Followers

Sunday, 8 September 2013

గణపతి పూజకి తులసిని ఎందుకు నిషేధించారు.?

    Ganapati,Devotion, tulasi,  Prohibiting, reason,
 తులసిని గణపతి పూజకు నిషేధించడానికి ఒక కారణం ఉంది. అదీ... తులసీ విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే కోరికతో బ్రహ్మకై తపస్సు చేస్తుంది. ఈ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ ‘‘ విష్ణువును నీవు కోరినట్లే భర్తగా పొందగలవు, అతడే నిన్ను వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తాడు’’ అని చెబుతాడు. అప్పటి నుండి విష్ణువు రాకకై బదరికా వనంలో తులసి తపిస్తుండగా ఒకనాడు అత్యంత తేజశ్శక్తివంతుడైన వినాయకుడు ఆ బదరికావనంలోకి రావడం జరిగింది. మోహావేశంతో ఉన్న తులసి, అతడే తన మనోవల్లభుడైన విష్ణువు అని భ్రమించి తనను వివాహమాడమని వినాయకుని వెంట పడింది.  వినాయకుడు తులసిని ఎంతగా వారించినా ఆమె వినిపించుకోకపోయేటప్పటికి కోపావేశంతో ‘‘ తులసీ ! మోహంధకారంలో కన్ను మిన్ను కానక ప్రవర్తించిన నీవు ఇక నుండి నా పూజకు అనర్హురాలివి. నా పూజకు నిన్ను నిషేధిస్తున్నాను.’’ అని శాపం ఇచ్చాడు. వినాయకుడు శపించగానే తులసికి కమ్మిన మాయ, మోహవేశాలు తొలగిపోయాయి. తులసి ఎంతగానో చింతించి, శాపవిముక్తిని ప్రసాధించమని వినాయకుణ్ణి వేడుకొంది. తలుసి ప్రార్థనతో ప్రసన్నుడైన వినాయకుడు  ‘‘ తల్లీ ! తులసీ ! ఏమి జరిగినా దాని వెనుకాల ఏదో ఒక కారణం తప్పక ఉండి తీరుతుంది. నీవు నాకు మాతృసమానురాలవు. విష్ణుప్రియవు తల్లి పుత్రుణ్ణి పూజించుట తగదు’’ అని వినాయకుడు తులసీక తెలియజెప్పాడు. ఈ కారణం వలన వినాయకుని పూజకు తులసిని నిషేధించారు. తెలిసిగాని, తెలియకగాని తులసితో వినాయకుని పూజించకూడదు. అలా చేసినట్లైతే అది మహాపాపమే అవుతుంది. ఒక వినాయక చవితి రోజున మాత్రమే పూజించవచ్చును.  

Popular Posts