. వాటిని అనుసరించి ఎందరో ఆయురారో గ్యాలతో 

తులతూగారు. ఇటువంటి సదాచా రాన్ని పాటించకపోవడం వల్లనే కోరినంత కాలం జీవించలేక, అనారోగ్యాలతో అకాల 

మృత్యువాత పడుతు న్నాం. రుద్రాక్ష మహిమ అనంతం అని దేవీభాగవతంలో కూడా సవివరంగా లిఖించబడింది.

వివాహ శబ్దార్ధం: హిందూ వివాహం:



శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన|

వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||

శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ 

రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ 

చారిణిగా ఈమెను అర్పించుచున్నాను. ఈమె చేతిని 

పట్టుకొని ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగు గాక!


పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |


ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||

పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి 

దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితము. 

ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ దంపతులకు 

నమస్కారములు.

వివాహ శబ్దార్ధం:

సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే 

ఉపసర్గను 

'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = 

వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష 


ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ 

పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, 

ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, 

పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, 

దారకర్మ, దారక్రియ మొదలైనవి.


వివాహ భేదములు:


మనువు వివాహ పద్ధతులను 8గా విభజించాడు.


బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |


గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||

1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. 

అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం అని వివాహాలు ఎనిమిది రకాలు.


1. బ్రాహ్మం: అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే 

బ్రాహ్మ వివాహమౌతుంది. (ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం)

2. దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ 

వివాహమౌతుంది.

3. ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకొని 

కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది.

4. ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం 

ప్రాజాపత్యం అవుతుంది. (సీతారాములు)

5. అసురం: వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ 

దశరథులు)

6. గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: 

శకుంతలా దుష్యంతులు)

7. రాక్షసం: యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం 

అంటారు. (ఉదా: మండోదరి రావణులు)

8. పైశాచం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం. వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠం, ప్రాజాపత్యం 

ధర్మబద్ధం, రాక్షసం, పైశాచం నిషిద్దం.

వివాహమెందుకు?

ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు 

ఋణాలతో పుడతాడు.

1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.

ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. 

మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి 

మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.

1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన 

వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం 

వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.

2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. 

యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. 

పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని 

ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం 

కృతఘ్నలం అవుతాం.

3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ 

ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, 

మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని 

అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు 

తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని 

కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం 

కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం 

మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను 

త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, 

సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. 

యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ 

యజ్ఞాలు.

వైదిక మతం సైన్స్‌కి వ్యతిరేకమా?


    చాలా మంది అనుకున్నట్టుగా, ప్రపంచంలో మిగతా మతాల మాదిరిగా కాకుండా వైదిక మతం శాస్త్ర విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. హిందువులకు ముఖ్యమైన మత గ్రంధాలు వేదాలు. 'వేదం' అనే పదం 'విత్‌' అనే ధాతువు నుండి వచ్చింది. విత్‌ అంటే 'జ్ఞానం' అని అర్థం. మానవ సమాజం యొక్క మొదటి మెట్టు జ్ఞానంతోనే మొదలయిందని దీని అర్థం. మనిషి నాగరికత మొదటి అడుగు వేసింది నిప్పును కనిపెట్టడంతోనే అని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి ప్రాచీనమైన గ్రంధమైన ఋగ్వేదం 'అగ్నిమీళే పురోహితమ్‌' అనే అగ్ని దేవుని ఋక్కు (ప్రార్థన)తో మొదలయింది. హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. ప్రశ్నించడం జ్ఞానం తెలిసిన వాడి హక్కు. ఫలానా గ్రంధంలో ఇలాగే ఉంది కాబట్టి దాని గురించి మీకు ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని ఎవరూ అనలేరు. ప్రశ్నించ గల నేర్పు, ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చునో కూడా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నాయి. అదే 'తర్కశాస్త్రం' - వేదాంగాలలో ఒకటి. వేదాంతమైన ఉపనిషత్తు కూడా గురు శిష్యుల మధ్య సంవాద రూపంలో ఉంటాయి. అంటే శిష్యుడు తనకు వచ్చిన ఒక అనుమానాన్ని గురువుని అడుగుతాడు. దానికి గురువు చక్కటి, సమాధానం చెబుతాడు. ఒకవేళ గురువుగారు చెప్పిన సమాధానంతో శిష్యుడు తృప్తి పడకపోతే, లేదా ప్రక్కనున్న మరో శిష్యుడికి దానికి సంబంధించిన మరో అనుమానం వస్తే, మరల గురువుగారిని తన ప్రశ్నని గురించి అడగవచ్చు. ఈ విధంగా మనం ఇపుడు చెప్పుకుంటున్న గ్రూప్‌ డిస్కషన్స్‌ ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చల ద్వారా వేద విషయాలలోని సంక్లిష్టత అందరికీ అర్థమయ్యే సులభ భాషలో ఉపనిషత్‌ రూపంలో భద్రపరచబడింది. ఉపనిషత్తులలో లేని అంశమంటూ లేదు. ఈ సృష్టి ఏర్పడిన విధానం - భగవంతుని గుణ గణాలు - ఆయన రూపం - ఆత్మ - పరమాత్మ - వీరిద్దరికీ గల సంబంధం - ప్రకృతి శక్తులు ఏమిటి - మనిషికి ప్రకృతికిగల సంబంధం - జననం - మరణం - పునర్జన్మ - వీటి రహస్యాలు ఇలా మనిషికి వచ్చే ప్రతీ అంశం గురించి ఉపనిషత్తులలో కూలంకంషంగా అధ్యయనం చేసారు - మన ప్రాచీన ఋషులు, యోగులు.

    మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. అందుకే ఏ భాషలోనైనా అమ్మని పిలిచే పిలుపులో 'మ' అనే అక్షరం తప్పని సరిగా ఉంటుంది. మన జన్మకి కారకుడైన పురుషుడిని తండ్రిగాను, వీరందరినీ ఒక కుటుంబంగా వ్యవహరించాలని, నిత్యం మనం చేయవలసిన పనులు, సమాజం నడవడిక ఎలా ఉండాలో, రాజు ఎలా పరిపాలించాలో అన్నీ తెలిపింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. ఇక వేదం జ్ఞానాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది?

    ఇదే కాకుండా ఈ రోజు ఆధునిక ప్రపంచానికి వచ్చే అనేక రుగ్మతల నుండి విముక్తి ప్రసాదిస్తున్న అతి ప్రాచీన - ఋషి ప్రసాదిత - యోగ విజ్ఞానం కూడా వేద కాలంలోనే రూపొందించబడింది. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి - ఏఏ నాడి పని తీరు ఎలా ఉంటుంది - ఏమి చేస్తే ఆయా అంగాల తీరుని మెరుగుపరచుకోవచ్చును - మనిషి తన ఆరోగ్యం కోసం ఏమి చేయాలి - ఇత్యాది విషయాలన్నీ యోగ శాస్త్రంలో నిబిడీకృతతం చేయబడ్డాయి. అవన్నీ కనిపెట్టడానికి ఇప్పటి వైద్య శాస్త్రానికి మరో వందేళ్ళ కాలం పట్టవచ్చు. ఇది అతిశయోక్తి కాదు - సంపూర్ణమైన నిజం. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన సత్యం. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం లోక క్షేమమే తమ పరమావధిగా తలచి మానవాళి మొత్తానికి ప్రాచీన ఋషి పుంగవులు అందించిన కల్తీ లేని, వ్యాపార ధృక్పదం లేని నిజమైన జ్ఞానం.

