సువిశాల ప్రపంచములో భారతీయ సంస్కృతీ ఎంతో సుందరమైనది. ఈ భారతీయ సంస్కృతి గాంభీరమైనదిగా ప్రపంచమంతా సకల జనులందరి చేత ఆమోదించబడటం ,గౌరవిన్చబడటం భారతీయులుగా సంస్కృతి పరిరక్షణ వారసులుగా మనందరికీ గర్వకారణం .
మన సాంప్రదాయం, ఆచార వ్యవహారములే భారతీయులుగా మనమందరం ఒకరినొకరు నమస్కారములు అని పలకరించుకొనే క్రమంలో వినమ్రతతో తల వొంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపటం జరుగుతుండటంతో మన ఎదుట వ్యక్తికి హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నట్లుగా క్రియా రూపములో ప్రదర్శిస్తున్నాము.ఇలా శిరస్సు వొంచి ,చేతులు జోడించి మనం చేసే నమస్కార ప్రక్రియే మన దేశ సంస్కృతిని ఎల్లెడలా చాటి చెబుతూ గౌరవ ప్రక్రియ లో ప్రపంచ ప్రజలకు మాదిరిగా నిలిస్తుంది .
నమస్కారమనేది ఆద్యాత్మిక పరంగా ఇకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది . ప్రాణ శక్తి, దివ్యత్వం, ఆత్మ ,పరమాత్మ అందరిలో ఒకేలా ఉండడంతో ఈ కత్వమును గుర్తించి రెండు చేతులు కలిపి తలవొంచి ఇతరులను కలసినపుడు వారిలోనున్న దివ్యత్వమునకు నమస్కరిస్తున్నట్టుగా అర్ధం.
అదే విధముగా ఇటీవల కాలములో కోందర పెద్దల వద్ద నేను ఈ క్రింది నమస్కార రీతులు గమనించాను. ఆచరించే ప్రక్రియ ఆరంభించేను. అంతే! వారి పరిపూర్ణ మైన ప్రేమ ,దివ్యత్వం ,ఉదారత్వం నిండిన హృదయాల నుండి ఉద్భవించే సుభ దీవెనలు అద్భుతమైన శక్తిని కలుగ చేస్తాయని విశ్వసించాను .
1.ప్రతుత్ధానం :లేచి నిలబడి స్వాగతం పలుకుట .
2.నమస్కారం :నమస్కారం ద్వారా విదఎయత వ్యక్తపరచటం .
3.ఉపసంగ్రహన :పెద్దలు, గురువుల పాదాలను తాకడం .
4.సాష్టాంగం : కాలు, మోకాళ్ళు, ఉదరం, నుదురు, అన్ని నేలను తాకేతట్లు పెద్దలు,గురువుల ముందు సాగిలపడి నమస్కరించడం.
5.ప్రత్యభివందనం : ప్రతినమస్కారం చేయుట .
కావున భారతమాత ముద్దు బిడ్డలమైన మనమందరం ఆద్యాత్మిక సంస్కృతిని తనలో నిలిపుకొన్న సంప్రదాయ నమస్కారం ద్వారా ప్రజల పట్ల మనకున్న గౌరవమును ప్రతిబంబించేలా ముందుకు సాగాలని వినమ్రతతో ప్రాదిస్తున్నను.
అందరికి నమస్కారములు .
సర్వేజనో సుఖినో భవంతు