మొటిమలు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తున్నాయా! అయితే ఇంట్లో తయారుచేసుకోగలిగిన ఈ ఫేస్‌ప్యాక్‌లను ఓ సారి ట్రై చేసి చూడండి.
- కమలాపండు(సంత్రా), టమాట రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
- ఎండబెట్టిన కమలాపండు(సంత్రా) తొనలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి.
- పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.
- రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.
- దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.