    భరధ్వాజుని వైమానిక శాస్త్రం - శుశ్రుతుని శస్త్ర విద్య పరిజ్ఞానం (ఆపరేషన్‌) - వరాహమిహిరుడు, ఆర్యభట్ట మొదలగు వారి ఖగోళ శాస్త్రం, భాస్కరుని లీలా గణితం (ప్రపంచంలో మొట్టమొదటి ఆల్జీబ్రా గణితం) - పాణిని వ్యాకరణ సూత్రాలు (మొట్టమొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌), ప్రపంచానికే తలమానికమైన దశాంశ పద్దతి వాడుక, అంకెల్ని కనిపెట్టడం, సున్నాని కనిపెట్టడం - ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రీయమైన క్యాలండర్‌ రూపకల్పన - ఋతువుల విభజన - ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతు ఉండదు. ఇవన్నీ ఎందుకు - రెండేళ్ళ తరువాత గ్రహణం ఎప్పుడు వస్తుందో ఖగోళ శాస్త్రవేత్తని లేదా ప్లానిటేరియం వాళ్ళని అడిగి చూడండి - వాళ్ళు చెప్పలేరు. కాని ఎక్కడో రేలంగిలో ఉన్న తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారినో మరో ప్రఖ్యాత సిద్ధాంతి గారినో అడిగి చూడండి - ఖచ్చితంగా లెక్కలు వేసి - కూర్చున్న చోట నుండి లేవకుండా సమాధానం చెప్పగలరు. అది కూడా ఎలా - గ్రహణం ఏ రోజు, ఎన్ని ఘడియల - ఎన్ని విఘడియలకు మొదలవుతుంది - ఆ సమయంలో గ్రహ స్థితి ఏమిటి - ఎన్ని గంటల ఎన్ని నిముషాల పాటు ఆ గ్రహణం ఉంటుంది - దాని స్పర్శా కాలం ఎంత - సంపూర్ణ గ్రహణం ఎంత సేపు ఉంటుంది ఇలా పూర్తి వివరాల్ని సంపూర్ణంగా అందించగలరు. ఇంతటి అద్భుతమైన ఖగోళ పరిజ్ఞానం ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఏ ఒక్క సమాజానికి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. పైగా ఇదంతా కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేని (మనం అనుకుంటున్నాం- నిజమో కాదో తెలియదు) ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు వ్రాసి ఉంచిన శాస్త్రాల ఆధారంగా గణించి చెప్పినటువంటిది. అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతటి అద్భుతమైన కృషి జరిగిందో ఇటే ఊహించవచ్చు.

    మిగతా మతాల్లో జ్ఞానం అనేది ఒక నిషిద్ధ ఫలం. జ్ఞానాన్ని తెలుసుకోవడం దేవుడిని ఎదిరించడమే. అందుకే ఆడమ్‌, ఈవ్‌లు సాతాను మాట విని నిషిద్ధ జ్ఞాన ఫలాన్ని తిని దేవుని శాపానికి గురయ్యారు. కాని వైదిక మతంలో జ్ఞానమే రాజమార్గం. భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం. జ్ఞానిగా మారినవారు దేవునికి ఇష్టులవుతారు. వారు ఎప్పటికైనా భగవంతునిలో ఐక్యమవుతారంటోంది వేదం. అలా నేను అనే అహంకారం నశించి, భగవంతునిలో ఐక్యమవ్వడమే మోక్షం.

    ఇప్పటి తరం దేన్నయితే నిజమైన అభివృద్ధిగా భ్రమపడుతుందో - ఏ ప్రకృతి వినాశనాన్ని వ్యాపారం అనుకుంటున్నదో - ఏ శారీరక మానసిక అనారోగ్యాన్ని నాగరికత అనుకుంటున్నదో అటువంటి ప్రయోగాలన్నీ దీర్ఘకాలంలో మనిషి మనుగడకు, తద్వారా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అందుచేత అటువంటి పరిజ్ఞానాన్ని ప్రాచీన కాలంలోనే సామాన్య ప్రజలకు అందకుండా చేశారు దీర్ఘదర్శులైన మన మహర్షులు.

    మరి ఇంతటి అద్భుతమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న భారతీయులు ఎందుకు మిగతా జాతులకి బానిసగా మారవలసి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రపంచానికే మార్గదర్శి అయిన భారత దేశం ఒక సామాన్య దేశంగా ఎందుకు మిగిలిపోయింది - భారతీయులంతా పర జాతికి తొత్తులుగా మారి వారు చెప్పిందే వేదంగా చెలామణీ అవుతూ  - వారి నాగరికత (?)ను అనుసరిస్తూ, అనుకరిస్తూ, తమ మూలాల్ని మరచిపోయి - ఒక నిస్సత్తువ జాతిగా మారి తమని తాము నిత్యం కించపరుచుకుంటూ - స్వార్థ పరంగా జీవిస్తున్నారు? వీటి గురించి నా తరువాతి పోస్టులో వివరిస్తాను.

అంత వరకు 'సర్వేజనా సుఖినోభవన్తు'.

