ఉసిరిక (ఆమలకీ)
షడ్రసాలలోనూ లవణరసం (ఉప్పు) మినహా మిగిలిన ఐదురసాలూ (మధుర, అమ్ల, తిక్త, కటు, కషాయ) ఉసిరికలో ఉంటాయి చ్యవనప్రాశ లేహ్యంలో ఇది ప్రధాన ద్రవ్యం ఇది ముసలితనాన్ని (వార్థక్యాన్ని) దూరం చేసి, శరీర సౌష్ఠవాన్ని పదిలపరుస్తుంది. జీవనకాలాన్ని పెంచుతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతివారు రోజుకి ఒక ఉసిరికాయను జీవితాంతం తింటే పైప్రయోజనాలను స్వంతం చేసుకున్నట్లే ఆకలిని పెంచుతుంది. దప్పికను పోగొడుతుంది. రక్తాన్ని పెంచుతుంది కామలాహరం (జాండిస్‌ను తగ్గిస్తుంది) ధీశక్తిని, మానసికశక్తిని పెంచుతుంది కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది మూలవ్యాధిని పోగొడుతుంది రక్తపిత్తం (రక్తం కారటం, హెమరేజ్) అనే వికారాన్ని తగ్గిస్తుంది కడుపులోని అల్సర్లు, వాయువు, వాంతి, మూర్ఛ, ఎక్కిళ్లు, గొంతుబొంగురుపోవడం - ఈ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది జ్వరహరం. ప్రమేహరోగాల్ని పోగొడుతుంది కామశక్తిని, శుక్రవృద్ధిని పెంచుతుంది దీన్ని గుజ్జుతో తింటే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది పిక్కతీసిన ఉసిరికాయ ముక్కల్ని ఎండబెట్టి, పొడిచేసి (ఆమలకీ చూర్ణం) కూడా వాడుకోవచ్చు. కార్తీక మాసంలో ఉసిరికాయల పంట మొదలవుతుంది. పక్వమైన ఆమలకీ ఫలాల్లో మాత్రమే ఔషధవిలువలు ఉంటాయి. (హైబ్రీడురకం అంత మంచిది కాదు).