Followers

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఆరవ అధ్యాయం

                ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
సత్రాజితః స్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః
స్యమన్తకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్

మహారాజా, సత్రాజిత్తు కృష్ణ పరమాత్మ విషయములో అపరాధం చేసి చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా తన కుమార్తెనిచ్చి వివాహం చేసాడు

శ్రీరాజోవాచ
సత్రాజితః కిమకరోద్బ్రహ్మన్కృష్ణస్య కిల్బిషః
స్యమన్తకః కుతస్తస్య కస్మాద్దత్తా సుతా హరేః

సత్రాజిత్తు కృష్ణుని విషయములో ఏ అపరాధం చేసాడు

శ్రీశుక ఉవాచ
ఆసీత్సత్రాజితః సూర్యో భక్తస్య పరమః సఖా
ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్స చ తుష్టః స్యమన్తకమ్

సత్రాజిత్తు సూర్యభగవానుని ఆరాధించగా ప్రీతి చిందిన సూర్యుడు ఒక మణిని ఇచ్చాడు. దాని పేరు శమంతకం

స తం బిభ్రన్మణిం కణ్ఠే భ్రాజమానో యథా రవిః
ప్రవిష్టో ద్వారకాం రాజన్తేజసా నోపలక్షితః

దానిని మెడలో ధరించి ద్వారకా నగరానికి వస్తుంటే చూచిన ద్వారకా నగర ప్రజలు సూర్యభగవానుడే వస్తున్నాడని భావించి

తం విలోక్య జనా దూరాత్తేజసా ముష్టదృష్టయః
దీవ్యతేऽక్షైర్భగవతే శశంసుః సూర్యశఙ్కితాః

కృష్ణా నిన్ను చూడడానికి సూర్యుడు వస్తున్నాడు అని చెప్పగా అతను సత్రాజిత్తనీ సూర్యుడు ఇచ్చిన మణిని ధరించి వస్తున్నాడు అని చెప్పాడు. ఈ మణి యొక్క గొప్పతనాన్ని చూచి సాక్షాత్తు కృష్ణుడే వచ్చి సత్రాజిత్తును మణి అడిగాడు. అది రాజు వద్ద ఉంటే ప్రజలకు మేలు కలుగుతుంది అని అడిగాడు. కృష్ణుడే వచ్చి అడిగినా సత్రాజిత్తు ఇవ్వలేదు. తాను ఆ మణిని తీసుకుని గృహములో ప్రవేశించి రోజూ ఆరాధన చేస్తున్నాడు. అది ఎనిమిది భారాలు (భారము అంటే ఇరవై తులాలు) బంగారాన్ని ఇస్తుంది.

నారాయణ నమస్తేऽస్తు శఙ్ఖచక్రగదాధర
దామోదరారవిన్దాక్ష గోవిన్ద యదునన్దన

ఏష ఆయాతి సవితా త్వాం దిదృక్షుర్జగత్పతే
ముష్ణన్గభస్తిచక్రేణ నృణాం చక్షూంషి తిగ్మగుః

నన్వన్విచ్ఛన్తి తే మార్గం త్రీలోక్యాం విబుధర్షభాః
జ్ఞాత్వాద్య గూఢం యదుషు ద్రష్టుం త్వాం యాత్యజః ప్రభో

శ్రీశుక ఉవాచ
నిశమ్య బాలవచనం ప్రహస్యామ్బుజలోచనః
ప్రాహ నాసౌ రవిర్దేవః సత్రాజిన్మణినా జ్వలన్

సత్రాజిత్స్వగృహం శ్రీమత్కృతకౌతుకమఙ్గలమ్
ప్రవిశ్య దేవసదనే మణిం విప్రైర్న్యవేశయత్

దినే దినే స్వర్ణభారానష్టౌ స సృజతి ప్రభో
దుర్భిక్షమార్యరిష్టాని సర్పాధివ్యాధయోऽశుభాః
న సన్తి మాయినస్తత్ర యత్రాస్తేऽభ్యర్చితో మణిః

అంతే కాక ఆ మణి ఉన్న చోట దుర్భిక్షములు గానీ అరిష్టాలు కానీ మాయలు గానీ కలహములు కానీ మాయా ప్రయోగములు కానీ పని చేయవు. దేశము కూడా శాంతముగా ఉంటుంది.