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక


మనం నివసించే ఈ విశ్వం, సౌరమండలం, భూమి ఇవన్ని అనేక అద్భుతాలకి నిలయాలు. మనిషి మేధస్సు ఎంత పురోగతిని సాధించినా తెలుసుకోవలసిన విశ్వ రహస్యలు ఎన్నో మిగిలే వుంటాయి. ఈ అద్భుత ప్రపంచం గురించి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హబుల్ టెలెస్కోప్ ని ప్రయోగించి రోదసిలో జరిగే అనేక అంతుచిక్కని నక్షత్రమండలాలని, వాటిలో జరిగే ప్రక్రియల్ని కనుగొంటున్నారు. కాని మనకి తెలియని, మనం మరిచిపోయిన మరొక విషయం ఏమిటంటే, మహా తపో శక్తి సంపన్నులయిన మన మహర్షులు, యోగులు సకల చరాచర సృష్టికి మూల స్తానమయిన మహాశక్తి కేంద్రాన్ని దర్శించారు. అది కూడా ఎటువంటి టెలెస్కోపులు, పరికరాలు లేకుండానే. దీనికి సజీవ సాక్ష్యం శ్రీ విష్ణు సహస్ర నామం.

మనం వుంటున్న సౌర కుటుంబం, పాలపుంత (Milkyway Galaxy) చుట్టు 200 మిలియన్ల సంవత్సరాలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఈ పాలపుంత మధ్య భాగం అనేక కోట్ల నక్షత్రాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. అది ఎంత అద్భుతమయిన వెలుగంటే, మనం ఒక సూర్యుడి వైపే పూర్తిగా చూడలేము. అటువంటిది కొన్ని కోట్ల సూర్య సమానమయిన కాంతిని మన నేత్రాలు చూడలేవు. ఆ నక్షత్రాలు కూడా ఒక దానికొకటి బాగా దగ్గరగా వుంటాయట. మన వున్న ఈ సౌర కుటుంబం పాల పుంతకి ఒక పక్కగా వుండడం వల్ల మనకు దాని కేంద్ర భాగాన్ని చూసే అవకాశం లేదు. అందువల్లనే భూమి మీద వున్న వారికి రాత్రి వేళ అక్కడొ నక్షత్రం ఇక్కడో నక్షత్రం కనిపిస్తూ వుంటాయి. కాని పాలపుంత మధ్య భాగంలో మాత్రం ఏ సమయంలోనయినా ఒకేలా అత్యంత ప్రకాశవంతంగా వుంటుంది. సకల విశ్వానికీ మూలాధారమయిన శక్తి అక్కడి నుండే ప్రవహిస్తు వుంటుంది. అన్ని జీవరాశులలో ప్రవహించే ఈ శక్తికే మన వారు "విష్ణు" అని, "నారాయణ" అని నామకరణం చేసారు. అటువంటి విష్ణువు వుండేది పాల సముద్రం అంటారు. విష్ణు సహస్ర నామంలో "క్షీరో ధన్వత్ ప్రదేశే" అన్న మాటకి అక్కడ పాలు వుంటాయని కాదు. ఆ లోకం అత్యంత ప్రకాశవంతంగా ఎటుచూసినా పాల వంటి స్వచ్చమయిన కాంతులు వెదజల్ల బడుతూ వుంటుంది అని అర్ధం. "విశ్వం విష్ణు " అనే పదానికి అర్ధం ఈ విశ్వమతా విష్ణు స్వరూపమే అని. ఈ ప్రపంచం మొత్తం, ఆయనలోనిదే. విష్ణువుకి నాలుగు చేతులు వుంటాయని "చతుర్భుజహ" అనే నామం చెబుతుంది. విశ్వంలో వుండే ఎక్కువ శాతం స్పైరల్ గెలాక్సీలకి నాలుగు భుజాలుంటాయి. ఈ క్రింది ఫోటొ గమనించండి. అదే విష్ణువు యొక్క స్వారూపం. "భుజగ శయనం" అనే మాటకి అర్ధం విష్ణువు పాము మీద పడుకుంటాడని కాదు. పాలపుంత మధ్యలో జరిగే అనేక చర్యల్లో భాగంగా అత్యంత వేడి, పొగలు, మనవూహకి కూడా అందనంత వేగంగా, పాము బుసలు కొట్టిన మాదిరిగా పైకి ప్రవహిస్తూ వుంటాయి. అందుకే విష్ణువు పవళించే ఆది శేషుడికి పదివేల తలలుగా పోల్చారు మన మహర్షులు.



