Followers

Friday, 27 September 2013

గురువు శిష్యుడిని మంత్రోపదేశానికి ముందు పరీక్షిస్తాడంటారేందుకు ?

 
పూర్వం గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేయడానికి ముందు శిష్యుడిని బాగా పరీక్షించి అంటే ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడా కాదా అని, మంత్రోపదేశం చేసిన తరువాత అతడు సాధన బాగా చేస్తాడా లేక ఆ మంత్రాన్ని నిర్లక్షం చేస్తాడా అనేటవంటి అనేక విషయాలను పరీక్షించి అప్పుడు ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడు అని నిర్ధారించుకున్నాక మంత్రోపదేశం చేసేవారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవత ఉంటారు. మంత్రోపదేశం పొందాక బాగా సాధన చేసినట్లైతే సిద్దిని పొందుతారు. సిద్దిని పొందినవారికి ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత శుభాన్ని వాక్సుద్దిని ప్రసాదిస్తుంది. అప్పటి నుండి వారు ఆలోచించిగాని అనాలోచితంగా గాని ఏది పలకితే అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగ ఉంటాయి. కనుక వీరు ఆచితూచి ఏమి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరులను ఊరికే చిన్నదానికి, పెద్దదానికీ, శపించడం వంటివి చేయకూడదు.  అలా చేయడం వలన ఇతరులకి హాని చేసిన వారవుతారు. వీరికి సహనం, ఓర్పు అనేవి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు. కనుకనే పూర్వం గురువులు ఇటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని శిష్యుడిని బాగా పరీక్షించి అప్పడు మంతరపదేశం చేసేవారు.  

Popular Posts