Followers

Saturday, 28 September 2013

పాలకూరలో పాలు చూపించమంటే సాధ్యం కాదు. కానీ దానిలోని స్నేహంపాళ్లు చూపించడం సాధ్యమే.


పాలకూర... 

పాలకూరలో పాలు చూపించమంటే సాధ్యం కాదు. కానీ దానిలోని స్నేహంపాళ్లు చూపించడం సాధ్యమే. ఎందుకంటే... ఏ కూరతో కలిపి వండినా అందులోని పోషకాలను మన శరీరం గ్రహించేందుకు అనువుగా చేయడంలో పాలు పంచుకుంటుంది పాలకూర. అందుకే... పాలకూరను అందరూ తినాలి. అందరికీ పెట్టాలి. ఇక గర్భవతికి అయితే రోజూ తినిపించడం మంచిది. ఎందుకంటే... దానిలో విటమిన్-సి, బి6, రైబోఫ్లేవిన్, ఐరన్, క్యాల్షియమ్... ఇవన్నీ ఉంటాయి. గర్భవతికి రాసే పోషకాహార సప్లిమెంట్ మాత్రల్లో ఉండాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నింటి బదులు స్వాభావికంగా పాలకూర వాడటమే మంచిది కదా! 

Popular Posts