భూమి మీద వుండే ప్రాణులన్నీ విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టిన కమలం నుండి పుట్టిన బ్రహ్మ ద్వార సృష్టించబడ్డాయని అంటారు. ఆయనకి అందుకే "పద్మనాభుడు" అనే పేరు పెట్టారు. నిజానికి ఈ పద్మం అనేది విశ్వం యొక్క మధ్య భాగంలో అనేక చర్యల ఫలితంగా ఏర్పడ్డ మేఘాలు మొదలయినవి ఆ నాభి ప్రాంతం నుండి కొన్ని కోట్ల కిలో మీటర్ల ఎత్తుకి ప్రయానించి అక్కడ చల్లబడి పువ్వు ఆకారంలో ఏర్పడి, అక్కడ జరిగే మరిన్ని చర్యలద్వారా క్లిష్టమయిన కార్బన్ గొలుసుకట్టు ఏర్పడి, వాటి యొక్క ఒక అజ్ఞాత విధానంలో ప్రాణం అనేది పుట్టి, అది ఈ విశ్వమంతా చేయబడుతుందని భావించవచ్చా? బహూశా అదే బ్రహ్మ స్వరూపమయి వుండవచ్చు. సృష్టించేది బ్రహ్మ అయినా గాని, ప్రాణులకి నిరంతరం శక్తి సరఫరా అయ్యేది మాత్రం విష్ణు లోకం నుంచే అనేది మనం అర్ధం చేసుకొవచ్చు అనుకుంటాను.


అదే కాకుండా విష్ణు సహస్ర నామంలో మరొక చోట "సహస్ర మూర్థా విశ్వాత్మా, సహస్రాక్ష సహస్ర పాత్" అని వుంటుంది. అంటే విష్ణువు యొక్క వైభవాన్ని వర్ణించడానికి మాటలు రాక ఆయన్ని దర్శించిన మహర్షులు "కొన్ని వేల చేతులు, కొన్ని వేల ఆకారాలు, కొన్ని వేల పాదాలు కనిపించినట్లుగా వర్ణించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు విష్ణు సహస్ర నామంలో వున్నాయి. బహుశా అవన్ని చదివి, మానసికంగా దర్శించగలగడం ఈ జన్మకి సాధ్యమవుతుందో లేదో తెలియడం లేదు.

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల వివరాలు Krita Treta Dvapara Kali Yuga Details

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల వివరాలు
Krita Treta Dvapara Kali Yuga Details
నాలుగు యుగాలను సృష్టించింది, నిర్ణయించింది బ్రహ్మదేవుడు.
ఏ యుగంలో ఎలాంటి వ్యక్తులు ఉండాలో, ఆ యుగం ఇంతకాలం సాగాలో ఆయనే ఏర్పాటు చేశాడు.
కృతయుగం 17,28,000 - ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అందరూ సత్యం మాట్లాడుతూ, నీతిగా ఉండేవారు. కృతయుగం వైశాఖ మాసం సుద్ద తృతీయనాడు ఆరంభమైంది.
త్రేతాయుగం 12,96,000 ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మహా సాత్వికురాలు సీతమ్మవారిమీద కూడా అనుమానం కలిగే రోజులు తలెత్తాయి. త్రేతాయుగం కార్తీకమాసం శుద్ద నవమిరోజున ప్రారంభమైంది. శ్రీరాముడు ధర్మపాలన చేశాడు.
ద్వాపరయుగం 8,64,000 ఈ యుగం శ్రావణమాసం శుద్ధ త్రయోదశినాడు ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు పరిపాలించాడు. త్రేతాయుగంలో ధర్మం రెండు పాదాలమీద నడవడం మొదలైంది. శ్రీకృష్ణుని మీద సిట అపవాదులు మోపే స్థితికి వచ్చారు.
కలియుగం 4,32,000 ఈ యుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆరంభమైంది. కలియుగం వచ్చేసరికి ధర్మం పూర్తిగా అంతరించి ఒంటి కాలిమీద కుంటుతూ నడుస్తోంది. ఇప్పుడు మనం కలియుగం ప్రధమపాదంలో ఉన్నాం. ఒక్కో పాదం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలు కనుక ఇంకా మూడున్నర లక్షల వరకూ ఈ విశ్వం అంతరించే ప్రశ్నే లేదు. కాకపోతే వినాశకాలం కనుక ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపడుతుంటాయి. ప్రజల్లో కక్షలు, కార్పణ్యాలు ప్రబలుతాయి. ఒకర్నొకరు ద్వేషించుకుంటారు. తన్నుకుంటారు. చంపుకుంటారు. చిట్టచివరికి సృష్టి అంతరిస్తుంది.


శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?