స యాచితో మణిం క్వాపి యదురాజాయ శౌరిణా
నైవార్థకాముకః ప్రాదాద్యాచ్ఞాభఙ్గమతర్కయన్

ఆ మణితో విరాజిల్లుతున్నాడు. పెద్దలు అడిగితే స్వార్థము లేకుండా అర్పించాలి లేకుంటే అది వారి వద్దా ఉండదు

తమేకదా మణిం కణ్ఠే ప్రతిముచ్య మహాప్రభమ్
ప్రసేనో హయమారుహ్య మృగాయాం వ్యచరద్వనే

అతని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తీసుకుని వేటకు వెళ్ళాడు. వేటలో ఒక సింహం అతనిని చంపి ఆ మణిని తీసుకు వెళ్ళింది

ప్రసేనం సహయం హత్వా మణిమాచ్ఛిద్య కేశరీ
గిరిం విశన్జామ్బవతా నిహతో మణిమిచ్ఛతా

సోऽపి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే
అపశ్యన్భ్రాతరం భ్రాతా సత్రాజిత్పర్యతప్యత

మణితో ఉన్న సింహాన్ని చూచిన జాంబవంతుడు ఆ మణీని తీసుకుని తన దగ్గర ఉన్న పిల్లవాడి ఊయలకు కట్టి ఆడిస్తున్నాడు

ప్రాయః కృష్ణేన నిహతో మణిగ్రీవో వనం గతః
భ్రాతా మమేతి తచ్ఛ్రుత్వా కర్ణే కర్ణేऽజపన్జనాః

అతని తమ్ముడు వేట నుండి రాకపోవడముతో కృష్ణుడే నా తమ్ముని చంపి మణిని అపహరించి ఉంటాడు అనుకుని అలాగే ప్రచారం చేసాడు.

భగవాంస్తదుపశ్రుత్య దుర్యశో లిప్తమాత్మని
మార్ష్టుం ప్రసేనపదవీమన్వపద్యత నాగరైః

అది తెలుసుకున్న భగవానుడు, కొద్ది పాటి పరివారాన్ని తీసుకుని ప్రసేనుడు వెళ్ళిన దారిలో వెళ్ళాడు.

హతం ప్రసేనం అశ్వం చ వీక్ష్య కేశరిణా వనే
తం చాద్రిపృష్ఠే నిహతమృక్షేణ దదృశుర్జనాః

అక్కడ చనిపోయిన ప్రసేనుడూ అతని గుర్రమూ ఉన్నాయి. సింహపు కాళ్ళ గుర్తులు ఉన్నాయి. అవి చూచుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు

ఋక్షరాజబిలం భీమమన్ధేన తమసావృతమ్
ఏకో వివేశ భగవానవస్థాప్య బహిః ప్రజాః

ఆకడ నుంచి ఎలుగుబంటు అడుగుజాడలు ఉన్నాయి. వాటిని వెంబడించి ఒక గుహకు వెళ్ళాడు. మిగిలిన వారిని బయట ఉంచి కృష్ణుడు లోపలకు వెళ్ళి

తత్ర దృష్ట్వా మణిప్రేష్ఠం బాలక్రీడనకం కృతమ్
హర్తుం కృతమతిస్తస్మిన్నవతస్థేऽర్భకాన్తికే

మణిని పిల్లవాడికి ఆట వస్తువుగా ఉన్న మణిని చూచి అది తీసుకోవాలని చూస్తే పిల్లవాడు ఏదిచాడు. దానికి జాంబవంతుడు వచ్చాడు

తమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోశ భీతవత్
తచ్ఛ్రుత్వాభ్యద్రవత్క్రుద్ధో జామ్బవాన్బలినాం వరః

తన స్వామిని గుర్తుపట్టలేకపోయాడు.

స వై భగవతా తేన యుయుధే స్వామీనాత్మనః
పురుషమ్ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్

కృష్ణుని స్వభావం తెలియని జాంబవంతుడు ఆయన ఒక ప్రాకృతిక పురుషుడు అనుకుని ఆయనతో యుద్ధం చేసాడు

ద్వన్ద్వయుద్ధం సుతుములముభయోర్విజిగీషతోః
ఆయుధాశ్మద్రుమైర్దోర్భిః క్రవ్యార్థే శ్యేనయోరివ

ఆయుధాలతో రాళ్ళతో చెట్లతో బాహు యుద్ధమూ చేసాడు.

ఆసీత్తదష్టావిమ్శాహమితరేతరముష్టిభిః
వజ్రనిష్పేషపరుషైరవిశ్రమమహర్నిశమ్

28 రోజులు ఎడతెరిపి లేకుండా యుద్ధం చేసాడు. కృష్ణ పరమాత్మ ముష్టి ఘాతములతో బలం కాస్తా తగ్గిపోయి.

కృష్ణముష్టివినిష్పాత నిష్పిష్టాఙ్గోరు బన్ధనః
క్షీణసత్త్వః స్విన్నగాత్రస్తమాహాతీవ విస్మితః

జానే త్వాం సఋవభూతానాం ప్రాణ ఓజః సహో బలమ్
విష్ణుం పురాణపురుషం ప్రభవిష్ణుమధీశ్వరమ్

నన్ను ఇటువంటి దెబ్బలు కొట్టగలవాడు ఒకడే. అఖిల ప్రాణములకు ఎవరు ప్రాణమో బలమో సహస్సో ఓజస్సో ఆ పరమాత్మవు నీవే. సకల జగత్తుకూ కారణం, జగన్నాధుడవు.

