Followers

Saturday, 21 September 2013

ఏలినాటి శని




జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా 

ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి 

శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం 

చెప్పారు జ్యోతిష్య నిపుణులు/



. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై 

ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 

-1/2 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి 

జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. 

శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. 

ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు 

కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ 

అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, 

ఏ 

శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. 

అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా 

వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.




శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల 

నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, 

లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన 

చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా 

మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం 

చేయించినా మంచిది

Popular Posts