Indian mythology turmeric scientific reasons behind ancient hindu tradition marraige invitations


మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ  ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన  సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం  పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప అన్నివేళలా  వారిపై  ఉంటుందని పురాణాలూ
తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.

శుక్రవారం మహిళలు అమ్మవారికి నేతితో దీపమెలిగిస్తే..?


Details Of The Benefits of Lighting up the Deepam with Ghee oil on Friday's are ultimate and many more at teluguone.com

శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి చేరుకుని నేతితో దీపమెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇంకా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం గావించి అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు.  ఇకపోతే.. ధవళ వర్ణ వస్త్రాలు ధరించడం, అరటి పండు జ్యూస్ తాగడం లేదా అరటి పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున పాలుతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరమునందు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

కాషాయ రంగు ప్రయోజనాలు (Benefits of Orange Colour)



భారతీయ సంస్కృతిలో కాషాయ రంగుకి అత్యంత ప్రత్యేకత ఉంది. భారతీయ యతులు, వేదాంతులు కాషాయంబరాలను ధరిస్తారు. కాషాయ వర్ణమంటే అగ్ని వర్ణం. కాషాయ వస్త్రధారియైనవాడు తన శరీరాన్ని అంతే ఆత్మను దహించివేశాడని సూచింపబడుతుంది. తన శరీరమును త్యాగంచేసి, సత్యబలి పీఠానికి సమర్పించుకుని, సమస్త ప్రాపంచిక వాంఛలను దగ్ధం చేశాడని అర్థం. సమస్త ప్రాపంచిక వాసనలు, ప్రాపంచిక తృష్ణలు జ్ఞానాగ్నిజ్వాలల్లో ఆహుతి అయ్యాయని అర్థం.

ఈ అగ్నివర్ణం ఒక దృష్ట్యా మరణాన్ని, వేరొకదృష్ట్యా జీవనాన్ని సూచిస్తుంది. అగ్నిలో జీవ ఉంది. నిత్యచైత్యన ఉంది. శక్తి ఉంది. అగ్నిలో కర్మశక్తి కూడా ఉంది. అరుణ వర్ణ రంజితమయిన కాషాయం సమస్త పశువాంఛలు, స్వార్థవాసన, అగ్నిలో ఆహుతి చేయబడ్డాయని సూచిస్తుంది. మరోవైపు ఆ స్థానం నుండి నవచైత్యనం, నవజ్వాల, నవశక్తి, నవజీవనం ఉదయించిందని సూచిస్తుంది.

కాషాయంబరానికి ద్వందార్థమున్నది. అది అహంకార మరణాన్ని, ఆత్మా చైత్యనమయిన నవ జీవనాన్ని రెంటినీ సూచిస్తుంది. హిందువులు జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తారు. జ్ఞానాగ్నిలో సమస్త ప్రాపంచిక మాలిన్యాలు దహింపబడతాయి. దివ్యాగ్ని, జ్ఞానజ్వాల ప్రజ్వలించాలనేదే కాషాయవర్ణ సందేశం.

మహాసాధుమూర్తి, భారతీయ సనాతన సన్యాసి పుంగవుడు, యావత్ప్రపంచంలో ఎకైక మహాస్వామి అనాది కాశాయంబరదారి సూర్యభగవానుడు. ఉదయ సూర్యుడు. ప్రతిదినం ఉదయ సూర్యుడు అపర సంయాసిలాగా కాషాయవర్ణ వేషంతో మనకు సాక్షాత్కరిస్తాడు. ఈ సాధు పుంగవుడు తన ఉదయారుణ కిరణాలతో సమస్త ప్రకృతిని కాషాయ వర్ణ రంజిటంగా త్యాగశీలిని చేసి, తన బంగారు కాంతులతో ప్రజ్వలింపజేసి, సంధ్యారుణ కాంతులతో మరల త్యాగాభావాన్ని ప్రకృతికి పులుముతాడు. ఇదే హైందవ సన్యాసుల కాశాయంబరధారణలోని విశేషం.