త్వం హి విశ్వసృజామ్స్రష్టా సృష్టానామపి యచ్చ సత్
కాలః కలయతామీశః పర ఆత్మా తథాత్మనామ్

ప్రజాపతులకు కూడా ప్రజాపతివి, వారిని సృష్టించినవాడవు, నీవే ఈశుడవు పరమాత్ముడవు

యస్యేషదుత్కలితరోషకటాక్షమోక్షైర్
వర్త్మాదిశత్క్షుభితనక్రతిమిఙ్గలోऽబ్ధిః
సేతుః కృతః స్వయశ ఉజ్జ్వలితా చ లఙ్కా
రక్షఃశిరాంసి భువి పేతురిషుక్షతాని

ఒక కనుబొమ్మ ఒకసారి కొద్దిగా పైకెత్తగానే అంత పెద్ద సముద్రామూ నీకు దారి ఇచ్చింది కదా. సముద్రం మీద వారధి కట్టావు కీర్తిని పెంచావు లంకను భస్మం చేసావు రాక్షసుల శిరస్సులను కినపడేసావు, రాముడవు పరమాత్మవు

ఇతి విజ్ఞాతవీజ్ఞానమృక్షరాజానమచ్యుతః
వ్యాజహార మహారాజ భగవాన్దేవకీసుతః

ఇలా జాంబవంతుడు తెలుసుకోగానే కృష్ణుడు సంతోషించి తన అమృతమయ హస్తముతో ఒళ్ళంతా నిమిరాడు.

అభిమృశ్యారవిన్దాక్షః పాణినా శంకరేణ తమ్
కృపయా పరయా భక్తం మేఘగమ్భీరయా గిరా

మణిహేతోరిహ ప్రాప్తా వయమృక్షపతే బిలమ్
మిథ్యాభిశాపం ప్రమృజన్నాత్మనో మణినామునా

ఈ మణి కోసం వచ్చాను. నాకు అపనింద నా మీద పడింది, వెతుక్కుంటూ వస్తే నీవు కనపడ్డావు.

ఇత్యుక్తః స్వాం దుహితరం కన్యాం జామ్బవతీం ముదా
అర్హణార్థమ్స మణినా కృష్ణాయోపజహార హ

జాంబవంతుడు మణితోబాటు తన కన్యా మణిని ఇచ్చి పెళ్ళి చేసాడు

అదృష్ట్వా నిర్గమం శౌరేః ప్రవిష్టస్య బిలం జనాః
ప్రతీక్ష్య ద్వాదశాహాని దుఃఖితాః స్వపురం యయుః

గుహ బయట ఉన్న వారు కృష్ణుడు ఎంతకీ రాకపోయేసరికి చూచి చూచి వెనక్కు వెళ్ళారు. అందరూ కలసి దుర్గను అమ్మవారిని పూజించి స్తోత్రం చేసారు.

నిశమ్య దేవకీ దేవీ రక్మిణ్యానకదున్దుభిః
సుహృదో జ్ఞాతయోऽశోచన్బిలాత్కృష్ణమనిర్గతమ్

పన్నెండు రోజులు మాత్రం చూచి అందరూ సత్రాజిత్తును తిట్టుకుంటూ వచ్చారు వెనక్కు

సత్రాజితం శపన్తస్తే దుఃఖితా ద్వారకౌకసః
ఉపతస్థుశ్చన్ద్రభాగాం దుర్గాం కృష్ణోపలబ్ధయే

అందరూ దుర్గను ఆరాధించారు కృష్ణుని క్షేమం కోసం

తేషాం తు దేవ్యుపస్థానాత్ప్రత్యాదిష్టాశిషా స చ
ప్రాదుర్బభూవ సిద్ధార్థః సదారో హర్షయన్హరిః

అపుడు దుర్గా మాత త్వరలోనే స్వామి వస్తాడు కంగారు పడకండి అని చెప్పింది

ఉపలభ్య హృషీకేశం మృతం పునరివాగతమ్
సహ పత్న్యా మణిగ్రీవం సర్వే జాతమహోత్సవాః

ఆమె మాట నిజం చేస్తూ భార్యను తీసుకుని రానే వచ్చాడు ఆ మాట పూర్తి అవుతుండగానే
ఇలా కృష్ణున్ని చూచి చనిపోయినవాడు మళ్ళీ వస్తే ఎంత ఆనందిస్తారో అంత ఆనందించారు

సత్రాజితం సమాహూయ సభాయాం రాజసన్నిధౌ
ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్మణిం తస్మై న్యవేదయత్