అసలు మన సంస్కృతిలో రంగులకు విశేష ప్రాధాన్యత ఉంది. దానిలో ఎంతో నిగూఢమయిన అర్థం కూడా ఉంటుంది. ఉదాహరణకు పెళ్లి సమయంలో వధూవరులు తెల్లని వస్త్రాలనుధరించాలనే నియమాన్నే తీసుకుంటే, పెళ్లిపీతల మీదకు వచ్చేటప్పుడు వధూవరులు వస్త్రాలు తెల్లగా ఉంటాయి. పెళ్లి తంతు ముగిసే సమయానికి ఆ కొత్త దంపతుల వస్త్రాలు పలు రంగుల సమ్మిళితమయి మనకు కనబడుతుంది. దానర్థం ఆ దంపతుల జీవిం పంచ రంగులమయమయి ఆనందంగా సాగాలనేది ఆ ఏర్పాటు ద్వారా మన పెద్దలు చెప్పదలచుకున్న విషయమని భావించవచ్చు.

ఇంట్లో ఇల్లాలు ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకున్నా, నుదిటిపై ఎర్రటి కుంకుమను తీర్చి దిద్దుకున్నా, చేతులకు రకరకాల గాజులను అలంకరించుకున్నా, ప్రతి విషయం రంగుల ద్వారా ఒక విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంటుంది.

ఇక మన పండుగలు తీసుకుంటే ప్రతి పండుగ ఇక రంగుక కథాకళే. సంక్రాంతి పండుగనాడు ఇంటి ముందు తీర్చిదిద్దే రంగు రంగుల రంగేళిలు, పండుగ రోజున ధరించే రంగురంగుల వస్త్రాలు, ఇక హోలీ పండుగ నాడు చల్లుకునే రంగునీళ్ళు అంటూ మన భారతీయుల జీవనమంతా రంగులమయంగానే సాగుతుంటుందని చెప్పొచ్చు.

ఇక భారతీయ సాధు, యుతులంటే ఆధ్యాత్మిక భావనామయమైన విషయంతో    వస్త్రధారణను కావించారు. అంతేగాని కడుపు కక్కుర్తి కోసం, రైళ్ళలో టిక్కెట్లు లేకుండా ప్రయాణము చేయడం కోసం కాషాయం ధరించిన క్షుద్ర భిక్షుకులు కారు. త్యాగం, చైతన్యము మూర్తీవభించిన అగ్నిరూపమయినదే కాషాయ వర్ణము. అందుకే కాశాయానికి అంట ప్రాధాన్యత. ఎంతయినా అగ్నిరూపుడు సూర్యుడు ధరించే రంగు కదా!

Sunday, 29 September 2013

గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ-నవగ్రహ ప్రదిక్షిణ

గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ 

నవగ్రహ ప్రదక్షిణలు. వీటివల్ల ఉత్పన్నమయ్యే దైవికశక్తి మనిషిని కాపాడుతుంటుంది. నిర్దిష్టమైన 

పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుంది.
చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను తాకి నమస్కారాలు అర్పిస్తుంటారు. వీలైనంతవరకూ 

వాటిని తాకకుండానే ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

నవగ్రహాల మధ్య తేజస్వి ఐన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు 

కూడా తూర్పుముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముకంగా ఉంటాడు.

శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా 

ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి 

ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని 

ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన ప్రతిష్ట.

సూర్యునిచూస్తూ లోనికి ప్రవేశించి ఎడమ వైపునుండి (చంద్రునివైపు నుండి)  కుడి ప్రక్కకు తొమ్మిది 

ప్రదక్షణలు చెయ్యడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడి వైపు నుండి ఎడమవైపునకు 

(అనగా బుధుడి వైపు నుండి) రాహువునూ కేతువునూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని 

మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా 

వెనుకకు రావాలి.

గ్రహదోషాల నుండి తప్పుకోవడానికి నవగ్రహప్రదక్షిణ కంటే ఉత్తమమయిన మార్గం లేదన్నది స్పష్టం

మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. ఎందుకు?

తీర్థం

మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్లినప్పుడు, పురోహితులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్ష్యకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం’ అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. రాకూడని కాలంలో మృత్యువుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై, సమస్త వ్యాదుల నివారణకు, సమస్త పాపాలనుండి బయట పడటానికి, పరమేశ్వరుని పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్థం. స్వామికి పంచామృతాలతో స్నానాన్ని చేయించగా వచ్చిన తీర్థం కాబట్టి, ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన దీనిని నీరు అని పిలువకుండా ‘తీర్థం’ అని అన్నారు. ఈ తీర్థంలో పవిత్ర మంత్ర శక్తి ఉంటుంది. అది మనకు శుభం కలిగిస్తుంది.

Popular Posts