సత్రాజిత్తును సభకు పిలిపించి జరిగినదంతా వివరించి చెప్పాడు కృష్ణుడు.  మళ్ళీ మణిని కృష్ణునికి ఇచ్చి వెళ్ళి రమ్మని చెప్పాడు

స చాతివ్రీడితో రత్నం గృహీత్వావాఙ్ముఖస్తతః
అనుతప్యమానో భవనమగమత్స్వేన పాప్మనా

కృష్ణుని విషయములో అపచారం చేసాను. అందుకు ఆ మణిని ఆయనకే ఇస్తాను అని చెప్పి సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేసాడు

సోऽనుధ్యాయంస్తదేవాఘం బలవద్విగ్రహాకులః
కథం మృజామ్యాత్మరజః ప్రసీదేద్వాచ్యుతః కథమ్

కిమ్కృత్వా సాధు మహ్యం స్యాన్న శపేద్వా జనో యథా
అదీర్ఘదర్శనం క్షుద్రం మూఢం ద్రవిణలోలుపమ్

దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవ చ
ఉపాయోऽయం సమీచీనస్తస్య శాన్తిర్న చాన్యథా

ఏవం వ్యవసితో బుద్ధ్యా సత్రాజిత్స్వసుతాం శుభామ్
మణిం చ స్వయముద్యమ్య కృష్ణాయోపజహార హ

తాం సత్యభామాం భగవానుపయేమే యథావిధి
బహుభిర్యాచితాం శీల రూపౌదార్యగుణాన్వితామ్

పరమాత్మ యధా విధిగా సత్యభామను వివాహం చేసుకున్నాడు. సత్యభామ శీల రూప ఔదార్యములు గలది. అందుచే ఇది వరలో ఆమెను చాలా మంది అడిగి ఉన్నారు.

భగవానాహ న మణిం ప్రతీచ్ఛామో వయం నృప
తవాస్తాం దేవభక్తస్య వయం చ ఫలభాగినః

అలాంటి సత్యభామను స్వామి వివాహం చేసుకున్నాడు. కానీ మణి మాత్రం తీసుకోలేదు. ఎలాగా ఫలితం మాకే వస్తుంది కదా. (సత్రాజిత్తుకు కొడుకులు లేరు. కాబట్టి అదంతా కృష్ణునికే వస్తుంది. మనం కూడా అన్ని పనులూ చేసి కృష్ణార్పణం అంటే చాలు. సత్రాజిత్తు అంటే యజ్ఞ్యములో అనుకున్న ఫలం పొందేవాడు అని అర్థం. జీవులందరూ సత్రాజిత్తులే. అతని కూతురు సత్యభామ. భామ అంటే కోపం గలది. జీవునికి సత్యమే ఆయుధం. జ్ఞ్యానమే సూర్యుడు. జ్ఞ్యానమనే సూర్యుడు స్యమంతం అనే మణిని ఇచ్చాడు. స్యమంతకం అంటే శుభాన్ని సుఖమునీ అంతం చేసేది, అహంకారం. నేనే జ్ఞ్యానిని అనుకోగానే అహంకారం పెరుగుతుంది. అది మన దగ్గరే దాచుకుంటే అది మనకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. అష్ట ప్రకృతులతో అహంకారం మాయ కప్పేస్తుంది. ఆ మాయ సువర్ణమే. ఆ జీవునికి ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రసేనుడు. జీవునికి గొప్ప సైన్యం ఇంద్రియాలు. అవి మనసు ఆధీనములో ఉంటుంది. మనసు ఇంద్రియాలను తీసుకుని అహంకారముతో కలసి విహరించడం ప్రారంభిస్తే ఆ మనసనే ప్రసేనున్ని సింహం చంపింది. ఇకడ సింహం అంటే హింస, హింసా ప్రవృత్తి వలన మనసు చనిపోయింది. ఆ హింసను చంపినది జాంబవంతుడు. జాంబవాన్ అన్నా బంగారమే. జాంబవాన్ అంటే పరమాత్మ భక్తుడు ఆచార్యుడు. గురువు అహంకారాన్ని తన వశం చేసుకున్నాడు. గురువు సంగతి తెలియక పరమాత్మనే అపనిందపాలు చేస్తే ఆచార్యుని వద్దకు వచ్చి ఆచార్య దత్తమైన జ్ఞ్యానాన్ని జీవునికి ఇచ్చాడు. అపుడు జీవుడు సత్యమైన సంకల్పముతో జ్ఞ్యానాన్ని  పరమాత్మకు అర్పించాడు. అపుడు పరమాత్మ జ్ఞ్యానం నీ దగ్గరే ఉంచుకో ఆ ఫలం  నాకివ్వూ అన్నాడు.)

  
                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts